LATEST NEWS
ఏపీలో లంచాల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అత్యంత అవినీతి శాఖగా పేరున్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై తొలి పంజా విసిరిన ఏసీబీ అధికారులు తాజాగా నిన్న పురపాలకశాఖ కార్యాలయాల్లోనూ దాడులు చేపట్టారు. శాఖల వారీగా చేస్తున్న ఈ దాడులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ ప్రభుత్వ శాఖలోనూ ఏసీబీ దాడులు తప్పవని అధికారులు తాజా దాడులతో హెచ్చరికలు పంపుతున్నారు. ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే తన కేబినెట్ లోని మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు సైతం హెచ్చరికలు పంపారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే సమస్యే లేదని కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు స్పష్టం చేసిన సీఎం జగన్ ఇప్పుడు దాన్ని చేతల్లో చూపుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవినీతి దర్యాప్తు విభాగాన్నిపటిష్టం చేయాలని భావించిన జగన్ అప్పటికే దాన్ని లీడ్ చేస్తున్న కుమార్ విశ్వజిత్ ను సాగనంపారు. అవినీతిని అరికట్టడంలో తన అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదని భావించడం వల్లే విశ్వజిత్ ను బదిలీ చేశారు. ఆయన స్ధానంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన సీతారామాంజనేయులును తీసుకొచ్చారు. గతంలో పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి సమర్ధుడిగా పేరు తెచ్చుకున్న సీతారామాంజనేయులు వచ్చీ రాగానే పని ప్రారంభించేశారు. రవాణాశాఖ కమిషనర్ నుంచి ఏసీబీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీతారామాంజనేయులు కీలకమైన రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై దృష్టిసారించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన అధికారులు అవినీతిలో మునిగి తేలడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని భావించిన ఆయన... వచ్చీ రాగానే రంగంలోకి దిగారు. అక్రమార్కులపై చర్యల విషయంలో సీఎం జగన్ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో విమర్శలకు వెరవకుండా గతేడాది 21న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, తహసీల్డార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ  సోదాలు చేపట్టింది. సిఫార్సులను సైతం లెక్కచేయకుండా అవినీతిపరుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి చేరవేసింది. ఆ తర్వాత మరో కీలక విభాగమైన పురపాలకశాఖపై ఏసీబీ దృష్టిసారించింది.  మంగళవారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. ఇందులో భారీ ఎత్తున ఆధారాలను సైతం సేకరించేంది. లెక్కతేలని నగదుతో పాటు డాక్యుమెంట్లను జప్తు చేసింది. 13 జిల్లాల్లో 14 టీమ్ లుగా విడిపోయి 100 మందికి పైగా అధికారులు చేపట్టిన సోదాల్లో పలుచోట్ల చాలా మంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా టౌన్ ప్లానింగ్ విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. లంచాలకు కక్కుర్తి పడి సిటిజన్ ఛార్జర్ అమలు చేయకపోవడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోవడం, తనిఖీలు నిర్వహించకపోవడం, బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కేసులు నమోదు చేశారు. త్వరలో మిగిలిన విభాగాల్లోనూ సోదాలు నిర్వహించేందుకు ఏసీబీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.
కర్ణాటక బీజేపీ సర్కారుపై అసంతృప్తి మొదలైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకోవటం కలకలం రేపుతోంది. సీఎం యడ్యూరప్ప పని తీరుతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యేలు ఆనందంగా లేరని సమాచారం. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఏడాది పాటు పాలన సాగించిన కాంగ్రెస్ జెడియు సంకీర్ణాన్ని గద్దె దించి ముఖ్యమంత్రైన యడ్యూరప్పకు అప్పుడే కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచి అరవై రోజులు కాకముందే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకుంటున్నారు. సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. పార్టీని ఫిరాయించి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కడాన్ని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది సార్లు గెలిచిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి చివరి నిమిషంలో మొండి చేయి చూపారనే వాదన వినిపిస్తోంది.  మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ లో సీఎం పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు యడ్యూరప్ప వర్గీయుల సృష్టిగా చెబుతున్నా సంతకం లేని లేఖ గురించి కూడా చర్చ జరుగుతోంది. యడ్యూరప్పకి వయసు మీద పడింది అని వారసుడిగా విజయేంద్రకు పగ్గాలు ఇవ్వవలసిన సమయం వచ్చేసింది అనేది ఆ లేఖ సారాంశం. కాంగ్రెస్ మార్క్ అయిన వంశపారంపర్య రాజకీయాలకు బిజెపిలో చోటు లేదని ఓ వైపు కేంద్ర నాయకత్వం చెబుతుంటే యడ్యూరప్ప అందుకు విరుద్ధంగా కొడుకును ప్రోత్సహించే ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. బడ్జెట్ సెషన్ మొదలైన తొలి రోజే సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యేలు ముందుముందు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బిజెపిలో పరిణామాలని బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికే సీఎల్పీ భేటీ నిర్వహించింది. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మాజీ సీఎం సిద్దరామయ్య.
వారం రోజుల్లో పెళ్లి. ఆమెలో పెళ్లి కళ కూడా వచ్చేసింది. తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ లోగా ఘోరం జరిగి పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది దివ్య అనే యువతి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. గత రాత్రి గజ్వేల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన దివ్య.. గజ్వేల్ లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈ నెల 26వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఇదే సమయంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం నిన్న ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా తనకు బ్యాంక్ లో పనులున్నాయని వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్ళింది. ఎప్పట్లాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీ ప్రసన్న నగర్ లో తాముంటున్న ఇంటికి వచ్చింది దివ్య. తనకు కాబోయే భర్త సందీప్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. ఇంతలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడంలో ఫోన్ లో మాట్లాడుతున్న సందీప్ కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్ లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో చుట్టు పక్కలవారు తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసే సరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో విచారణ చేశారు. కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికొచ్చారు. అయితే ప్రేమోన్మాదం తమ కుమార్తె హత్యకు కారణమని బోరున విలపిస్తున్నారు. గత కొంత కాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్ లో చదువుకొనే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి నారాయణ తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు.
ALSO ON TELUGUONE N E W S
తమిళంలో విజయ్ పాడిన 'కుట్టి స్టోరీ' పాటను తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాడుతున్నాడా? అతడితో పాడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఫిలింనగర్ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మాస్టర్'. అనిరుధ్ సంగీత దర్శకుడు. కార్తీతో 'ఖైదీ' వంటి హిట్ సినిమా తీసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఒక సాంగ్ పాడాడు. అది నెట్టింట వైరల్ అయ్యింది. విజయ్ పాడడం అనే పాయింట్ ఆడియన్స్ ని  అట్ట్రాక్ట్ చేసింది. తెలుగులో ఆ సాంగ్ ఎన్టీఆర్ తో పాడించాలని ట్రై చేస్తున్నారట. తెలుగులో 'మాస్టర్' సినిమాను ఎన్టీఆర్ సన్నిహితుడు, నిర్మాత మహేష్ కోనేరు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్  దగ్గర సాంగ్ ప్రపోజల్ ఆయనే పెట్టాడట. ఎన్టీఆర్ ఏమంటారో? ఇంతకు ముందు ఎన్టీఆర్ తన సినిమాల్లో ఐదారు పాటలు పాడారు. బయట హీరోలకు అయితే ఒక్క పాట మాత్రమే పాడారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'చక్రవ్యూహ'లో 'గెలియా గెలియా' పాట పాడారు.  
ఆస్కార్ అవార్డులో కొరియన్ సినిమా 'పారా సైట్' చరిత్ర సృష్టించింది. ఉత్తమ చిత్రం, అంతర్జాతీయ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్స్ అందుకుంది. ఈ సినిమా కథ చదివి చాలామంది ఇదేదో తెలుగు సినిమా కథలా ఉందని అనుకున్నారు. అసలు ఆ సినిమా కథేంటి? అంటే... సంపన్నుల కుటుంబంలో ఒక పేదింటి కుర్రాడికి ఉద్యోగం వస్తుంది. అక్కడ చేరిన తర్వాత మిగతా ఉద్యోగాల్లో ఉన్నవాళ్లను పథకం ప్రకారం తప్పించి తన కుటంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాడు. అతడి పన్నాగం ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్లలో ఒకరికి తెలుస్తుంది. పేదింటి కుర్రాడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? తర్వాత ఏమైంది? అనేది టూకీగా కథ. మెయిన్ ట్విస్టులు రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇంతే! ఈ టైప్ లైన్ తో సౌతిండియాలో చాలా సినిమాలు వచ్చాయి. ఒక సినిమా తామిద్దరం భార్యాభర్తలు అని చెప్పకుండా బ్రహ్మానందం, మరొక కమెడియన్ ఉద్యోగాలు చేస్తారు. ఈ టైపు కథతో తమిళంలో ఒక సినిమా వచ్చిందట. దాంతో వాళ్ళు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు.  రెండు దశాబ్దాల క్రితం తమిళంలో విజయ్ హీరోగా 'మిసారా కన్న' అని ఒక సినిమా వచ్చింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రంభ హీరోయిన్. ఆ సినిమా ప్లాట్, 'పారా సైట్' ప్లాట్ ఒక్కటేనని నిర్మాత పీఎల్ తేనప్ప చెబుతున్నారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఈయన కాదు. కానీ, రైట్స్ ఎప్పుడో కొనుక్కుని పెట్టుకున్నారు. తమ సినిమా లైన్, కథ కాపీ కొట్టి సినిమా తీశారని 'పారా సైట్' టీమ్ కి ఒక మెయిల్ చేశారు. అక్కడ నుండి రిప్లై రాకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. అకాడమీ అవార్డ్స్ టీమ్ కి కూడా ఈ సంగతి చెబుతామని అంటున్నారు. అసలు, కొరియన్ సినిమా టీమ్ తమిళ  నిర్మాత ఆరోపణలపై స్పందిస్తారో? లేదో? ఈయన మాత్రం హడావిడి గట్టిగా చేస్తున్నాడు.   
'అందాల రాక్షసి', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం' తదితర విజయవంతమైన సినిమాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో లావణ్యా త్రిపాఠి నటించారు. దాంతో ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం 'ఏ1 ఎక్స్‌ప్రెస్', 'చావు కబురు చల్లగా' సినిమాల్లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్'లో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా హాకీ శిక్షణకు డుమ్మా కొట్టడం లేదట. అవసరమైతే ఒక్కో రోజు రెండు గంటలు తక్కువ నిద్రపోతున్నారు కానీ, హాకీ ప్రాక్టీస్ మాత్రం మానడం లేదట. తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నారు. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఒక వారం రోజులు ఈ విధంగా చేశారు. ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్' లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లావణ్యా త్రిపాఠి హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన సినిమా యూనిట్ ఆమెను అభినందిస్తున్నారు.  'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో  పాటు లావణ్యా త్రిపాఠి నటిస్తున్న మరో తెలుగు సినిమా 'చావు కబురు చల్లగా...!'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థలో 'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాల తర్వాత లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సినిమా ఇది. డార్క్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు.
  'ఫలక్‌నుమా దాస్' వంటి హిట్ మూవీ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' మూవీ ట్రైలర్ బుధవారం యూట్యూబ్‌లో రిలీజయ్యింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని ప్రెజెంట్ చేస్తొన్న ఈ మూవీని ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తోంది. డాక్టర్ శైలేష్ కొలను ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'చి.ల.సౌ' ఫేం రుహానీ శర్మ హీరోయిన్. 'హిట్' ట్రైలర్ చూస్తుంటే ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన 'దిశ' ఘటన గుర్తుకొస్తోంది. కారు ఆగిపోవడం వల్ల ఒక యువతి రోడ్డుపక్కన ఆగడం, అటువైపు వచ్చిన ఒక పోలీసాఫీసర్ (మురళీ శర్మ) ఆమెను చూసి ఆగి మాట్లాడి, 'పోతామరి.. మేనేజ్ చేసుకుంటావుగా' అనడిగితే, ఆమె 'ష్యూర్ సర్.. థాంక్యూ' అనడం మనకు ఆ ఉదంతాన్నే గుర్తుచేస్తోంది. ఆ వెంటనే అదే పోలీసాఫీసర్ దగ్గరకు తమ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదని ఒక దంపతుల జంట వస్తుంది. మొత్తానికి మిస్సయిన ఆ అమ్మాయి కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత 'సీఐడీ'లోని 'హిట్' (హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం)కు చెందిన ఇన్‌స్పెక్టర్ విక్రం రుద్రరాజుపై పడుతుంది. అది అతడికి ఫస్ట్ కేసు. దీన్నతడు ఎలా పరిశోధించి, వాస్తవాలు వెలికితీశాడనే అంశాన్ని థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ రూపొందించినట్లు ట్రైలర్ చెబుతోంది. 'ఫలక్‌నుమా దాస్'గా యమ ఎనర్జిటిగ్గా నటించి మెప్పించిన విశ్వక్ ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నమైన విక్రం రుద్రరాజు క్యారెక్టర్‌లో కనిపించి ఆశ్చర్యపరచనున్నాడు. అతడికి కూడా ఏదో గతం ఉందనీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా అది గుర్తుకొచ్చి అతను పానిక్ అవుతున్నాడని కూడా తెలుస్తోంది. అతని గతమేంటి? అదేమైనా బాధాకరమైందా? ఆ విషయాలు తెలుసుకోవాలంటే 'హిట్' చూడాల్సిందే. ట్రైలర్ మాత్రం ఒక మంచి అనుభవాన్ని ప్రేక్షకులకు ఇచ్చేట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలవుతోంది.
తమిళ హీరో అజిత్ మంచి బైక్ రేసర్ కూడా. తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ ఛేజింగ్ సీక్వెన్సులు ఉంటే డూప్ లేకుండా చేయడం అజిత్‌కి అలవాటు. ఆయనే స్పీడుగా బైక్ నడుపుతూ స్టంట్స్ చేస్తారు. ఇంతకు ముందు  చాలా సినిమాల్లో అలాగే చేశారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఒక సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్ తీస్తుండగా హీరోకి గాయాలు అయ్యాయట. అసలు వివరాల్లోకి వెళితే... కార్తీ హీరోగా వచ్చిన 'ఖాకి' సినిమా గుర్తుందా? ఆ సినిమా దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ ఒక సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరిగింది. అజిత్ మీద ఒక యాక్షన్ సీక్వెన్స్ తీశారు. అందులో అజిత్ బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తారు. షూటింగులో సడన్ గా బండి స్కిడ్ అవ్వడంతో అజిత్ భుజాలు, కాళ్లకు గాయాలు అయ్యాయని తెలిసింది. ఒక 20మినిట్స్ రెస్ట్ తీసుకుని అజిత్ మళ్లీ షూటింగ్ పూర్తి చేశాడని యూనిట్ సభ్యులు చెప్పారు. ఆ రోజు షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారట. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అజిత్ కి వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో వచ్చే వారంలో మొదలు అవుతుందట.
సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సోలో బతుకే సో బెటర్'. కానీ, ఇది సోలో హీరోయిన్ సినిమా కాదు గురూ! ఇందులో నభా నటేష్ ఒక్కరే హీరోయిన్, ఆమె ఒక్కరే అందమైన అమ్మాయి అనుకుంటే పొరపాటే. నభాతో పాటు చాలామంది అందమైన అమ్మాయిలు సినిమాలో ఉన్నారట. అందులో నజియా  డేవిడ్‌స‌న్‌ ఒకరు. ఇంతకుముందు ఈ అమ్మాయి అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను'లో కూడా నటించింది. అందులో అఖిల్ గాళ్‌ఫ్రెండ్‌గా కనిపించింది. ఇప్పుడు 'సోలో బతుకే సో బెటర్'లో సాయి తేజ్ గాళ్‌ఫ్రెండ్‌ కావాలని ప్రయత్నించే అమ్మాయిగా కనిపిస్తారని టాక్. హీరోకి లైన్ వేసే అమ్మాయిగా నజియా కనిపిస్తారట. అమ్మాయిలు అంటే పడని ఒక అబ్బాయి, ప్రేమలో పడకూడదని ప్రతిజ్ఞలు చేయించే ఒక అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డాడని కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది. మే 1న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
  రాజమౌళి దెబ్బకు టాలీవుడ్‌లోని టాప్ హీరోలు, మిగతా టాప్ డైరెక్టర్లు 'అబ్బా!' అంటున్నారు. అవును. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆయన రాజముళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ 2021 జనవరి 8న విడుదలవుతుందని ప్రకటించడంతో మిగతా భారీ, ప్రతిష్ఠాత్మక సినిమాలపై దాని ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. మొదట ప్రకటించినట్లు 'ఆర్ఆర్ఆర్' జూలై 30న రిలీజ్ కాకపోయినా, దసరాకైనా వచ్చేస్తుందని భావించిన ఇతర టాప్ హీరోలు తమ సినిమాల్ని 2021 సంక్రాంతికి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ అదే సంక్రాంతి సెలవులకు మారడంతో అవాక్కయ్యారనేది కాదనలేని నిజం. దీని ఎఫెక్ట్ ఆఖరుకి మెగాస్టార్ పైనా పడింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారం చేసుకొని కల్పిత కథతో, 20వ శతాబ్దం తొలినాళ్ల నేపథ్యంతో రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'ను మొదట జూలై 30న విడుదల చేయనున్నట్లు 10 నెలల క్రితమే నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తారక్, చరణ్.. ఇద్దరూ గాయాల పాలవడం, తారక్ సరసన నటించే హీరోయిన్ మారడం వంటి కారణాలతో షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం జూలైలో ఈ సినిమా విడుదలవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే 'ఆర్ఆర్ఆర్' జూలైలో కాకుండా, అక్టోబరులో దసరా సీజన్‌లో సినిమా రిలీజ్ అవుతుందని అనధికార వర్గాలు కొద్ది రోజుల క్రితం వెల్లడించాయి. దాంతో మెగాస్టార్-కొరటాల శివ ('ఆచార్య') సినిమా, పవన్ కల్యాణ్-క్రిష్ మూవీ, మహేశ్-వంశీ పైడిపల్లి మూవీ, ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమా, అల్లు అర్జున్-సుకుమార్ మూవీ నిర్మాతలు కాస్త అటూ ఇటుగా తమ సినిమాల్ని సంక్రాంతి సమయంలో తీసుకురావడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇదివరకు ఏప్రిల్ లోగా షూటింగ్ అంతా పూర్తవుతుందనీ, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు నాలుగైదు నెలల సమయం తీసుకొని, అక్టోబరులో సినిమాని విడుదల చెయ్యాలని 'ఆర్ఆర్ఆర్' దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఏప్రిల్ లోగా షూటింగ్ పూర్తయ్యే అవకాశం లేకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత ఎక్కువ సమయం పట్టేట్లు ఉందని తేలడంతో.. దసరా సీజన్ తర్వాత, మరో పెద్ద సీజన్ సంక్రాంతే కాబట్టి, అప్పుడే ఆ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చి, 2021 జనవరి 8న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సంక్రాంతి టార్గెట్ చేసుకున్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్.. ముగ్గురూ ఇదివరకే సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. దానికి తగ్గట్లుగా తమ సినిమాల షూటింగ్ షెడ్యూళ్లను ప్లాన్ చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ సినిమా 'అల.. వైకుంఠపురములో'.. రెండూ ఆ ఇద్దరు హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్లుగా నిలవడం, రెండూ కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడంతో మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాని 2020 ఆగస్టులో కాకుండా 2021 సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ సంక్రాంతికి వెళ్లడంతో, ఆయన తన సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనను విరమించుకున్నట్లు మెగా కాంపౌండ్ వర్గాలు తెలిపాయి. 'ఆర్ఆర్ఆర్' బరిలో ఉంటే, మరో సినిమా వైపు ప్రేక్షకులు చూడరనీ, ఆ సినిమాపై పోటీగా తమ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఏ హీరో కోరుకోవడం లేదనీ ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అంతెందుకు.. 'ఆర్ఆర్ఆర్'పై ఏ సినిమా పోటీకి దిగినా అది బాక్సాఫీస్ దగ్గర 'క్రష్' అయిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు తేల్చిచెబుతున్నారు. అందువల్ల 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండూ ఒకేసారి వచ్చినా బ్లాక్‌బస్టర్ అయినట్లు, 'ఆర్ఆర్ఆర్'పై పోటీకి వస్తే తమ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఏ నిర్మాతా నమ్మడం లేదు. 'ఆచార్య' సినిమా నిర్మాతలైనా అంతే. ఆ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజన్ రెడ్డితో కలిసి 'ఆర్ఆర్ఆర్' హీరో చరణ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పైగా 'ఆచార్య' సినిమాలో చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేయనున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' మూవీలో తన సన్నివేశాలు మొత్తం పూర్తయ్యాకే అతను మరో సినిమా చెయ్యడానికి వీలుంది. ఈ కారణంతో చిరంజీవి సినిమాలో చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలు తియ్యడానికి జాప్యం జరుగుతోంది. అందువల్ల 2020 దసరాకే ఈ మూవీని తీసుకువచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరైతే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? 'తెలుగుఒన్'కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు 'ఆచార్య' మూవీని 2021 మార్చిలో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అంటే రాజమౌళి సినిమా విడుదల తేదీ మారడంతో అందుకు అనుగుణంగా తన సినిమా విడుదల తేదీని మెగాస్టార్ సైతం మార్చేసుకుంటున్నారన్న మాట.  ఇదే పరిస్థితి పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్, బన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. వారి సినిమాలేవీ సంక్రాంతికి వచ్చే సాహసం చెయ్యడం లేదు. ప్రభాస్, మహేశ్, బన్నీ సినిమాలు కూడా 2021 వేసవికే వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది మేలో 'వకీస్ సాబ్'గా రావడం ఇప్పటికే ఖాయం చేసుకున్న పవన్ కల్యాణ్, క్రిష్ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమానీ ఈ ఏడాదే తీసుకురావడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫాస్ట్‌గా సినిమా తీస్తాడని పేరుపడిన క్రిష్ ఏం చేస్తాడో చూడాలి. ఇలా ఒక్క సినిమా వల్ల ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక సినిమాల రిలీజ్ షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యింది. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ చివరి నిమిషంలో వాయిదా పడితే? ఆ ఆలోచన చెయ్యడానికి కూడా టాలీవుడ్ భయపడుతోంది.
బాహుబలి కోసం రాజమౌళి మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించారు. తమిళ రచయిత మదన్ కర్కి అయితే ఆ బాహుబలి కోసం 'కిలికి' భాషను సృష్టించారు. బాహుబలిలో కాలకేయలు కిలికి భాషలో మాట్లాడారు కదా! ఇప్పుడు ఆ భాష మీద ఒక వెబ్‌సైట్ వస్తోంది. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా ఫిబ్రవరి 21న దర్శక ధీరుడు రాజమౌళి లాంఛ్ చేయనున్నాడు. ఈ వెబ్‌సైట్ ను మదన్ కర్కి రీసెర్చ్ ఫౌండేషన్ డెవలప్ చేసింది. కిలికి లాంగ్వేజ్, వెబ్‌సైట్ గురించి మదన్ కర్కి మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో 'క్లిగ్' నుండి నేను కిలికి లాంగ్వేజ్ క్రియేట్ చేశా. ఏదో ఒక రాజ్యంలోనో, ప్రాంతంలోనో కాలకేయులు ఉంటారని రాజమౌళిగారు చూపించాలని అనుకోలేదు. వాళ్లను ప్రత్యేకంగా చూపించాలని అనుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజ్ కావాలనుకున్నారు. అప్పుడు కిలికి క్రియేట్ చేశా. ఈ లాంగ్వేజ్ మీద వెబ్ సైట్ లాంఛ్ చేయడానికి రాజమౌళి కంటే బెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు? నేను హైదరాబాద్ వచ్చి, ఆయనను అడగగానే ఒప్పుకున్నారు. ఆయన పేరును కిలికి భాషలో చూసుకున్నారు. కిలికి అక్షరాలు, సంఖ్యల మీద ఆసక్తి కనబరిచారు. ఆన్‌లైన్‌లో రాజమౌళి గారు ఈ వెబ్ లాంఛ్ చేస్తారు" అన్నారు. కొత్త భాషను నేర్చుకోవాలని అనుకునేవారు శుక్రవారం కిలికి వెబ్ చుడండి.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm surrounding antibiotic-resistance. The study, Global Trends in Antibiotic Consumption 2000- 2010, according to Princeton University researchers found that worldwide antibiotic use has risen a staggering 36 per cent over the studied 10-year period. Among the 16 groups of antibiotics studied, cephalosporins, broad-spectrum penicillins and fluoroquinolones accounted for more than half of that increase, with consumption rising 55 per cent from 2000 to 2010. The study quantifies the growing alarm surrounding antibiotic-resistant pathogens and a loss of efficacy among antibiotics used to combat the most common illnesses. The report also highlights an increasing resistance to carbapenems and polymixins, two classes of drugs that have long been considered last-resort antibiotics for illnesses without any other known treatment. Overall, the study reviewed patterns, seasonality and frequency of use of antibiotics in 71 countries. "The data underscore the welcome evidence that more global citizens are able to access and purchase antibiotics. But that use is not being effectively monitored by health officials, from doctors to hospital workers to clinicians," the researchers noted. "Consequently, antibiotic use is both rampant and less targeted. That reality is driving antibiotic resistance at an unprecedented rate," researchers said. The five BRICS nations - Brazil, Russia, India, China and South Africa - have been held responsible for more than three-quarters of that surge. While India is the largest consumer of antibiotics, US accounts for the highest per capita consumption, with a rate of more than twice that of India. Source: PTI  
    Alternate healing methods for chronic pains and diseases are often considered as they provide treatment for various health issues. One such chronic problem which both men and women face are Varicose veins .This a condition where a person has dilated, tortuous and elongated veins, especially on the legs. The causes of varicose veins are mainly due to standing for long hours at work, genetic tendency, during pregnancy and due to obesity. Now there are various treatments for varicose veins. Through non-medical treatment where postural corrections and lifestyle changes are recommended, wearing suitable stockings to hold the legs and if the problem is too severe surgical treatment is also prescribed but in rare cases. Since the pain is persistent and takes time to cure, one could try Homeopathic treatment. This works very well for those who have mild to moderate cases of varicose veins.  It significantly helps to reduce pain and controls more varicosity and reduces swelling in the legs. Homeopathy is known to also help significantly in the cases where varicose leads to varicose ulcers. It is strongly recommended for all cases of varicose veins and though the dosage prescribed may be for two or three months they work well and show good results.