LATEST NEWS
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.   రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో  సుప్రీం కోర్టు  ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.   2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ  మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని   ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది.  దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.   మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి..  రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్,   వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. ఈ తీర్పు  రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై   కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని  అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి   ముగింపు పడినట్లేనన్నారు.  ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.  Supreme Court,  Margadarsi Judgement, Vundavalli Aruna Kumar,  Margadarsi Case,  Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.  అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి,   మంత్రి కొండా సురేఖను  పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై  ప్రభుత్వ విప్ వేముల వీరేషం  తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు.  తెలంగాణలో  ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను   క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు.  2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.   Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet 
తెలుగు రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది.  2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ  ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.    ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.   ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం  కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.  అదలా ఉంటే..   ప్రజా కోర్టులో  వివేకా హత్య కేసులో   తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి?  అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ..  40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే..   అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.   ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి   స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది. ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుక  ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహం కుటుంబ వేడుకగా కాకుండా.. వైసీపీ నేతల గ్యాదరింగ్ గా మారి పొలిటికల్ అటెన్షన్ కు కారణమైంది. పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీకి  చెందిన   కీలక నేతలు హాజరయ్యారు. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి చెందిన  పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఈ వివాహానికి హాజరయ్యారు.  వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబంలో జరిగిన వేడుకకు ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఈ స్థాయిలో హాజరుకావడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడమే కాకుండా కొత్త చర్చకు దారి తీసింది.  గతంలో  వైపీపీ అధికారంలో ఉన్న సమయంలో  పీఎస్సార్ ఆంజనేయులు ఏపీ పోలీస్ శాఖలో   కీలకమైన పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కాలంలో ఆయన వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న   ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.   రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత..  ఆయన  చట్టపరమైన వివాదాలు, కేసులలో చిక్కుకోవడం వి తెలిసిందే. ముఖ్యంగా ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన వేధింపుల కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణల కేసులలో ఆంజనేయులు పేరు ప్రముఖంగా ఉంది. జెత్వానీ వ్యవహారంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఆ తరువాత ఆయనకు బెయిల్  లభించింది అది వేరే సంగతి.  ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో  వివాదాస్పదంగా వ్యవహరించి ఆరోపణలు, విమర్శలూ ముటగట్టుకున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడి వివాహానికి వైసీపీ అగ్రనేతలంతా తరలిరావడం అప్పటి ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు.   PSR Anjaneyulu son marriege in Hyderabad, YS Jagan Mohan Reddy, YCP Leaders, Hyderabad Wedding Gathering, AP IPS Officer, TeluguOne
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు.   ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో  సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.   Another Governer post for TDP,  NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్లారిటీతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్‌ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి. ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్‌లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు. థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లేదా ఇరు వర్గాల ప్రతినిధులు చర్చలు జరిపి ఒక సయోధ్యకు రాకపోతే, సెప్టెంబర్ నెలలో విడుదల కావలసిన పలు క్రేజీ తమిళ సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
B Sreedhar Varma has assumed charge as the new Chairman of Sri Venkateswara Bhakti Channel (SVBC), the devotional channel of Tirumala Tirupati Devasthanams (TTD). He formally took charge at the SVBC office near Alipiri in Tirupati. Before assuming his responsibilities, B Sreedhar Varma received the blessings at the Sri Ranganayakula Mandapam in Tirumala and later arrived in Tirupati to take charge as SVBC Chairman. Speaking on the occasion, B Sreedhar expressed his happiness at being given the opportunity to serve as SVBC Chairman. He said SVBC plays a key role in taking the glory of Lord Sri Venkateswara and the message of Hindu Dharma to devotees across the world. He assured that he would work in coordination with all employees and strive to further strengthen the channel. Sreedhar expressed his heartfelt gratitude to Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu, Minister Sri Nara Lokesh, Deputy Chief Minister Sri Pawan Kalyan, and Endowments Minister Sri Anam Ramanarayana Reddy for giving him the opportunity to serve as SVBC Chairman. The programme was attended by several members of the Nandamuri family, including Nandamuri Mohana Krishna, Nandamuri Ramakrishna, Nandamuri Mohana Roopa, Kamineni Sreemantini and Daggubati Nivedita, who congratulated B Sreedhar Varma, AP FDC Chairman Bharath Bhushan, TFPC secretary Thummala Prasanna Kumar and others extended their best wishes for his tenure. Several alliance leaders and well-wishers also attended the programme. Nandamuri Mohana Krishna congratulated B Sreedhar Varma on being appointed SVBC Chairman and described him as a brother-like figure. Recalling the long-standing association between the Nandamuri family and B Sreedhar Varma’s family, he said that although they were not related by blood, the bond of affection and respect between the families was like that of brothers. He recalled that NTR Raju had been offered an early party ticket by Nandamuri Taraka Rama Rao but chose not to contest, instead dedicating himself to the service of Lord Venkateswara and TTD. He also recalled Raju’s contribution to the development of TTD, including his voluntary donation of land. Mohana Krishna said that Raju’s family had stood by the Nandamuri family since the generation of NTR and expressed happiness that his son B Sreedhar Varma was now carrying forward that legacy through his new responsibility as SVBC Chairman. Nandamuri Ramakrishna said that the appointment of B Sreedhar Varma, son of the well-known NTR Raju, as SVBC Chairman was a matter of great happiness for the Nandamuri family. He recalled that B Sreedhar Varma’s family had been associated with the service of Lord Venkateswara for four generations. Describing NTR Raju as a highly trusted and disciplined person who was deeply committed to the service of Lord Venkateswara, he expressed confidence that Sri Dhar Varma would follow in his father’s footsteps. He hoped that B Sreedhar Varma would take SVBC to greater heights and conveyed his blessings and best wishes to him and his family. He also thanked Chief Minister Sri N. Chandrababu Naidu and everyone involved in his appointment. Nandamuri Mohana Roopa said that it was a moment of immense happiness and pride for the entire Nandamuri family. She recalled the close association between NTR Raju and Nandamuri Taraka Rama Rao, describing Raju as a selfless person who worked with dedication and remained committed to his values throughout his life. She said it was particularly gratifying that SreedharVarma, the son of such a respected personality, had been given the responsibility of serving as SVBC Chairman. She expressed confidence that he would do complete justice to the position and carry forward his family’s legacy with dedication and integrity. She also expressed gratitude to the government for honouring B Sreedhar Varma with the responsibility. The Nandamuri family members and other dignitaries wished B Sreedhar Varma success in his new role and expressed confidence that under his leadership, SVBC would continue to spread the glory of Lord Sri Venkateswara and devotional values to devotees across the globe. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Megastar Chiranjeevi's Vishwambhara is steadily building curiosity as the ambitious fantasy spectacle moves through its extensive post-production. On the occasion of Chiranjeevi's birthday, the makers unveiled an OST composed by Gowra Hari, offering the first real taste of the film's larger-than-life musical world. The track stands out for its Sanskrit shlokas, powerful orchestration and spiritual undertone, creating an imposing aura around Chiranjeevi's character. The background score is designed to underline the connection between the protagonist and Lord Shiva, giving the track an epic quality that suits the film's fantasy setting. The accompanying poster adds another layer to the intrigue. Chiranjeevi appears with striking green eyes, while the reflection of a mystical gemstone connected to Lord Shiva's trident hints at the power surrounding his character and the enormous threat he is expected to confront. Directed by Vassishta Mallidi and produced by UV Creations, Vishwambhara has already completed its shoot and is undergoing heavy VFX work involving international studios. MM Keeravaani is composing the film's songs, while Gowra Hari handles the background score. Trisha Krishnan and Ashika Ranganath are part of the cast. The makers are expected to announce the release date soon. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు.
  మైత్రీ మూవీ మేకర్స్.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించి పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుంది. అసలు సిసలు కళామ తల్లి ముద్దుబిడ్డల్లా  ట్వంటీ ఫోర్ అవర్స్  సినిమా గురించి ఆలోచించడంతో పాటు ఎలాంటి సబ్జెట్ తో కూడిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో అని నిరంతరం ఆలోచిస్తూ ఉండటం మైత్రి స్పెషాలిటీ. అందుకే కష్టే ఫలి అనే రీతిలో పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. ఇప్పుడు 'ఇరుముడి'తో  బాక్సాఫీస్ వద్ద విజిల్ వేస్తుంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ వెనుక మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఒక పెద్ద రిస్క్, ఓటీటీ వ్యాపారంలో నడిచిన ఆసక్తికర నాటకం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన సమయంలో మైత్రీ మేకర్స్ చాలా నమ్మకంతో ముందడుగు వేసినప్పటికీ, వ్యాపార పరంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. 'ధమాకా'  తర్వాత రవితేజకి  సరైన హిట్ పడకపోవడం, వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లు రావడం వల్ల ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల పట్ల డిజిటల్ దిగ్గజాలు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఉత్సాహం చూపించలేదు. అయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ తమ కంటెంట్‌పై ఉన్న అమితమైన నమ్మకంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శివ నిర్వాణ సిద్ధం చేసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథాంశం, రవితేజను గతంలో ఎన్నడూ చూడని కొత్త తరహా మేకోవర్‌లో చూపించే విధానం కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నిర్మాతలు నమ్మారు. ఎటువంటి రాజీ పడకుండా  సుమారు 14 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, మరియు 'ఇరుముడి' టైటిల్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. Also Read: డిసి తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా చేసేది ఈ డైరెక్టర్ తోనే! ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పెరిగిన ఈ రకమైన హైప్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో చర్చలు జరిపి, చివరకి  భారీ ఫ్యాన్సీ ధరకు డిజిటల్ హక్కులను చేజిక్కించుకుంది. ఇక ఇరుముడి తొలి రోజు 24 కోట్లని సాధించగా ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ పక్కా అనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  అందుకు తగ్గట్టే రేపట్నుంచి ఐదో షో కూడా ప్రదర్శితమవుతోంది.  పూర్తి రన్ లో 200 కోట్లు అనే మాటలు సినీ సర్కిల్స్ లో తాజా న్యూస్ హోదాలో చక్కర్లు కొడుతున్నాయి.  Irumudi, Raviteja, Mythri Movie Makers
Tamil cinema is heading towards a potential release freeze from September 1, with the Tamil Film Producers Council (TFPC) and Tamil Film Active Producers Association (TFAPA) deciding not to release new Tamil films in theatres if the ongoing OTT window dispute remains unresolved. The decision follows a fresh escalation between producer bodies and the Tamil Nadu theatre owners and distributors' associations. The core issue is the demand for an eight-week theatrical window. Theatre owners and distributors have decided that films releasing from September 1 should be allowed to premiere on OTT only after eight weeks, and producers must provide a written commitment to that effect. Producers have opposed the condition, arguing that it was imposed without proper consultation. The producers' associations have now taken a stronger stand, announcing that new releases, along with shooting and post-production activities, will be halted from September 1. They have also pointed out that such an eight-week mandate is not being followed in the same manner across the other southern industries. The producers are expected to take the matter to the Tamil Nadu government and seek intervention. With several films lined up for September, the dispute could seriously disrupt the Tamil theatrical calendar if no settlement is reached before the deadline. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి తాప్సీ పన్ను, మరోసారి పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథతో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' ప్రత్యక్షంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 3 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌తో పంచుకోవడంతో ఓటీటీ ప్రేక్షకుల్లో మరియు తాప్సీ అభిమానుల్లో విశేష ఆసక్తి నెలకొంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ కథను అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. ఒక జాయ్‌పురా అనే ఊహాజనిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ కథలో.. కష్టాల్లో ఉన్న తన కుమార్తెను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొందనేది ప్రధానాంశంగా చూపించనున్నారు. 'గాంధారి' పాత్ర కోసం తాప్సీ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారట. ఈ సినిమాలో బాణి అనే పాత్రలో ఆమె కనిపించనుండగా, ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్ మరియు జతిన్ సర్నా కీలక పాత్రల్లో నటించారు. భావోద్వేగాలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. గతంలో తాప్సీ, కనికా ధిల్లాన్ మరియు నెట్‌ఫ్లిక్స్ కలయికలో వచ్చిన 'హసీన్ దిల్‌రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా' చిత్రాలు ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో 'గాంధారి'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విభిన్నమైన యాక్షన్ ప్రయాణం డిజిటల్ వ్యూవర్స్‌ను ఎంతగా మెప్పిస్తుందో మరియు నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
  'డిసి'తో సోలో హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృష్టిస్తున్న ప్రభంజనం తెలిసిందే.   'కెప్టెన్ మిల్లర్' ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన 'డీసీ' త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుకోబోతుంది. రీసెంట్ గా  సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ ఓ ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది.  'డీసీ' చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ హీరోగా మరొక భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారనే రూమర్లు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.  ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం, 'డీసీ' చిత్ర విజయం మరియు ఆ సినిమాకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసిన తర్వాత, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మరియు హీరోగా మారిన లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కింగ్ సైజ్ కాన్సెప్ట్‌తో 2027 చివర్లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈసారి మరింత డార్క్, వయలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  అరుణ్ మాథేశ్వరన్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా లోకేష్‌తో క్లోజ్ బాండింగ్ ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కి కూడా స్వరాన్ని, సంచలన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించనున్నారని బజ్ వినిపిస్తోంది. Also Read: టాలీవుడ్ హీరోయిన్ తో బాలయ్య విలన్ పెళ్లి..7 ఏళ్లుగా సహ జీవనం, ఇద్దరు పిల్లలు  అయితే, లోకేష్ కనగరాజ్ మళ్లీ హీరోగా సెట్స్ పైకి వెళ్లేముందు తన దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ఆయన ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'AA23' ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో అనిరుధ్ సంగీతంలో తెరకెక్కనున్న ఈ చిత్రం 2026-2027 మధ్యకాలంలో భారీ స్థాయిలో రూపొందనుంది. అంతేకాకుండా తన డ్రీమ్ ఫ్రాంచైజీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో 'ఖైదీ 2', 'రోలెక్స్' స్టాండ్ అలోన్ ప్రాజెక్టులతో పాటు 'విక్రమ్ 2' చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 1000 కోట్ల పైగా వసూళ్లు సాధించిన ఎల్సీయూ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, లోకేష్ ముందుగా ఈ భారీ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్‌లనే ప్రాధాన్యతగా పూర్తి చేయనున్నారు.  అందుకే అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రాబోయే ఈ రెండవ హీరో ప్రాజెక్ట్ 'AA23' షూటింగ్ ముగిసిన తర్వాతే, అంటే 2027 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.   Dc, Lokesh kanagaraj, Wamiqa Gabbi
  ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2  లో మేజర్ ఇక్బాల్ గా నెగిటివ్ రోల్ లో అత్యద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచిన నటుడు అర్జున్ రామ్ పాల్.  పార్ట్ 2 లో అయితే తనదే కీలక రోల్    ఒకప్పటి హీరో కూడా అయిన అర్జున్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో విలన్ గా చేసి మెప్పించిన విషయం తెలిసిందే.  గత 8 ఏళ్లుగా డేటింగ్ చేస్తూ, సహజీవనం సాగిస్తున్న తన  గర్ల్‌ఫ్రెండ్, సౌత్ ఆఫ్రికన్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ 'గ్యాబ్రియెల్లా డెమెట్రియాడేస్‌'ని గోవాలోని మపుసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా వివాహం చేసుకున్నాడు. గోవా తీరంలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆప్తమిత్రుల సమక్షంలో  వివాహ వేడుక ప్రశాంతమైన వాతావరణంలో, సింపుల్‌గా జరిగింది. సాధారణంగా గోవా చట్టాల ప్రకారం మొదటి సంతకానికి, రెండో సంతకానికి మధ్య 15 రోజుల సుదీర్ఘ నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. అయితే, వీరు స్థానిక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రత్యేక అనుమతి పొంది ఈ 15 రోజుల నిరీక్షణ సమయాన్ని మినహాయించుకుని వేగంగా ప్రక్రియని  పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ జంట ఎంతో క్యాజువల్ దుస్తుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకుని సంతకాలు చేయగా, సబ్ రిజిస్ట్రార్ సూరజ్ వర్ణేకర్ ఈ వివాహాన్ని నమోదు చేశారు. అర్జున్ రాంపాల్, గ్యాబ్రియెల్లా లవ్ స్టోరీ 2018 లో ప్రారంభమైంది. మొదటి భార్య, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెస్సియాతో విడిపోయిన తర్వాత అర్జున్ జీవితంలోకి గ్యాబ్రియెల్లా అడుగుపెట్టింది. 1998లో మెహర్ జెస్సియాను వివాహం చేసుకున్న అర్జున్‌కు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం తర్వాత 2018లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించగా, 2019 నవంబరులో వీరికి అధికారికంగా విడాకులు వచ్చాయి. అదే 2018 సమయంలోనే అర్జున్, గ్యాబ్రియెల్లా ప్రేమలో పడ్డారు.సహజీవనంలో ఉన్న ఈ జంటకు 2019 లో మొదటి కుమారుడు అరిక్ (Arik) జన్మించాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు  రెండో కుమారుడు అరవ్ (Arav) జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ఈ జంట సమాజంలో ఎలాంటి దాపరికం లేకుండా తమ బంధాన్ని కొనసాగించారు. గతంలో ఓ టాక్ షో లో అర్జున్ మాట్లాడుతూ "పెళ్లి అనేది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే, మేమిద్దరం మనస్ఫూర్తిగా ఎప్పుడో భార్యాభర్తల్లాగే కలిసి జీవిస్తున్నాం" అని పేర్కొనడం విశేషం. Also Read: షూటింగ్ లో గుండెపోటు.. డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్  అయితే 2025 లో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా 8 సంవత్సరాల సహజీవనం తర్వాత, ఇద్దరు పిల్లలు సాక్షిగా గోవాలో చట్టబద్ధమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా మెరిసిన అర్జున్ రాంపాల్, ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ కింగ్ నాగార్జున,  కార్తీ నుంచి వచ్చిన  ‘ఊపిరి’ సినిమాలో గాబ్రియెల్లా కీ రోల్ లో కనిపించింది.  Arjun Rampal, Gabriella Demetriades, Balakrishna  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.