- బొమ్మదేవర నాగకుమారి
.png)
సాయంకాలానికల్లా ఫామ్ హౌస్ కి వస్తానన్న రోజా ఇంకా రాకపోవటంతో సుధాకర్ కి విసుగ్గా వుంది. మాటి మాటికీ టైం చూసుకుంటున్నాడు, కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. అయిదున్నర దాటిపోవటంతో అతనికి కోపమొచ్చింది. ఒక్క రోజా మీదే కాదు, ఆమె తల్లిదండ్రుల మీద, తన తల్లిదండ్రుల మీద. అటువైపు పెద్దల మీద ... ఇటువైపు పెద్దల మీద. అసలు ప్రపంచంలోని పెద్దలందరి మీద – ‘కొత్తగా పెళ్ళయిన దంపతులు ఆషాఢ మాసం దూరదూరంగా వుండాలి’ అన్న నియమం పెట్టిన పెద్దలందరి మీదా కోపం వచ్చింది.
వాళ్ళందరినీ కాదని రోజాని ఎలాగైనా కల్సుకోవాలని తన పట్టుదల ...! రోజా ఏమో హోటల్స్ కి రానంటుంది ... ఫ్రెండ్స్ ఇళ్ళకొ, బంధువుల ఇళ్ళకొ రమ్మంటే ... చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తారు ... సిగ్గంతుంది. అందుకే ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఈ ‘ఫామ్ హౌస్’ ఎరేంజ్ చేసేడు.పుణ్యకాలమంతా గడిచిపోతోంది ... ఏదీ ఇంకా రాదే ... కిటికీలోంచి చూసేడు .... దూరంగా గుల్ మొహర్ చెట్టు దగ్గర పొద కదలిక ... సరిగ్గా చూశాడు ... కళ్ళు చికిలించి మరీ చూసాడు... అతని కళ్ళు మెరిశాయ్ ...
గుల్ మొహర్ పువ్వుల్ని కోస్తూ ... గుల్ మొహర్ లాంటి పిల్ల లంబాడీ పిల్ల ...! గొప్ప సెక్సీగా వుంది ...! తను నిలబడ్డ చోటనుంచి ఆ పిల్ల వెనకభాగం – సైడ్ యాంగిలూ కనిపిస్తున్నాయ్... రవిక లేని వీపు ... ఆమె వీపుని నగ్నంగా చూపిస్తోంది. అద్దాల రవిక లోపల బ్రాసరీలాటి దేమీ లేకపోవటం వల్ల గుండెలు బరువుగా కదలడం స్పష్టంగా తెలుస్తోంది. గుండెలు కదిలినప్పుడల్లా, గుండెల చివరనున్న గుండ్రటి అద్దాల మీద ఏటవాలు సూర్యకిరణం పది మెరుస్తూ జిగేల్మని రిఫ్లెక్ట్ అవుతోంది. కాస్త పైనున్న పువ్వుని అందుకోవటానికి దంతం గాజులున్న చేతుల్ని చప్పుడు చేస్తూ సాచి బొటనవెళ్ళ మీద నిలబడింది.
లేలేత ఆర్తి మొవ్వలాటి పలుచటి పొట్ట ... లతలా సాగిన నడుం ... పట్టు పరికిణీ ... ఇంకాస్త పైకి పోవటంతో పిక్కలూ, మడుమలూ, పాదాలూ నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి... ప్రకృతికి దగ్గరగా వైల్డ్ బ్యూటీ ... మ్చ్ ... ! ఆమెకి పువ్వు అందలేదు. నిరాశగా నేలమీద పాదాలానించి మామూలుగా నిలబడింది. నడుమ్మీద మెలిక పరికిణీ మీదున్న నలుచదరపు అద్దంలో ప్రతిఫలించింది. చూస్తోన్న సుధాకర్ గుండె లయ తప్పింది. ఒళ్ళు ఝల్లుమంది.
ఆమె ఏదో వశీకరణ మంత్రం వేసినట్టే ఆమె దగ్గరికి నడిచి వెళ్ళాడు నిశ్శబ్దంగా ... దగ్గరగా నిలబడి ... ‘’పువ్వు కావాలా ...?’’ అని అడిగేడు. తలమీడున్న మేలి ముసుగు ముఖంమీదకి లాక్కుంటూ కావాలన్నట్లుగా తలూపింది. అంతే ...! అతనికి ఆలస్యం చేయలేదు. వుందా లేదా తెల్చుకోవాలన్నట్టుగా వున్న ఆమె నడుమ్మీద రెండు చేతులు వేసాడు. అతనేం చేస్తున్నాడో వూహించేలోగా ఆమె గాల్లో పైకి లేచింది.... ‘’కోసుకో ...’’ అన్నాడతను వరమిస్తున్న దేవుడిలా...
ఆమె పువ్వు కోసుకుంది. తన ముఖానికి దగ్గరగా ఘనీభవించినట్టున్న ఆమె జఘన భాగాన్ని చూస్తూ అతను ఫ్రీజ్ అయ్యాడు. ఆమె అతని చేతుల్లోంచి ఒడుపుగా కోర్రమీనలా జారిపోయింది అంతలోనే. అతను తెరుకునేలోగానే అక్కడ్నుంచి పారిపోయింది ... పరిగెత్తుతూ ... తూనీగలా పరిగెడుతున్న ఆమెని ... తూనీగల్ని పట్టుకునే తుంటరి కుర్రాడిలా పట్టుకుందామనే అతనూ పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమయ్యింది. ఆమె అదృశ్యమయ్యింది.... చుట్టుపక్కలంతా వెతికాడు ... ఎక్కడా కనిపించలేదు... చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి స్లిప్ అయ్యింది ప్చ్ ... ప్చ్ ... స్లిప్ ... స్లిప్ బిట్వీన్ కప్ ఎండ్ లిప్ ...! నిరాశగా తిరిగి గది దగ్గరకు వచ్చాడు.
తిరిగి వచ్చే సరికి గుమ్మంలో రోజా ... ‘’హాయ్ ...!’’ అన్నాడు ఆనందంగా ఎదురు వెడ్తూ .... ఆమె అతడ్నే చూస్తోంది. ఎటో వెళ్ళిపోయిన మనసు తిరిగి వచ్చింది ...ఆశగా కళ్ళనిండా ఆమెనే చూస్తూ అడిగేడు ... ‘’ఎప్పుడొచ్చావ్ ?’’ ‘’మీరు వెయిట్ లిఫ్టింగ్ కార్యక్రమంలో వుండగా’’ షార్ప్ గా, అతను ఉలిక్కిపడ్డాడు ... ఎమ్మే తెలుగు లిటరేచర్ చేసిన పెళ్ళానికి స్పాంటినిటీ కాస్త ఎక్కువే అని మొదట్లోనే గ్రహించాడు ... కానీ మరీ ఇంట ఎక్కువ అనుకోలేదు. కత్తివేటుకి నెత్తురు చుక్క లేనంతగా అతని ముఖం పాలిపోయింది ...
‘’అదీ ... అదీ ...!’’ ‘’అదే ... అది ఎవరనే అడుగుతున్నాను ....?’’ ‘ ’తెలీదు రోజా ...’’ ‘’బాడీ డేటా తప్ప బయోడేటాతో సంబంధం లేదన్న మాట ...’’ విసురుగా అడిగింది. ఏం చెప్తాడు ...? ఏం చెప్పినా వినే మూడ్ లో లేదు ... అపార్థం చేసుకుంది... అయినా తప్పు తనదే ... అస్సలు అలాంటి తప్పు ఎలా చేశాడు ...? క్షణాల్లో బుద్ధి గడ్డి తింది ... అప్పటిదాకా నీ గురించే ఎదురు చూస్తూ నీ ఆలోచనల్లోనే వున్నాను .... ఆ పిల్లని చూడగానే ఏం బయోకెమికల్ రియాక్షన్ జరిగిందే గానీ ...
చిన్న పొరపాటు జరిగింది. నువ్వు అనుకుంటున్నదేదీ జరగలేదని చెప్తే వింటుందా ... అసలే అతను ఎక్కువగా మాట్లాడడు. ఇక ఇలాటి నోట మాట రాని టైంలో ఎదుటి వ్యక్తి నోట్కి తాళం ఎలా వేయాలో తెలీని టైంలో ... మాటలెలా కూడగాట్టుకోవాలో అతనికి తెలియలేదు. ‘మా పెద్దాళ్ళు నా గొంతు కోశారు .... బుద్ధిమంతుడని ఇచ్చి చేశారు. మీ బుద్దేమిటో కళ్ళారా చూశాను ... ఎవర్నని ఏం లాభం ...? నా రాత బావుండలేదు ...’ ఆమె గొణుగుతూనె వుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుంది ... అలిగింది.
‘ఇలాటి వ్యవహారాలన్నీ చాలా మామూలేనన్న మాట! ఎంత ఆరితేరిన వాళ్ళు కాబట్టే ఆషాఢమాసం నాల్రోజులు కూడా అగలేక పోయారు. జనమంతా ఎలాగూ తప్పదు మీతో ... కనీసం ఈ నాల్రోజులన్నా ప్రశాంతంగా వుంటాను ... నే వెడ్తున్నా వూరికే ఫోన్లు చెయ్యకండి ...’’ చిర చిర లాడుతూ చార చార నడుస్తూ వెళ్ళిపోయింది. పిలవాలనీ .... ఆపాలనీ కూడా తోచలేదు అతనికి. ఇన్నేళ్ళనుంచి ప్రవర్తన ఒక్క చిన్న సంఘటనతో ఎందుకూ కొరగాకుండా పోయింది. ఈ మాత్రం దానికి ఏళ్ళతరబడి నిగ్రహంగా వుండటమెందుకు ...? ఎవర్ని అడగాలి ...
*****
రోజాని చూడకుండా ... రోజాతో మాట్లాడకుండా ... రోజాతో సెక్స్ లేకుండా ఒక్క రోజు వుండటం కూడా అసాధ్యమే అనుకున్న సుధాకర్ కి ఆషాఢమాసం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. పుట్టింట్లోవున్న ఆమెకు ఫోన్ చేయకుండా తనున్న ఊళ్ళోనే వున్న ఆమె పుట్టింటికి మాట్లాడకుండా ఈ రోజేక్కడ కల్సుకుందాం అని ఫోన్స్ చేయకుండా ఎలా గడిపాడో అతనికే తెలీదు.
శ్రావణమాసం వచ్చిన ఐదో రోజు ఆదివారమూ పంచమీ అన్ని రకాలుగా కుదిరాయని ఇంటికి రమ్మంటూ వచ్చిన మామగారు దేవుడిలా కనిపించాడు. శ్రావణమాసంలో అల్లుడ్ని అత్తవారింటికి స్వయంగా వెంట పెట్టుకుని తీసుకు వెళ్ళాలన్న నియమం పెట్టిన వాళ్ళందరికీ మనసులోనే నమస్కరించుకున్నాడు. గుమ్మం బయటే కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చినా, గుమ్మం ముందు కొబ్బరికాయ కొట్టి లోపలి రమ్మన్నా, లోపలి వస్తున్నప్పుడు హారతి ఇచ్చి స్వీటు పెట్టినా ఏదీ ఛాదస్తంగా అనిపించలేదు ... పద్ధతిగా అనిపించింది. లోపలి వెళ్ళగానే రోజా కోసం వెతికాడు. ఏదీ ఎక్కడుంది ..? ఇంకా అలక తగ్గలేదా ...?
ఇంట్లో పెద్దవాళ్ళందరికీ తన సంగతి చెప్పేసిందా...? ఇప్పుడు వాళ్ళందరూ పంచాయితీ పెడతారా ...? ఛా ...! ఛా ...! ఎంత పరువునష్టం ...? తనకిలాంటి శాస్తి జరగాల్సిందే ... ఎందుకెందుకు ...? నిజానికి తనేతప్పూ చేయలేదు. వయసులో వుండటం వల్ల రోజా పుణ్యమాని శారీరక సుఖమంటే ఏమిటో అపుడపుడు తెలియటం వల్ల రోజాకి దూరంగా వారం రోజులుండటం వల్ల ... రోజా ఆలోచనల్లో వుండటం వల్ల ... ఎన్నిటి వల్ల అయితే మాత్రం ఇంకా ఆడపిల్ల నడుమ్మీద చెయ్యేసాడంటే ఏ భార్య మాత్రం ఒప్పుకుంటుంది ...? మరెలా ...? బెడ్రూంలో కెళ్ళాడు ....
రోజా మంచంమీద కూర్చుని వుంది అతడ్నే చూస్తూ ... ఈ అవకాశాన్ని అతను వదుల్చుకో దలచుకోలేదు ... మాటలు చెప్పలేని భావాన్ని చేతలు చెబుతాయ్ ... శ్రీ కృష్ణ పరమాత్ముడిని గుర్తు చేసుకున్నాడు. మోకాళ్ళ మీద కూర్చుని ... ఆమె ఒళ్ళో తల పెట్టుకున్నాడు చేసిన తప్పుని ... చెయ్యని తప్పుని మన్నించమన్నట్టుగా ... అతని తల నిమిరింది ఆమె ... తర్వాత తన ఒళ్ళోని వాడ్ని గుండెల మీదికి ... గుండెలోకి పదిలంగా తీసుకుంది. దేవత వరమిచ్చిందని అర్థమయ్యాక ఆతనిక ఆగుతాడా ...? మన్మథుడే అయ్యాడు.
‘’బయట అందరూ మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు ... బావుండదు వెళ్దాం పదండి ...’’ తన ఛాతీ మీద పడుకున్న ఆమెని కదలనివ్వకుండా అడిగాడు అతను ‘’టైం ఎంతయ్యింది ...?’’ ‘ ’కాలమాగిపోయింది ...’’ ‘’ఏమిటీ ...?’’ అర్థంగాక అడిగేడు. గోడగడియారం వైపు చూపించింది. గడియారం పనిచేయట్లేదు. ఆమె భావం అర్థమై నవ్వి ‘’సెల్ మార్చాలనుకుంటా...!’’ అన్నాడు. ‘’ఒక్క నిమిషం ...’’ అంటూ అతడ్నుంచి విడివడి బాత్ రూమ్ లో కెళ్ళిందామె. అతని మనశ్శరీరాలు రెండూ దూది పింజెళ్ళా .. మబ్బు తునకల్లా తేలిగ్గా వున్నాయ్ హమ్మయ్య గండం గడిచింది ... రిలీఫ్ గా గాలి పీల్చుకున్నాడు.
జన్మలో ఇంకెప్పుడూ పొరపాటు చేయకూడదు. తనకు తనే ఒట్టు పెట్టుకున్నాడు. ‘‘ఏమండీ ... ఇది అందట్లేదు చూడండీ ...’’ అంటూ రోజా పిలవటంతో నోర్లా పడుకున్న సుధాకర్ అటువైపు తిరిగాడు .... షాక్ కొట్టిన వాడికిమల్లె అలానే చూస్తుండిపోయాడు ... లంబాడీ డ్రెస్ ... అదే ఫోజ్ ... డోర్ ప్రేమ్మీదున్న గోడ గడియారాన్ని మునివేళ్ళమీద నిలబడి అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్న రోజా ...! ‘’కొంచెం సాయం పట్టండి ...’’ పిలుస్తోంది రోజా.
డవుట్ లేదు ... రోజానే ... అదే వీపు ... అదే నడుం ... అవే పిక్కలు ... అవే మడమలు ... అంటే ... అంటే ... ఆ లంబాడీ పిల్ల రోజాయేనా ...? ఒక్కసారిగా వెళ్ళి ఆమెని సుడిగాలిలా చుట్టేశాడు ‘ ’అమ్మదొంగా ...! నిజం చెప్పు ...’’ అంటూ ... బ్రతిమాలించుకుని ... బ్రతిమాలించుకుని చెప్పింది ... ‘ ’మీ మగాళ్ళంత మూర్ఖులెవ్వరూ వుండరండి ...! ఆషాఢమాసం దూరంగా వుందామని బుద్ధిగా చెప్తే విన్లేదు కదా ... అందుకే బుద్దోచ్చేలా చేశాను అయినా...’’ ‘’నిన్నూ ...’’ అంటూ ఆమెని మాట్లాడనివ్వలేదు.
|
|

