The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Preyasi Nee Peru Raakshasaa>>Preysi Nee Peru Rakshasaa
ప్రేయసి నీ పేరు రాక్షసా - 81

నాపేరు విజయ్ భరద్వాజ. మా ఫాదర్ పేరు మార్కండేయులు- మామదర్ పేరు లలిత. మా మదర్ చనిపోయిన విషయం తెలీగానే నేను ఢిల్లీ నుంచి బయల్దేరాను. దారిలో యాక్సిడెంట్. స్పృహలోలేని స్థితిలో హాస్పిటల్ లో నెలరోజులు గడిపాను. తర్వాత ఇల్లు చేరుకోనేసరికి శోకదేవతలా వున్న నా భార్య ధరణి కనిపించింది. జరిగిందంతా చెప్పి బావురుమంది.

కానీ అప్పట్లో నేను చాలా సంకుచితంగా ఆలోచించాను. ఆమెదేమీ తప్పులేదని నమ్మకమున్నా ఆమెను అంగీకరించి నాతొ తీసికేల్లటం నాకిష్టం లేకపోయింది. కేశవ్ ని కలిశాను. జరిగిందానికి సారీ చెప్పాడు. నేను ఏమయ్యానో తెలీక తను ధరణి మేలుకోరి అలా చేశానని చెప్పాడు.

"ఇప్పుడెం చేద్దాం?'' అనడిగాను.

"నాకేం తెలీటంలేదు''

"ధరణిని తీసికెళతావా?''

"ఎలా తీసుకెళతాను?''

"సరే-నీ ఇష్టం ... పోనీ ఇంకో పెళ్ళిచేసుకో''

"నా సంగతి వదిలేయ్ ... ధరణిని నువ్వేం చేయదల్చుకున్నావ్?''

"ఇంకా ఆలోచించలేదు''

"నువ్వు పెళ్ళి చేసుకొని పూర్తీ రక్షణ ఇవ్వాలి''

కేశవ్ విరగబడి నవ్వాడు "రక్షణ ఏర్పాటు చేస్తానుగానీ నా భార్యగా కాదు''

"మరి?''

"అదంతా నీకెందుకులే-నీ దారిన నువ్వెళ్ళిపో''

"ఆస్థిలో నా వాటా సంగతేమిటి?''

"అంతా బిజినెస్ లో పెట్టాను- లాభాలు రాగానే పంపిస్తాన్లే - నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళు''

నాకు వాడినక్కడే మర్డర్ చేయాలన్నంత కోపం వచ్చింది. ఏం చేయాలో తోచని స్థితిలో వుండగా ఒకరోజు ప్రభాకరం, కేశవ్ లు ఎక్కడికో బయలుదేరారు అర్థరాత్రి. నాకు అనుమానం వచ్చి వారిని ఫాలో అయ్యాను. సిటీకొచ్చి బయటికొచ్చేశారిద్దరూ. ఆ చీకటిలో కారాపి యిద్దరూ కొద్దిసేపు ఏదో ఘర్షణ పడ్డారు. అప్పుడు ప్రభాకరంని చంపి రోడ్డు ప్రక్కనే వున్న లోయలోకి తోసేశాడు కేశవ్. ఆ సమయంలో నేను అప్రయత్నంగా వేసిన కేక వింటూనే కేశవ్ నా మీదకి టార్చ్ లైట్ వేశాడు.

మరుక్షణం నా నెత్తిన కర్రలతో బాదారెవరో. స్పృహతప్పింది నాకు. తిరిగి కళ్ళు తెరిచేసరికి నేను ఓ అంధకార బంధమైన గదిలో పడివున్నాను. వళ్ళంతా కాలిపోతోంది. ఆకలి దాహించివేస్తోంది. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. నాకు పిచ్చి ఎక్కినా స్థితిలో బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నా ధ్యేయం ఒక్కటే .... కేశవ్ ని చంపాలి ... బిచ్చం ఎత్తుకుంటూ అవకాశంకోసం ఎదురుచూస్తూ తిరుగుతున్నాను. కానీ ఆ పని నా బదులు ఇంకెవరో చేశారని తెలిసేసరికి నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది ...''

ఇంతవరకూ చెప్పి ఇంకా మాట్లాడలేక కళ్ళుమూసుకున్నాడతను. విశాల్ హడావుడిగా బయటకు నడిచాడు. సిద్ధార్థ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. "ఎలా వుంది అంకితకి?'' అడిగాడు విశాల్.

"బుల్లెట్స్ తీసేశారు- ఇంకా కాన్సస్ నెస్ రాలేదు'' "వస్తుంది- వచ్చి తీరుతుంది''

ధృడవిశ్వాసంతో అన్నాడు విశాల్.

"ఈ ప్యాకెట్ అంకిత బ్యాగ్ లో దొరికింది - దీనిమీద మీ పేరు వుంది'' ప్యాకెట్ అందించాడతను. మరో అయిదు నిముషాలకి విశాల్ ఆఫీసులో టేప్ రికార్డర్ లో చాలా సీరియస్ గా కేసెట్ వినసాగారు విశాల్, సిద్ధార్థ

"ఈ ... ఈలోగా నాకేదయినా జరిగితే హంతకుడు మూడు హత్యలకి కారకుడవుతాడు ... భరద్వాజ, సుఖజీవన్, నేను .... మీకో కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. చనిపోయిన భరద్వాజ, అంటే కేశవ్ భరద్వాజ హత్యచేసి తప్పించుకున్న వ్యక్తీ ... కారాక్సిడెంట్ ముసుగులో లాయర్ ప్రభాకరాన్ని చంపాడతను. ఇన్నేళ్ళుగా కప్పబడి పోయిన ఈ రహస్యం ఇటీవల ప్రభాకరం తమ్ముడు శ్రీధరం యాదృచ్చికంగా భరద్వాజ డైరీలో చదవడం జరిగింది.

అతనికి తన అన్నంటే ప్రాణం. విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో అతన్ని షూట్ చేసి, ఫింగర్ ప్రింట్స్ లేకుండా చూసుకుని వెళ్ళిపోయాడు వెనక కిటికీ గుండా దూకి. అయితే అప్పుడే భరద్వాజ ఇంటికి సాగర్ ని ఆపుదామని బయల్దేరిన నాకు ఎదురుపడి, సహజంగా వుండటంకోసం నాతొ తిరిగి అక్కడికొచ్చాడు. షాక్ తిన్నారా? తింటారానుకున్నానే ...