ARTICLES
రామ కైంకర్యానికి యువ కళాకారుల చేయూత

 

 

 

రామ కైంకర్యానికి  యువ కళాకారుల చేయూత

సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రశాంతమైన ధార్మిక జీవితం కొరకు అవలంబించవలసిన దారులు ఆత్మా సాక్షాత్కారం కలిగిన గురువులే చెప్పగలరు. అటువంటి వారిలో ఒకరు శ్రీ  రవి శర్మ మహారాజ్. వారి ఆశ్రమం  "సద్గురు సదనం", చెన్నై లో, "శ్రీ ఆనంద రామ" విగ్రహం గత 8 ఏళ్ళు గా ఆరాధింపబడుతోంది. "శ్రీ ఆనంద రామ" విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ రాముని పూర్ణ అంశాలతో ఉంటుంది. అనగా ఇది , శ్రీ రాములవారు, సీతా అమ్మవారు, లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి తో  కూడిన పట్టాభిషేక పంచలోహ విగ్రహమ్. ఈ విగ్రహానికి విడి గా సేలయుర్, చెన్నై లో "రామాశ్రమం"  గుడి నిర్మించాలని గురువు గారు నిర్ణయించారు. ఈ ఆశ్రమం లో నిత్య భాగవత, రామాయణ పారాయణలు జరపాలని, పిల్లల కు సంస్కృత బోధనా తరగతులు నిర్వహించాలని ఆశిస్తున్నారు శ్రీ రవి శర్మ మహారాజ్.

వారి ఆశయానికి  తమ వంతు చేయూత ఇవ్వటం కొరకు వారి శిష్యురాలయిన శ్రీమతి రమ్య రంగనాథన్ శ్రీనివాస్ ఆరిజోనా లోని చాన్డ్లర్ నగరం లో  "జగదానంద కారకా" అనే సంగీత, నృత్య విభావరిని నిర్వహించారు. శ్రీమతి రమ్య రంగనాథన్ శ్రీనివాస్ స్థాపించిన "పొన్నాంబళం గోల్డెన్ టెంపుల్ అఫ్ ఫైన్ ఆర్ట్స్" ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో, ఫీనిక్స్ మెట్రోపాలిటన్ ఏరియా లోని ప్రఖ్యాతి గాంచిన సంగీత, నృత్య పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. మిడిల్ స్కూల్, హై స్కూల్,  అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న  ఈ విద్యార్థులు ఎనలేని ప్రతిభ చూపించారు.



మాస్టర్ సంహిత్ ఆరాధ్యుల, మాస్టర్ హరీష్ సుందరం ల ఫ్లూట్, మృదంగం కచేరీ తో ఈ కార్యక్రమం మొదలయ్యింది. పలుకే బంగారమాయెనా, కొండలలో నెలకొన్న, భాగ్యాద లక్ష్మిబారమ్మ, రామచంద్రాయ జనక, టి. ఆర్. మహాలింగం గారు స్వరపరిచిన జానపద సంగీతం, కదన కుతూహల రాగం లోని తిల్లాన  ల తో పాటు, మరెన్నో పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వీరిరువురూ తమ తమ వాయిద్యాలలో ఎంతో ప్రావీణ్యం పొందారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రఖ్యాతి గాంచిన క్లీవ్ లాండ్ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో బహుమతులు గెలుచుకున్నారు.

తరువాత భరతనాట్యం ప్రదర్శన లో మొదటిగా "సాంప్రదాయ డాన్స్ అఫ్ ఇండియా " నృత్య పాఠశాల కు చెందిన కుమారి వైష్ణవి "శ్రీ విజ్ఞరాజం భజే"  అనే కృతి, "ఆరతి స్కూల్ అఫ్ ఇండియన్ డాన్స్ స్" విద్యార్థి కుమారి నిశా తలంకి  తయ్గరాజ కీర్తన అయిన "బ్రోచే వారెవరురా " , గురు కళా శ్రీ ఆశా గోపాలన్    శిశ్యురాలయిన కుమారి శ్ర్యావ్య పొన్నపల్లి "రామ వర్ణం", "సాంప్రదాయ డాన్స్ అఫ్ ఇండియా " నృత్య పాఠశాల కు చెందిన కుమారి జనని లక్ష్మణన్ "ఆడినయే కన్నా" ,  "నృత్యాలయ ఈస్థటిక్ సొసైటీ " విద్యార్థులు కుమారి మీనా, కుమారి వైశాలిని తులసీ దాస్ రచించిన "తుమక్ ఝలక్", తిల్లానా , మంగళం లకు అత్యుత్తమ నృత్య అభినయాలను ప్రదర్శించారు.

 ఇటు చదువులలోనూ, అటు భారతీయ సాంప్రదాయ సంగీత నృత్య కళలలోనూ రాణిస్తున్న ఈ విద్యార్థులు  ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లోని పిల్లలందరికీ ఆదర్శ ప్రాయులుగా నిలిచారు అనటం లో సందేహం లేదు.

ఈ కార్యక్రమ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు, ఉడతా భక్తి గా  " శ్రీ ఆనందాశ్రమం"  కొరకు తమవంతు సాయం అందించ దలుచుకున్నవారి  కొరకు ఈ కింద వివరాలు ఇవ్వడమైనది .

 
 "THIRUNAMACHARYAN TRUST"
ICICI Bank A/C. No. 603705017590 
IFSC Code ICIC0006037 
For details contact: ramashramam@gmail.com
 
- Radhika
 
TeluguOne For Your Business
About TeluguOne
;