LATEST NEWS
జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  
రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  
ALSO ON TELUGUONE N E W S
      -నష్టం నిజమేనా! -ఎంత నష్టం  -ప్రణబ్ కపాడియా ఏమంటున్నాడు -ధురంధర్ కి వచ్చింది ఎంత       రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.        ధురంధర్  డిసెంబర్ 5 న మన దేశంతో పాటు యూరప్, ఉత్తర అమెరికాలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. కానీ పశ్చిమాసియాలో నిషేధం విధించడంతో గల్ఫ్ మార్కెట్ లో దురంధర్ కాలు మోపలేదు.ఈ విషయంపై విదేశీ పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా మీడియాతో మాట్లాడుతు యాక్షన్ చిత్రాల్ని గల్ఫ్ దేశాల్లో ఎంతగానో ఆదరిస్తారు. దీంతో అదే కంటెంట్ తో ఉన్న దురంధర్ ని గల్ఫ్ ప్రేక్షకులు  ఆదరిస్తారని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో రిలీజ్ కాలేదు. దీంతో సుమారు 90 కోట్ల  రూపాయలు  నష్టపోయామని తెలిపాడు.     Also Read:  గత వైభవం మూవీ రివ్యూ      దురంధర్ ని పాకిస్థాన్ కి వ్యతిరేఖంగా పిక్చరైజ్ చేయడం వల్లే గల్ఫ్ దేశాలైన కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రేయిన్, తో పాటు యూఏఈ దేశాల్లో బ్యాన్ చేసినట్టుగా బాలీవుడ్ లోని అన్ని మీడియా ఛానల్స్ వెల్లడి చేసాయి. మరి ఈ లెక్కన ఆ దేశాల్లో కూడా రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.        
  మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. (Anaganaga Oka Raju)   జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'అనగనగా ఒక రాజు'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో 'రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక'ను ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అడుగడుగునా వైవిధ్యం ఉట్టిపడింది.    నాయకానాయికలు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి 'అనగనగా ఒక రాజు' చిత్రంలోని 'భీమవరం బాల్మా', 'రాజు గారి పెళ్లిరో' పాటలకు వేదికపై నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. అనంతరం అతిథులందరికీ స్వాగతం పలికి, నిజంగానే పెళ్లి రిసెప్షన్ వేడుకను తలపించారు. ఇక నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరులులా వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రికేయలు బంధుమిత్రుల్లా ఒక్కొక్కరిగా వేదికపైకి వచ్చి.. ఆ జంటను ఆశీర్వదించడం, గిఫ్ట్ కవర్ ఇచ్చి వారిని ఓ ప్రశ్న అడగటం.. ఇలా ఎంతో కొత్తగా, సరదాగా ఈ వేడుక నడిచింది.     ఈ వేడుకలో కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "ఈ నూతన సంవత్సరం 2026 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. 2024 అనేది నా జీవితంలో క్లిష్టమైన సంవత్సరం. వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ, ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ 'అనగనగా ఒక రాజు' కథ రాసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాము. ఆ సమయంలో 'అన్నా సినిమా ఎప్పుడు?' అని చాలామంది మెసేజ్ లు చేశారు. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. మీ అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాము. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇంతటి వినోదాత్మక చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే.. సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాము. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. నేను, మీనాక్షి సహా టీమ్ అందరం మనసు పెట్టి పనిచేశాం. జనవరి 14న విడుదలవుతున్న 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నాము. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను." అన్నారు.   కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "ఇది నా మూడో సంక్రాంతి సినిమా. 'అనగనగా ఒక రాజు'లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. జనవరి 14న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.   'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.  
    సినిమా పేరు: గత వైభవం న‌టీన‌టులు:  ఆషిక రంగనాథ్‌ ,దుశ్యంత్, కిషెన్ బిలగాలి, కృష్ణ హెబ్బాలే, సుధా బెల్వాడి    త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: విలియం డేవిడ్  ఎడిట‌ర్‌: అషిక్ కులిగొలి  సంగీతం: జుదా శాండీ  నిర్మాత‌:  దీపక్ తిమ్మప్ప, సుని   రచన, ద‌ర్శ‌క‌త్వం: సుని  రిలీజ్ డేట్ : జనవరి 1 ,2025      కింగ్ నాగార్జున హిట్ మూవీస్ లో ఒకటైన 'నా సామి రంగ' తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ 'ఆషిక రంగనాథ్‌'(Ashika Ranganath). చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర లో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది. రవితేజ తో చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి తో అయితే ఈ సంక్రాంతికి సందడి చేయనుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆషిక రంగనాథ్‌ సినిమాలపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే నూతన హీరో దుష్యంత్(Ss Dushyanth)తో కలిసి  'గత వైభవం' అనే మూవీతో ఈ రోజు  సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యింది. ప్రీమియర్స్ కూడా ప్రదర్శించగా మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.       కథ ఆధునిక( ఆషిక రంగనాథ్‌) ఆర్టికల్చర్ స్టూడెంట్ తో పాటు అందమైన పెయింటింగ్ లని వేయడంలో నైపుణ్యురాలు. ఈ క్రమంలో పురాతన్(దుశ్యంత్) బొమ్మ వేసి సోషల్ మీడియాలో ఉంచుతుంది. పురాతన్ ఫ్రెండ్ ఆ బొమ్మ చూసి పురాతన్ కి చెప్తాడు. గ్రాఫిక్స్ కి సంబంధించిన స్టూడియో నడిపే పురాతన్ ఒక జల్సా రాయుడు. తప్పుడు ఉద్దేశ్యంతోనే తనకి ఒక ఫిగర్ ఈజీగా పడిపోయిందని ఆధునిక కోసం వెళ్తాడు. కానీ పురాతన్ కి సంబంధించిన  రెండు  జన్మరహస్యాలని ఆధునిక చెప్తుంది. పురాతన్ కే ఎందుకు జన్మ రహస్యాలని చెప్పింది?  ఆ జన్మ రహస్యాల్లో జరిగిన కథ ఏంటి? అవి నిజమేనా? నిజమే అయితే వాటిల్లో ఆధునిక క్యారక్టర్ ఏంటి?  ఆ జన్మల్లో ఆధునిక, పురాతన్ ప్రేమించుకున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళ ప్రేమ ఫలించిందా? లేదా? మరి ఈ జన్మ పరిస్థితి ఏంటి? ఈ మొత్తం కథ కి పురాతన్ తండ్రైన ప్రముఖ సైక్రియాటిస్ట్, పుస్తక రచయిత   అయిన కృష్ణ కనాటి కి ఏమైనా సంబంధం ఉందా? ఈ విధంగా పలు కోణాలు మిళితమై ఉన్నదే  గత వైభవం చిత్ర కథ.       ఎనాలసిస్    ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడానికి  గత వైభవం లాంటి లైన్  కంటే మంచి కథ దొరకదేమో. అంతలా చిత్రం యొక్క పాయింట్ బాగుంటుంది. వందల ఏళ్ళకి పూర్వం ఒకరి ముఖాలు ఒకరికొకరు చూసుకోకుండానే కాగితాలలోని కబుర్లు  ద్వారా ప్రాణానికి ప్రాణంగా యువతి యువకులు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరే భార్యా భర్తలు అవుతారు. కానీ  తాము ప్రేమించిన వాళ్ళని తలుచుకుంటు శారీరకంగా ఒకటి కారు. ఆ తర్వాత అసలు నిజం ఇద్దరకీ తెలుస్తుంది. కానీ  విధి వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ కథ  ఎంత గొప్పదో చెప్పుకోవడానికి. పైగా ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం లో ఉన్న దున్నపోతుల పోటీ పందలైన 'కంబళీ' బ్యాక్ గ్రౌండ్.     దీంతో ఎంతో  అద్భుతమైన సినిమాగా తెరకెక్కించవచ్చు. కానీ  స్క్రీన్ ప్లే తెలియకపోవడం వల్లే 'గత వైభవం' మరుగున పడిపోయింది.సినిమా చూసీ బయటకొచ్చాక  అంత ఖర్చు పెట్టి ఇలా తెరకెక్కించారనే జాలి కూడా మేకర్స్ పై కలుగుతుంది. అర్ధం పర్థం లేని సన్నివేశాలతో, క్యారెక్టర్స్ యొక్క డిజైన్స్ తో, డైలాగ్స్ తో, స్క్రీన్ ప్లే తో ఒక రకమైన గందర గోళం నడిచింది. నడిచింది అనే కంటే వాళ్లే చేజేతులారా చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాపర్ స్క్రిప్ట్ పూర్తయ్యాకే షూట్ కి వెళతారు కాబట్టి. ఫస్ట్ హాఫ్ ప్రారంభమే పురాతన్ బొమ్మని ఆధునిక వేయడంతో ప్రారంభమయ్యింది.     ఆ విషయం తెలిసి పురాతన్ ఆ అమ్మయి తనని  ఇష్టపడుతుందనీ, శారీరకంగా కలవడానికి వెంటనే వెళ్లడం అనేది  వర్క్ అవుట్ కాలేదు. అతను అలా వెళ్ళడానికి టైం గ్యాప్ ఇవ్వాల్సింది. ఈ  కథలో పురాతన్ తండ్రి సైక్రియాటిస్ట్ కృష్ణ ఇచ్చే ట్విస్ట్ కీలకం కాబట్టి ఆ గ్యాప్ లో ఒక పేషేంట్ కి సంబంధించిన మెంటల్ కండిషన్ ని   రీసర్చ్ చేస్తున్నట్టుగా సీన్స్ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. మొదటి జన్మలో వచ్చిన దేవతల కాలం నాటి సీన్స్ , పోర్చుగల్ కాలం నాటి ఎట్మాస్పియర్ బాగున్నా సీన్స్ మాత్రం బాగోలేదు. పైగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.     వాటిల్లోని ఆధునిక, పురాతన్ ల పెర్ ఫార్మెన్స్ మాత్రం బాగున్నాయి. ఇంటర్ వెల్ లో ఎలాంటి హడావిడి లేకపోవడమే కాకుండా త్వరగా వచ్చినట్టుగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే పర్వాలేదనే స్థాయిలోనే ఉంటుందని ఒక అంచనాకి వస్తాం. ఎందుకంటే వంద ఏళ్ళ కాలం నాటి పురాతన గ్రామాలకి చెందిన విజువల్స్, దున్నపోతులతో ఆడే ప్రాచీన గ్రామీణ క్రీడ  కంబళి, అందమైన ప్రేమ ఉంటాయి. కానీ సన్నివేశాలన్నీ నిరుత్సాహ పరుస్తాయి.     మంగళ, చెన్నయ్య లు ప్రేమించుకున్న వాళ్ళమే భార్య భర్తలం అయ్యాం అని తెలుసుకునే సన్నివేశం మాత్రం సూపర్ గా ఉంటుంది. ఒకటవుదామని అనుకునే లోపే చెన్నయ్య మరణించడం కంట తడి పెట్టిస్తుంది. మంగళ, చెన్నయ్య మధ్య వచ్చే కాగితపు ప్రేమ సీన్స్, పోస్ట్ మెన్ గా పని చేసిన పాలవాడి సీన్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో  పురాతన్ తండ్రి అయిన సైక్రియాటిస్ట్ కృష్ణ  ద్వారా అనవసర గందరగోళాన్ని సృష్టించారు.     నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు      ఆధునిక, మంగళ, దేవ లోకానికి చెందిన దేవ కన్యగా, మానసిక రుగ్మతతో బాధపడే పేషంట్ గా ఆషిక రంగనాథ్‌ తన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. సినిమా అర్ధం పర్థం లేకుండా సాగుతున్నా తన పెర్ ఫార్మెన్స్ తో చివరి దాకా థియేటర్స్ లో కూర్చోబెట్టిందనడంలో నో డౌట్స్ . పురాతన్, రాక్షస జాతికి చెందిన రాక్షసుడిగా, చెన్నయ్య గా దుశ్యంత్ నటనలో పెద్దగా మెరుపులు లేవు. కాకపోతే చెన్నయ్యగా పరిణితి చెందిన పెర్ ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఇక మిగతా నటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. పాలవాడుగా చేసిన ఆర్టిస్ట్ మాత్రం తన మేనరిజమ్స్ తో మెప్పించాడు. ఇక దర్శక, రచయిత సుని మాత్రం ఆ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు.ఎంతలా అంటే కనీసం ఏ సీన్ ని ఎంత వరకు ఉంచాలి, ఆ సీన్ యొక్క ఉద్దేశ్యం ఏంటనే అవగాహన కూడా లేకుండా పోయింది. సినిమా తెరకెక్కించడం నాకు ముఖ్యం అది ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా నాకు అనవసరం అనే విధంగా స్పీడ్ గా చుట్టేశాడు. నటి నటుల నుంచి బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు బాగుండటంతో పాటు ఫొటోగ్రఫీ  ఒక రేంజ్ లో ఉంది. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మెరుపులు ఏం లేవు.     ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి కథకి దర్శక రచయిత  సుని(Simple Suni)అన్యాయం చేసాడు. బహుశా వెన్నుపోటు అంటే ఇదేనేమో.. ఆషికా రంగనాధ్ పెర్ ఫార్మెన్స్ మాత్రం హైలెట్. రేటింగ్ 2 /5                                                                                                                                                                                        అరుణా చలం 
Magic is a Marathi film produced by Raju Satyam under the banner of  TwoThree Ventures. The movie stars Jitendra Joshi and is directed by Ravindra Vijay Karmarkar. This film is set to be released on January 1st. On this occasion, the film unit met with the media. The event was graced by the President of the Maharashtra Mandal, Geeta, MLC Arun Kumar, and director Meher Ramesh, who attended as chief guests.  Subsequently, during the media interaction: Meher Ramesh said... "Raju Satyam is a very good friend of mine. Raju acted in my film ‘Veera Kannadiga’ which I did with the late Puneeth Rajkumar Garu. Since then, our friendship has continued. He has now produced the movie ‘Magic’. I saw the trailer. I found it very gripping. Raju acted in Puri Garu's films. Now he has become a passionate producer. All of Bollywood has come forward to support this film. The Marathi audience in Hyderabad also have screens. I urge everyone here to watch the ‘Magic’ movie and make it a success." Geeta, President of the Maharashtra Mandal, said... "You must have understood what ‘Magic’ is going to be like by watching the teaser and trailer. Raju Satyam Garu took a great step forward by producing this movie in Marathi. I wish for this film to come with Telugu subtitles. You would have never seen a film like this." MLC Arun Kumar said... "All the best to the producer of ‘Magic,’ Raju Satyam. The Marathi industry holds a special place in Indian cinema. Wonderful artists have emerged from there. The film ‘Magic’ is coming directly from such an industry. Even before its release, it has already won 9 international awards worldwide. The entire Hindi industry genuinely rallied together for this movie. It is a good film. This film should go into all languages, not just Marathi. This psychological thriller is releasing on January 1st. All the best to the film unit." Arvind said... "All the best to Raju Satyam Garu. The film ‘Magic’ is going to be a huge hit. Raju Satyam Garu never made films for money. Films with naturalism often come from Marathi and Malayalam. I really like Jitendra Garu's acting. This movie is coming out on January 1st. Everyone please watch it." Producer Raju Satyam said... "Many Marathi people live in Hyderabad. With the cooperation of Arun Bhaiyya, we are releasing the ‘Magic’ movie here. Thanks to Arvind for supporting me. I really liked the story narrated by Ravindra. I had the thought of which language to make this story in, but I decided to make this movie as an independent film only in Marathi. Jitendra Joshi Garu has acted wonderfully. I felt that he would rule the Indian film industry for the next 20 years. I wish our film a big hit in Marathi and Hyderabad." Jitendra Joshi said... "Telugu cinema has always been influencing Hindi cinema. Telugu directors and producers are the reason Tollywood has reached this level. The film ‘Magic’ will appeal to everyone. Our film is releasing on January 1st. Everyone please watch and support it. Raju Garu treats all of us like a family. Raju Garu said too much about me. I am a very small actor. I was very scared when I got this movie and this role. The writing in this is amazing. The character I played in it is very complex. Karan Johar, Salman Khan, Boney Kapoor, Ranveer Singh, everyone came forward and supported us. They all love Raju Satyam very much. We are happy to come to Hyderabad and promote our film. Raju Bhai is Telugu, but he settled in Mumbai. I am Marwadi, but I settled in Pune. But as artists, we receive love everywhere. I hope you support our movie." Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.    స్రవంతి రవికిషోర్: ఈ ఫిల్మ్‌ షూటింగ్ సెట్స్‌కి నువ్వు ఎక్కువగా వచ్చేవాడివి కదా? త్రివిక్రమ్: ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ ఒకేసారి రాశాను. అందుకే ఆ సెట్స్‌కి ఎక్కువగా వెళ్ళలేదు. ‘నువ్వే కావాలి’లో షుక్రియా పాట షూటింగ్, క్లైమాక్స్ చిత్రీకరణ టైంకి వచ్చాను. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి మాత్రం ఎక్కువ శాతం షూటింగులకు వచ్చాను. న్యూజిలాండ్ కూడా వెళ్లాం కదా. డబ్బింగ్ టైంలో కూడా ఉన్నాను.    స్రవంతి రవి కిషోర్ : ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్‌ని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం. నువ్వు డిక్షన్‌తో సహా డైలాగ్స్ చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ అని ఫిక్స్ అయిపోయాం.  సినిమాలోని సీన్లలో ఆయన్ను కాకుండా ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం. త్రివిక్రమ్ : అవును. ఆ 22 సీన్లు.. నాకు గుర్తుంది. నానక్ రాం గూడలో ఇంటి సెట్ వేశారు. ఫస్ట్ రోజు ప్రకాష్ రాజ్ సెట్‌కి వచ్చారు. ఆ 22 సీన్లను నెరేట్ చేస్తుంటే.. ఆయనకు అప్పుడు తెలుగు రాదు. కన్నడలోనే మొత్తం సీన్లు, డైలాగ్స్ రాసుకున్నారు.     స్రవంతి రవి కిషోర్ : ఇదొక అద్భుతమైన ప్రయాణం. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే త్రివిక్రమ్: నాకు బాగా గుర్తుంది ఏంటంటే.. నాకు మీరు మద్రాస్ నుంచి ఫోన్ చేశారు.. ‘ఓ నవ్వు చాలు’ అనే పాట గురించి చెప్పారు. పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా? ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా...   స్రవంతి రవి కిషోర్ : ఆయన అన్నింటికీ అలానే రాస్తారు. ఈ పాటను ఊటీలో షూట్ చేయాలి. అప్పుడే న్యూజిల్యాండ్ నుంచి వచ్చాం. వర్క్ అంతా నాన్ స్టాప్‌గా చేస్తున్నాం. అవతల కోటి స్టూడియోకి శంకర్ మహదేవన్ వచ్చి ఉన్నారు. నేనేమో ఇటు ఒత్తిడి చేయలేను. మనకు కావాల్సింది పాట కాదు.. మంచి పాట. ఏం చేయాలి? ఈ పాట ఆపేయాల్సి వస్తుందా? అని రకరకాలుగా అనుకున్నాను. అరేయ్.. ఆగురా.. పాట వచ్చింది అని కార్లో బయల్దేరాం. కారులోనే పల్లవి రాసుకుంటూ వచ్చాం. అందుకే ఆయన ఫైల్స్ లో పల్లవి అంతా కనిపించదు..  త్రివిక్రమ్: ఆ..ఆ.. అవును.. ఆ కురులు చీకట్లో చిక్కుకుని అని ఉంది.. దాన్ని తరువాత కంప్లీట్ చేశారు.. ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా అని..   స్రవంతి రవికిషోర్ : తను చాలా రకరకాలుగా రాసి అక్కడ పెట్టేవాళ్లు.. ఇటివ్వు అని.. వాలు జడ బాగుంది కదా? దీనితో ఎందుకు రాదు?.. గాలిపటం గగనానిదా? బాగుంది కదా? పాట అయిపోయింది కదా?.. అనేవాళ్లం. ముందు చరణం కంప్లీట్ చేశారు.. ఆ తరువాత పల్లవి పూర్తి చేశారు. త్రివిక్రమ్ : చాలా నోస్టాల్జిక్‌గా ఉంది…ఇలా వెనక్కి వెళ్తుంటే.   స్రవంతి రవికిషోర్ : ఈ పేపర్స్ యోగేశ్వర్ శర్మ తీసుకుని వచ్చి ఇస్తే..  శాస్త్రి గారు చేత్తో పట్టుకున్న కాగితాలు కదా? అని ఎంతో ఎమోషనల్ అయ్యాను.. చాలా తొందరపడ్డాడు.. త్రివిక్రమ్ : పాటలు లేటుగా ఇచ్చారు కానీ.. మనిషి ఎర్లీగా ఎళ్లిపోయారు.   స్రవంతి రవికిషోర్ : ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆర్టిస్టుగా ఎంతో అద్భుతంగా చేశారు. త్రివిక్రమ్ : మొత్తం డైలాగ్ వెర్షన్ అయిన తరువాత రెండు మూడుసార్లు రీడింగ్ తీసుకున్నారు. అంతలా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అంతలా లోపలకు ఇంజెక్ట్ చేసుకుని చేశారు.   స్రవంతి రవికిషోర్ : నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆఖరి రోజున ట్రైన్ ట్రావెల్ సీన్ చేశాం. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బయల్దేరి తిరిగి రావాలి త్రివిక్రమ్ : అంటే ఫస్ట్ సీన్‌ను లాస్ట్ తీశారా? స్రవంతి రవికిషోర్ : హా.. అవును.. ఈ రోజే ఆఖరి రోజు కదా? గుమ్మడి కాయ కొట్టేస్తున్నాం. అప్పుడే అయిపోయిందా? కిషోర్.. అని అన్నారు. మేం 85 రోజుల్లో షూట్ చేశాం. మొత్తం మూడు గంటల 14 నిమిషాల నిడివి వచ్చింది.  త్రివిక్రమ్ : ఫైనల్‌గా మూడు గంటలకు తీసుకు వచ్చారా? (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ :  మూడు గంటల తొమ్మిది నిమిషాలతో రిలీజ్ చేశాం.   స్రవంతి రవికిషోర్ : సినిమా రిలీజ్ అయినప్పుడు సుహాసిని సీన్లు ఎంత కాంట్రవర్సీ అయ్యాయ్. త్రివిక్రమ్ : మీరొక్కరే భయపడలేదు. నేను అయితే ఆ సీన్లను కట్ చేసేద్దామని అన్నాను. ఏం కాదు ఏం కాదు.. ఈ వారం రోజులు వదిలేయ్ చెప్తాను అన్నారు (నవ్వుతూ). అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా.. రాత్రి పదకొండు, పదకొండున్నరకు ఫోన్లు చేసి ప్రతీ డైలాగ్ గురించి ఫోన్ చేసి బాగుందని ఫీల్ అయి చెప్పేవారు. స్రవంతి రవికిషోర్ : నువ్వు కూడా మంచి డైలాగ్ రాస్తే అలానే చెప్పేవాడివి. గుండెలో మాట కళ్లలో చూడాలి.. అమ్మ ఆవకాయ్ అంజలి.. ఇలా మంచి డైలాగ్స్ అన్నీ కూడా ఫోన్ చేసి చెప్పేవాడివి.   స్రవంతి రవికిషోర్ : ఈ సినిమా చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సర్.. త్రివిక్రమ్ : రామానాయుడు స్టూడియోలో నాయుడు గారి ఫ్యామిలీకి ఈ మూవీని ప్రివ్యూ వేశాం. వెంకటేష్ గారి సతీమణి ఈ మూవీ గురించి మాట్లాడారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో.. ఈ మూవీ గురించి రానున్న తరాలు మాట్లాడుకుంటాయి అని అన్నారు. ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ రీ విజిట్ చేస్తారని అన్నారు. కానీ నేను అప్పుడు నమ్మలేదు. అంత దూరం నేను చూడలేదు.. మనమే రాసి ఉన్నాం కదా.. స్రవంతి రవికిషోర్ : మనం కూడా మంచి సినిమా తీశామని అనుకుంటాం. కానీ ఎంత మందికి రీచ్ అవుతుంది? ఎంత మందికి స్ట్రెస్ బస్టర్ అనేది.. త్రివిక్రమ్ : అది మనకు తెలీదు కదా. కానీ ఆమె చెప్పిందే ఇప్పుడు అందరూ చెబుతుంటారు. నేను ఆ మాటల్ని చాలాసార్లు తలుచుకుంటాను. స్రవంతి రవికిషోర్: ఈ మూవీ నిర్మాత అని చెబితే.. ఇప్పటికీ గౌరవంగా చూస్తారు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనవడికి 9 ఏళ్లు ఉంటాయి. ఆ చిన్న పిల్లాడు కూడా ఈ మూవీని పదే పదే చూస్తుంటాడట. ఇలా జనాల్ని ఎంటర్‌టెయిన్ చేశానని అనుకుంటే నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది.   స్రవంతి రవికిషోర్ : ఒక్కసారి చెప్పలేవా అనే పాటకు శాస్త్రి గారిని ఎంత ఇబ్బంది పెట్టాం..  త్రివిక్రమ్ : దారుణం కదా.. పది రోజుల తరువాత ఫస్ట్ రాసిన వర్షెన్‌ను వినిపిస్తే చాలా బాగుందని అన్నాం. తెగ తిట్టాడు మనిద్దరినీ (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ : నీ మొహం మండ.. మొదటి రోజే రాశా కదా?.. త్రివిక్రమ్ : నన్నైతే మామూలుగా తిట్టలేదు.. నువ్వూ, నీ చాదస్తం.. నువ్వు, కిషోర్ కలిసి నా దుంపతెంపారు.. స్రవంతి రవికిషోర్ : మీ ముగ్గురు అసలు ఇక్కడకు రండి.. మీకేం కావాలి..  (నవ్వుతూ) త్రివిక్రమ్ : మీకు అసలు క్లారిటీ ఉందా? అని అన్నారు (నవ్వుతూ)   స్రవంతి రవికిషోర్ : ఫస్ట్ రాసిన పల్లవిలోనే కథ అంతా ఉంటుంది.. త్రివిక్రమ్ : ఫస్ట్ నాలుగు లైన్లోనే అంతా ఉంటుంది.. చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ.. ఈ నాలుగు లైన్లే సినిమాలో వాడాం. స్రవంతి రవికిషోర్ : అన్యాయం కదా (నవ్వుతూ) త్రివిక్రమ్ : పది రోజుల తరువాత మళ్లీ అక్కడికే వచ్చాం.   స్రవంతి రవికిషోర్ : బెస్ట్ పార్ట్ ఏంటంటే?.. ఎవ్వరినీ ఉద్దేశించి అని కాదు కానీ.. ఆయన సినిమా కథని, సారాంశాన్ని, నాలుగైదు సీన్లని ఒకే పాటలో రాసేస్తారు. త్రివిక్రమ్ : పాట అక్కర్లేదు అని చెప్పే పాటల రచయిత ఆయన ఒక్కరే సార్.. స్రవంతి రవికిషోర్ : యస్.. త్రివిక్రమ్ : పాట రాస్తే డబ్బులు వస్తాయ్ కదా.. కానీ ఆయన అలా కాదు.. ఇక్కడ పాట పడదు అని చెప్పేస్తారు (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ : అవును.. నాకు పాట రాసేందుకు నాలుగు రోజులు కేటాయించి.. షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.. ఆ తరువాత పాటకు ఇక్కడ స్పేస్ గానీ అవసరం గానీ లేదు అని అన్నారు. త్రివిక్రమ్ : ఆయన ఈ వృత్తిని చాలా సీరియస్‌గా కాదు.. డివైన్‌ క్రోషన్‌గా తీసుకున్నారు.. స్రవంతి రవికిషోర్ : ఒక్క విషయం శ్రీను.. ఆయన మన కోసం పాట రాయరు.. ఆయన తృప్తి చెందితేనే కానీ పాట ఇవ్వరు.. త్రివిక్రమ్ : పట్టుకెళ్లడం కుదరదు.. ఆ ఇంటి నుంచి పేపర్ రాదు (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ : రాస్తా రాస్తా.. పాడుతూ.. నా వైపు చూసి నాకు తెలుసులే అని పేపర్ తిప్పేసేవారు.. మేం ఇద్దరం కలిసి దాదాపు 400 రాత్రులు గడిపి ఉంటాను.. నాకు ఆయన 89 పాటలు రాశారు.. ప్రతీ రాత్రి ఆయనతోనే ఉండేవాడ్ని. నాకు ఆయనతో అంత సమయం గడిపే అవకాశం రావడం నా అదృష్టం.. త్రివిక్రమ్ : అవును.. చాలా చాలా సమయం గడపగలిగారు..   స్రవంతి రవికిషోర్ : ఓ చిన్న ఉదాహరణ ‘గౌరి’ అనే సినిమాకు నాకు ఆయన పాట రాశారు.. ఆ పాట మా అందరికీ ఓకే. కానీ వాయిస్ మిక్సింగ్‌లో ఎవరే అనే పదం వద్ద కోటి ఇబ్బంది పడ్డారు. నేను అడ్జస్ట్ చేసుకుంటానులే శాస్త్రి గారు అని కోటి గారు అన్నారు. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. నేను రాసుకొస్తాను అని వెళ్లి మూడు రాత్రులు కష్టపడ్డారు. ఎవరే అనే పదంతో ఎండ్ చేయాలని ఆ పాటను మళ్లీ రాశారు. మహానుభావుడు.. ఆ పాట అద్భుతంగా ఉంటుంది.   త్రివిక్రమ్ : ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు’ అనే పాటను చాలా రోజులు రాశారు. ఆ ఒక్క పాటే ఆయన్న చాలా రోజులు రాశారు. మిగతావన్నీ చాలా ఫాస్ట్‌గా రాశారు. స్రవంతి రవికిషోర్ : మరి సినిమా అంతా ఆ పాటలోనే చెప్పాలి కదా. మిగతా ట్యూన్స్ అన్నీ అయిపోయాయి. క్లైమాక్స్‌ను మనం రకరకాలుగా మార్చాం. త్రివిక్రమ్ : అవును.. 35 రోజులు కొట్టుకుని.. చివరకు మీరే విజయం సాధించారు కదా (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ : వేమూరి సత్యనారాయణ, పేకేటి రంగా గారు చాలా గొప్ప వ్యక్తులు. యూత్ సినిమా చేస్తున్నావ్ కరెక్టే.. కానీ పెద్ద వాళ్లు కూడా ఈ మూవీని చూడాలి కదా? అని వారు అన్నారు. నువ్వు నాకు పాయింట్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అయితే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కూడా కావాలి కదా అని అనుకున్నాను. త్రివిక్రమ్ : మీరు చెప్పినప్పుడు నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే .. నేను మీకు ముందు చెప్పిన పాయింట్ అదే కదా? అది నచ్చే కదా సినిమాను స్టార్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఆ పాయింట్‌నే మార్చితే ఎలా? మిగతా సీన్లన్నీ మార్చినప్పుడు మేం వ్యతిరేకించలేదు.. ఈ ఒక్కటి అలానే పెట్టాలని ఎందుకు అంటున్నాం.. అది నాకు స్ట్రయిక్ అయింది.. అప్పుడు విజయ భాస్కర్ గారితో చర్చించాను.. మనం ఎంత టఫ్‌గా మాట్లాడిన సరే.. ఆయన వాదనలో నిజం ఉంది.. అని అన్నారు.. అందుకే నెక్ట్స్ డే వచ్చి మార్చి రాశాం మళ్లీ. స్రవంతి రవికిషోర్ : ‘కళ్లలోకి కళ్లు పెట్టి’ అనే పాటను ముందుగా బాలుగారు పాడారు మీకు గుర్తుందా? త్రివిక్రమ్ : నాకు గుర్తు లేదు సర్ స్రవంతి రవికిషోర్ : భాస్కర్ గారు అది బాగుందని అన్నారు. ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుందని నేను అన్నాను. త్రివిక్రమ్ : చిత్ర గారిదే బాగుంటుంది.. నేను ఆమె పాడిన పాటే విన్నాను. స్రవంతి రవికిషోర్ : చెన్నై నుంచి క్యాసెట్ వచ్చింది. ఆ పాట తరుణ్ విని ఏడ్చేశాడు.   స్రవంతి రవికిషోర్ : చిత్ర గారు పాడుతూ.. ఇది స్రవంతి పాట కదా? క్లైమాక్స్ పాట కదా? అని అనేవారు.. దిల్ రాజు కూడా మన  క్లైమాక్స్ పాటల గురించి మాట్లాడేవారు. త్రివిక్రమ్ : మీ పాటలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ‘సంతోషం’ క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది. ఎంతో మందికి దారి చూపించింది.  స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ కావాలి సినిమాలోని క్లైమాక్స్ పాట కూడా బాగుంటుంది.. ఆ పాటకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు.. త్రివిక్రమ్ : అవును… స్రవంతి అంటే పాటలే కదా..   స్రవంతి రవికిషోర్ : నేనేదో ప్యాషన్‌తో సినిమాలోకి రాలేదు. కానీ ‘లేడీస్ టైలర్’తో నాకు సీతారామశాస్త్రి గారు, తనికెళ్ల భరణి గారు, అనుమోలు హరి, ఇళయరాజా గారు, వంశీ, వేమూరి సత్యనారాయణ వంటి గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. దీన్ని విడిచి పెట్టి ఎలా వెళ్తాను? అలా నాకు సినిమాల మీద ప్రేమ, ఇష్టం ఏర్పడింది. ‘నువ్వే కావాలి’తో ఉన్న అప్పులు తీర్చుకున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్’తో ఇల్లు కొనుక్కున్నాను. అప్పటి డబ్బులు దాచుకుంటే వందల కోట్లు అయ్యేది. కానీ ఇంకో సినిమాని తీసేందుకు డబ్బులుంటే చాలని అనుకున్నాను. కాబట్టి నాకు నో రిగ్రేట్స్. త్రివిక్రమ్ : ఒక్కోసారి ఎలా జరుగుతుందో మనకే తెలీదు. ఈ కథని రాసేందుకు చాలా కష్టపడ్డాం. మీరేమో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. చేతిలో కథ లేదు. వెంకటేష్ గారు కూడా ఎప్పుడూ కథ ఎక్కడి వరకు వచ్చింది అని అడగలేదు. అలా అడిగితే ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాను అని ఆయనకు తెలుసు (నవ్వుతూ). అలా ఓ నెల రోజుల పాటు విజయ భాస్కర్ గారు , నేను చాలా శ్రమించాం. స్రవంతి ఆఫీసులో వెళ్లి కూర్చుండేవాళ్లం. ఓ సారి నాకు ఓ కలలా కథ వచ్చింది. హీరోయిన్ ఉండే వీధిలోకి హీరో, అతని తండ్రి వస్తాడు. హీరోకి తల్లి ఉండదు. ఓసారి హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్‌కి ఎంగేజ్మెంట్ జరిగిపోతోంది. అదే వారిద్దరి తొలి పరిచయం. మామూలుగా అయితే హీరో, హీరోయిన్ మధ్యలో ఎవరో వచ్చి ప్రీ క్లైమాక్స్‌లో ఎంగేజ్మ్ంట్ చేసుకుంటారు. అదే ఇందులో కొత్తగా ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్‌తో ప్రేమ అని అనుకున్నాం. అది కూడా సమాజ కట్టుబాట్లు, హద్దుల్లోనే ఉండాలని అనుకున్నాం. అలా ఐడియా వచ్చింది. ఆ ఐడియా వచ్చిన 15 రోజులకే కథ మొత్తం సెట్ అయింది. పాయింట్ అనుకున్నప్పుడు ఉన్న కథకి, చివరకు వచ్చిన కథకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. కాలనీ ఒకటి అని లేదు.. వాళ్ల ఫాదర్, వీళ్ల ఫాదర్ ఫ్రెండ్స్ అయ్యారు.. స్రవంతి రవికిషోర్ : ఎంగేజ్మెంట్ అనే పాయింట్ మాత్రమే ఉంది.. త్రివిక్రమ్ : అదొక్కటే ఉంది.. మిగతావన్నీ మారిపోయాయి స్రవంతి రవికిషోర్ : నిజంగానే ఇది కత్తి మీద సాము. ఎక్కడా కూడా హద్దులు దాటలేదు. త్రివిక్రమ్ : అసలు కథ ఇంత ఫాస్ట్‌గా అవుతుందా? అని అనుకున్నాను. కానీ, వెంటవెంటనే అయిపోయింది..   స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ అక్టోబర్‌లో రిలీజ్ అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత నువ్వు భీమవరం వెళ్లిపోయావు.. ఆ హడావిడిలోనే నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించాం. ‘నువ్వే కావాలి’ వంద రోజుల ఫంక్షన్‌కి మేం ఇక్కడ లేం. నేను, విజయ భాస్కర్ కలిసి ఫిబ్రవరిలో ఆల్రెడీ పియానో సాంగ్ రికార్డింగ్ చేసినట్టున్నాం..   త్రివిక్రమ్ : ఆశా షైనీ కారెక్టర్ రావడానికి ఓ కారణం ఉంది. వెంకటేష్ గారికి కథ మొత్తం చెప్పిన తరువాత.. కథ అంతా బాగుంది.. నాకేం మార్పులు లేవు.. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను. సినిమా అంతా ఒకే ప్లేస్‌లో జరుగుతోంది.. ఈ కథను ఏమైనా కాస్త బయటకు తీసుకెళ్లొచ్చా? అలా అని కథలోని ఎస్సెన్స్ మారకూడదు.. ఏమైనా చేయగలవా? అని అన్నారు. అప్పుడు ఊటికి వెళ్తే ఎలా ఉంటుంది? అని అనుకున్నాను. ఊటికి అంటే.. ముందే ఆ అమ్మాయిని పరిచయం చేయాలి. అలా ఊరికే పరిచయం చేయడం ఎందుకు? ఓ పాట ఉంటే బాగుంటుంది కదా? అని అనుకున్నాం. అలా ఆ కారెక్టర్‌తో ఫస్ట్ హాఫ్‌లో ‘ప్రియతమా’ అనే పాట, సెకండాఫ్‌లో ‘ఓ నవ్వు చాలు’ అనే పాట వచ్చింది. విజయ భాస్కర్ గారికి ఆరు పాటలు ఉండాల్సిందే (నవ్వుతూ) స్రవంతి రవికిషోర్ : అందులో ఓ పాట భువనచంద్ర గారు రాయాల్సిందే (నవ్వుతూ) త్రివిక్రమ్ : వాళ్లిద్దరిదీ ఆర్మీ కనెక్షన్ కదా (నవ్వుతూ) శాస్త్రి గారు కూడా ఇది భువనచంద్ర పాటే కదా? అని అన్నారు (నవ్వుతూ).. ప్రియతమా అనే పాటను భువనచంద్ర గారు రాశారు కదా   స్రవంతి రవికిషోర్ : కోటి గారు మంచి సంగీతం ఇచ్చారు. సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. నేను, భాస్కర్ కలిసి రామానాయుడులో ఆర్ఆర్ పనులు చూసుకున్నాం. ఏదో తేడా కొడుతోందని భయపడ్డాను. త్రివిక్రమ్ : ఆ రోజు నేను కూడా వచ్చాను.. అర్దరాత్రి వరకు కూర్చున్నాను. స్రవంతి రవికిషోర్ : ఆ రాత్రి ఏం తేలకపోయే సరికి సినిమా కోసం కొన్న  ప్రకాష్ రాజ్ కారుని తీసుకుని విజయవాడ హైవే ఎక్కేశా.. ఆర్ఎఫ్‌సికి వెళ్లిన తరువాత గుర్తుకు వచ్చి మళ్లీ రిటర్న్ అయ్యా.  త్రివిక్రమ్ : ఆ తర్వాత రోజు నేను కూడా వచ్చాను.. ప్రతీ సీన్‌ను మళ్లీ చూసాం .. ఆయన పక్కన ఎవరో అసిస్టెంట్ కూడా ఉండేవాడు.. స్రవంతి రవికిషోర్ : మన జీబూ.. త్రివిక్రమ్ : హా.. జీబూ.. ఆయన కన్సోల్ వదిలి బయటకు వెళ్లేవారు.. కోటి గారు చాలా కష్టపడ్డారు.. స్రవంతి రవికిషోర్ : కోటి ప్రాణం పెట్టి చేశారు.. త్రివిక్రమ్ : కోటి గారు ఎంత పెద్ద వారో నాకు అప్పుడు తెలిసేది కాదు.. ‘నువ్వే కావాలి’ అప్పుడు నేను చాలా యంగ్. నా ఒపీనియన్‌ను చెప్పినా ఫీల్ అయ్యేవారు కాదు. ఏదో చిన్న పిల్లాడు అని అనుకునేవాడు. స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే నువ్వే’ టైంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి.. త్రివిక్రమ్ : ఇలాంటి విచిత్రకరమైన వంటకం నేనెప్పుడూ తినలేదని అన్నారు.. హారతి సంఘటన గుర్తుందా? ఫైర్ అలారమ్ వచ్చింది.. పోలీసులు కూడా వచ్చారు.. స్రవంతి రవికిషోర్ : తరుణ్  సాంబ్రాణి పుల్ల అంటించాడు స్విట్జర్లాండ్ హోటల్ లో ./ చాలా డబ్బులు కట్టాం.. త్రివిక్రమ్ : నాకు గుర్తుంది (నవ్వుతూ) చాలా కాస్ట్ లీ భక్తి అని అన్నారు.. పొద్దున్నే స్నానం చేసి టవల్ కట్టుకుని పూజ చేశాడు.. స్రవంతి రవికిషోర్ : నేను చాలా భక్తితో పూజ చేశాను అని మళ్లీ చెప్పాడు (నవ్వుతూ)   స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ స్క్రిప్ట్ చెప్పినప్పుడు పెళ్లి టైంలో ఇంటికి కలర్స్ వేసే సీన్ ఒకటి చెప్పావు . అక్కడి నుంచే ‘ఆకాశం దిగి వచ్చి’ అనే పాట పుట్టింది. ఆ పాటని శాస్త్రి గారు 8 రోజులు రాశారు. త్రివిక్రమ్ : ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని పాటలన్నీ రాసినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. ‘ఓ నవ్వు చాలు’ పాటకి మాత్రం లేను. ఆయనతో అలా రాత్రి పూట కూడా కూర్చుండేవాడిని. విజయ భాస్కర్ మాత్రం రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు నిల్చుని పడుకునేవారు. భాస్కర్ నీ కళ్లేంటి? అలా ఎర్రగా అయ్యాయ్.. వెళ్లి పడుకో అని శాస్త్రి గారు అనేవారు (నవ్వుతూ)   స్రవంతి రవికిషోర్ : మాకు ఎప్పుడూ మూడ్ బాగా లేకపోయినా సినిమాని చూస్తాం.. ఇది మాకు స్ట్రెస్ బస్టర్ సార్ అని అంతా అంటుంటారు.. త్రివిక్రమ్ : ఆ క్రెడిట్ అంతా వెంకటేష్ గారికే. కథ చెప్పిన వెంటనే మీతో ఆయన వచ్చి మనం చేసేస్తున్నాం కిషోర్ అని అన్నారు. క్యారెక్టర్ బేస్‌డ్ సినిమా అని, రెండు మూడుసార్లు డైలాగ్ వర్షెన్ చెప్పించుకున్నారు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆయన కాబట్టి ముందుకు వచ్చి అలా చేసినట్టుగా అనిపిస్తుంది. స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారికి కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది.. త్రివిక్రమ్ : సినిమాలో ట్విస్టులు ఉండవు.. కమర్షియల్ అంశాలుండవు.. చాలా ఫ్లాట్‌గా ఉంటుంది.. కానీ కథ చెప్పినప్పుడే ఆయన సినిమాని చూసేశారు. స్రవంతి రవికిషోర్ : వెంకటేష్ గారు సెట్‌లో వేరే సీన్ జరుగుతుంటే.. అలా మేకప్ రూంలో ఉండేవారు. నా షాట్ ఎప్పుడు? నేను ఎప్పుడు రావాలని అడిగేవారు కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవారు.    త్రివిక్రమ్ : నేను మొదటిసారిగా ఈ మూవీ కోసం బ్రహ్మానందం గారికి ఎక్కువ ట్రాక్ రాశాను. చివర్లో ట్విస్ట్ కూడా వస్తుంది. స్రవంతి రవికిషోర్ : నేను తీసిన ఫోటో వల్ల పెళ్లి కొడుకు మారాడా? (నవ్వుతూ) త్రివిక్రమ్ : విజయ భాస్కర్ గారికి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. నేను పేపర్ మీద రాసినప్పుడు అది చాలా ఫ్లాట్‌గా ఉండొచ్చు. కానీ ఆయన దాన్ని పసిగట్టేవారు. స్రవంతి రవికిషోర్ : స్క్రిప్ట్ ఇచ్చిన తరువాత 25 రోజులు రిహార్సల్స్ చేసుకునేవారు.. రాయడం కాదు.. త్రివిక్రమ్ : మీటర్ సెట్ చేసుకోవడానికి.. ఆయన లేకపోతే ఆ హ్యూమర్ అంతగా వచ్చేది కాదు.. ఆయనకి ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ వల్లే అంత బాగా వచ్చింది. ఇది ఆయనది.. అది నాది అని అందుకే ఇందులో తూకం వేసి చెప్పలేం. అల్లసాని పెద్దన చెప్పినట్టుగా మనం చెప్పేదాన్ని అర్థం చేసుకుని శభాష్ అనే శ్రోత ఉండాలి. ఇలా ఈ టీం ఇంత బాగా కలిసి వచ్చింది కాబట్టే సినిమా అంత గొప్పగా వచ్చింది.   స్రవంతి రవికిషోర్ : ఆర్తి అగర్వాల్, సుహాసిని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. వెనకాల నుంచి వెంకటేష్ వినే సీన్‌ను మీరు తీసేద్దామని అనేవారు గుర్తుందా? త్రివిక్రమ్ : మామూలుగా అయితే నిర్మాతలు అలా తీసేయమని అంటారు.. దర్శక, రచయితలు ఉంచమంటూ పోరాడతారు. కానీ ఇందులో రివర్స్. నేను తీసేద్దామని అంటే.. మీరేమో పెడదామని అంటారు. సినిమా రిలీజ్ చేసిన మొదటి రోజు సంతాప సభలో ఉన్నట్టుగా అనిపించింది. ఆ రోజు సినిమా చూసి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నేను తప్పు చేశా.. నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుండేది అని అన్నా.. నేనేం మాట్లాడుతున్నానో మా అమ్మకి అర్థం కాలేదు. ఆ టైంలోనే మీరు ఫోన్ చేసి హైదరాబాద్‌కి రమ్మన్నారు. స్రవంతి రవికిషోర్ : శాంతి థియేటర్‌కు తీసుకెళ్లాను.. త్రివిక్రమ్ : అప్పుడు అక్కడ పది మందే ఉన్నారు.. అప్పుడు నేను ఇంకా బెంబేలెత్తిపోయాను. ఆ పది టికెట్లు అమ్ముడు పోయాక హౌస్ ఫుల్ బోర్డు పడింది. అప్పుడు నేను కొంచెం కుదుటపడ్డాను. ధైర్యంగా అనిపించింది. డోర్ వద్ద నిల్చుని ఆడియెన్స్ రియాక్షన్ చూడమని అన్నారు. సినిమా బాగానే ఉందని అనుకుని ఆ రోజు రాత్రి కాస్త నిద్రపోయాను.    స్రవంతి రవికిషోర్ : ‘నువ్వే కావాలి’ రిలీజ్ అప్పుడు అమెరికా నుంచి మా మామయ్య ఫోన్ చేశారు. రెండు వారాలే అని అన్నారు. సినిమా బాగా లేదని నాతో చెప్పలేరు.. (నవ్వుతూ) త్రివిక్రమ్ : కానీ అది ఆడుతూనే ఉంది.. వన్ ఇయర్ ఆడింది.. నేను భీమవరంలో సినిమా చూశాను. గేట్ కీపర్ అయితే ఈ మూవీ కష్టం సార్ అని అన్నాడు. అలా షాక్‌లో నేను నడుచుకుంటూ వెళ్లాను. అక్కడే 300 రోజులు ఆడింది. మళ్లీ అదే గేట్ కీపర్ ‘నేను మీకు ముందే చెప్పాను కదా సర్’ అని అన్నాడు. స్రవంతి రవికిషోర్ : ఏంటి.. కష్టం సార్ అని అన్నవాడేనా? త్రివిక్రమ్ : హా అవును.. కానీ నాకు గుర్తుంటుంది కదా.. విన్నది నేను.. (నవ్వుతూ).. కొన్ని సినిమాలు డబ్బులు తీసుకొస్తాయి.. కొన్ని సినిమాలు పేరుని తీసుకొస్తాయి.. గౌరవం మాత్రం కొన్ని సినిమాలే తీసుకొస్తాయి.. స్రవంతి రవికిషోర్ : ఇందాక నేను చెప్పింది అదే.  
It has been 25 years since the release of Nuvvu Naaku Nachav, produced by Sravanthi Ravi Kishore under Sri Sravanthi Movies, directed by K. Vijayabhaskar, starring Victory Venkatesh and Aarthi Agarwal. Trivikram Srinivas provided the story and dialogues, while Koti composed the music. The film, which became a cult classic, is being re-released on January 1 as a New Year special. On this occasion, producer Sravanthi Ravi Kishore and writer–director Trivikram shared memories of the film and its journey. Sravanthi Ravi Kishore: Revisiting the wonderful memories and the incredible journey of Nuvvu Naaku Nachav after so many years makes me very happy. Trivikram: Me too. Sravanthi Ravi Kishore: You used to come to the shooting sets quite often, right? Trivikram: I was writing Nuvve Kavali and Chirunavvutho simultaneously, so I couldn’t visit those sets much. I went to Nuvve Kavali during the “Shukriya” song shoot and the climax. But I was present for most of Nuvvu Naaku Nachav shoots. We even went to New Zealand together. I was there during dubbing as well. Sravanthi Ravi Kishore: You were supposed to direct Nuvve Nuvve next, right? Trivikram: Yes. That’s why I was involved in everything for Nuvvu Naaku Nachav. Sravanthi Ravi Kishore: Back then, you’d write a script version and narrate the dialogue version to the director and producer. We didn’t just hear what you wrote—we saw it. Trivikram: There was another room next to my writing room. We all used to sit there together. Sravanthi Ravi Kishore: We couldn’t imagine anyone other than Prakash Raj for the heroine’s father. Once you narrated the dialogues with diction, it was fixed. Trivikram: Yes. Those 22 scenes—I remember them clearly. The house set was in Nankramguda. On the first day Prakash Raj came to the set, he didn’t know Telugu then. He wrote all his scenes and dialogues in Kannada. When Suhasini garu entered and asked, “Is he a good man or a bad man?”, you replied, “Maniratnam!” (laughs). What I wrote was, “Good man or bad man? A husband is just that.” But you said, “Good man or bad man? Maniratnam.” I burst out laughing and had to step outside. Sravanthi Ravi Kishore: It was an amazing journey. No matter how much we talk about Sirivennala Seetharama Sastry garu, it’s never enough. Trivikram: I clearly remember—you called me from Madras about the song O Navvu Chalu. “Can anyone see night in broad daylight?”—those lines. Sravanthi Ravi Kishore: That’s how he wrote everything. We had to shoot the song in Ooty. We had just returned from New Zealand and were working non-stop. Shankar Mahadevan was at Koti’s studio. I couldn’t pressure anyone. We didn’t want just a song—we wanted a good song. Then suddenly—“Wait! The song is here!”—and we rushed in the car. He wrote the pallavi while traveling. That’s why the pallavi isn’t fully seen in his files. Trivikram: Yes—“Those curls stuck in the darkness…” He later completed it as “Will you die if I don’t show those curls?” Sravanthi Ravi Kishore: The best part is—we followed every single line he wrote. He never just brought one line and called it a song. Trivikram: Even one line would excite us—one line per day! (laughs) Sravanthi Ravi Kishore: He’d write many options and place them there. “Isn’t ‘that braid’ good?” “Isn’t ‘a kite in the sky’ good?” We’d say, “The song is done!” He completed the first stanza first, then the pallavi. Trivikram: This is all so nostalgic. Sravanthi Ravi Kishore: When Yogeshwar Sharma brought those papers, knowing Sastry garu had held them—it made me emotional. He left us too early. Trivikram: He delivered songs late—but left this world early. Sravanthi Ravi Kishore: Venkatesh’s contribution is huge. As an artist, he was extraordinary. Trivikram: After the dialogue version was ready, he did two or three readings. He immersed himself completely. Sravanthi Ravi Kishore: On the last day, we shot the train travel scene—from Hyderabad to Nalgonda and back.     Trivikram: So the first scene was shot last? Sravanthi Ravi Kishore: Yes. He said, “Is it over already, Kishore?” We shot for 85 days. The first cut was 3 hours 14 minutes. Trivikram: You brought it down to 3 hours? (laughs) Sravanthi Ravi Kishore: Released at 3 hours 9 minutes. Sravanthi Ravi Kishore: Suhasini’s scenes created controversy on release. Trivikram: You weren’t scared at all. I suggested cutting them. You said, “Let it run for a week.” Landlines those days—calls at 11 or 11:30 at night, praising every dialogue. Sravanthi Ravi Kishore: You did the same when I wrote good dialogues—“Truth should be seen in the eyes,” “Mother’s mango pickle,” and so on. Sravanthi Ravi Kishore: It’s been 25 years now. Trivikram: 24 or 25? Sravanthi Ravi Kishore: Silver Jubilee was on September 6. Sravanthi Ravi Kishore: This film is a stress-buster for many.     Trivikram: During a preview for Ramanaidu garu’s family, Venkatesh’s wife said: “Just like we talk about Gundamma Katha and Missamma today, future generations will talk about this film.” I didn’t believe it then. Today, everyone says the same. Sravanthi Ravi Kishore: Even now, when I say I produced this film, people look at me with respect. Even a 9-year-old watches it repeatedly. That gives me immense satisfaction. Trivikram: Some films bring money. Some bring fame. Only a few bring respect. This is one of those films.   Sravanthi Ravi Kishore: That respect still exists today. Trivikram: This film gave us lasting relationships and unforgettable memories. Sravanthi Ravi Kishore: Even your marriage happened because of this film! Trivikram: Let’s save that story for television! (laughs) Sravanthi Ravi Kishore: Relationship humor! (laughs) Trivikram: Only Sastry garu, you, and I know that conspiracy angle. Let’s not discuss it here. Love you, sir. Thank you. Sravanthi Ravi Kishore: Thank you   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు.   శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి దంపతులు మోహన్ లాల్ నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం తెలుపుతున్నారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.    Also Read: మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!   శాంతకుమారి, విశ్వనాథన్ నాయర్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మోహన్‌లాల్. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వనాథన్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. మోహన్‌లాల్ సోదరుడు కూడా 2000లో గుండెపోటుతో మృతిచెందారు.   
Following the positive reception of its initial teaser, the team behind the upcoming family entertainer Om Shanti Shanti Shantihi has unveiled their first single, "Sinnari Koona. Starring Tharun Bhaskar and Eesha Rebba, the film is directed by AR Sajeev and produced by the collective team behind 35, including Srujan Yarabolu and Vivek Krishnani.  This latest track, composed by Jay Krish, offers an incredibly grounded and authentic look at the early stages of married life from a woman’s perspective. The song’s lyrics, penned by Bharadwaj, resonate deeply as they encourage the protagonist to maintain her identity while navigating a new domestic world.  Eesha Rebba delivers a standout performance, portraying the nuances of a newlywed with remarkable sincerity. Her rapport with Tharun Bhaskar is a highlight, as they convincingly capture the dynamic of two distinct personalities learning to live as one. Director AR Sajeev deserves credit for maintaining a naturalistic tone that sets this project apart. With vocals by Ananya Bhatt, MG Narasimha, and Jay Krish, the song has effectively heightened anticipation for the movie's theatrical debut. Distributed and promoted by Rana Daggubati’s Spirit Media, Om Shanti Shanti Shantihi is scheduled to arrive in cinemas on January 23, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Venkatesh) కలిసి చిందేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదలైంది. (Mana Shankara Varaprasad Garu)   చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ గా మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చింది. (Mega Victory Mass Song)   చిరంజీవి, వెంకటేష్ లపై చిత్రీకరించిన పార్టీ సాంగ్ ఇది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందరూ కాలు కదిపేలా ఎనర్జిటిక్ గా ఉంది. "మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైన్టీ.. ఎవడైతే ఏంటి" అంటూ క్యాచీ లిరిక్స్ తో అందరూ పాడుకునేలా పాటను రాశారు కాసర్ల శ్యామ్. "ఏంది బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి..." వంటి లైన్స్ ఫ్యాన్స్ హమ్ చేసుకునేలా ఉన్నాయి. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగా సింగర్స్ నాకాష్ అజిజ్, విశాల్ దద్లాని ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు.   ఇక లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి వైబ్ కి తగ్గట్టుగా ఇద్దరూ పంచెకట్టుతో కనిపించడం అదిరిపోయింది. మెగా, విక్టరీ ఫ్యాన్స్ కి ఈ సాంగ్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.    
The long-awaited collaboration between Megastar Chiranjeevi and Victory Venkatesh has finally materialized, sending ripples of excitement through the Telugu film industry. Directed by the visionary Anil Ravipudi, the Mega Victory Mass Song serves as a high-octane tribute to two of cinema's most enduring icons.  This musical spectacle from Mana Shankara Vara Prasad Garu captures a rare synergy, blending the sophisticated grace of the Megastar with the infectious, vibrant energy that defines Venkatesh’s screen persona. Nakash Aziz and Vishal Dadlani have sung the song with lyrics written by Kasarla Shyam.  Composer Bheems Ceciroleo has crafted a rhythmic powerhouse that perfectly complements the legends' synchronized choreography. The track is not merely a song but a grand visual event, characterized by opulent production design and a dynamic set-up that amplifies its scale.  The meticulous attention to styling and the commanding screen presence of both actors ensure that every frame resonates with charisma. It is the kind of high-energy composition designed specifically for the big screen, where the collective roar of a packed theater becomes part of the soundtrack. Producer duo Sahu Garapati and Sushmita Konidela have spared no expense in ensuring the film meets the highest technical standards. As the release date of January 12, 2026, approaches, the anticipation for this unprecedented mass euphoria continues to mount.  Anil Ravipudi has successfully navigated the immense task of honoring their combined legacies while delivering a fresh, thrilling experience. Mana Shankara Vara Prasad Garu is poised to redefine box-office milestones, proving that when two titans unite, the impact is truly historic. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి.  వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి.  అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది.  సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు  వైద్యులు,  ఆహార నిపుణులు.  అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్  ను అందరూ పొందవచ్చు. సోంపు నీటి ప్రాధాన్యత..  సోంపు నీటిని శక్తివంతమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు.  కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. సోంపు నీరు ఎలా తయారు చేయాలి? సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది,  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపు నీరు ప్రయోజనాలు..  ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.  ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా  ఏర్పడే ఎసిడిటీ,  యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది,  కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట.   కడుపు నిండినప్పటికీ పదే పదే  ఆహారం  తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల  శరీరం డిటాక్స్ అవుతుంది.  ఇది  కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు,  సమస్యలను తగ్గిస్తుంది. సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. -రూప
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి.  అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది.  ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.  శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు,  ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. విటమిన్ స,  యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.   ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.  మొత్తం రోగనిరోధక శక్తి,  హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి.  ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే.. ఉసిరి-తేనె.. తేనె కాంబినేషన్ లో  ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు    ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.   శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో  పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది,  శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్  ఇస్తుంది. ఎలా తినాలి.. టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి.  దీన్ని సమాన పరిమాణంలో  తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉసిరి-పసుపు.. ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.   పసుపులో  కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు  కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా  పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది,  శరీరాన్ని  డిటాక్స్  చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది ఎలా తీసుకోవాలి.. స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు  నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ,  ఒక  ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు. ఉసిరి-అల్లం..  అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది.  అల్లం శరీరంలో వేడిని  పెంచుతుంది. ఉసిరి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా  అల్లం రక్త  ప్రసరణను పెంచుతుంది,  ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది.   ఉసిరిలో ఉండే  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి.. 2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని  1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని  ఉదయాన్నే తీసుకోవాలి. ఉసిరి-బెల్లం.. ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.  ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.  ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు  చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్  శోషణను పెంచుతుంది.  శరీరానికి  వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎలా తీసుకోవాలి.. ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు,  జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి.  చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...