Home » suryadevara rammohan rao » Vyuham


    రాత్రి ఏడుగంటలైంది.

 

    "నౌ... అయామ్ వెరీ హేపీ శక్తి. శక్తి శకం- ప్రారంభమవుతోంది. నాకు తెలుసు ఇండియాలో నెంబర్ వన్ బిజినెస్ మాగ్నట్ వి నువ్వు అవుతావని" ఎక్సయింట్ గా అన్నాడు భగవాన్.

 

    "బాణశంకర్ యిచ్చిన ఆఫర్ని కాదనకు. అన్నయ్య వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకోకూడదు" అభిమానంగా అంది శారద.

 

    "నేను అదృష్టాన్ని వెతుక్కునే వ్యక్తిని కాదు. వ్యక్తిలోని శక్తిని నమ్ముకున్న శక్తిని" తనలో తను అనుకున్నాడు శక్తి.

 

    సరిగ్గా అదే సమయంలో...

 

    ఇంటర్ కమ్ మోగింది.

 

    "చెప్పండి" రిసీవర్ని పట్టుకొని అడిగాడు శక్తి.

 

    చెప్పింది పి.ఏ-

 

    "ఈజిట్.... ట్రూ?!" రోమాలెందుకో నిక్కబొడుచుకున్నాయి.

 

    "ఎంతసేపైంది వచ్చి?" అడిగాడు శక్తి ఎగ్జయింటింగ్ గా.

 

    "ఇరవైనిమిషాలైంది. మీకోసం అడిగారు. బిజీగా ఉన్నారని చెప్తే కూర్చుంటానని చెప్పారు. విజిటింగ్ కార్డు అడిగాను. వచ్చినవాడ్ని కలవకుండా వెళ్ళనుగా అన్నారు. హాల్లో కూర్చున్నారు" చెప్పింది పి.ఏ.

 

    "ఏవైంది శక్తీ. వాట్ హేపెండ్" శక్తిని చూస్తూ అడిగాడు భగవాన్.

 

    "వెంకటనారాయణ వచ్చారు" మెల్లగా చెప్పాడు శక్తి.

 

    నోరు వెళ్ళబెట్టాడు భగవాన్.

 

                          *    *    *    *

 

    ఏ.సీ. రూమ్ లో నిశ్శబ్దంగా వుంది. రూమ్ లో కొచ్చిన వి.వి.ఎన్. ఎస్టేట్స్ ఛైర్మన్ వెంకటనారాయణ శక్తివేపు చూసి నవ్వాడు.

 

    "టేక్ యువర్ సీట్ సర్" కంగారును అణచుకుంటూ చెప్పాడు శక్తి.

 

    "వెరీగుడ్. నీ గురించి, నీ బిజినెస్ గురించి విన్నాను. బాగా డెవలప్ చేశావ్. మర్చిపోయాను. మనం ఇంతకు పూర్వం ఎప్పుడు ఎక్కడా కల్సుకోలేదు కదూ!"

 

    గంభీరంగా ఉందా గొంతు.

 

    "కలిసే అవకాశం రాలేదు" జవాబిచ్చాడు శక్తి.

 

    "వీరమాచనేని వెంకటనారాయణ ఛైర్మన్ గా వి.వి.ఎన్. గ్రూప్" అలా చెపుతున్న వెంకటనారాయణ కళ్ళల్లోకి చూసాడు శక్తి.

 

    ఆవారాగా తిరుగుతున్న తనను, బలవంతమ్మీద తల్లి పంపగా అమాయకంగా బెంగుళూరులో అడుగుపెట్టిన క్షణాలు- ఛైర్మన్ వెంకట నారాయణను కలవడం కోసం తను విశ్వప్రయత్నం చేసిన క్షణాలు కలలుగన్న క్షణాలు.

 

    తన బంధుత్వాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన ముఖం మీద గుమాస్తా ఉద్యోగం పారేసిన వెంకటనారాయణ తన ప్రతిభను ఏమాత్రం పట్టించుకోకుండా తనని నిర్లక్ష్యం చేసిన మేనమామ వెంకట నారాయణ.  

 

    జ్వరంతో ఒక్కడూ దిక్కుమాలిన వాడిలా పడుంటే...

 

    తన పరిస్థితి తెలిసి కూడా తను రాలేకపోయినా బేబీని కూడా పంపకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన వెంకటనారాయణ.

 

    ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ వెంకటనారాయణ.

 

    "ఎట్ లాస్ట్ యూ కేమ్ హియర్" మనసులోనే అనుకుని కసిగా నవ్వుకున్నాడు శక్తి. గర్వంగా నవ్వుకున్నాడు శక్తి. ఆనందంగా నవ్వుకున్నాడు శక్తి.

 

    "మీరు మా ఆఫీసుని చూడ్డానికి రాలేదనుకుంటాను" నిశ్శబ్దాన్ని బద్ధలు చేస్తూ అన్నాడు శక్తి.

 

    ఆ వ్యంగ్యం అర్థమైంది వెంకటనారాయణకు.

 

    కూర్మనాధం వచ్చిన విషయం మాట్లాడలేదు వెంకటనారాయణ.

 

    అరుణ్ మాల్యా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడలేదు. మార్కెట్ లో డౌన్ ఫాల్ అయిన వి.వి.ఎన్. ప్రోడక్ట్స్ గురించి మాట్లాడలేదు.

 

    "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ" శక్తి నోటివెంట వచ్చే ఆ మాట కోసం చూస్తున్నాడు వెంకటనారాయణ.  

 

    భగవాన్ లోనికొచ్చి వినయంగా కూల్ డ్రింక్స్ తెచ్చి టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

 

    ఏదో అర్జంటు ఫైలు ఇచ్చే మిషమీద లోనికొచ్చి శక్తి టేబిల్ మీద ఫైలుని పెడుతూ మేనమామ వెంకటనారాయణ వేపు చూసి వెళ్ళిపోయింది శారద.

 

    తల తిప్పి-

 

    శారదవైపు ఒకే ఒక్క క్షణం చూసి శారద ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోగానే-

 

    "ఆ అమ్మాయిని నేనెక్కడో చూసినట్టుగా వుంది" అన్నాడు వెంకటనారాయణ.

 

    శారద పూర్తిగా తల్లి పోలిక.

 

    నువ్వు దాన్ని చూడలేదు. దాన్ని చూడగానే మా అమ్మను చిన్నప్పుడు చూసినట్టుగా అన్పించి వుంటుంది. మనసులోనే అనుకున్నాడు శక్తి.

 

    ఆలోచనలోంచి తెప్పరిల్లాడు వెంకటనారాయణ.

 

    "మా ప్రెస్ట్రీజియస్ ప్రోడక్ట్ మా టూత్ పేస్టు. దానికి సంబంధించిన ఫైలు ఇది... నీక్కావలసిన డిటైల్స్ అన్ని ఇందులో ఉన్నాయి" ఆ ఫైలుని శక్తికి అందించాడాయన.

 

    "గుడ్ మార్నింగ్" టూత్ పేస్టు నేమ్ ని చదివాడు శక్తి. ఒక్క క్షణం మౌనంగా వుండిపోయాడు.

 

    "వి.వి.ఎన్ ఎస్టేట్స్ గుడ్ మార్నింగ్ టూత్ పేస్ట్ చాలా పాతదే కాదు- "చాలా సక్సెస్ ఫుల్ బ్రాండ్. దేశవ్యాప్తంగా టూత్ పేస్ట్ మార్కెట్ ని కైవశం చేసుకొని 80 శాతం మర్కెట్ ని తన గుప్పిట్లోకి తీసుకున్న ప్రోడక్ట్ గురించి తనతో చర్చించేదేముంటుంది? తను చేయగలిగేదేముంటుంది?"

 

    "ప్రోడక్ట్ నేమ్ లోనూ, ఇన్నర్ మెటీరియల్ లోనూ, పేకేజింగ్ లోనూ, మీడియా కేంపైన్ లోనూ, ప్రొడక్ట్ లాచింగ్ లోనూ, అన్ని విషయాల్లోనూ, నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో... బట్-


Related Novels


Rakthachandanam

Erra Samudram

Daaling

Anitara Sadhyudu

More