The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kama Shastram>>Contineous Health Problems - Health Problems
దీర్ఘకాల వ్యాధులు - సెక్స్ సమస్యలు

దీర్ఘకాల వ్యాధులలో అనేక సెక్స్ సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాల వ్యాధుల సంఖ్య పెరగడమే కాకుండా మధ్య వయసులోనే దీర్ఘకాల వ్యాధి బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు వృద్దాప్యంలోనే ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇప్పుడు మధ్యవయస్కులను కూడా బాధిస్తున్నాయి. దీర్ఘకాల వ్యాధులు వాటికి వాడే మందులు సెక్స్ సమస్యను కలిగిస్తాయి. మధ్య వయస్కులలో మరో ముఖ్యమైన సమస్య మిడిల్ ఏజ్ క్రైసిస్. వృద్దాప్యం వచ్చేలోపే జీవితంలో స్థిరపడాలి అనే ఆలోచన, ఆందోళన ఎక్కువవుతోంది. జీవితంలో స్థిరపడడం అంటే పిల్లలు సెటిల్ అవ్వడమన్నది, పిల్లలకు ఉద్యోగాలు రావడం, వాళ్ళ పెళ్ళిళ్ళు అనే ఆలోచన మధ్య వయస్కులలో ఎక్కువగా వుంటుంది. 10, 15 సంవత్సరాలలో ఇవన్నీ సాధించాలి. ఆందోళన పెరగడం, జీవన విధానంలో మార్పులు, ఇవన్నీ దీర్ఘకాల వ్యాధుల్ని పెంచుతున్నాయి.

 

తగినంత ఏకాంతం లేకపోవడం, కుటుంబ బాధ్యతలతో భార్య కూడా అలసిపోవడంతో శృంగారంలో పాల్గొనడం తగ్గిపోతుంది. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్లు కూడా సెక్స్ కు సంబంధించిన సలహాలు ఇవ్వరు. రోగులకు కూడా అడగడానికి సమయం చాలకపోవడం ఆ విషయం ఆ సమయంలో గుర్తుకు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ వుంటాయి. కామోద్రేకం తగ్గడం సెక్స్ కోరికలు కలగకపోవడం, క్యాన్సర్, ఎయిడ్స్, నాడీమండల వ్యాధులలో ఎక్కువగా వుంటుంది. ఇలాంటి వ్యాధి ఉందన్న నిర్దారణ జరిగినప్పటినుంచే సెక్స్ సమస్యలు కలగడం సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం జరుగుతుంది.

 

కీమో థెరపీ, రేడియేషన్, అనేక రకాల మందులు సెక్స్ కోరికలను, కామోద్రేకాన్ని తగ్గిస్తాయి. అనేక రకాల మానసిక భావాలు కూడా సెక్స్ కోర్కెలు తగ్గిస్తాయి. దిగులు, ఆత్మవిశ్వాసం తగ్గడం, శరీరాకృతిలో మార్పులు, సామర్ద్యానికి సంబంధించిన భయం, ఇవన్నీ దీర్ఘకాల వ్యాధి బాధితులలో సెక్స్ కోరికలు తగ్గేట్టు చేస్తాయి. మామూలుగా హాస్పిటల్ లో సెక్స్ సమస్యల గూర్చి అడగడానికి లేదా వాటిని గూర్చి వివరించి చెప్పడానికి తగినంత ఏకాంతం వుండదు. రోగి, రోగి తాలూకు బంధువు, డాక్టర్లు అసిస్టెంటు అందరూ ఉండడంతో ఏకాంతం కొరవడుతుంది.

 

అదే ప్రత్యేకం సెక్స్ స్పెషలిస్ట్ దగ్గర అయితే తగినంత ఏకాంతం వుండడమే కాకుండా నిర్భయంగా అడగడానికి సందేహించడు అంతేకాకుండా పరిష్కారం లభిస్తుంది కనుక నిశ్చింతగా సెక్స్ థెరపిస్ట్ ను అడగగలుగుతారు. కొన్ని కొన్ని సందర్బాలలో చిన్న చిన్న సలహాలు కూడా ఎక్కువ ఉపయోగంగా వుంటాయి. దీర్ఘకాలవ్యాధులకు వాడే మందులతోపాటే సెక్స్ కు సంబంధించిన మందులు కూడా వాడాల్సి వుంటుంది. అందువలన చికిత్స ఎక్కువ కాలం వుంటుంది. దీర్ఘకాల వ్యాధుల వలన శరీరంలో కలిగే మార్పులు, వాటికి వాడే మందులు, వ్యాధి తాలూకు మానసిక భావాలు ఇవన్నీ సెక్స్ పై దుష్ప్రభావం చూపిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్, నాడీమండలానికి సంబంధించిన వ్యాధులలో మధుమేహం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దీర్ఘకాలం బాధించే నొప్పులు వీటన్నిటిలో సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.

 

చాలామంది రోగులలో సెక్స్ కూడా ఒక ముఖ్యమైన అంశం అనే భావన వుంటుంది. అది కోల్పోవడంతో మరింత దిగులుకు లోనవడం, జీవితంలో ఏదో కోల్పోయాం అనే బాధకు లోనవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడం సంభవిస్తాయి.ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స వలన అంగస్తంభనాలు తగ్గిన రోగులను ఇంటర్వ్యూ చేసినప్పుడు 30 నుండి 50 శాతం మంది తమకు సెక్స్ తగ్గడం అన్నది తమకు ఒక ముఖ్యమైన సమస్యగా చెప్పారు. వయాగ్రా మార్కెట్లోకి వచ్చాక దీర్ఘకాల వ్యాధులు కలవారు దాన్ని ఎక్కువగా వాడడం సమస్య యొక్క తీవ్రతను సెక్స్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తోంది. క్యాన్సర్ రోగులలోనూ మరణానికి దగ్గరయ్యేవారిలోనూ సెక్స్ ముఖ్యమైనది కాకపోయినా భార్యాభర్తల మధ్య ఆప్యాయత, ఆప్యాయతతో కూడిన స్పర్శ ముఖ్యమైనవి.