వృషణాలతో సంబంధం లేకుండా బీజకోశం లావేక్కడం వరిబీజం (హైడ్రోసిల్)వల్ల జరుగుతుంది. వృషణాల చుట్టూ పల్చని పోర ఉంటుంది. దానిపైన మరొక పోరుంటుంది. ఈ రెండు పోరలూ కలిసి ఒక సంచీగా ఏర్పడతాయి. కొందరికి ఈ సంచీలోకి నిదానంగా ఒక రకమైన ద్రవం చేరుతుంది . దీనినే వరిబీజం అంటారు. మధ్యవయస్సు పురుషులలో వరిబీజం తరచుగా కనబడుతుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ వరిబీజం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో దానంతట అదే పోతుంది.
పెద్దవాళ్ళల్లో దీర్ఘకాలం నిలవ ఉండిపోయిన వరిబీజం వల్ల వృషణాల క్షీణించడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి క్షీణించి పిల్లలు కలిగే అవకాశం తగ్గవచ్చు. అందుకని త్వరగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఆపరేషన్ కి బదులుగా వరిబీజంలోని నీరు సిరంజిద్వారా బయటకు తీసేసి అందులోకి క్వినైన్ యురిథెన్ అనే మందు ఎక్కించే పధ్ధతి ఉంది కాని దానివల్ల పెద్ద ఫలితం ఉండదు. పైగా సరిగ్గా చేయకపోతే సెప్టిక్ కూడా అవవచ్చు. సక్రమంగా చేసినా తిరిగి వరిబీజం రావచ్చు. ఎప్పుడైనా బీర్జాలకి దెబ్బ తగిలితే వృషణాల మీద ఉండే సన్నని పొరల సంచిలోకి రక్తం చేరుకొని హిమటోసిల్ గా తయారవుతుంది. దీనివల్ల బాగా నొప్పి చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి దీనికి సర్జరీ అవసరం అవుతుంది. అలాగే ఫైలేరియాలో వరిబీజం కావడానికి ఆస్కారం వుంది.
|
|


