సూరేపల్లి విజయ
.png)
ప్రకృతి పులకరించి పోయింది. పచ్చని చెట్లు ఆనందంతో వింజామరలయ్యాయి. ఆకాశం హర్షించి వర్షిస్తోంది. జలపాతం కొండల్లో నుంచి చెంగు చెంగున గేన్తుతోంది. సృష్టిలోని సకల చరచరాల శృంగారానికి ఆది, అంతం వాళ్ళే .... రతీమన్మథులే. అలాంటి వారి సమాగానికి యుగాల అనంతరం, ఓ వెన్నెల మాసాన ... భువి వేదికగా మారింది. వారి సమాగానికి, ప్రకృతి సాక్షి, చెట్లు ... చేమలు సాక్షి జలపాతం సాక్షి ... నిండు వెన్నెల సాక్షి ... మన్మథుడు సరసాల అంబులపొదిలో నుంచి తాపాల అస్త్రాలను సంధించాడు.
ఆ అస్త్రాలు రతీదేవి మేనిని అంటిపెట్టుకొని ఉన్న వస్త్రాలు తాకి, చీల్చుకుని, ఆమె ఎదను తాకి, హృదయంతర్భాగాలను మీటి, కోరికల చిచ్చును రగిల్చి, తనువును వాంఛల కొలిమిగా మార్చాయి. రతీదేవి ఒళ్ళు హరివిల్లుగా మారింది. ఇంద్రధనస్సు ఈర్ష్యపడింది ... ఆ భంగిమ చూసి. ఆమె మేని సౌందర్యానికి అప్సరసలు కైమోడ్పులన్నారు. ఆమె ఒంటిమీద వస్త్రాలు బహిష్కారమయ్యాయి. పతిదేవినికి అర్పణ చేయడానికి శృంగారోద్వేగాలను సిద్ధం చేస్తోంది రతీదేవి ఆప్తకాలం స్తంభించింది.
క్షణకాలం శృంగారం వివర్మమైంది. రతిలో జడత్వం ... మన్మథుడిలో నిర్లిప్తం ... ఏమిటా వైపరీత్యం? ఏమిటా జడత్వం? పరమశివుదినే కదిలించిన మన్మధబాణం ఏమైనది? సృష్టినే శృంగారోద్వేగం చేసే మన్మధ శక్తి ఏల నిర్వీర్యమైనది? కైలాసానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకుని, సతీసమేతంగా, సమ్మోహనంగా సత్యలోకానికి వెళ్తూ, స్వర్గంలో దేవేంద్రుడ్ని పరామర్శిద్దామని వెళ్ళిన మన్మథుడికి వాత్సాయనుడు చింతాక్రాంతుడై కనిపించాడు. "నాయనా వాత్సాయనా ... కుశలమా?'' అని అడిగాడు దరహాస భూషితుడైన మన్మథుడు.
రతీమన్మథులకు వినమ్రాపూర్వక జోతలివే'' రెండు చేతులూ జోడించాడువాత్సాయనుడు. "నా ప్రియభక్తుడివి ... కామసూత్ర గ్రంథాల సృష్టికార్తవీ స్వర్గంలో ఉన్న రంభ, ఊర్వశీ, మేనకలాంటి వాళ్లకు కామసూత్రంలో మెలుకువలు చెప్పక ఈ నైరాశ్యమేమిటి?''
"సృష్టికే మూలమైన శృంగారానికి ఆది, అంతం నువ్వే. నీ కరుణాకటాక్షాలతో క్రీస్తుపూర్వమే అప్పటికే అంతరించిపోతున్న శృంగారాసక్తిని మేల్కొలపడానికి, కామసూత్రాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, మీ దయ చేత, మీ అనుగ్రహంతో కామసూత్రాలను లిఖించాను. వేళ సంవత్సరాలు గడిచాయి. శృంగారం అనివార్యం అన్న స్పృహ మానవులలో అంతరించింది. శృంగారం మొక్కుబడి అయింది. దంపతుల మధ్య సమస్యలన్నీ కార్చిచ్చులయ్యాయి. వెన్నెల విహారాలు, భార్యాభర్తలు శృంగార అలిలోనాలు ... చుంబనాలు, మధురోహాలూ మచ్చుకైనా లేవు. అంతెందుకు మన్మథా ఇప్పుడు మీరు స్వయంగా వెళ్ళిననూ మీలోనూ శృంగారేచ్చ నశిస్తుంది ... జడత్వం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇది తథ్యం ...'' భూలోకంలో జరుగుతున్నది అనునిత్యం.
"వాత్సాయనా ... ఏమిటి .. శృంగారానికి నిలువెత్తు సాక్షాలమైన మాలో శృంగారేచ్చ నశించడమా ... మేమే శృంగారం ... శృంగారకామేము ... సాక్షాత్తు పరమశివుదినే నా మన్మథబాణాలతో క్షణకాలం మేహావేశపూరితుడ్ని చేసిన విషయం తెలియదా?'' మన్మథుడిలో కాసింత కోపం, మరికొంత ఉక్రోషం.
"మన్మథా ... ఇది కలియుగం ... అందులోనూ మానవులు ఆధునికత పేరుతొ, సంపాదన పట్ల వ్యామోహంతో, పనుల ఒత్తిళ్ళతో శృంగారాన్ని విస్మరించారు. భూలోక వాతావరణమే జడత్వంలోకి మారినది.'' మన్మథుడిలో విస్మయం ... పంతం ...దాని ఫలితం భూలోక విహారం ... సతీసమేతం .... "అంటే వాత్సాయనుడు చెప్పింది నిజమేనా? మన్మథుడి దివ్య నేత్రం తెరుచుకుంది. మన్మథ నేత్రం ప్రపంచం నలువైపులకూ కాంతి కిరణాలను ప్రసరింప చేసి చూసింది.
"శిరీషి ఒంటిమీద ఉన్న సింగిల్ పీస్ నైటీ మోకాళ్ళ వరకూ వచ్చింది. ఆమె మోహంలో కోరికల తాలూకు ఉధృతి ... ఆమె శరీరం కోరికల కొలిమిలో కాలిపోతోంది. రెండు గంటల నుంచి మంచం మీద వెల్లకిలా పడుకుని, కంప్యూటర్ ముందు కూచొని, ఎప్పుడూ నేకెడ్ గా వెల్లకిలా పడుకున్న భార్యను కూడా చూడనంత దీక్షగా కంప్యూటర్ లోని ఫైళ్ళను చెక్ చేసుకుంటున్నాడు ప్రహాసిత్. ఒక చిన్న నిట్టూర్పు ఆమెలో .... కనీసం ఫైలును చూసిన దాంట్లో పదోవంతు కూడా తనను చూడడు ...
ఆమెకు కొన్ని నెలలుగా అనుభవవేద్యమైన విషయం ... తెల్లవారుఝాము వరకూ ఫైల్స్ చెక్ చేస్తాడు. ఏ తెల్లవారు ఝామునో నిద్రపోతాడు. లేదా తన దగ్గరికి వస్తాడు. అప్పటివరకూ అతని . కోసం ఎదురుచూసి ... చూసి నిద్రలోకి జారుకునే తను అతని స్పర్శను గుర్తించలేదు కూడా ... తెల్లారితే రొటీన్ ... పనులు .. ఒత్తిళ్ళూ ... శిరీష్ లేచి భర్త దగ్గరికి వెళ్ళింది. అతడి వెనగ్గా వెళ్ళి అతని మెడ ఒంపులో పెదవులు ఆన్చింది.
"శిరీ ...! ఫైల్స్ చూడనా ...'' ముద్దుగా విసుక్కున్నాడు.
అందులో ముద్దు ధ్వనించలేదు ఆమెకు. "ఫైల్స్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ... ముందు నా ఫైల్ చూడండి. భార్తముండు సిగ్గునూ, కోరిక ముందు బిడియాన్నీ వదిలేసింది. శిరీష నైటీకి శరీర బహిష్కార శిక్ష విధించింది. తెల్లని మేనిచాయ ,,, వయసు తాలూకు ఒంపూ సోమ్పులూ ... అదే కంప్యూటర్ లో ఏ నీలిచిత్రమో అయితే, కళ్ళార్పకుండా చూసేవాడేమో ... అదే కాల్ గర్ల్ అయితే సమయాన్ని వృథా చేయకుండా చుట్టేస్వాడేమో ... అదే ఏ బిజినెస్ కు సంబంధించిన అగ్రిమెంటో అయితే, ఫైల్స్ ఆమూలాగ్రం చదివేసినట్టు ఆమె శరీరాన్ని చదివేసేవాడేమో ...
"శిరీ ...! వాటిస్ దిస్ చిన్నపిల్లలా ... వెళ్ళు ... చలివేస్తుంది. అసలే ఎ.సి. నైటీ వేసుకుని స్వెట్టర్ వేసుకో ...'' భార్య పట్ల భార్యతో నిర్లిప్తతో ...
"భార్యకు చలివేస్తే మొగుడే స్వెట్టర్ లా, గౌగిలితో చుట్టేయాలన్న ధ్యాస ఆ పెద్దమనిశిలో, మొగుడు మనిషిలా కనిపించలేదు. అలానే బాత్రూమ్ లోకి వెళ్ళింది. హాట్ వాటర్ ఉన్నా చన్నీళ్ళటో షవర్ కింద స్నానం చేసింది. ఒళ్ళు కూడా తుడుచుకోలేదు. ఆమెకు చలి తాలూకు వణు
కు వేయడం లేదు. కోరికల తాలూకు వేడి, చలిని తరిమేసింది. అలానే తడి శరీరంతోనే మంచం మీద వెల్లకిలా వాలిపోయింది. తెల్లవారు ఝామున ఏ వేళో ... ప్రహాసిత్ వచ్చి అలసటగా బెడ్ మీద వాలిపోయి, నేకెడ్ గా ఉన్న భార్యను చూసి ఆమె వణికిపోవడం చూసి బ్లాంకెట్ తీసుకువచ్చి కప్పాడు. ఆమె వణికిపోతుంది చలితో కాదని, కోరికతో అని అతడు ఈ జన్మలో తెలుసుకోలేడు.
అలాగే మంచంమీద పడుకుండిపోయాడు. భర్త నిద్రపోవడం గమనించి కసిగా తన మీద భర్త కప్పిన బ్లాంకెట్ ని తీసి ఓ మూలకు గిరాటేసి కార్పెట్ మీద పడుకుండిపోయింది. ఆ గదిలో గోడకు రతీ మన్మథుల తైలవర్ణ చిత్రపటం ఉంది. ఆమె కళ్ళు సన్నగా వర్షిస్తున్నాయి. ఆ కన్నీరు చినుకుగా మారి, వరదలా పొంగి, ఆమె స్త్రీత్వాన్ని ముంచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇంట్లో రోజూ ఇదే తంతు ... బహుశా కోరికలను తీర్చుకోలేని నిస్సహాయత వయసు వారిని సమీపించేంత వరకూ కాబోలు ...
"అలకా డియర్ ... భార్య నడుం చుట్టూ చేయివేసి, దగ్గరకు హత్తుకుంటూ పిలిచాడు వినేష్''
"నన్నొదలండి ముందు ...'' అతన్ని పురుగును విదిల్చినట్టు విదిల్చి అంది 'అలక' అని పిలువబడే అలకనంద.
"రాత్రి పదకొండయింది ... గంట నుంచి నీ ఆర్గ్యుమెంటే తప్ప నా స్టేట్ మెంట్ వినవా ...''
"వినను ... మనం వేరు పడవలసిందే ... మీరు మనకోసం ఫ్లాట్ కొనవలసిందే ...'' అలకనంద ఇదే ఛాన్స్ అని రెచ్చిపోతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే భర్తని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తోంది ...''
"అలకా ... పరిస్థితులు అర్థం చేసుకో ... ఇంట్లోనుంచి బయటకు వెళ్తే అమ్మవాళ్లకు ఎవరున్నారు. పైగా రెండు కుటుంబాలు అవుతాయి ... ఖర్చు పెరుగుతుంది ... అయినా నువ్విలా ఈ టైంలో బ్లాక్ మెయిల్ చేయడం ఏమీ బావోలేదు ...'' నిస్సహాయంగా, బాధగా అన్నాడు వినేష్.
"మీరు పడకదగ్గరే వింటారు మరి ...'' అంటూ ఆమె మూడంకె వేసింది. భర్తని ఎలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలో ఆమెకు తెలుసు .. కోరికల లిస్ట్ చెప్పడానికి బెడ్ రూమ్ కు మించిన ప్లేస్ మరోటి ఉండదని ఆమె ప్రగాఢ విశ్వాసం. భర్తను మంచమ్మీదే లొంగ దీసుకోవాలన్నది ఆమె థియరీ ... అందుకు 'సెక్స్' ను ఒక అస్త్రంగా భర్తమీద ప్రయోగిస్తుంది. ఏదో ఓ రోజు అతను ఆమె నుంచి ఆకర్షణను, ప్రేమను కోరికలనూ కోల్పోయి, మరో స్త్రీ వైపు ఆకర్షితుడు అవ్వొచ్చు. అప్పుడది ఎవరి తప్పు ...? ఆ ఇంట్లో ఇది నిత్యకృత్యం ... అతనిలో దామ్పత్యసుఖం తాలూకు అసంతృప్తి పెరిగిపోతూనే వుంది.
"అమ్మో ... నాకు భయం అంది అర్విత మొగుడి వైపు చూస్తూ చిన్నగా భయమా ... నువ్వేమైనా చిన్నపిల్లవ ... తొలిరాత్రి ... ఆమె భయాన్ని పోగొట్టి, బిడియాన్ని వదిలించి, సుతిమేత్తగాం సుతిమెత్తగా ఆమెను 'తన'దానిగా చేసుకోవాల్సిన అతను ... సెక్స్ పట్ల అసరైన అవగాహన లేకుండానే ... కోరికతో ఆమెను ఆక్రమించుకున్నాడు ... బ...ల...వం...తం...గా ...ఆమె కెవ్వున కేకవేసింది ... ఏడ్చింది ... భయంతో తల్లడిల్లింది ... ఫ్రిజిడిటీతో భర్త పట్ల సెక్స్ పట్ల ఏహ్యభావం పెంచుకుంది.
ఆమె ఉదయం నుంచి అలసిపోయింది. ఇంటిపనీ, వంటపనీ ... బండెడు చాకిరీ ... శరీరమంతా చెమటటో తడిసిపోయింది. అతడు అచ్చు మగమహారాజులా దర్జాగా వచ్చాడు. వస్తూనే కాఫీ అని కేక వేశాడు. లుంగీలోకి మారి భోజనం చేసాడు. కాసేపు టీ.వి. చూసాడు. ఆమెకు పిల్లలకు తినిపించి, ఇళ్ళు సర్ది, పడగ్గదికి వచ్చింది. ఆమె ఉదయం నుంచీ పడ్డ కష్టాలను ఒడార్పుతో పోగొట్టి, కలిసి స్నానం చేసి తనువులతో ఎకమవ్వాలని ఆమెకు ఓదార్పు అవ్వాలని ఉదయం నుంచీ ఆమె శారీరక అలసటను, శరీర కలయికతో పారద్రోలాలని అనిపించలేదు అతగాడికి. పనిచేసి అలసి వచ్చిన భార్య పనిమనిషిలా అనిపించిందే తప్ప 'తన మనిషి'లా అనిపించలేదు ఆ మగమనిశికి ఆమె అలసటగా నిద్రలోకి జారుకుంది. నిస్సత్తువుగా కోరికల్ని అణుచుకుంది.
"స్వామీ చూసారా ఈ మనుషుల తీరు ... వీక్షించారా వాళ్ళలోని జడత్వం తీరు ... డబ్బుపట్ల వ్యామోహం, వృత్తిపట్ల అతి అంకిత భావం'' ఏదో సాధించాలని తపన ... ఉన్న దేశం వదిలి కట్టుకున్న వారిని వదిలి దానం కోసం వేట ... నిర్లిప్తత, నిర్వీర్యత ... శృంగారం పట్ల అవగాహనలేమి. శృంగారం నిత్యం అవసరం ... ఆయురారోగ్య రహస్యం అన్న స్పృహ లేకుండా ... అందుకే భూలోకం రాగానే మీరు అలాంటి భావానికి లోనయ్యారు .... మీకీ విషయాన్ని విశాదపర్చాలానే మీ శృంగారాస్త్రాలు దంపతుల మధ్య మధురోహాల పుష్పాలు పూయించాలని నా కోరిక''
మన్మధుడికి సమస్తం అర్థం అయింది. రతీదేవి వంక చూశాడు. ఆమె మొహనంగా చూసింది. అతను సమ్మోహనంగా అంబులపొది నుంచి అస్త్రాలు తీసాడు. "వాత్సాయనా ... మళ్ళా నిన్ను విధాత అనుమతితో భూలోకంలో సృష్టిస్తాను ... వెళ్ళు ... వెళ్ళి కొన్ని సూత్రాల ఆవశ్యకత ఈ మనుష్యులకు, దంపతులకు చెప్పు. శృంగారం పట్ల అవగాహన, సృష్టి సిద్ధమైన, అనివార్యమైన, అనుభూతిపరమైన, శృంగారనుభావాల గురించి దంపతులకు చాటి చెప్పు ..
.'' శృంగారం లేని జీవితం, నిస్సారమైనదని చెప్పు ... ఈ క్షణమే నేను భువికి దిగి వస్తున్నాను .... దంపతులంతా అతి చిన్నదైన శృంగార జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి ... కాలం గుప్పిట్లో నుంచి శృంగారానుభవాల ఇసుక రేణువులు జారిపోకూడదు ... వాత్సాయనుడు మళ్ళీ జన్మించాదానికి సిద్ధమయ్యాడు.
శృంగారం దంపతుల మధ్య అనివార్యం .. అనిర్వచనీయం ... ఆ క్షణం .. సృష్టి పులకించింది ... శృంగారం ఉద్వేగభరితమైన ఒళ్ళు విరుచుకుంది. మధురోహాలు కదిలాయి ... మన్మథుడే దిగివచ్చి ... మన్మథబాణాలు దంపతుల మీదికి సంధిస్తున్నాడు ... శృంగారమా సుఖినోభవంతు ....
|
|


