The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Jokes>>Godachatu Muddu
గోడచాటు ముద్దు

 

“నీ స్మృతులు మృతప్రాయం కావు … అవి అమృతతుల్యమైన చందన, చర్చిత పరిమళ భరితమైన మధురోహాల, శృంగారాను భూతులకు, తొలి, నులివెచ్చని కౌగిళ్ళ నజరానులకు భాష్యం చెప్పి, సేద తీర్చే మజిలీలు. ఒట్టు … మన ‘తొలిగోడచాటుముద్దు’ మీదొట్టు’’

*****

లాస్ ఏంజిల్స్ ….. న్యూ ఒకేగా అపార్ట్ మెంట్స్ … సిక్స్ త్ ఫ్లోర్ … విశాలమైన అతి ఖరీదైన బెడ్రూంని నీలిరంగు బల్బుకాంతి ఆక్రమించుకుంది. “లాస్ ఏంజల్’’ స్ప్రే ఆ గదిలో ఆహ్మాదాన్ని అందిస్తోంది. అతి ఖరీదైన ఒమెక్స్ నైట్ బెడ్ తెల్లటి పాల నురుగులా మెరిసిపోతోంది. మిడ్ నైట్ ఎట్ ట్వెల్ … “విరజా డాళింగ్ …’’ అమాంతం వెనక నుంచి వచ్చి భ్యారను చుట్టేసి ఆమె లేత పొట్టను తన చేతులతో బిగించేసి, ఆమె మెడఒంపులో మొహం పెట్టి అన్నాడు విరించి.

“యూ … నాటీ … ఫిఫ్టీస్ లో కూడా ‘మీరిలా’ ‘సిక్స్ టీన్’లా రెచ్చిపోవడం ఏం బాగాలేదు’’ అంది ముద్దుగా మొగుడ్ని విసుక్కుంటూ … “అది కాదు డాళింగ్ … నా ప్రాబ్లెం అర్థం చేసుకోవూ … వింటర్ సీజన్ … ఫైర్ ప్లేస్ ను కాదని, నిన్ను ఆశ్రయిస్తే … బ్యాడ్ … డిసీజ్ వెరీ బ్యాడ్’’ అన్నాడు భార్యను కవ్విస్తూ. “అబ్బ … నీ ఇంగ్లీష్ కవిత్వం ఆపుతావా?’’ అంది విరజ.

“నా రొమాంటిక్ భావకవిత్వం, నీకు ‘కపిత్వం’లా అనిపిస్తుందా?’’ బుంగమూతి పెట్టి అన్నాడు విరించి. “ఇంకా పాతికేళ్ళ క్రిందటి చిలిపితనం పోలేదు బావా?’’ అతని ముక్కు పట్టుకుని ఆడిస్తూ అంది.

“నువ్వు మాత్రం … పెళ్ళి కాకముందు పిలిచినా బావా … అన్న పిలుపునే, పెళ్ళయి ఇన్నేళ్ళయినా కంటిన్యూ చేయడం లేదూ … అసలు స్టేట్స్ లో గత పాతికేళ్ళుగా ‘టాక్ ఆఫ్ ది టౌన్’ ఈ ఇష్యూనే అన్నాడు ఆమెను తనవైపు తిప్పుకొని చుట్టేస్తూ. పింక్ కలర్ నైటీలు ఫార్టీస్ క్రాస్ చేసినా, బింకంగానే వుంది ఆమె స్ట్రక్చర్..

ఏ వృత్తలేఖని ఇంత ఇదిగా అందాలను క్రియేట్ చేయలేదేమోనన్నంత … రొమాంటిక్ మూడ్ ని క్రియేట్ చేసే వెస్ట్రన్ మ్యూజిక్ మంద్రంగా వినిపిస్తోంది. విరించి చేతిలో నలిగి, కరిగి, కలిసి పోతోంది విరజ. ఇలాంటి టైంలో అతను నైటీని ద్వేషించి బహిష్కరిస్తాడు.

*****

ఇద్దరి మధ్య వెచ్చని కబుర్లు. ఉచ్వాసనిచ్వాసళు … వాళ్ళ సైనికులయ్యారు. నఖ, దంతక్షతాలు చుంబనాదులు వాళ్ళకు ఆయుధా లయ్యాయి. పాతికేళ్ళ దాంపత్య జీవితం అనుభవించిన, ప్రతి రాత్రి వాళ్లకు శృంగారసమరమే … సంధి లేని యుద్ధం వాళ్ళిద్దరి మధ్య నిరంతరం జ్వలిస్తూనె వుంటుంది. తెల్లటి ఆమె మేనిపై అతని పెదాలు, పాదాలై అడుగులేస్తూ వుంటే, అతని గమనాన్ని ఓరకంట వీక్షిస్తూ అతనికి అందమైన మజిలీలు చూపిస్తూ ఆమె మురిసి మెరిసి పోతోంది.

అతనామె నడుంమడత మజిలీకి చేరుకొని పెదాలకు విరామాన్ని ఇచ్చి సేదతీరుతాడు. ఆపై మళ్ళీ అతని పెదవుల యాత్ర మొదలవుతుంది. ఆమెలోని ఏ మజిలీని అతను సందర్శించకుండా విడిచిపెట్టడు.

*****

ఇద్దరి మధ్య సమయనియమం లేడు. ఇద్దరు ఒకరిలో మరొకరు కలిసిపోయే వరకూ, వాళ్ళిద్దరి మధ్య శృంగార యుద్ధం కొనసాగవలసిందే.

*****

“రేపే మనం ఇండియా వెళ్తున్నాం డాళింగ్’’ అన్నాడు వేకువవేళ ఆమె ఒడిలో తలపెట్టి విరించి.

“ఐనో .. పాతికేళ్ళ తర్వాత వెళ్తున్నాం కదూ …?’’ అంది విరజ. అలా అన్నప్పుడు ఆమె గొంతు వణికింది. ఎన్ని అనుభవాలు … ఎన్ని అనుభూతులు …. “అవున్నిజమే … ఎప్పుడూ ఏదో పని … బిజీ వర్క్ … బిజీ … కనీసం ఇప్పటికైనా వెళ్తున్నాం .. బీ రేడీ …’’ అన్నాడు ఆమె తలను తన పెదవులపైకి ఒంచి, ఆమె లేత పెదాలను తన పెదవుల మధ్య బిగిస్తూ.

ఇండియాలో కాలు పెట్టగానే ఉత్సాహం … హైదరాబాద్ లో దిగగానే అత్యుత్సాహం … తమ ఊళ్ళోకి అడుగుపెట్టగానే ఉద్వేగం … పాతికేళ్ళ క్రిందట పచ్చని పొలాల మధ్య స్వచ్చమైన గాలి పీలుస్తూ ఆడుకుంటూ, కోనేరులో స్నానం చేసి కోవెలలో పాటలు పాడుకుంటూ వుంటే గతస్మృతుల తేనేటిగలతుట్టె కదిలి చెదిరింది. ఆ అందమైన కల కళ్ళముందు నిలిచింది.

*****

“బావా …!’’ ఆ రెండిళ్ళ మధ్య ‘హద్దు’లా వున్న గోడచాటు నుంచి సైరన్ కూతలా వినిపించింది విరజ కంఠం … అప్పుడే స్నానం చేసొచ్చి ఫ్రెషప్ అవుతున్న విరించి ఆ సైరన్ గొంతుని గుర్తించి నవ్వుకున్నాడు. విరించి తల్లి హైందవి , విరజ తండ్రి రాఘవరావు అన్నాచెల్లెలు. ఆ పల్లెటూరిలో వున్న రెండు అతి పెద్ద భవంతులు ఆ అన్నాచెల్లెల్లవే. హైందవికి పెళ్ళయ్యాక ఆమె భర్త కూడా ఆ పల్లెలోనే సెటిలయ్యాడు.

ఇళ్ళ పంపకాలు జరిగాయి. చెల్లెలి మీద మమకారంతో ఆ రెండు భవంతుల మధ్య హద్దుగా గోడను కట్టించడానికి మనస్కరించలేదు రాఘవరావుకు. అందుకే ‘హద్దు’గా కట్టించే గోడ నిర్మాణాన్ని సగంలోనే ఆపేసాడు. సగం వరకూ లేచిన గోడ అలానే వుంది. తమ మధ్య అడ్డుగోడ వుండొద్దని నిర్ణయించుకున్నారు. ఆ గోడను కూల్చేద్దామని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా అప్పుడే ఆ గోడ చాటున బావా, మరదళ్ళు ఆడుకోవడం, దాక్కోవడం ఒకరినొకరు ఆ గోడచాటు ఆసరాతో ఆటపట్టించుకోవడంతో వాళ్ళిద్దరి ఆటపాటల కోసం ఆ గోడని అలాగే వుంచేశారు. విరజ, విరించి చిన్నప్పట్నుంచి కలిసి పెరగకపోయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ. విరించి హయ్యర్ స్టడీస్ కోసం స్టేట్స్ కు వెళ్ళడం, అక్కడే కంప్యూటర్ ఇంజనీర్ గా చేయడం జరిగిపోయాయి. అయినా విధిగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మరదలితో గడిపి వెళ్తాడు.

*****

“బావా …! ఇదిగో ఒకటోసారి పిలవడం అయిపొయింది. రెండోసారి పిలుస్తున్నా … ‘’ పరికిణీని బొడ్లో దోపి సీరియస్ గా వార్నింగ్ ఇష్యూ చేసింది విరజ. లంగా, పరికిణిలో ముద్దబంతిపువ్వులా అందంగా వుండే విరజ అంటే బోలెడు ఇష్టం విరించికి. అయినా మరదలిని ఉడికించాలని రెస్పాన్స్ ఇవ్వలేదు. “బావా … రెండోసారి అంది’’ అయినా నో రెస్పాన్స్ …. విరించి నుంచి.

“ఒరే బావా …!’’ ఈసారి పిలుపు మారింది. గతుక్కుమన్నాడు విరించి. రెండున్నరసారి …. మూడోసారి … “ఒరే నిన్నేరా విరించి బావగా …’’ ఈసారి రెండు ఫ్యాక్టరీల సైరన్ కూతల్ని మిక్స్ చేసి అరిచి పిలిచింది విరజ. కంగారుపడిపోయాడు విరించి. ఇంకా ఆలస్యం చేస్తే ‘ఏం వినవలసి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. వెంటనే రియాక్టయి గోడచాటుకు పరుగెత్తి మరదలు చెవి మెలిపెట్టాడు.

“నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువవుతోంది … నీకన్నా పెద్దవాడిని ,,, బావని … రేపోమాపో నీక్కాబోయే మొగుడ్ని …’’ ఇంకా ఏదో చెప్పబోతుంటే విరజ, విరించివైపు చూసి ‘సైరన్ కూత’ లెవల్లో కేకేసింది మళ్ళీ…. “ఏయ్ … ఏమిటా సైరన్ కూత …?’’ కంగారుపడిపోతూ విరజ చెవి వదిలేసి అడిగాడు విరించి.

“ఒరే బావా … నువ్వు ఫ్రెషప్ అయ్యావు గానీ డ్రసప్ అవ్వలేదు …’’ ఒంటిమీద తువ్వాలుతో వచ్చి వుంటావు. ఆ బుజ్జిముండ జారిపోయింది… ఛీ … యాక్’’ అంది కావాలనే అతడ్ని ఉడికిస్తూ. ఆ క్షణం అలానే చూస్తుండిపోయాడు. విరజలో అమాయకత్వం ఎంతుందో అల్లరి అంతే వుంది. ఆమె పెదాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతున్నాయి. “నన్నిలా పిలిచి గోడచాటుకు రప్పించడం నీకిదే పనిష్మెంటు …’’ అంటూ తమకంగా మరదలు మీదికి ఒంగి ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు.

సుదీర్ఘ చుంబనం … క్షణాలు … నిమిషాలు … గడుస్తూనే వున్నాయి. చల్లగాలి పరామర్శిస్తోంది … ఆకాశానికి భూమికి మధ్య చీకటి పరదా వేలాడుతోంది. గోడచాటున వున్న సన్నజాజుల చెట్టు నుంచి సన్నజాజుల పరిమళం మత్తేక్కిస్తోంది. విరించి పడబోతూ బ్యాలెన్స్ కోసం విరజ నడుం పట్టుకున్నాడు. విరజ బావ బరువు మోయలేక అలా అని అతడ్ని వెనక్కి తోయలేక గోడను ఆనుకుంది బ్యాలెన్స్ చేసుకుంటూ …

ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వేనవేల మాటలను కూర్చి వేనవేల పాటలకు ప్రోది చేసింది. వాళ్ళలోని పరవత్వం నేపథ్యసంగీతమైంది. అటు విరజ తల్లితండ్రులు … ఇటు విరించి పేరెంట్స్ వచ్చి కళ్ళు మూసుకుని హర్షాతిరేకాలకు చప్పట్ల ద్వారా తెలియజేసేవరకూ వాళ్ళు ఈ లోకంలోకి రాలేదు ….

*****

“అమ్మా … హైందవి … దీనిబట్టి నాకు అర్థమిందేమిటంటే … నీ కొడుకు అంటే నా అల్లుడికి అలాగే నీ కోడలికి అంటే నా కూతురికి అర్జంటుగా పెళ్ళి చేయాలని …. మాఘమాసంలో మంచి ముహూర్తం వుంది’’ రాఘవరావు డిక్లేర్ చేశాడు. గోడచాటు ముద్దు పుణ్యమాని ఆ పెళ్ళి అలా కుదిరిపోయింది.

*****

“విరజా … ఏయ్ … విరజా …’’ విరజ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా భర్త. విరజా ఫైవ్ స్టార్ హోటల్ లోని మూడవ అంతస్థులో వున్న లగ్జరీ సూట్ లో నుంచి, బయటకు చూసింది. ఎదురుగా విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ … చుట్టూ కంపెనీలు … ఆఫీసులు … ఆకాశహార్మ్యాలు … “పాతికేళ్ళలో ఎంత మారిందండీ … ఒకప్పటి ఈ పల్లెటూరు ఇప్పుడు హైటెక్ సిటీని తలదన్నింది. పొలాలు మాయమయ్యాయి … కోనేరు లేదు … కోవెల లేదు … పచ్చని పైరుగాలి లేదు …’’ స్వగతంగా అంది విరజ.

పెళ్ళయ్యాక విరించి, విరజ స్టేట్స్ కు వెళ్ళారు. బిజీవల్ల ఇండియా రావడం కుదరలేదు. తర్వాత విరించి పేరెంట్స్ విరజ తల్లిదండ్రులు సంవత్సరం గ్యాప్ లో చనిపోవడం … అప్పుడొచ్చారు. ఆ తర్వాత తన ఆస్తిపాస్తులను కంపెనీలుగా మార్చేశారు. ఇల్లని మాత్రం పడగొట్టి విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ … విరజ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించారు. ఒక్క ఆ గోడ …. మాత్రం అలానే వుంది పాతికేళ్ళయినా … తమకు తీపిజ్ఞాపకంగా మిగిలిన గోడ …

శిథిలావస్థలో వున్నా, తమ అనుభూతులను పంచుకున్నారో అక్కడే కూచున్నారు విరజ, విరించి … పాతికేళ్ళు వెనక్కి వెళ్ళి …. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ … గోడచాటు ముద్దు తాలూకు స్మృతికి ఊపిరిపోసుకుంటూ వుండిపోయారు. ఆ అనుభవం అమృత తుల్యమైనది … అజరామరమైనది … అనుభవానికి మరణం లేదు…. అనుభూతికి కాలంతో పనిలేదు ….