LATEST NEWS
మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే..   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.  మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్‌కు బయలుదేరింది. ఈ వర్గాన్ని  అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు.  ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone
వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది.  వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు.  మహిళలు జుట్టూజుట్టూ  పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది. YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు.  Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News  
  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్   బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.   తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి  గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ..  తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం   గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా..  లక్ష్మారెడ్డి వారిని  వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా  ప్రజల్లో తిరగడమే  తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు. 
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అంటే అమితమైన ప్రాణం గల వరంగల్ దగ్గర్లోని  హనుమకొండకి చెందిన యువ వీరాభిమాని నిరంజన్ గత కొంతకాలంగా  ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ (జన్యుపరమైన వ్యాధి) తో బాధపడుతు ఈ రోజు ఉదయం  తుదిశ్వాస విడిచాడు.  పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' 2 కి  సంగీతాన్ని అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S), నిరంజన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక భావోద్వేగ ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా  'OG 2' ఆల్బమ్‌ని  అభిమాని నిరంజన్‌కి  అంకితం ఇస్తున్నాను. నువ్వు శారీరకంగా మా మధ్య లేకపోయినా, ఓజీ యూనివర్స్‌లో నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయి. ఈ 'OG 2' ఆల్బమ్ పూర్తిగా నీకే అంకితం" అంటూ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ గత నెలలో నిరంజన్ ని కలిసిన విషయం తెలిసిందే. Also read: Kalki: ప్రభాస్ 'కల్కి' పై మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ   pawankalyan, thaman, sujeeth, og2
పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుండెల్లో కొలువై ఉన్న ఒక చిన్నారి అభిమాని లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ గత కొంతకాలంగా ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ, మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తెలియడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన అభిమాని ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. నిరంజన్ మృతి తన హృదయాన్ని ఎంతగానో కలచివేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించిన ఆత్మీయ క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో చావుబతుకుల మధ్య పోరాడుతున్నప్పటికీ, తనను చూడగానే నిరంజన్ ముఖంలో వెలిగిన ఆ చిరునవ్వు, ఆ కళ్లలోని ఆనందం ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. నిరంజన్ శరీరం వ్యాధితో క్షీణిస్తున్నా, అతని మనసు నిండా అపారమైన ధైర్యం, జీవితంపై ఎనలేని ఆశ ఉండేవని, అంత చిన్న వయసులో అతను చూపించిన ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనదని పవన్ కొనియాడారు. ఆ రోజు హనుమకొండ పర్యటనలో నిరంజన్‌ను పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఆ సమయంలో తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా, 'తప్పకుండా కొని పంపిస్తా' అని మాట ఇచ్చిన పవన్, చెప్పినట్లుగానే అదే రోజు సాయంత్రానికి ఒక ముద్దుల కుక్కపిల్లను నిరంజన్ చేతిలో పెట్టేలా చేశారు. అంతేకాకుండా, తాను 'OG 2' తీస్తే నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశారు. కానీ, ఆ సినిమా చూసే భాగ్యం లేకుండానే, ఆ చిన్నారి అంత త్వరగా సెలవు తీసుకోవడం పవన్ అభిమానులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. చివరి క్షణం వరకు ధైర్యంగా పోరాడిన ఆ ధైర్యవంతుడైన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ తీరని పుత్రశోకాన్ని, సుదీర్ఘ వేదనను భరించే శక్తిని ఆ భగవంతుడు నిరంజన్ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ తన సందేశంలో ప్రార్థించారు. నిరంజన్ పంచిన నిష్కల్మషమైన ప్రేమ, ఆ అమాయకపు చిరునవ్వు తన హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. https://x.com/PawanKalyan/status/2074746985425560036   Pawan Kalyan, Niranjan, OG 2, TeluguOne  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబ‌రులోనే ‘ఫౌజీ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం కేవలం అభిమానుల నిరీక్షణ మాత్రమే కాదు, దీని వెనుక ఓటీటీ ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ సినిమాలకు థియేట్రికల్ విడుదలకు ముందే వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ‘ఫౌజీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి మేకర్స్‌కు తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల డిసెంబరులో సినిమా రాకపోతే, ఓటీటీ డీల్‌ అమౌంట్ లో కొన్ని కీలక మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ మార్పుల వల్ల నిర్మాతలకు భారీగా ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఓటీటీ సంస్థకు అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ పాల్గొనాల్సిన కేవలం మూడు ప్రధానమైన యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే బాకీ ఉన్నాయి. దీంతో ఓటీటీ డీల్ దెబ్బతినకుండా ఉండేందుకు, నిర్మాణ ప‌నుల్ని మేకర్స్ వేగ‌వంతం చేస్తున్నారు. ఒకవైపు పెండింగ్ షూటింగ్‌ను పూర్తి చేస్తూనే, మరోవైపు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా నడిపిస్తున్నారు. ఆగస్టు కల్లా ప్రభాస్ తన పార్ట్ పూర్తి చేయనుండగా, డిసెంబర్ 3న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. డెబ్యూ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు.     Prabhas, Fauzi Movie, OTT Deal, TeluguOne  
   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)నాగ్ అశ్విన్ సృష్టించిన  విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' వరల్డ్ వైడ్ గా సృష్టించిన సంచలనం తెలిసిందే.  కల్కి రిలీజ్  సమయంలో భాస్ క్యారెక్టరైజేషన్, లుక్  చూస్తుంటే  ‘జోకర్’లా ఉన్నాడంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ  మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. దీంతో  టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ పై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ వివాదం నెట్టింట ఓ రేంజ్‌లో నడిచింది. తాజాగా ఈ వివాదంపై అర్షద్ వార్సీ మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   అర్షద్ మాట్లాడుతు 'ఆ చేదు అనుభవం తర్వాత నా  ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిం ది. ప్రభాస్ అభిమానుల నుండి వచ్చిన భారీ ట్రోలింగ్ తీవ్రంగా ప్రభావితం చేసింది. అందుకే ఇప్పుడు నాపై నేనే  ‘సెల్ఫ్ సెన్సార్’ (స్వీయ నియంత్రణ) విధించుకున్నాను  ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైనా ఏ క్షణంలోనైనా దేనికైనా అప్సెట్ అవ్వచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాను.  ఇప్పుడు నాకు  బాగా తెలిసిన అత్యంత ఆప్తమిత్రుల మధ్య మాత్రమే మనస్ఫూర్తిగా సరదాగా మాట్లాడుతున్నాను. కొత్తవారు లేదా పెద్దగా పరిచయం లేని వ్యక్తుల ముందు జోకులు వేయడానికి కూడా భయపడుతున్నాను. Also read: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను..అగ్ర హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఈ కాలంలో ఒక జోక్ వేయాలన్నా వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. మనం ఒక కప్పు చాయ్ తాగుతూ సాధారణంగా మాట్లాడుకుంటున్నా, ఎవరో ఒకరు ఆ కప్పును చూసి కూడా హర్ట్ అయ్యే రోజులు. నెటిజన్లు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. సమాజంలో ప్రజలు కాస్త తేలికగా ఉండటం నేర్చుకోవాలి.  సినిమాలోని క్యారెక్టర్స్ ని  కేవలం క్యారెక్టర్స్ గానే చూడాలి. ఒక నటుడి వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. ఆయన టాలెంట్‌ని  నేను ప్రశ్నించలేదు. కేవలం ఆ క్యారెక్టర్ డిజైన్ మాత్రమే తనకు నచ్చలేదని గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అర్షద్ వార్సీ బాలీవుడ్ సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ పలు రకాల రోల్స్ పోషించి అశేష అభిమానులని సంపాదించాడు. prabhas, arshad varsi,kalki 2898ad  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న క్రేజ్, హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణతో మొదలైన ఈ నట వారసత్వాన్ని మహేష్ బాబు అగ్ర స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే ప్రతిష్టాత్మక కుటుంబం నుండి మూడో తరం వారసురాలిగా వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది జాన్వీ స్వరూప్. సీనియర్ నటి, ప్రముఖ దర్శకురాలు మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్‌ల కుమార్తె అయిన జాన్వీ.. త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. తాజాగా మంజుల ఘట్టమనేని తన కూతురు జాన్వీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ క్యాజువల్ అండ్ స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా, ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ఈ ఫొటోల్లో జాన్వీ చాలా సింపుల్, స్పోర్టీ స్ట్రీట్ స్టైల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. లైట్ ఎల్లో కలర్ క్రాప్ ట్యాంక్ టాప్, దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ జోగర్ ప్యాంట్స్ ధరించి ట్రెండీగా మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె ధరించిన టాప్ పైన ఉన్న "అవుట్ ఆఫ్ మై మైండ్ ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్" అనే క్యాచీ స్లోగన్ కుర్రకారును బాగా ఆకర్షిస్తోంది. ఈ అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మంజుల ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ నోట్ కూడా రాశారు. కొన్నిసార్లు మనలా మనం చాలా ప్రశాంతంగా ఉండటం, పెద్దగా కష్టపడకుండానే సహజంగా ముఖంపై నవ్వును చిందించడం, ఉన్నది ఉన్నట్లుగా ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడంలోనే నిజమైన అందం దాగుందని ఆమె పేర్కొన్నారు. తన ముద్దుల కూతురు జాను ఎప్పుడూ ఇలాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ మురిసిపోయారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు జాన్వీ లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా నేచురల్‌గా, హీరోయిన్ మెటీరియల్‌లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. జాన్వీ స్వరూప్‌కి వెండితెర కొత్తేమీ కాదు. గతంలో 2018 లో ఆమె తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే ఈమె భవిష్యత్తులో హీరోయిన్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఇప్పుడు మంజుల స్వయంగా తన కూతురి డెబ్యూపై అధికారిక ప్రకటన చేయడంతో అందరి దృష్టి జాన్వీపై పడింది. టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పటికే ఈ మెగా ఎంట్రీ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలిగా, కృష్ణ గారి మనవరాలిగా వస్తున్న ఈ ఘట్టమనేని అమ్మాయి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.     Janvi Swaroop, Mahesh Babu, Manjula Ghattamaneni 
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ "టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్". భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ రోమాంటిక్ సింగిల్ వీడియో సాంగ్ ‘తబాహి’ విడుదలైంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధిస్తూ, బిగ్ స్క్రీన్స్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ‘తబాహి’ వీడియో సాంగ్‌లో రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సముద్రతీరంలో తీసిన అద్భుతమైన విజువల్స్, నటీనటుల మధ్య ఉన్న ఇంటెన్సిటీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయి. గతంలో ఈ సినిమా నుండి ఆడియో మాత్రమే విడుదల కాగా, ఇప్పుడు మేకర్స్ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సూఫీ తత్వవేత్త రూమి రాసిన ప్రముఖ కోట్‌తో ప్రారంభం కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరపరిచిన ఈ అద్భుతమైన మెలోడీ సాంగ్‌కు తెలుగులో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దాదాపు 500 నుండి 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుండగా తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణీ వసంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త టీజర్ ‘లేడీస్ అండ్ లేడీస్’ ఇటీవల విడుదలై, ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. ఈ టీజర్‌లో ఐదుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ సినిమాలోని బోల్డ్, యాక్షన్ ఎలిమెంట్స్ ను చూపించారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్, యశ్ సంయుక్తంగా కథను అందించారు. ఈ సినిమాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.   Toxic Movie, Tabaahi Song, Yash, Kiara Advani  
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'రాకా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో పాటు యావత్ భారతీయ సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ స్టాండర్డ్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ రెట్టింపు అయింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించిన ఒక అనూహ్యమైన వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా విడుదలైన బ్లాస్ట్, కన్నప్ప సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులలో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాల్సి ఉందట. ఈ భారీ చిత్రంలో నటించే సువర్ణావకాశాన్ని ఆమె చేజేతులా వదులుకుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు విషయానికి వస్తే, 'రాకా' చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్, వెయిట్ ఉన్న క్యారెక్టర్ కోసం దర్శకుడు అట్లీ స్వయంగా ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించారట. కథ, తన పాత్ర నచ్చినప్పటికీ, ఆమె ఈ ఆఫర్‌కు నో చెప్పాల్సి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం డేట్ల సర్దుబాటు కుదరకపోవడమే అని ఇండస్ట్రీ టాక్. ప్రీతీ ముకుందన్ నటించిన 'కన్నప్ప' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ వెంటనే వచ్చిన 'బ్లాస్ట్' మూవీ సక్సెస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఈ సినిమాల్లో కేవలం గ్లామర్ పరంగానే కాకుండా, యాక్షన్ సీన్స్‌లో కూడా అదరగొట్టి క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది. ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ల తర్వాత ప్రీతీ ముకుందన్‌కు సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో ఆమె కాల్ షీట్లు, డైరీ మొత్తం ఇరవై నాలుగు గంటలూ బిజీ అయిపోయాయి. అట్లీ అడిగిన సమయానికి 'రాకా' సినిమాకు డేట్లు కేటాయించడం ఆమెకు సాధ్యం కాలేదు. ఇంత పెద్ద ఆఫర్‌ను వదులుకోవడం బాధాకరమే అయినప్పటికీ, అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల నిర్మాతల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ భారీ పాన్-ఇండియా ఛాన్స్‌కు చాలా భారంగా నో చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అట్లీనే ఒక సందర్భంలో వెల్లడించడం విశేషం. ఇక ప్రీతీ ముకుందన్ వదులుకున్న ఆ క్రేజీ రోల్ ఇప్పుడు మరో టాలెంటెడ్ నటి ఫెమినా జార్జ్‌ చెంతకు చేరింది. అట్లీ ఈ పాత్రను ఫెమినాకు అప్పగించినట్లు క్లారిటీ ఇవ్వడంతో, అసలు ఈ సినిమాలో ఫెమినా ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుందనే క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగిపోయింది. అంతేకాకుండా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం 'రాకా' సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారట. అల్లు అర్జున్ వన్-మ్యాన్ షోతో పాటు, ఈ నలుగురు భామల గ్లామర్, పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకవైపు దీపికా పదుకోణె మెయిన్ లీడ్‌గా చేస్తుండటం, మరోవైపు అట్లీ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో 'రాకా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అధికారిక అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్ పంచుకోనుంది.     Allu Arjun, Raaka Movie, Atlee, Preity Mukhundhan, Femina George, Deepika Padukone 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న కెపాసిటీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. నడుస్తున్న సినీ చరిత్రకి సజీవ సాక్ష్యం. సూపర్ స్టార్ కృష్ణ గారు తన అద్భుతమైన నటనతో, సాహసోపేతమైన ప్రయోగాలతో కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఏలారు. ఇండియాలో అత్యధిక అభిమాన సంఘాలు గల ఏకైక హీరో కూడా. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ టాగ్ లైన్ మాదే అంటూ రికార్డుల రారాజుగా కొనసాగుతూ వస్తున్నాడు. ఇప్పుడు అదే ప్రతిష్టాత్మక కుటుంబం నుండి మూడో తరం వారసుడు మహేష్ అన్నయ్య   రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా పరిచయమవుతున్నాడు . ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జయకృష్ణ టాలీవుడ్‌లో తదుపరి సూపర్ స్టార్ లేదా 'స్టార్ మెటీరియల్' గా నిలుస్తాడా అనే ఆసక్తికరమైన చర్చ పరిశ్రమ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జయకృష్ణ కేవలం ఒక స్టార్ వారసుడిగా మాత్రమే కాకుండా, సినిమా రంగానికి కావాల్సిన పూర్తి సన్నద్ధతతో రంగ ప్రవేశం చేస్తున్నాడు. అమెరికాలో నటన, అనుబంధ విభాగాల్లో ఇంటెన్సివ్ యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకుని పక్కా ప్లానింగ్‌తో ఇండియాకి  తిరిగొచ్చాడు. ఇటీవల విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' యాక్షన్ గ్లింప్స్,  టీజర్, సాంగ్ చూస్తే జయకృష్ణలో ఉన్న ఈజీ  స్క్రీన్ ప్రెజెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లవ్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో ప్రదర్శించిన ఎనర్జీ లెవెల్స్ చూసి అభిమానులు  ఫిదా అవుతున్నారు. లుక్స్ అచ్చం బాబాయ్ మహేష్ బాబు లాగే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో వాసు బాబు అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో జయకృష్ణ కనిపించబోతున్నాడు. ఒకప్పటి  బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్‌గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండటం అంచనాలని మరింత పెంచేసింది. Also read: aamir khan: అమీర్ ఖాన్ భార్య మెడలో హైదరాబాదీ పఠానీ.. వైరల్ అవుతున్న న్యూస్  ఒక కొత్త హీరో.కి  ఇంతకంటే బెస్ట్ లాంచ్ ప్యాడ్ దొరకడం చాలా అరుదు. ఘట్టమనేని కుటుంబానికి ఎంతో కలిసివచ్చిన లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. దాదాపు 41 సంవత్సరాల క్రితం కృష్ణ గారితో అగ్నిపర్వతం సినిమా తీసిన అశ్వినీదత్, ఆ తర్వాత 1999 లో రాజకుమారుడు మూవీతో మహేష్ బాబుని  హీరోగా పరిచయం చేశారు. ఇప్పుడు అదే బ్యానర్ సెంటిమెంట్‌తో జయకృష్ణను లాంచ్ చేస్తుండటం ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, సీనియర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్ వెంకటప్పనాయుడు గా చేస్తుండటం అదనపు క్రేజ్. నరేష్, బ్రహ్మాజీ, అజయ్ లాంటి భారీ స్టార్ కాస్ట్  ఉండటం  కూడా ప్లస్ పాయింట్. ఈ నెల 30న రాబోతున్న శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణ ఘట్టమనేని వంశ ఘనకీర్తిని ఏ మేరకు ముందుకు తీసుకెళ్తాడో, టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్‌గా ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి. jaya krishna, krishna, mahesh, rameshbabu
Yash and Kiara Advani are sharing the screen in the newly first single Tabaahi from the upcoming movie Toxic: A Fairy Tale for Grown-Ups. The makers released complete video song and it gives audiences an early look at the film's visual style and the relationship between the lead characters. Zee Music Company officially released the track following a brief promotional interaction on social media involving the actors. The song explores a more intense and destructive side of romance, moving away from traditional love themes. Music director and singer Vishal Mishra explained that the track focuses on the raw and unfiltered nature of love. He noted that the music was composed specifically to match the strong, natural screen presence that the lead actor brings to his roles. Tabaahi has been released in multiple languages, including Hindi, Kannada, Telugu, Tamil, and Malayalam. While the original Hindi version was written by Raj Shekhar, the makers collaborated with popular regional lyricists like Ramajogayya Sastry and Vignesh Shivan to adapt the song.  The song and lyrics become representative of Rumi Quote used by the makers in the beginning. With each losing themselves in this bold iteration of love, the gangster drama presents itself as a solid struggle for power while rage in love is also presented brilliantly. Directed by Geetu Mohandas, the film features a large ensemble cast that includes Nayanthara, Tara Sutaria, Rukmini Vasanth, and Huma Qureshi. Toxic is produced by KVN Productions and Monster Mind Creations, and it is slated for a worldwide theatrical release on August 26, 2026.    Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సినిమాని అన్ని విభాగాల్లోను అప్ డేట్ కండిషన్ లోకి తీసుకొచ్చిన దర్శకుడు శంకర్. ప్రేక్షకుల సినీ ఆలోచన స్థాయి పెంచి, మేము సినిమా చూసాం అని గర్వపడేలా చేసిన  దర్శకుడు కూడా. మేకింగ్ పరంగా కూడా సినిమా సైతం ఊహించని విధమైన టేకింగ్ తో సినిమా యొక్క వాల్యూ పెంచాడు. భారతీయ చలనచిత్ర రంగాన్ని గ్రాఫిక్స్ వైపు, భారీ బడ్జెట్ వైపు నడిపించిన ఒకే ఒక్కడు కూడాను. 1993లో వచ్చిన 'జెంటల్‌మ్యాన్' సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, దాదాపు పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. జెంటల్‌మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన 100% బ్లాక్‌బస్టర్ విజయం టాలీవుడ్, కోలీవుడ్‌లను ఊపేసింది. ఆ తర్వాత వచ్చిన 'భారతీయుడు', 'జీన్స్', 'అపరిచితుడు', 'రోబో' చిత్రాలు కేవలం సినిమాలు కావు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ మార్చేసిన అద్భుతాలు. ముఖ్యంగా 2010లో వచ్చిన 'రోబో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹375 కోట్లకు పైగా వసూలు చేసి ఆ రోజుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మన స్క్రీన్‌పై చూపించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు శంకర్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా శంకర్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఆయన మేకింగ్ స్టైల్‌లో పాత ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన '2.0' చిత్రం ఆశించిన స్థాయిలో   మెప్పించలేకపోయింది. వసూళ్లు సాధించినప్పటికీ, శంకర్ మార్క్ ఎమోషన్ అందులో మిస్ అయిందనేది పచ్చి నిజం. ఇక ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మరింత నిరాశపరిచాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2'  డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 20% పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేక, పాతకాలపు కథనంతో సాగడం శంకర్ అభిమానులను సైతం తీవ్రంగా కలచివేసింది.  రామ్ చరణ్‌తో చేసిన 'గేమ్ చేంజర్ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులు సరికొత్త స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నరేషన్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం ఆడియన్స్ కేవలం భారీ సెట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ చూసి పడిపోవడం లేదు. బలమైన కథ, ఎమోషన్ ఉంటేనే 000 కోట్ల క్లబ్‌లో సినిమాలు చేరుతున్నాయి. కానీ శంకర్ ఇంకా 1990ల నాటి లంచగొండితనం, సామాజిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో 5G స్పీడ్‌తో దూసుకుపోతున్న ప్రేక్షకులకు శంకర్ పాత ఫార్ములా రొటీన్‌గా అనిపిస్తోంది. Also read: Lenin: టెన్షన్..టెన్షన్..టెన్షన్!  ఈ పరిస్థితులని చూస్తుంటే 'శంకర్ నుంచి ఇకపై అద్భుతమైన సినిమాలు రావడం కష్టమేనా?' అనే ప్రశ్న సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆయనను తక్కువ అంచనా వేయలేం. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలిన ఒక లెజెండరీ దర్శకుడు ఒక్క సరైన హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే శంకర్ తన పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చి, నేటి తరం ప్రేక్షకుల పల్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. విజువల్ గ్రాండ్‌నెస్ పక్కన పెట్టి, కథలో దమ్ము చూపిస్తేనే శంకర్ మళ్లీ కింగ్ కాగలరు. లేదంటే ఆయన శకం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  shankar, game changer, ram charan
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్,  అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు.  చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి.  అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా  అద్బుతమైన ఫలితాలు చూస్తారు.  30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు.  ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.  రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి.  డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ.  ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది.  దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ,  బేకరీ ఫుడ్స్,  కేక్స్, ఆయిల్ ఫుడ్స్  వంటివి తినడం వల్ల శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.   జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి,  బలాన్ని ఇస్తాయి,  ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.