The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Sex - Science>>Heartbroken Lovers
భగ్న ప్రేమికులు - పగిలే గుండెలు

భగ్న ప్రేమికులు అనగానే దేవదాసు గుర్తుకు వస్తాడు. ప్రేమవల్ల పగిలిన గుందేగా మన ముందు నిలబడతాడు. భగ్న ప్రేమకు చిహ్నంగా దేవదాసు పేరే చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందఱో యువకులు కూడా భగ్న ప్రేమికురాండ్రై గుండెలు పగిలి చిందర వందరగా ఉంటారు. మగవాడు గనుక త్రాగి మైకంలో మనస్సుకి ముసుగువేస్తే, అలా త్రాగాలేక, మనస్సుని మార్చికోలేక గుండెలో రగిలే మంటలకి మనస్సుని చితిచేసి, ఆ వెదికి తాళలేక వంపులు వచ్చి చివరికి బిగాదీసుకుని పోయి జీవచ్చంలా పడిఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిస్టీరియా ఫిట్స్ తో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు. మగవాళ్ళలో కూడా హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. కాని తక్కువ. అదే స్త్రీలలో మానసికంగా కలిగిన బాధకి తట్టుకోలేక హిస్టీరియా ఫిట్స్ తెచ్చి పెట్టుకుంటుంది. ఎన్నో

 

సెక్స్ సమస్యలు - ఎందఱో యువతులు :- స్త్రీలలో వలెనే పురుషులలో కూడా ఎన్నో సెక్స్ సమస్యలు ఎదురవుతాయి. కాని పురుషుడు మానసికంగా కృంగిపోవడం తక్కువ, స్త్రీ కృంగిపోవడం ఎక్కువ. దీనికి కారణం పురుషుడు నలుగురితో ఎక్కువ కలిసి మెలసి తిరగడానికి అవకాశం ఉంటుంది కనుక వారితో మాట్లాడుతున్నంతసేపు అయినా మానసికంగా కొంత శాంతిని పొందగలుగుతాడు. అదే స్త్రీ విషయంలో అయితే తన బాధ ఇంకొకరితో చేప్పుకోలేదు. నలుగురిలో తిరగడానికి సమాజం ఒప్పుకోదు. దాంతో మానసికంగా కృంగిపోయి ఇంట్లో నాలుగుగోడల మధ్య ఉండిపోవడంతో ఎప్పుడూ అదే ఆలోచన, అదే బాధ. మనస్సులోని బాధలని బయటకు వ్యక్తీకరించడానికి అవకాశం లేకపోవడం, వాటిని మరచిపోవడానికి తగిన వాతావరణం లేకపోవడంతో వారికి మానసిక నైరాశ్యం, అసంతృప్తి, హిస్టీరియా ఫిట్స్ రావడానికి ముఖ్యకారణం. సమాజంలో పురుశునీ ఒక నీతి, స్త్రీకి మరొకనీతి ఉండటంవల్ల ఇటువంటి మానసిక వ్యాధులు ప్రబలడానికి అవకాశం కలుగుతుంది.

 

మానసిక వ్యభిచారం :- మానసిక వ్యభిచారం మంచిదా? అది నేరం క్రింద పరిగణింపబడదా? హస్త ప్రయోగం చేసే వ్యక్తుల్లో మానసిక వ్యభిచారం అనే విషయం వస్తుంది. మనస్సులో వారికి నచ్చే వారి రూపం మెదలడం, వారితో సంయోగం జరుపుతున్నట్లు అనుభూతి పొంది కామోద్రేకం చెందడం మానసిక వ్యభిచారంగా పరిగణింపబడుతుంది. ఇలా ఒక పరాయి స్త్రీని ఊహించి ఆమెతో మానసికంగా వ్యభిచరించడం నేరమా అంటే చట్టప్రకారం నేరం మాత్రం కాదు.

 

 

ఇటువంటి మానసిక వ్యభిచారం సెక్సు విషయంలో చాలా సహజం. శారీరకంగా భార్యతో సంయోగం జరుపుతూ ఆ సమయంలో కూడా మానసికంగా ఇంకొక స్త్రీని వ్యభిచరించే పురుషులు చాలామంది లేకపోలేదు. భార్య అనాకారిగా ఉండవచ్చు, భార్య వైపునుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవచ్చు. ఆమెను చూస్తే మనస్సులో కామము కలగకపోవచ్చు. అటువంటప్పుడు కామవాంఛ తీవ్రత పెంపొందడానికి, వీర్య స్కలనంతో రతిలో తృప్తి పొందడానికి ఆ పురుషుడు తనకి ఇష్టమైన స్త్రీని మనస్సులో ఊహించుకుని భార్యతో రతి జరుపుతున్నా తన ఊహాసుందరితో రతి జరుపుతున్నట్లు భావించి కామాన్ని క్లయిమాక్సుకి పెంపొందించుకుని తృప్తి పొందడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో ఒకరికొకరి యెడల ఆసక్తి తగ్గిపోయినప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ మానసిక వ్యభిచారం మంచి మందుగా పనిచేస్తుంది.