The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Preyasi Nee Peru Raakshasaa>>Preyasi Nee Peru Rakshasaa
ప్రేయసి నీ పేరు రాక్షసా - 82

ప్లీజ్ నోట్ దిస్ ... ఈ వ్యక్తికీ ఆ టైంలో ఖచ్చితమైన ఎలిబీ ఉండదు. రైట్? ... శీథరానికి అతని అనుచరుడు ... జీ.డి. కి జరిగిన ఒక సంభాషణ సుఖజీవన్ వినడం జరిగింది. వెంటనే వివరాలు త్రవ్వి తీసి బ్లాక్ మెయిల్ చేయసాగాడతను. తరువాత్ వివరాలు, నేను చెప్పిన విషయాలకి ఎవిడెన్సూ కేసెట్ లో వున్నాయి. నాకు చాలా జ్వరంగా వుంది ... ఇలాంటి మలుపొస్తుందని వూహించకపోవడంతో ఒంటరిగానే వచ్చాను. తిట్టుకోకండేం? మళ్ళీ కలుస్తామో లేదో ... కలిస్తే ... సి యూ దెన్ ...

ఒకవేళ నాకేదయినా ప్రమాదం సంభవించి కలవకపోతే నా గురించి బాధపడకండి విశాల్ జీ! సిద్ధార్థ ... విష్ యూ ఆల్ ది బెస్ట్! టేప్ ఖాళీగా తిరుగుతోంది. సిద్ధార్థ కళ్ళనుండి కన్నీటిబోట్లు జారిపడ్డాయి. విశాల్ బెల్ మోగించాడు. ఇన్స్ పెక్టర్ శాతకర్ణి హడావిడిగా లోపలికొచ్చాడు.

"యస్సార్'' "శ్రీధరాన్ని అరెస్ట్ చేయండి''

శాతకర్ణి ఆశ్చర్యపోయాడు. "శ్రీధరాన్నా సర్ ...''

"అవును! అతనే భరద్వాజని హత్య చేశాడు. అతని మనుషులే సుఖజీవన్ ని మర్డర్ చేశారు ....''

"ఓ.కే. సర్ ...'' అతను వెళ్ళిపోయాడు.

"కమాన్ - లెటజ్ సి అంకిత'' అన్నాడు విశాల్. సిద్ధార్థ అతనితోపాటు బయల్దేరాడు.

*****

సాగర్ జైలునుంచి బయటికి వచ్చాడు. అతనికింకా నమ్మబుద్ధికావటంలేదు. తనను నిర్దోషిగా ప్రకటించి వదిలేశారు. రోడ్డుమీద నడవసాగాడతను. అంతా కలలాగుంది. శృతి తనని ప్రేమించినట్లు నటించడం ... తనతో భరద్వాజని చంపించడానికి ప్రయత్నించడం - శృతి నిజంగా తనను ప్రేమించలేదా? ప్రేమించకుండా అలా ఆమె శరీరాన్ని మనసారా తన కర్పిస్తుందా? ఎంత దారుణమైన మానసిక పరిస్థితి ఆమెది? ఒకేసారి ఇద్దరితో ఎలా సంబంధం పెట్టుకుంటోంది?

ఇప్పుడు ఇంట గాఢంగా ప్రేమించిన శృతిని ఎలా మనసునుంచి తొలగించడం.? అతనికి అంకిత గుర్తుకొచ్చింది. ఆరోజు ఆమెను ముద్దుపెట్టుకోవడం గుర్తొచ్చింది. అవునూ-తనూ ఒకేసారి అంకితతోనూ, శృతితోనూ కూడా ప్రణయం జరపడానికి ప్రయత్నించలేదూ? అంటే తను ఇద్దరినీ ప్రేమించాడనా? సాగర్ కి నవ్వు వచ్చింది. మనిషి పరిస్థితులకు బానిస. సంఘటనలు ఫలితాలకు బానిస- వయసులోవున్న యువతి దగ్గరయినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆమెనే ప్రేమించిన భావన కలుగుతుంది.

ఆమె మీద కోరిక పుడుతుంది. ఆ తర్వాత ఇంకో యువతి మళ్ళీ అదే పరిస్థితిలో దగ్గరయితే మళ్ళీ అదే కథ మొదలవుతుంది. ఇది శ్రుష్టిలో యిమిడివున్న రహస్యం. ఇంటికి చేరుకున్నాడతను. సిద్ధార్థ కోసం ఎదురు చూస్తున్నాడు. "అంకిత సీరియస్ గా ఉంది సాగర్ - నీపేరే కలవరిస్తోంది'' సాగర్ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. తనకోసం ఎందుకు ఆమె జీవితాన్ని రిస్క్ చేసింది? ప్రేమలో అంత బలం ఉందా? శృతిమీద ఏర్పడిన ప్రగాఢమైన తన ప్రేమలోనూ అంత బలం ఉందా?

అంకిత తనను ప్రేమించినంత గాఢంగా తనామెను ప్రేమించగలడా? సిద్ధార్థ మాట్లాడకుండా కారు డ్రైవ్ చేస్తున్నాడు. "అంకితకేమయినా ప్రమాదంగా ఉందా?'' అడిగాడు సాగర్.

"అనే అంటున్నారు డాక్టర్లు''

"బ్రతుకుతుందా?''

"లెటజ్ హోప్ ''

సాగర్ మాట్లాడలేదు.

అంకిత చనిపోతుందా?