LATEST NEWS
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ దగ్గరకు పంపాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... కిందిస్థాయి ఉద్యోగుల ఒత్తిడి మేరకు సమ్మెకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించామన్న రవీందర్ రెడ్డి... అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిచి... సీఎస్‌ను కలుస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి.... ప్రభుత్వం దిగిరాకపోతే.... మరో సకల జనుల సమ్మెకు సిద్ధంకావాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించడంపై అశ్వద్ధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు అత్యంత కీలక పాత్ర పోషించారన్న అశ్వద్ధామరెడ్డి... తమకు మద్దతిచ్చిన టీజీవోలు, టీఎన్జీవోలకు రుణపడి ఉంటామన్నారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలుగిపోతున్నారని, నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు.. కానీ పండుగ సమయంలో రవాణా నిలిపేస్తే ఎలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. వెంటనే చర్చలు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ప్రజలపై సమ్మె ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యా సంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. దాదాపు 4 వేల బస్సులు నడవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీని విలీనం చేయలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్లు.. ముందుకు వస్తాయన్నారు. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రమే తమ దృష్టికి తేవాలన్న హైకోర్టు సూచించింది. ప్రస్తుతం 75 శాతం బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల్లో మిగతావాటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. ఈ సందర్భంగా 4000 బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆరోపించాయి. చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లినట్లు కోర్టుకి వివరణ ఇచ్చాయి. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ లేరని, ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని, చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయని కార్మిక సంఘాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. సమస్య ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని.. ఆది ప్రజల సమస్యగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, యూనియన్ల పట్టుదలతో మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవా అని కోర్టు ప్రశ్నించింది. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదో తెలిపాలని ప్రశ్నించింది. కార్మికుల్లో విశ్వాసం పెంచేందుకు తక్షణం ఆర్టీసీ ఎండీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
  ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖారవిందం కోసం చేసుకునే ఈ సర్జరీలు దొంగలకు కలిసొస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలతో ముఖం మార్చుకోవచ్చన్న టెక్నిక్ ను దొంగలు ఫాలో అవుతున్నారు. ఇటీవల అలాంటి చిన్నపాటి సర్జరీని చేయించుకున్న మురుగన్ కు బాగానే కలిసొచ్చింది. మొత్తానికీ ముఖాన్ని మార్చుకునేయత్నం చేయక పోయినా పోల్చుకో లేకుండా మారిపోవడం అతనికి బాగా కలిసి రావడమే కాక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దొంగతనం చేసింది అతనే అని తెలిసినా పట్టుకోలేక పోయారు. దాంతో ఈ మధ్య కాలంలో తనకు అనువుగా మార్చుకున్న ఈ దొంగ ఏకంగా కోర్టులో లొంగిపోయి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. డబ్బులు ఊరికే రావు, చాలా కష్టపడాలి, దొంగతనము అంతే అదంత ఈజీ కాదని ఈ మురుగన్ చూపించాడు. కొట్టేసిన సొమ్మును పక్కా ప్లాన్ ప్రకారం మార్చేశాడు. చోరీ అయిన మొత్తం బంగారంలో అయిదు కిలోల వరకు పట్టుకున్నా ఇంకా చాలా వరకూ బంగారాన్ని మురుగన్ చేతులు మార్చినట్లు అనుమనిస్తున్నారు. ఇప్పుడు ఆ గోల్డ్ ను రికవరీ చేయడం చెన్నై పోలీసులకు కష్టతరంగా మారింది.  ప్లాస్టిక్ సర్జరీ కారణంగా అతన్ని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది.ఈ లోపే దొంగతనం చేసిన బంగారాన్ని మొత్తం సర్దేశాడు మురుగన్. ఒకప్పటి పాత ఫొటో ఇప్పటి సర్జరీ ఫోటోను చూస్తే ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అప్పుడు బక్కపలచగా అందవిహీనంగా ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ సర్జరీతో స్మార్ట్ గా తయారయ్యాడు మురుగన్. అదే అతనికి ప్లస్ అయితే పోలీసలుకు మైనస్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ పోయే మురుగన్ చెన్నైలోని లలిత జూలరీలో దొంగతనం చేశాక అనూహ్యంగా మాయమయ్యాడు. తన అనుచరుడు ఒకడు పట్టుబడటంతో ఐదు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. మిగితా సొత్తును స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు ముందుకు సాగుతుండగానే మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగిపోవడం సంచలనంగా మారింది. మరో దొంగ సురేష్ తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో లొంగిపోయాడు. ఇప్పుడు మురుగన్ లొంగుబాటు కూడా ఓ వివాదంగా మారింది. అతనిని నుంచి పది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదంటే తమదంటూ కుస్తీపడుతున్నారు. కర్ణాటక పోలీసులు తమ రాష్ట్రాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన గోల్డ్ గా చెబుతుండగా చెన్నై పోలీసులు లేదు లేదు అది ముమ్మాటికీ లలితా జ్యువెలరీ కేసు సొత్తేనని వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా గోల్డ్ వారు నెలకొంది. తిరుచ్చి జిల్లాలోని తిరువెంబూర్ లో మురుగన్ ఉండే అద్దె ఇంటి సమీపంలో కూడా పోలీసులు అతని ఫోటో పట్టుకొని ఆరా తీశారు. అయినా అక్కడ వారు గుర్తించలేకపోయారు. దీంతో కంగుతిన్న పోలీసులు అసలు విషయం ఆరా తీయగా అతను కొద్దిగా ప్లాస్టిక్ సర్జరీ డెంటల్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు. అంతకుముందు అనారోగ్యంతో ఉన్న అతని ఫోటోకు ఇప్పటి ఫొటోకు చాలా వ్యత్యాసం ఉండడంతో పోలీసులు మొదట గుర్తించలేకపోయారు. చేతి వాటం చూపడంలో మురుగన్ ది అందెవేసిన చెయ్యి. అందుకే అతన్ని పట్టుకోవడం కొన్ని సందర్భాల్లో పోలీసులకు సవాలుగా మారుతూ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కూడా మరో కారణం ఉందని ప్రచారం ఉంది. అతనికి ఎయిడ్స్ ఉందని, ఆ అనారోగ్యం విషయం బయటివారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  సినిమాలపై కూడా మురుగన్ కు బాగానే మోజుంది. గతంలో అనేక దొంగతనాలకు పాల్పడిన సొత్తుతో మూడు నాలుగు సినిమాలు కూడా తీశాడు. ఓ హీరోయిన్ తో విదేశాలలో తిరిగాడని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ పదిహేనేళ్ల కాలంలో మురుగన్ సంపాదించిన ఆస్తి వంద కోట్ల వరకు ఉంటుందని పోలీసులు లెక్కలే చెబుతున్నాయి. దొంగతనం చేసిన సొత్తులో మెజార్టీ డబ్బును సినిమాల నిర్మాణం కోసమే మురుగన్ ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కొంత మంది పేర్లతో బినామీ ఆస్తుల్ని కూడా దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతనితో  సన్నిహిత్యంగా ఉన్న వారిపైన నిఘా పెట్టారు పోలీసులు. సినిమాలపై మోజుతో తెలుగులోనూ చిన్న చిన్న చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు.  రెండు వేల పదిహేనులో బెంగుళూరులో ఓ వ్యాపార వేత్త ఇంట్లో దొంగతనం చేశాక 3.16 కోట్ల ఆస్తిని రికవరీ చేసేందుకు అక్కడి పోలీసులకు తొంభై రోజుల సమయం పట్టింది. ఆ తరువాతనే మురుగన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కొత్త లుక్ తో దొంగతనాలకు తెగబడుతున్నట్లు అర్ధమవుతోంది. మురుగన్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీతో పోలీసులు బోల్తాపడ్డారు. మురుగన్ ఎపిసోడ్ తో చోరీ తతంగం కాసింత పక్కకు వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు ప్లాస్టిక్ సర్జరీతో మొత్తం మొహాన్ని మార్చుకోవడం సాధ్యమవుతుందా సినిమాల్లో చూపించినట్టు జరుగుతుందా ఒకవేళ సాధ్యమైతే ఎన్ని సర్జరీలు చేసుకోవాలి.ఏదేమైనా మున్ముందు సర్జరీలు అంటూ వచ్చే వారి అవసరం ఎంత ఉన్నా వారి వివరాలు ఏంటన్న దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే సమాజానికి చెడు చేసే దుర్మార్గులకు ఇలాంటి సర్జరీలు కలిసి వచ్చేలా మారుతుండటం మరింత ఇబ్బందికర పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ సర్జరీ కారణంగా పోలీసులను ముప్ప తిప్పలు పడుతున్నారనే విషయం వెల్లడవుతోంది.
ALSO ON TELUGUONE N E W S
  అనూహ్యంగా 'వెంకీ మామ' మూవీ సంక్రాంతి విడుదలకు సై అనడంతో.. ఒక్కసారిగా సంక్రాంతి సీజన్ వేడెక్కిపోయింది. ఇప్పటికే మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.. రెండూ జనవరి 12న వస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. అఫిషియల్‌గా అనౌన్స్ చెయ్యకపోయినా 'వెంకీ మామ' మూవీ వాటికంటే ఒకరోజు ముందు, అంటే జనవరి 11న వస్తున్నట్లు సమాచారం. మొదట శుక్రవారమైన జనవరి 10న రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ, చివరకు 11వ తేదీని ఎంచుకున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్ కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.  ఇవి కాకుండా కల్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా' కూడా సంక్రాంతినే నమ్ముకుంటోంది. దాన్ని జనవరి 15న రిలీజ్ చెయ్యాలని నిర్మాణ సంస్థ ఆదిత్యా మ్యూజిక్ భావిస్తోంది. మహేశ్, బన్నీ లాంటి మహా మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ సినిమాలతో పోటీకి దిగడం దుస్సాహసం అని తెలిసినా, అప్పుడే రావాలని కల్యాణ్ రామ్ భావిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఆడియో, వీడియో రంగంలో ఉన్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ 'ఎంత మంచివాడవురా' మూవీతోటే సినిమా ప్రొడక్షన్‌లో ఎంటరవుతోంది. గతంలో పేరుపొందిన మరో మ్యూజిక్ సంస్థ సుప్రీం ఆడియో కూడా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి దిగి.. విష్ణు, అనుష్క జోడీగా 'అస్త్రం' మూవీని తీసి, చేతులు కాల్చుకుంది. ఇప్పుడు కథను నమ్ముకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆదిత్యా మ్యూజిక్ అధినేతలు తమ సినిమా విడుదలకు సరైన సమయాన్ని ఎంచుకోకపోతే, దెబ్బతినే ప్రమాదముంది. 'ఎంత మంచివాడవురా' మూవీకి 'శతమానం భవతి' ఫేం సతీశ్ వేగేశ్న డైరెక్టర్.  మాస్ ఆడియెన్స్‌లో అమిత ఫాలోయింగ్ ఉన్న మహేశ్, అల్లు అర్జున్ చాలా రోజుల క్రితమే సంక్రాంతికి ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో' జనవరి 12న వస్తాయనే ప్రచారం జరిగింది. అయితే ఒకేసారి ఆ రెండు సినిమాల మేకర్స్ తమ సినిమాలు జనవరి 12న వస్తాయని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఓపెనింగ్స్ విషయంలో రెండు సినిమాలకూ దెబ్బేనని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలవడం వల్ల అందుబాటులో ఉన్న థియేటర్లను రెండు సినిమాలూ పంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రెండింటికీ మార్కెట్‌లో బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాల తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా కావడం, 'ఎఫ్2' సహా వరుస హిట్లతో టాప్ లీగ్‌లోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 'సరిలేరు నీకెవ్వరు' థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు అల్లు అర్జున్, త్రివిక్రం మునుపటి సినిమాలు ఫ్లాపైనా, వాళ్ల కాంబినేషన్‌కు క్రేజ్ ఎంది. గతంలో వాళ్లిద్దరూ కలిసి చేసిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు రెండూ ప్రేక్షకుల్ని అలరించాయి. పైగా ఇటీవల 'సామజవరగమన' పాటకు లభించిన ఆదరణ.. 'అల వైకుంఠపురములో' మూవీపై అంచనాల్ని పెంచేసింది. బన్నీ లుక్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఏమాత్రం బాగున్నా, సినిమాని సూపర్ హిట్ రేంజికి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మహేశ్‌తో సంక్రాంతి సమరానికి బన్నీ అండ్ కో ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మేనమామ, మేనల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కూడా తమ 'వెంకీ మామ' మూవీతో సంక్రాంతి ఫైట్‌ను మరింత రసవత్తరంగా మార్చాలని భావిస్తున్నారు. 2019లో 'వినయ విధేయ రామ' వంటి భారీ మాస్ ఫిల్మ్, 'యన్.టి.ఆర్: కథానాయకుడు' వంటి బయోపిక్, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'పేట' ధాటిని తట్టుకొని, వాటిని వెనక్కినెట్టేసి, 'ఎఫ్2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వెంకటేశ్. 2020 సంక్రాంతికి 'వెంకీ మామ'తో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చెయ్యాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నాడు. సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తుండటం, సురేశ్‌బాబు చేతుల్లో చాలా థియేటర్లు ఉండటం ఆ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఇక తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో మరోసారి పోటీ పడేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్నాడు. 2019లో 'పేట'తో వచ్చినా, ఆశించినన్ని థియేటర్లు లభ్యంకాక అసంతృప్తికి గురైన ఆయన, ఈసారీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని, 'దర్బార్' మూవీతో వస్తున్నాడు. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఏమిటనేది అఫిషియల్‌గా వెల్లడికాలేదు. విడుదల తేదీగా జనవరి 10, జనవరి 15 రెండూ ప్రచారంలోకి వచ్చాయి. ఏదేమైనా 'దర్బార్'.. పొంగల్‌కు రావడం ఖాయం. అయితే 2019 కంటే, 2020 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్స్ నుంచి రజనీకాంత్ మరింత గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి కూడా 'దర్బార్'కు తగినన్ని థియేటర్లు లభించే అవకాశం కనిపించడం లేదు. 'వెంకీ మామ' మూవీతో పోలిస్తే.. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు రెండూ భారీ బడ్జెట్‌తో తయారవుతున్నాయి. పెట్టుబడి రావాలంటే, అత్యధిక థియేటర్లలో రిలీజ్ చెయ్యాల్సిన స్థితి. డిసెంబర్లో వస్తుందనుకున్న 'వెంకీ మామ' అనూహ్యంగా పోటీలోకి రావడం వాటి నిర్మాతలను కలవరపెట్టే విషయం. 'వెంకీ మామ'ను పోటీలోంచి తప్పించడానికి నిర్మాత సురేశ్‌బాబుతో మంతనాలు జరపాలని వారు భావిస్తున్నారని వినిపిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?.. ఒకవేళ 'వెంకీ మామ' పోటీ నుంచి తప్పుకున్నా సంక్రాంతికి 'మహా సంగ్రామం' తప్పదు. ఆ సంగ్రామంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్నది ఆసక్తి కలిగించే విషయం. గతంలో సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నీ హిట్టయిన సందర్భాలున్నాయి. ఈసారీ అలా జరగాలనే ఆశిద్దాం. 
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అనుకోని అతిథి'. అంతకు మించి... అనేది ఉపశీర్షిక. మలయాళం ఘన విజయం సాధించిన 'అధిరన్'కు తెలుగు అనువాదం ఇది. నవంబర్ 15న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్,  గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సాయి పల్లవి నటన అంతకు మించి అనేలా ఉంటుందట. ఇందులో మెంటల్ గా డిస్టర్బ్ అయిన క్యారెక్టర్ చేసినట్టుంది. నిర్మాతలు మాట్లాడుతూ "కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు" అని అన్నారు.
  హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేసే కాన్సెప్ట్‌ మీద చాలామంది దర్శకులు కామెడీ పండించారు. అలాగే, కమెడియన్‌ని ఇతర ఆర్టిస్టుల చేత కొట్టించడం కాన్సెప్ట్‌తోనూ బోలెడు సినిమాల్లో ఫన్‌ పుట్టించారు. ఫర్‌ సపోజ్‌... హీరోయిన్‌కి, అదీ దెయ్యం ఆవహించిన హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేస్తే? కమెడియన్‌ని హీరోయిన్‌ చితక్కొడితే ఎలా ఉంటుందనే ఐడియా ఓంకార్‌కి వచ్చింది. ఈ కాన్సెప్ట్‌ మీద ‘రాజుగారి గది 3’లో సూపర్‌ కామెడీ ట్రాక్‌ చేశాడట. హీరోయిన్‌ అవికా గోర్‌కి బ్రహ్మాజీ లైన్‌ వేసే సన్నివేశాలు, అతడిని ఆమె చితక్కొట్టే సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వడం ఖాయమట. ఆ కామెడీ ట్రాక్‌ బాగా వచ్చిందట. ముఖ్యంగా బ్రహ్మాజీ ఇరగదీసి నటించాడట. అశ్విన్‌బాబు హీరోగా, ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తొలి రెండు భాగాల కంటే ఈ భాగం ఎక్కువ నవ్విస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.
కొరటాల శివ కొత్త సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే ఉన్నారు. ఆయనే హీరో. రామ్‌చరణ్‌ గానీ... మరో హీరో గానీ... ఎవరూ లేరు. కమర్షియల్‌ మీటర్‌లో, పక్కా చిరంజీవి స్టైల్‌లో ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’ టైపులో మెసేజ్‌ ఇచ్చేలా ఉంటుంది. ఇదీ పక్కా న్యూస్‌. రీసెంట్‌గా చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని న్యూస్‌ వినిపించింది. ‘సైరా’ ప్రమోషన్స్‌ కోసం కేరళకు వెళ్లినప్పుడు ‘లూసిఫర్‌’ రీమేక్‌ రైట్స్‌ కొన్నట్టు చిరంజీవి చెప్పారు. అందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ క్యారెక్టర్‌ చేశాడు. తెలుగులోనూ ఆయన్నే చేయమని అడిగితే రామ్‌చరణ్‌ పేరును సజెస్ట్‌ చేసినట్టు ఆయనే చెప్పారు. కొన్ని రోజులకు కొరటాల శివ సినిమాలో రామ్‌చరణ్‌ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. అసలు మేటర్‌ ఏంటంటే... కొరటాల శివ సినిమాలో చరణ్‌ లేడు. ముందుకు ఒక కథ అనుకున్నప్పుడు ఓ క్యారెక్టర్‌ రామ్‌చరణ్‌తో చేయిస్తే ఎలా ఉంటుందని అనుకున్నార్ట. కానీ, కథ మారింది. చిరంజీవి హీరోగా మాత్రమే సినిమా చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. హీరోయిన్స్‌ సెలక్షన్‌ త్వరలో పూర్తి చేసి, నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు.
  నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య.. 'వెంకీ మామ' మూవీలో అవే తరహా పాత్రల్లో హీరోలుగా నటిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ పేరిట రిలీజైన వీడియో ద్వారా మనకు స్పష్టమైంది. అందులో చైతూని 'అల్లుడూ' అంటూ వెంకీ సంబోధించడం మనకు కనిపిస్తుంది. కె.ఎస్. రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీని పరిశీలిస్తే, ఒక ఇంట్లోని వాళ్లు, చుట్టాలు కలిసి నటించిన సినిమాలు కొల్లలుగా కనిపిస్తాయి. అయితే మామా అల్లుళ్ల వరుస అయ్యేవాళ్లు కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలైతే.. ఇదివరకు రెండే కనిపిస్తాయి. వాటిలో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేశ్ కలిసి నటించిన 'బ్రహ్మరుద్రులు' మూవీ. వెంకటేశ్‌కు ఏఎన్నార్ మామయ్య వరుస అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీలోనూ వెంకీకి మేనమామగా అక్కినేని కనిపిస్తారు. అక్కినేని జడ్జిగా నటిస్తే, ఆయన చెల్లెలి కుమారుడిగా వెంకటేశ్ నటించాడు. ఇది హీరోగా వెంకీకి రెండో సినిమా. ఆయన తొలి సినిమా 'కలియుగ పాండవులు' వచ్చిన సంవత్సరమే ఈ సినిమా కూడా వచ్చింది. కె. మురళీమోహనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించలేదు. రెండో సినిమా.. నాగార్జున, ఆయన మేనల్లుడు సుమంత్ కలిసి నటించిన 'స్నేహమంటే ఇదేరా'. మలయాళ హిట్ ఫిల్మ్ 'ఫ్రెండ్స్'కు రీమేక్‌గా తమిళ దర్శకుడు బాలశేఖరన్ రూపొందించిన ఈ మూవీ 2001లో విడుదలైంది. ఈ మూవీలో నాగార్జున, సుమంత్.. ఇద్దరూ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌గా కనిపించారు. మెలోడ్రామా, ట్విస్టులు ఎక్కువగా కనిపించే ఈ మూవీలో అపార్థాల కారణంగా విడిపోయిన స్నేహితులు చివరకు కలుస్తారు. కేవలం సుమంత్‌ను ప్రమోట్ చెయ్యడం కోసమే ఈ మూవీని నాగార్జున చేశాడంటూ అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. అయితే నాగ్ ఆశలు ఫలించలేదు. బాక్సాఫీస్ దగ్గర 'స్నేహమంటే ఇదేరా' ఫెయిలైంది. (ఈ మూవీ మన దగ్గర ఉంది) మామా అల్లుళ్ల తరహాలో మామాకోడళ్లు నటించిన సినిమాను ఇటీవలే చూశాం. అది.. నాగార్జున, సమంత కలిసి నటించిన 'రాజుగారి గది 2'. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున మెంటలిస్టుగా నటిస్తే, తోటి విద్యార్థుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి, ఆత్మగా మారిన అమృత అనే స్టూడెంట్‌గా సమంత కనిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. ఈ సినిమాకు ముందు కూడా నాగ్, సమంత కలిసి 'మనం' మూవీలో నటించినా, అప్పటికి వాళ్లిద్దరూ మామా కోడళ్లు కాలేదు. ఇక తండ్రీకొడుకులు, అన్నాతమ్ముళ్లు కలిసి నటించిన సినిమాలు తెలుగులో ఎన్టీఆర్ కాలం నుంచే మనకు కనిపిస్తుంది. మరే తండ్రీకొడుకుల కాంబినేషన్‌లో రానన్ని సినిమాలు ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చాయి. బాలయ్య చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలను పక్కనపెడితే, ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి 'అన్నదమ్ముల అనుబంధం', 'వేములవాడ భీమకవి', 'దాన వీర శూర కర్ణ', 'అక్బర్ సలీం అనార్కలి', 'శ్రీ మద్విరాటపర్వం', 'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం', 'రౌడీ రాముడు కొంటె కృష్ణుడు', 'అనురాగ దేవత', 'సింహం నవ్వింది', 'శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర', 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలు వచ్చాయి. 'దాన వీర శూర కర్ణ'లో హరికృష్ణ కూడా నటించడం గమనార్హం. ఇది బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించింది. 'సింహం నవ్వింది' డిజాస్టర్ అయ్యింది. అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణ బాలనటులుగా 'తాతమ్మ కల', 'రామ్ రహీమ్' సినిమాలో కలిసి నటించారు. బాబాయ్, అబ్బాయ్ అయిన బాలకృష్ణ, కల్యాణ్ రామ్ 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాల్లో కలిసి నటించారు. దురదృష్టవశాత్తూ ఆ రెండు సినిమాలూ డిజాస్టర్ అయ్యాయి. ఎన్టీఆర్ - బాలకృష్ణ తర్వాత ప్రధాన పాత్రల్లో ఎక్కువగా కలిసి నటించిన తండ్రీకొడుకులు కృష్ణ, మహేశ్. అయితే వీటిలో అత్యధికం మహేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు వచ్చినవే. 'పోరాటం', 'శంఖారావం', 'అన్నా తమ్ముడు', 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు' సినిమాలను తన చిన్నతనంలో తండ్రితో కలిసి నటించాడు మహేశ్. పెద్దయ్యాక అతను కృష్ణతో కలిసి నటించిన సినిమాలు.. 'రాజకుమారుడు', 'వంశీ'. వీటిలో మొదటిది బాగానే ఆడగా రెండోది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 'ముగ్గురు కొడుకులు'లో కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ కూడా నటించాడు. కృష్ణ, రమేశ్ కలిసి 'కలియుగ కర్ణుడు', 'ఆయుధం', 'నా ఇల్లే నా స్వర్గం' సినిమాల్లోనూ నటించారు. రమేశ్, మహేశ్ కలిసి 'బజారు రౌడీ' అనే హిట్ సినిమాలో నటించారు. అయితే అప్పుడు మహేశ్ బాలనటుడు. తండ్రీ కొడుకులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కాంబినేషన్‌లోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో 'కలెక్టర్ గారి అబ్బాయి', 'మనం' సినిమాలు సక్సెస్ అవగా, 'అగ్నిపుత్రుడు', 'ఇద్దరూ ఇద్దరే' సినిమాలు ఫ్లాపయ్యాయి. 'శ్రీరామదాసు' ఓ మోస్తరుగా ఆడింది. చిన్నకొడుకు అఖిల్ పసివాడిగా ఉన్నప్పుడు నాగార్జున అతనితో ఒక సినిమా చేశాడు. అది.. 'సిసింద్రీ'. అఖిల్ టైటిల్ రోల్ చేసిన ఆ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. తాతా మనవళ్లయిన ఏఎన్నార్, సుమంత్ కలిసి 'పెళ్లి సంబంధం' అనే ఫ్లాప్ సినిమాలో నటించారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా చాలా సినిమాల్లో కలిసి నటించారు. మోహన్‌బాబు, ఆయన ఇద్దరు కొడుకులు కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో కలిసి నటించారు. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి డైలాగ్ కింగ్ 'సూర్యం', 'సలీం', 'గేమ్', 'రౌడీ', 'గాయత్రి' సినిమాల్లో నటించారు. అలాగే చిన్నకొడుకు మనోజ్‌తో 'శ్రీ', 'ఝుమ్మంది నాదం' సినిమాలు చేశాడు మోహన్ బాబు. ఇదే కుటుంబంలో అక్కాతమ్ముళ్లు మంచు లక్ష్మి, మనోజ్ కలిసి 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా' సినిమాలో నటించారు. వీటిలో 'రౌడీ', 'ఝుమ్మంది నాదం' సినిమాలు మాత్రమే ఆడాయి. చిరంజీవి కుటుంబానికి వచ్చేసరికి మెయిన్ రోల్స్‌లో ఇద్దరు కలిసి నటించిన సినిమాలేవీ లేవు. చిరంజీవి హీరోగా నటించిన పలు సినిమాల్లో ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు నటించినా.. అవన్నీ చిన్న పాత్రలే. 'రాక్షసుడు', 'మరణ మృదంగం', 'త్రినేత్రుడు', 'కొండవీటి దొంగ', 'అంజి', 'మృగరాజు', 'ఖైదీ నంబర్ 150' సినిమాల్లో ఆ సోదరులిద్దరూ కలిసి నటించారు. కొడుకు రాంచరణ్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్‌లో నటించారు. ఆ రెండు.. 'మగధీర', 'బ్రూస్ లీ' సినిమాలు. బావ బావమరుదులు చిరంజీవి, అల్లు అరవింద్ 'చంటబ్బాయ్' సినిమాలో కలిసి నటించారు. అందులో వాళ్లిద్దరి మధ్య వచ్చే ఫైట్లు కడుపుబ్బ నవ్వించాయి. ఇక తన మామ అల్లు రామలింగయ్యతో కలిసి చిరంజీవి నటించిన సినిమాలెన్నో. చిరంజీవి హీరోగా చేసిన యావరేజ్ మూవీ 'డాడీ'లో బాల నటుడిగా అల్లు అర్జున్ కనిపించాడు. అలాగే 'సైరా' మూవీలో నాగబాబు కుమార్తె నిహారికను ఒక చిన్న పాత్రలో చూశాం. పవన్ కల్యాణ్ సినిమా 'అన్నవరం'లో నాగబాబు పోలీసాఫీసర్ కేరెక్టర్‌లో కనిపిస్తాడు. వరుసకు మేనమామ, మేనల్లుళ్లు అయ్యే నాగబాబు, అల్లు శిరీష్ 'ఏబీసీడీ' సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించడం గమనార్హం. అలాగే మేనల్లుడు సాయిధరం తేజ్‌తో కలిసి నాగబాబు 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో నటించాడు. వరుసకు బావ బావమరుదులయ్యే రాంచరణ్, బన్నీ 'ఎవడు' మూవీలో నటించారు. అందులో బన్నీది చిన్న పాత్ర. పైగా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలుండవు. ఇవాళ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుతో రెండు సినిమాల్లో నటించాడు. వాటిలో 'బిల్లా' యావరేజ్‌గా అడగా, 'రెబెల్' మూవీ ఫ్లాపయింది. అన్నదమ్ములైన ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేశ్ కలిసి ఒక సినిమాలో హీరోలుగా నటించారు. వాళ్ల తండ్రి ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఆ మూవీ 'నువ్వంటే నాకిష్టం'. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ సరిగా ఆడలేదు. సంఖ్యాపరంగా చూసినప్పుడు ఒక కుటుంబసభ్యులు, దగ్గరి చుట్టాలు కలిసి నటించిన సినిమాల్లో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సక్సెసవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'వెంకీ మామ' మూవీ ఎలా ఆడుతుందో చూడాలి.
  దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. దాంతో 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ ఉండదేమోనని చాలామంది అనుకున్నారు. నిజం ఏంటంటే... 'లస్ట్ స్టోరీస్' తెలుగులో రీమేక్ అవుతోంది. మరి, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? అంటే.... తరుణ్ భాస్కర్. అవును... 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కి డైరెక్టర్. ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' విడుదలకు రెడీ అవుతోంది. అది ప్రేక్షకుల ముందుకు వచ్చాక 'లస్ట్ స్టోరీస్' రీమేక్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ మీద కూడా తరుణ్ భాస్కర్ వర్క్ చేస్తున్నాడని తెలిసింది.
పవన్‌కల్యాణ్‌ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు' వంటి అద్భుతమైన డైలాగులు రాశారు. అయితే... కొన్ని డైలాగులు విషయంలో దర్శకుడు విష్ణువర్ధన్‌తో గొడవ పడ్డారట. పవన్ కల్యాణ్ ముందే తనకు, దర్శకుడికి గొడవ జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో అబ్బూరి రవి చెప్పారు. కొన్ని డైలాగులు కొంతమందికి రాయకూడదని, ఏ డైలాగ్ ఎవరికి రాస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దర్శకుడు, డైలాగ్ రైటర్ ఊహించగలగాలని ఆయన అన్నారు. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'తో విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న అబ్బూరి రవి, డైలాగ్ రైటర్‌గా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. దర్శకుడు కావాలనే కోరిక మనసులో బలంగా ఉందనీ, అయితే డైలాగ్ రైటర్‌గా బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఆ కోరికను పక్కన పెట్టాననీ, డైరెక్షన్ కోసం సొంత కథ రాసుకోవడానికి డైలాగ్ రైటర్‌గా సినిమాలు తాగించానని అబ్బూరి రవి తెలిపారు. దర్శకుడు సాయికిరణ్ అడివి కోసం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో విలన్ ఘాజీ బాబా పాత్ర చేశానన్నారు. తన నటన ఎలా ఉందో ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా చూసి ప్రేక్షకులే చెప్పాలని అన్నారు.
'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు మిలటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఆర్మీ డ్రస్సులో సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తూ ఒక పాట కూడా విడుదల చేశారు. అయితే... సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? మహేష్ బాబు ఆర్మీ అధికారిగా, దేశ సరిహద్దుల్లో సైనికుడిగా కనిపించేది ఎంతసేపో తెలుసా? జస్ట్ 20 మినిట్స్ మాత్రమే. మిగతా కథ అంతా తెలుగు నేల మీద నడుస్తుంది. బోర్డర్ నుండి కథ కర్నూల్ కొండారెడ్డి బురుజుకు షిఫ్ట్ అవుతుంది. వయా ఒక పెద్ద ట్రైన్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అంతా చాలా హిలేరియస్ గా ఉంటుందని టాక్. సినిమా స్టార్టింగులో మిలిటరీ, ఆర్మీ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం. విజయశాంతి ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాతో బండ్ల గణేష్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు.
  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.
  చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.
  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 
  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.
  గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.
  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.
  జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.
  If you are sick you go to the doctor. But, what if you could avoid falling sick? Of course you can’t avoid everything and anything but there are a few problems to which you can lower your vulnerability. Diabetes type 2 is one such problem you can avoid simply by an increased consumption of eggs and fat dairy products. Surprised? It is a very unusual remedy but experts say its very effective. For more proof you can take a look at what the research of a University of Eastern Finland has revealed. After a controlled experiment it was realized that men who ate 4 eggs in a week brought down their risk of developing type 2 diabetes by 37%. However, taking more than 4 eggs per week did not lead to any other benefits that are worth a mention. Another group of Scandinavian scientists who conducted a similar research, pointed out that increased consumption of high fat dairy products can bring down your risk of developing type 2 diabetes by 23%. Shockingly, 6% of the population in Britain are diagnosed with diabetes and most of the people fall in the type 2 category. If you don’t want to be one among them, consult your doctor and include these essential foods in your diet. -Kruti Beesam
  నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.