.png)
చివరికి దీపాలు పెట్టేవేల ఆ వీథిలో ఏం కరుగుతుందో అక్కడి అమ్మాయిలూ చేసే వ్యాపారం ఏమిటో తెలిసిపోయింది ఆమెకి. ఆ క్షణంలో ఆమె గుండె అగ్నిపర్వతం కింద పగిలిపోయింది. ఇక అక్కడ వుండలేకపోయింది. తనను పంపించేయ్యమని బ్రతిమిలాడింది, ఏడ్చింది, కాళ్ళకు మొక్కింది. సావిత్రి కరగలేదు. మూడోరోజు ఆ రాత్రి ఆరంగ్రేటం జరిపిస్తానని రెడీగా వుండమని చెప్పింది.
ఆ టైముకి ఇందుమతి కుక్కిన పేనులా కన్నెరికం చేసుకునేటట్టు ఒప్పించాల్సిన బాధ్యతను ఆమె తన అసిస్టెంట్లకు ఒప్పజేప్పింది. వాళ్ళు ఓ ఆడపిల్లను అలానే ఒప్పిస్తారు. తిండీ, తీర్థం ఇవ్వకుండా ఓ గదిలో బంధిస్తారు. ఒప్పుకునే వరకూ బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదుతారు. వాళ్లకు తెలిసిన పధ్ధతి అదొక్కటే. మరుసటి రోజు రాత్రే ఇందుమతికి ఓ సెట్ తో ఫస్ట్ నైట్. ఆయన ఆమెకు కన్నెరికం చేయడానికి చెల్లిస్తోంది అక్షరాలా పాతికవేలు. తన బతుకు బుగ్గి అయిపోయేందుకు మరో ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే వుందని తెలియని ఇందుమతి స్పృహ తప్పిన స్థితిలో ఉంది.
"చిత్ర ఊర్లో లేదు, నిన్ననే కావలికి వెళ్ళిందట'' శతరూప భయం భయంగా చెప్పింది. జరిగిందేమిటో అందరికీ అర్థమైంది.
"ఏం జరిగిందో మీకు తెలిసిపోయింది, అయితే ఎట్లా జరిగి వుంటుందో నేను చెబుతాను'' అంటూ కలలో మాట్లాడుతున్నట్టు చెబుతోంది కవిత. "రాత్రికి రాత్రే ఇందుమతిని తీసుకుని భరణి రాజోల కండ్రిగలో ప్యాసింజర్ రైలెక్కుంటాడు. ఆ రైలు తెల్లవారు జామున కావలి చేరుకుంటుంది. రైలు టికెట్టు కొనకపోవడం వల్ల దర్జాగా ముందుద్వారం నుంచి వెళ్ళే వీలు లేక బాగా వెలుగొచ్చే వరకూ స్టేషన్ లోనే ఆగిపోయి వుంటారు.
ఆ తర్వాత బయల్దేరి పట్టాభిని కలిశారు. అతను పొట్టేలు మాంసం అమ్ముతుంటాడు. వాళ్ళిద్దరికీ ఓ ఇల్లు చూపించాడు. అక్కడే మొదటి రాత్రి శోభనం. పెళ్ళి చేసుకుంటానన్న భరణికి తనను అర్పించుకున్న ఇందుమతి ఇక అక్కణ్ణుంచి బొంబాయి ...'' ఆ తరువాత ఒక్క మాట కూడా వినలేక పోయింది శతరూప. ఆకాశం అంటుకుని అది తమ నెత్తిమీద పడుతున్నట్టు వణికిపోయింది. "వద్దు కవితా చెప్పొద్దు'' ఆమె బలవంతంగా ఆపు చేసింది.
కన్నపేగు కన్నీళ్ళయి ప్రవహిస్తున్నట్టుంది. రామదాసు ఏం జరగాలన్నదే ఆలోచిస్తున్నాడు. "నాక్కూడా అచ్చు ఇలానే జరిగింది. చలపతి స్థానంలో భరణి నా స్థానంలో ఇందుమతి తేడా అంతే'' గతాన్ని కళ్ళముందుకు తెచ్చుకుని మళ్ళీ చెప్పసాగింది కవిత.
"బొంబాయిలో చిత్ర మన ఇందూను ఎక్కడ ఏమ్ముతుందో తెలుసా?'' ఆయన ఆతృతతో అడిగాడు.
"ఆ'' అన్నది కవిత.
"అయితే ఒక్కక్షణం ఆలస్యం వద్దు. ముందు కావలికి వెళ్ళి చూద్దాం. అక్కడ లేకపోతే బొంబాయికి వెళదాం. మన ఇందుమతిని రక్షించుకుందాం'' "అవును మన ఇందూ బతుకు నాలా కుక్కలు చింపిన విస్తరి కాకూడదు'' కవిత తన మీదున్న బ్లాంకెట్ ను పక్కకు విసిరేసి చటుక్కున లేచి నిలబడింది. ఓ అద్భుతమైన ఆశయం మనిషికెంత మనోబలాన్నిస్తుందో ఆమెను చూస్తే తెలుస్తోంది. పదినిముషాల క్రితం వరకు పేషెంటుగా ఉన్న ఆమె ఇప్పుడు పతితకాకుండా ఓ అమ్మాయిని రక్షించే బాధ్యతను తన నెత్తిమీద వేసుకున్న వీరనారిలా వుంది.
|
|


