The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kama Shastram>>Contineous Health Problems - Health Problems
Contineous Health Problems - Health Problems

గుండెజబ్బులు కలవారిలో ఆడ, మగ ఇద్దరిలోనూ సెక్స్ కు సంబంధించిన అనేక సందేహాలు కలుగుతుంటాయి. సిగ్గుతో రోగులు అడగరు. డాక్టర్లు కూడా చాలా సందర్భాలలో సెక్స్ కు సంబంధించిన సలహాలు ఇవ్వరు. ఇదే పరిస్థితి అవయవాల మార్పిడి శస్త్రచికిత్స అయినవారు, క్యాన్సర్ సర్జరీ, ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు, కీళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు, రుమాటిక్ డిసీజ్ వున్నవారిలో కలుగుతుంది. హెచ్. ఐ. వి. వచ్చినవారిలో అనేక సందేహాలు కలుగుతూ వుంటాయి గానీ వాళ్ళ సందేహాలు తీర్చడం చాలా తక్కువగా వుంటుందని అమెరికాలో గమనించారు. ఈమధ్య జరిగిన ఒక రీసెర్చ్ ప్రాజెక్టులో హెచ్. ఐ. వి. వ్యాధికి గురైనట్లుగా డాక్టరు దగ్గరకు కొందరు నటీనటులను పంపించారు. వీరు ప్రైమరీ కేర్ ఫిజీషియన్స్ ని, నర్సులను కలిశారు. కండోమ్ వాడకం, సెక్సువల్ ఓరియంటేషన్, గతంలో వున్న పార్టనర్ల సంఖ్య లాంటి ముఖ్యమైన ప్రశ్నలు కూడా కేవలం 9 నుంచి 63 శాతం మందిని మాత్రమే అడిగినట్లు చూశారు.

 

సెక్సువల్ బిహేవియర్ లో రిస్క్ ను తగ్గించే మార్గాలగూర్చి ఇంకా తక్కువ సందర్భాలలోనే చెప్పినట్లు చూశారు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్సకొచ్చే వారిలో 1000 మందిని పరిశీలించారు. వారిలో 30 శాతం మందిలో కంటే ఎక్కువ మందిలోనే అంగస్తంభన సమస్య వున్నప్పటికీ మెడికల్ రికార్డ్స్ లో ఈ సమస్య గూర్చి అశలు ప్రస్తావించలేదని చూశారు. గతంలో అమెరికాలో మెడికల్ స్టూడెంట్స్ కు సెక్స్ గూర్చిన అవగాహన కలిగించే తరగతులు తక్కువ వుండేవి. గత శతాబ్దం నుంచి అక్కడ సెక్సువాలిటీకి సంబంధించిన శిక్షణా తరగతులు పెరిగాయి. అమెరికన్ అసోసియేషన్ కూడా సెక్సువాలిటీకి సంబంధించిన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. రోగి యొక్క ముఖ్యమైన వ్యాధికి సంబంధించిన అంశాలు పరిశీలించడానికే సమయం సరిపోతుందని సెక్స్ గూర్చి అడిగే సమయం అక్కడే లేదని చూశారు.

4000 మంది అవుట్ పేషెంట్స్ ని పరిశీలించినప్పుడు ఫ్యామిలీ ఫిజీషియన్ తో గడిపే సమయం సగటున 10 నిముషాలని గమనించారు. ఈ సమయం లో రోగి వ్యాది వృత్తాంతం చెప్పడం, రోగిని పరీక్షించడం, చికిత్సా ప్రణాళిక వివరించడం, రోగికి కల సందేహాలు తీర్చడానికే సరిపోతుంది. దిగులు లేదా ఆందోళన కలిగినట్లయితే ఇంకో 2,3 నిముషములు మాత్రమే కేటాయించ గలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో సెక్స్ గూర్చి అడగడానికి అవకాశం లభించట్లేదు. దీర్ఘకాల వ్యాధులలో సెక్స్ కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్య, స్త్రీలలో కామోద్రేకం తగ్గడం, స్త్రీ పురుషులిద్దరిలోనూ భావప్రాప్తి లోపం లాంటి సెక్స్ సమస్యలు కలుగుతాయి.

దీర్ఘకాల వ్యాధుల్లో సెక్స్ సమస్యలు సాధారణంగా కలుగుతూ వుంటాయి. అడగ డానికి సిగ్గుపడి రోగులు సమయం చాలక లేదా ఇతర కారణాల వల్ల డాక్టర్లు అడగరు. అనేక సర్వేలలో సెక్స్ గూర్చి అడిగినప్పుడు రోగులలో చాలామంది డాక్టర్లే సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగితే బాగుంటుందని తమంతటతాము అడగలేక పోతున్నామని చెప్పారు. కొద్దిశాతం మంది మాత్రం డాక్టర్ని సెక్స్ సమస్యను గూర్చి అడగడమే కాకుండా వాళ్లంతట వాళ్ళే సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి సహాయానికి వస్తున్నారు. అమెరికాలో చాలామంది రోగులు వివిధ వ్యాధులలో కలిగే సెక్స్ సమస్యల గూర్చి వుచితంగా లభించే సమాచారాన్ని తెలుసుకుంటున్నారు కానీ పుస్తకాలు కొని చదవడంలో అంత ఉత్సాహం చూపించట్లేదని గమనించారు. నేషనల్ ఆర్ద్రెటీస్ ఫౌండేషన్, మల్టిపుల్ స్క్రీరోసిస్ సొసైటీ, క్యాన్సర్ సొసైటీలు కొంత సమాచారాన్నిస్తున్నాయి.

బాగా చదువుకున్న వాళ్లు, వున్నతమైన పదవులలో వున్న వాళ్లు ఇంటర్ నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి తెలుసు కుంటూ సెక్స్ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తున్నారు. కానీ చాలామంది అడగడానికి సిగ్గుపడుతున్నారు. సెక్స్ సమస్యలు వాటి పరిష్కారానికి మార్గాలు గూర్చిన అవగాహన లేక పోవడం, దీర్ఘకాలవ్యాధులు, వృద్దాప్యం వీటిలో సహజంగానే కలిగే మార్పులు, సెక్స్ సమస్యలు గూర్చి పరిజ్ఞానం లేక పోవడం, సెక్స్ కౌన్సిలింగ్ విషయంలో సిగ్గుపడడం ఇలా అనేక కారణాలుగా సెక్స్ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ, వాళ్లు బాధ పడుతూ, పార్టనర్ ని కూడా బాధపెడుతున్నారు. దీర్ఘకాల వ్యాధులలో సెక్స్ కు సంబంధించిన అనేక రకాల వికృతులు కలుగుతాయి.

 

బ్రెస్ట్ క్యాన్సర్ కు చికిత్స తీసుకునే యువతులతో ముఖ్యంగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలు జరిగినప్పుడు సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. శరీరంపై స్పర్శవలన కామోద్రేకం కలగడం తగ్గుతుంది. అండాల ఫెయిల్యూర్ వలన యోనిలో స్రావాలు తగ్గడం, రతిలో నొప్పిలాంటివి కలుగుతాయి. వీటన్నిటి ఫలితంగా భావప్రాప్తి పొందలేరు. కొన్ని రకాల సెక్స్ సమస్యలు కొద్దికాలం వుంటాయి. మందులు మార్చడంతో తగ్గుతాయి. కానీ చాలా సమస్యలు దీర్ఘకాలం అనువర్తించి వుంటాయి. వాటికి చికిత్స కూడా దీర్ఘకాలం చేయాల్సి వుంటుంది. సెక్స్ కోరికలు తగ్గడం అన్నది ఆడ, మగ ఇద్దరిలోనూ దీర్ఘకాల వ్యాధులు వున్నవారిలో కనబడే ముఖ్యమైన సమస్య. కొన్ని సందర్భాలలో వ్యాధిని గుర్తించడానికి ముందే సెక్స్ కోరికలు తగ్గడం వుంటుంది. వ్యాది నిర్ధారణ జరిగినతర్వాత వ్యాధికి చికిత్స జరిగేకొద్దీ సెక్స్ కోరికలు తగ్గడం అనే సమస్య క్రమంగా ఎక్కువ అవుతుంది.