- విజయార్కె
.png)
ఆమె నాకెప్పుడూ అర్థం కాదు. ఇప్పుడర్థమవుతుందను కోవడం నా భ్రమే. ఆమె అతిలోక సౌందర్యవతి కాదు. కానీ ఆమెలో ఏదో ఆకర్షణ. అది శరీరానికి సంబంధించినదో, మనసుకు సంబంధించినదో తెలియదు. ఆమె అభిప్రాయాలు, ఆలోచనలు, పరస్పర విరుద్ధంగా వుంటాయి. ద్వేదీ భావం గోచరిస్తోంది.
ఆమెతో నా పరిచయం ఊహు ... నాతో ఆమె పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. నా నవల ఓ మాస పత్రికలో ప్రచరిత మయింది. నా చిరునామా కూడా ఆ పత్రికలో వేయడం వల్ల మంచి రెస్పాన్స్ కనిపించింది. రచయితలకు పాఠకులకు రాసే వుత్తరాలు చాలా వరకూ ఎలా వుంటాయో ఊహించవచ్చు. అందులో ‘ఆమె’ వుత్తరం నన్ను ఆకట్టుకుంది. చాలా చిన్న వాక్యాల్లో తన బాధ రాసుకుంది.
“నేనో అభాగ్యురాలిని- చిన్నప్పుడే కన్నతల్లి పరాయి మగాడితో అతడి గదిలో ... అతని మంచం మీద నగ్నంగా వుండడం చూసేను. చిన్న వయసుకు అర్థంకాని, చిత్రహింసలతో కూడిన ఫీలింగ్ ... అందరమ్మలూ ఇలానే ఉంటారా! ఊహు ...! వుండరు ... అందుకే అమ్మంటే కోపం నాకు. వయస్సు వచ్చేసరికి, అమ్మ స్నేహితులే (మగస్నేహితులే) నా వైపు అదోలా చూడ్డం అమ్మతో సంబంధం పెట్టుకున్న వాడే నన్ను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా నిమరడం, నా వయసు పొంగులపైన అతని చూపు పడ్డం ...
ఎంత అసహ్యం వేసిందో ... ఆ పరిస్థితుల్లో ఓ మతం కాని యువకుడిని ప్రేమించి అమ్మా, వాళ్ళ చేత తన్నులుతిని, అన్న చేతుల్లో చావుదెబ్బలు తిని,. వాళ్ళు తెచ్చిన సంబంధాన్నే చేసుకున్నాను. అతనికి నాకన్నా పాతికేళ్ళు ఎక్కువ. జీవితాన్ని నిరాసక్తంగా గడుపుతున్నా ... నా భర్తనే మగడు ... తన వ్యాపారం కోసం నన్ను తార్చినప్పుడు .... సిగ్గుతో చచ్చిపోతూ ... శీలం కోల్పోయి మానసికంగా చితికిపోతూ వయసు మీరిన అతను నన్ను శారీరకంగా తృప్తి పరచలేడు. నా వయసును నేను జోకోట్టలేను. అందుకే నైతికానైతికాలకు తిలోదకాలిచ్చి నా సుఖాలను నేనూ వెతుక్కున్నా. ఇదంతా ఎందుకు రాస్తున్నానో తెలుసా ... మీరు నా కథ రాయండి. నాలాంటి అభాగ్యులగురించి చెప్పండి.’’
ఉత్తరం ఆమె రాసిన ప్రతి అక్షరమూ నన్ను కదిలించింది. ఆమె నాతొ ఉత్తరాల పరిచయం కొనసాగించింది. ఆమె లేఖల్లో నిరాశా, నిస్పృహ, ఆవేదనా, ఆర్థ్రత, కసి అన్ని భావాలు కనిపించేవి. అందరినీ ఎదిరించి తనంతట తానుగా ... ఉన్నతమైన స్థానానికి ఎదిగింది. ఆమె ఆత్మ స్థైర్యం ముచ్చట గొలిపింది. ఆర్థికంగా లోటులేదు. కానీ మానసికంగా, శారీరకంగా ఆమె ఒంటరి.
*****
మా పరిచయం ఉత్తరాల ద్వారా పెరిగిపోతూనే వుంది. నా ఉత్తరాలే ఆమెకు ఓదార్పయ్యాయి. అలా మొదలయిన మా పరిచయం ఓ రోజు అనుకొని మలుపు తిరిగింది. ఓ నవల రాయడానికి ఇన్ఫర్మేషన్ సేకరించడానికి ముంబాయ్ వెళ్ళవలసిన పని పడింది. మాఫియా బ్యాగ్రౌండ్ లో నేన్రాయబోయే నవల అది. నాకు ముంబాయ్ వెళ్ళడం అదే మొదటిసారి. అప్పుడు గుర్తోచ్చిందామె. తనుండేది ముంబాయిలోనే... వెంటనే లెటర్ రాశాను. నేను ముంబాయ్ వస్తున్నట్లు. తను ఫోన్ చేసి హేపీగా వెల్ కమ్ చెప్పింది. నాలో శతసహస్ర కోటి ఆలోచనలు. మా ఇద్దరి ఉత్తరాల పరిచయంలో సెక్స్ ప్రస్తావన కూడా వుంది. ఆ ప్రస్తావన ఎటువైపు దారి తీస్తుందో?
ముంబాయ్ బయల్దేరాను. స్టేషన్ లోనే రిసీవ్ చేసుకుంది. ఆమెను ప్రత్యక్షంగా చూడలేదు. ఎలా వుంటుందో తెలియదు. “నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను’’ అంది. నాలో టెన్షన్. ఆమె ఎలా వుంటుంది? అందంగా ఉంటుందా? సెక్సీగా ఉంటుందా? చుడీదార్ వేసుకుంటుందా? నాలో నా ఆలోచనలు సాగుతున్నాయి. ఇంతలో ఆమె పిలుపు...
*****
తలతిప్పి చూశాను ... మార్వలెస్ ... బ్యూటిఫుల్ ... అపురూప సౌందర్యవతి కాకపోవచ్చు. కానీ ఏదో ప్రత్యేకత ఆకర్షణ ఆమెలో వుంది. “హాయ్’’ ప్రతిగా పలకరించాను.
“లగేజ్ లేదా?’’ అంది నా చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ మాత్రమే చూసి.
లేదన్నట్టు తల అడ్డంగా వూపాను.
“పదండి’’ అంది.
ఆమెను అనుసరించాను. ఆమెకు కారు కూడా వుందన్న విషయం అప్పుడే తెలిసింది. తనే డ్రైవ్ చేస్తుంది. పక్కనే నేను ... ఆమెకు తగులుతూనే కూర్చున్నాను. సడెన్ బ్రేక్ వేసినప్పుడు మలుపులు తిరిగినప్పుడు ఆమె మెత్తటి భుజాలు నాకు తగులుతూనే ఉన్నాయి. నాక్కావాల్సిన ఇంఫర్మేసన్ దొరకడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. ఆమెకున్న పరిచయాలు చూసి ఆశ్చర్యపోయాను. అర్థంకాని ఆమెకున్న పరిచయాలు చూసి ఆశ్చర్యపోయాను.
ఆమె చేతివేళ్ళు చకచకా కదిలి టెలిఫోన్ నంబర్లు కలుపుతున్నాయి. ఎవరెవరికో ఫోన్ చేసింది. ఎవరెవరినో సంప్రదించింది. సాయంత్రానికల్లా చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. సాయంత్రం ఆరు దాటుతుండగా ...
“త్వరగా తయారవ్వండి’’ అంది.
ఎందుకో ఏమిటో అర్థం కాలేదు.
“హమీద్ ని కలుద్దాం’’ అంది.
ఒక్క క్షణం నా పంచేంద్రియాలూ పనిచేయడం మానేశాయా? అనిపించింది. హ...మీ ... ద్ ... మాఫియా లీడర్ ... ముంబాయిలో టాప్ టెన్ టెర్రర్ డాన్ లలో అతనూ ఒకడు. ‘అతడిని కలుసుకోవడమా?’ నాతొ జోక్ చేస్తుందేమో అనుకున్నాను. “మరి అపాయింట్ మెంట్?’’ అన్నాను.
“ఇప్పుడే రమ్మన్నాడు’’ అంది.
ఆమెను ఎంత తక్కువగా అంచనా వేశానో త్వరగా అర్థమయింది. సరిగ్గా గంట తర్వాత టైట్ సెక్యూరిటీతో దుర్భేద్యమయిన అతని ప్యాలెస్ లోకి అడుగుపెట్టాను. ఆమెను చూసి అతను లేచి వచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఆమె అతడిని ముద్దు పెట్టుకుంది. నా ముందే .... అతనితో ఇంటర్వ్యూ గంటలో ముగిసింది. నేనింకా ఆ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ షాక్ నుంచి బయటపడలేదు. హోటల్ కు తిరిగొచ్చాం. డిన్నర్ పూర్తయి గదిలోకోచ్చేసరికి పదయింది. డబుల్ బెడ్ రూమ్ సూట్ ... ఏ.సి. పనిచేస్తోంది. పేర్ఫ్యూమ్ సువాసనలు వెదజల్లుతోంది.
“మీ పని పూర్తయినట్టేనా?’’ అడిగింది.
“చాలా థాంక్స్ ... నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు’’ అన్నాను సిన్సియర్ గా.
“ఓహ్ ... యార్ ... నో థాంక్యూలు ... నో మొహమాటాలు ... అంటూ ఓ లార్జ్ పెగ ఫిక్స్ చేసి నా ఎదురుగా కూర్చుని – “అలవాటుందా?’’ అనడిగింది.
లేదనట్టు తలాడించాను.
“నేను తాగితే అభ్యంతరం లేదుగా?’’ అంది.
మళ్ళీ లేదన్నట్టు తలాడించాను.
మెల్లి మెల్లిగా సిప్ చేస్తూ అంది- “నీముందే హమీద్ ని ముద్దుపెట్టుకున్నందుకు ఫీల్ అయ్యారా?’’ ఏకవచనంతోనే అడిగింది.
నిజం చెప్పాలంటే ఫీలయ్యాను. కానీ నన్ను నేను తక్కువ చేసుకోవడం ఇష్టం లేక చెప్పాను “లేదు’’ అని.
“నాకు తెలుసు .... ఫీలయ్యావు. లీవిట్ నాతొ సెక్స్ నీకిష్టమేనా ...?’’ డైరెక్ట్ గా అడిగేసింది.
నేను అదిరిపడి ఆమెవైపు చూశాను.
ఆమె జోక్ చేయడం లేదు. “మీకు సెక్స్ నాతొ ఇష్టమేనా?’’ లోన నైటీ ముడిని విప్పుతూ అంది.
నేను ప్రవరాఖ్యుడిని కాను. అందులోనూ ఆ వాతావరణం ... ఆమె అందం ...
“నేనేం పదహారేళ్ళ అమ్మాయిని కాదు. మీరంటే ఇష్టం. మీరు నా అభిమాన రచయిత అని గుడ్డిగా మిమ్మల్ని అభిమానించి, మెచ్యూర్డ్ గా శీలం అర్పించే బాపతు అమ్మాయిని కాదు. అలా అని నేను కాల్ గార్ల్ ని కాదు. ఇద్దరు పిల్లల తల్లిని .... నాకిష్టమయిన వ్యక్తితో వెళ్ళాను. జస్ట్ ఫర్ రిలాక్స్ ... ఫిజికల్ రిలాక్స్ ... తర్వాత మరిచిపోతాను. హమీద్ తో నా పరిచయం అలాంటిదే. నువ్వంటే ఇష్టం, అభిమానం. దీనికి ప్రేమ అని, ఇంకా ఏదో త్యాగం అని పేరు వద్దు. మళ్ళీ ముంబాయ్ కి మీరు వస్తారో రారో ... లేదో వచ్చినా అప్పుడు నా మూడ్ ఎలా వుంటుందో ... ఇప్పుడైతే నేను రెడీ’’ అంటూ లేచింది.
నైటీ కిందపడింది. లోపల ఏ అచ్చాదనా లేదు. నన్ను తన గుండెలకు హత్తుకుంది. అలాగే మోకాళ్ళ మీద కూర్చుని నా వొడిలో తల పెట్టుకుంది. ఆ రాత్రి గమ్మత్తుగా గడిచింది. ఆమె శరీరంలోని ప్రతి అణువూ ఒక్కో కొత్త విషయం చెబుతున్నట్టు అనిపించింది. వాత్స్యాయనుడు సెక్స్ లో ఎన్ని రకాల సుఖాలు నిర్వచించాడో అన్ని రకాల సుఖాలనూ ఆ రాత్రి అందుకున్నాను. సెక్స్ ... సెక్స్ ... విత్ ఎఫెక్షన్ ... నా వీపు మీద వున్న నఖ క్షతాలు ...గుండెలమీద పడ్డ చుంబన క్షతాల ముద్రలు ...
ఆమె పాములా మెలికలు తిరిగిపోతుంది. కోరికలతో రెచ్చిపోతూ తన చేతలతో రెచ్చగొడుతూ నన్ను నిద్రపోనివ్వకుండా ... తను నిద్రపోకుండా ... తెల్లవారుతుండగా ఆమె నా గుండెల పైనుంచి లేచింది. చుంబన క్షతాలతో పాటు కన్నీళ్ళ ముద్రలూ కనిపించాయి. నా ఛాతీ కన్నీటి బిందువులతో తడిసిపోయింది.
“థాంక్యూ డియర్ ... సెక్స్ విత్ ఎఫెక్షన్ ... నీ నుంచి లభించింది. ఇష్టమయిన వ్యక్తితో సెక్స్ ను అనుభవించడం వేరు ... కోరికను అణుచుకోవటానికి సెక్స్ ను కోరుకోవటం వేరు ... మొదటి రకం సెక్స్ ను నీ నుంచి అందుకున్నాను. నాకు అర్జెంట్ పనుంది ... వెళ్తున్నాను. నిన్ను స్టేషన్ దగ్గర డ్రైవర్ డ్రాప్ చేస్తాడు’’ అంటూ ఓ కవరు ఇచ్చింది.
అందులో ట్రైన్ టికెట్ ... దాంతో పాటు ఓ లెటరూ వున్నాయి.
*****
ట్రైన్ లో వస్తుంటే ఆమె జ్ఞాపకాలే. ఆమె రాసిన ఉత్తరం మడత విప్పాను. “థాంక్యూ డియర్’’ అన్న పదమే వుంది ... నిట్టూర్చాను. తర్వాత ఆమెకు చాలా ఉత్తరాలు రాశాను. రిప్లయి లేదు ... ఫోన్ చేసినా ఆ నెంబరు మారిందని తెలిసింది. ఆమెను, ఆమె అందించిన ఆ సుఖాన్ని మరిచిపోలేక పోయాను. ఇది జరిగిన సంవత్సరం తర్వాత ఓ లెటర్ వచ్చింది. వణుకుతున్న చేతులతో విప్పాను.
హలో డియర్ ...
నేనిప్పుడు లండన్ లో వున్నాను. ఆ మధ్య యూరప్ ట్రిప్ వేసుకుని వెళ్ళాను. (మనం కలిసాక) డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాక గుర్తొచ్చింది డబ్బులు అయిపోయాయనే విషయం. లండన్ లో ఓ భారతీయ ఫ్రెండ్ తగిలాడు. తమిళియన్ ... ఓ రాత్రి అతనికి గెస్ట్ (అర్థమయిందనుకుంటాను) వున్నాను. తెల్లవారుఝామున నా తెల్లటి పాదాలను తన పెదవులకు ఆన్చుకుని అలాగే చాలాసేపు ముద్దులు పెట్టుకుంటూ వుండిపోయాడు. తర్వాత చెప్పాడు ... తనతో వుండిపోమ్మని. అందుకే ఇక్కడ వుండిపోయా ... నాకూ అక్కడ బోర్ కొట్టింది.
చూద్దాం ... మళ్ళీ ఇతను నాకు బోర్ కొట్టినప్పుడో ... నేను అతనికి బోర్ కొట్టినప్పుడో ఇండియా వస్తాను. ఎక్కడ ఎప్పుడు సెటిలవుతానో తెలియదు. హఠాత్తుగా కాషాయం బట్టలు వేసుకున్నా ఆశ్చర్యం లేదు నా మూడ్ ని బట్టి కానీ ఒక్క విషయం. ఈసారి వస్తే ముందుగా నీ అనుభవం పొందుతాను. (చాలా పచ్చిగా చెబుతున్నానా) ఆ తర్వాత గుడ్ బై ... గుడ్ బై ... ఫరెవర్ ... అని కనిపించని చోటుకు వెళతాను. ఆ తర్వాత మళ్ళీ మన కలయిక వుండదు. చివరి కలయిక కోసం ఎదురు చూస్తూ వుండు ... వుంటాను’’
ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాను నేను .... అయితే .... ఇప్పటికీ నాకు అర్థం కాదు ... ఆమె మనసు అర్థమైనా, నా మనసు అర్థమైనా ఆమె మాత్రం అర్థం కాదు. కానీ ఆమెకోసం నేను మాత్రం ఎదురు చూస్తూనే వున్నాను.
|
|


