30 ఏళ్ల తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి! 30ఏళ్లు దాటిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏయే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి...ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం ఇలా ఎన్నో కారణాల వల్ల మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. ముఖ్యంగా 30ఏళ్లు పైబడిన తర్వాత మహిళల తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయానే లేవడం, వంట పనులు చేయడం, ఆఫీసులకు వెళ్లడం, సాయంత్రం కుటుంబాన్ని చూసుకోవడం..ఈ పనులకే సమయం గడిచిపోతుంది. ఆమెకు తన ఆరోగ్యానికి సమయం కేటాయించడం మర్చిపోతుంది. కానీ 30ఏళ్లు నిండిన తర్వాత ప్రతిస్త్రీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. శరీర బరువు, కండరాల బలాన్ని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.ఇప్పుడు చూద్దాం. ఎలాంటి ఆహారం తినాలి? 30 నుంచి 35 సంవత్సరాల మధ్య, మీ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. ఇది శరీరంలో చక్కెరను ఉపయోగించుకునే హార్మోన్ల పెరుగుదలకు కారణమవుతుంది. అసమతుల్యమైన ఆహారాలు తినడం వల్ల బరువు పెరుగుతారు.కాబట్టి మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే బెర్రీలు, ధాన్యాలు, గింజలు ఉండేలా చూసుకోండి. అలాగే అల్పాహారం మానేయకండి. సమయానికి భోజనం చేయండి. వ్యాయామం చేయండి: రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది బరువును నియంత్రించడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ప్రతిరోజూ చురుకైన, సాధారణ వ్యాయామాలు చేయండి. 30 ఏళ్ల తర్వాత, కండర ద్రవ్యరాశి దశాబ్దానికి 3-8% తగ్గుతుంది. మొత్తంగా వ్యాయామం మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియం ఆహారాన్ని తినండి: చిన్న వయసులోనే ఎముకల సాంద్రత ఏర్పడుతుంది. అలాగే, 25, 30 సంవత్సరాల మధ్య కొత్త ఎముక నిర్మాణం పూర్తవుతుంది. ఎముకల సాంద్రతను నిర్వహించడానికి, మీరు కాల్షియంతో కూడిన ఆహారాన్ని తినాలి. పాలు, పెరుగు, చీజ్, బ్రోకలీ, బచ్చలికూర, కాలే, బాదం వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోండి: నిద్ర మానసిక ఆరోగ్యం, శరీర బరువును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోయేలా చూసుకోండి.అలాగే, మీ ఆహారంలో ఫోలేట్ తీసుకోవడం పెంచండి. ఈ ఫోలేట్ ఆహారాల యొక్క ఇతర వనరులు బచ్చలికూర.సిట్రస్ పండ్లు వంటి ఆకుపచ్చ ఆకు కూరలు. అలాగే, 30 తర్వాత మధుమేహం , రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ చెక్ చేసుకోండి.
ప్రసవం తరువాత మహిళల్లో డిప్రెషనా... ఇదిగో మెడిసిన్ వచ్చేస్తోంది! తల్లి కావడం మహిళలకు దక్కిన ఓ గొప్ప వరం. అయితే మహిళలు ప్రసవానంతరం డిప్రెషన్ కు లోనవుతారు. ఈ కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా తల్లీబిడ్డల బంధానికి సమస్య ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే డిప్రెషన్ ను ఇన్నాళ్లు తల్లిదండ్రులు, భర్త, అత్తమామల సహకారంతో అధిగమించేవారు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు మెడిసిన్ కనిపెట్టారు. ప్రసవానంతరం మహిళలు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ అధిగమించవచ్చు. Zurzuve.. ప్రసవానంతరం మహిళల్లో డిప్రెషన్ అరికట్టడానికి తయారుచేస్తున్న మెడిసిన్ పేరు Zurzuve. US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఆమోదం పొందిన తర్వాత 2023 సంవత్సరం చివరి మూడు నెలల్లో Zurzuve డ్రగ్‌ను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (MDD) ఉన్న పెద్దలకు చికిత్స చేయడానికి Zurzuway మెడిసిన్ అప్లికేషన్ కోసం FDA జారీ చేసిన ఒక ప్రకటనలో, ఔషధం ఎంత ప్రభావవంతంగా ఉందో చూపించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. ప్రస్తుతం దీనికి మరింత అధ్యయనం అవసరం అవుతుందని తెలిపారు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, ముఖ్యంగా ప్రసవానంతర వ్యాకులతను నోటి ద్వారా తీసుకోగలిగే ఈ మెడిసిన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఈ మెడిసిన్ తయారుచేస్తున్న వైద్యులు తెలిపారు. ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకు ఇప్పటి వరకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ మాత్రమే వాడుతున్నామని, మెడిసిన్ ద్వారా ఈ దిశగా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని, అయితే ఇందులో జుర్జువే ఎంత ప్రభావవంతంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎఫ్‌డిఎ నిపుణులు తెలిపారు. ప్రసవానంతర డిప్రెషన్ కోసం ప్రత్యేకంగా ఈ మాత్రను రూపొందించారు. ఇతర యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ దీని కంటే వేగంగా పనిచేస్తాయి. ఇది కేవలం రెండు వారాల తక్కువ వ్యవధిలో తీసుకునేలా రూపొందించబడింది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రసానంతర ఔషధం తీసుకోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మెడిసిన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతాయా అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయి, మెడిసిన్ సక్సెస్ అయితే ఎంతో మంది మహిళలకు డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ప్రసవానంతర డిప్రెషన్‌ను అనుభవిస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే, దాదాపు 75 శాతం మంది మహిళలు సమస్యను గుర్తించలేరు లేదా చికిత్స పొందలేరు. ఈ సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మాతాశిశు మరణాల సమస్యకు ప్రసవానంతర డిప్రెషన్ కూడా ఒక కారణం అనే విషయం కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రసవానంతర డిప్రెషన్ కు మెడిసిన్ సక్సెస్ అయితే ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం లభించినట్లే. *నిశ్శబ్ద.
ఇలా చేయడం వల్ల థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువ అయ్యింది. . థైరాయిడ్ గ్రంధిలో అసమతుల్యత కారణంగా, హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సూపర్‌ఫుడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరగుపరచడంలో సహాయపడతాయి. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంధిలో అసమతుల్యత కారణంగా, హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. బరువు పెరిగిపోతారు. థైరాయిడ్ ఈ సమస్యకు చెక్ పెట్టి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు ఎంతగానో సహాయపడతాయి. * ఉసిరి: ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి, దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మీ థైరాయిడ్ గ్రంధి అతిగా క్రియాశీలంగా పనిచేస్తుంటే.. ఉసిరి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేం కాబట్టి, దీనిని ఉడకబెట్టి, పచ్చడి చేసుకుని తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. * గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా జింక్.. శరీరం ఇతర విటమిన్లు, మినరల్స్ గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది. * ఇవే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేయడం వల్ల కూడా థైరాయిడ్ కంట్రోల్ చేయవచ్చు .. అలాగే మనం తీసుకునే ఆహారం కూడ లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ మానేసి పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
కొల్లాజెన్ అంటే ఏంటి.. మహిళల్లోనే ఇది ఎందుకు లోపిస్తుంది... దీన్ని ఎలా భర్తీ చేయాలి? శరీరం సరైన రీతిలో పనిచేయడానికి అనేక రకాల ప్రొటీన్లు, విటమిన్లు అవసరం. కొల్లాజెన్ అటువంటి ప్రోటీన్లలో ఒకటి. ఇది శరీరంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటుంది. శరీరం దానిని సహజంగా తయారు చేస్తుంది. అయితే శరీరంలో కొల్లాజెన్ పాత్ర ఏంటి? అనే విషయం గురించి తెలుసుకుంటే.. మొత్తం శరీరానికి మెరుగైన నిర్మాణాన్ని, బలాన్ని అందించడం కొల్లాజెన్ పాత్ర. ముఖ్యంగా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మహిళల్లో కాలక్రమేణా ఈ కొల్లాజెన్ స్థాయి తగ్గుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వయసు పెరగడంతో పాటు కొల్లాజెన్ స్థాయి కూడా తగ్గుతుంది. ఈ కారణంగానే వృద్దాప్యం సంభవిస్తుంది. అయితే కొల్లాజెన్ తగ్గడానికి వయసు పెరగడమే కారణం కాదు.. శరీరంలో ఏర్పడే కొన్ని లోపాల కారణంగా కూడా కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది. కొల్లాజెన్ పాత్ర ఏమిటంటే.. శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో 30% కొల్లాజెన్ ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం. ఆహారం సరిగ్గా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన కొల్లాజెన్ భర్తీ అవుతుంది. ఒకవేళ ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది. మహిళలు ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కనుక మహిళల్లలో ఈలోపం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు ఇతర కారణాల వల్ల కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది.. వృద్ధాప్యం రాకుండా శరీరంలో కొల్లాజెన్ స్థాయిని తగ్గించడానికి కారణమయ్యే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. సూర్యరశ్మి, ధూమపానం, చక్కెర అధికంగా తీసుకోవడం ఇందులో ప్రముఖమైనవి. అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన ఇది ప్రభావితం అవుతుంది. ఇది కాకుండా, సిగరెట్ పొగలో ఉండే అనేక రసాయనాలు కూడా కొల్లాజెన్ ను దెబ్బతీస్తాయి, దీని కారణంగా చర్మం వదులుగా మారిపోయి ముడతలు పడుతుంది. కొల్లాజెన్ చర్మానికి చాలా ముఖ్యమైనది. దీని లోపాన్ని భర్తీ చేయడానికి కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల చర్మ స్థితిస్థాపకత మెరుగుపడుతుందని, ముడతలను తగ్గించడంలో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కొల్లాజెన్ లోపం ఉన్నవారిలో అకాల వృద్దాప్యం స్పష్టంగా చూడవచ్చు. కొల్లాజెన్ ఎముక బలానికి కూడా చాలా ముఖ్యమైనది. ఈ కారణంతో చేతి, తుంటి, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులు క్రమం తప్పకుండా కొల్లాజెన్ ను తీసుకోవడం వల్ల మూడు నెలల్లో వాటి తాలుకూ నొప్పి తగ్గుతుంది. అయితే కొల్లాజెన్ సప్లిమెంట్లను ఎక్కువ కాలం తీసుకోవజం వల్ల ప్రమాదం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొల్లాజెన్ ను సప్లిమెంట్ల ద్వారా కంటే ఆహారం ద్వారా భర్తీ చేయడం చాలా మంచిది. కొల్లాజెన్ జంతు ఆధారిత ఆహారాలలో పుష్కలంగా లభిస్తుంది. వీటి వినియోగం కొల్లాజెన్ భర్తీకి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ జంతు ఆధారిత ఉత్పత్తులలో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వైద్యులు ఏమి చెబుతారంటే మహిళలు కొల్లాజెన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి ముఖ చర్మం వదులుగా మారి, ముడుతలు పడుతూ వృద్దాప్యం మీద పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లక్షణాలు గమనించిన తరువాత వారు వైద్యులను కలిసి వైద్యుల సలహా మేరకు కొల్లాజెన్ ను తీసుకోవడం సురక్షితం. *నిశ్శబ్ద.
మహిళల్లో అకాల వృద్దాప్యమా.. ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాలి! ఇనుము చాలా బలమైనది మరియు శక్తివంతమైనది. సుత్తితో కొట్టినా కూడా అది విరిగిపోదు, కానీ తుప్పు మాత్రం ఇనుమును కబళిస్తుంది. అదే విషయం శరీరానికి కూడా వర్తిస్తుంది. కొన్ని అలవాట్లు శరీరాన్ని దెబ్బ తీస్తాయి. దానివల్ల వయసు పైబడిన తరువాత రావలసిన వృద్ధాప్యం ముందే వస్తుంది. దీన్నే అకాల వృద్ధాప్యం అంటారు. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం మహిళల శరీరం హార్మోన్స్ పరంగానూ, ఒత్తిడి కారణంగానూ వివిధ మార్పులకు లోను కావడం. అకాల వృద్ధాప్యం లక్షణాలు: యవ్వనంలో జుట్టు నెరిసిపోయి, బలహీనత-అలసట, శరీరంలో ఎముకల శబ్ధం, ముడతలు, మధుమేహం రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అకాల వృద్ధాప్యంతో బాధపడుతున్నారని అర్థం. దీన్ని నివారించడానికి 3 విషయాలను తప్పక తెలుసుకోవాలి. మూడు అలవాట్లు తొందరగా వృద్ధాప్యం రావడానికి కారణం అవుతుంది. ఈ అలవాట్లు వృద్ధాప్యాన్ని తొందరగా తీసుకువస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. మెలటోనిన్.. మెలటోనిన్ ఒక యాంటీఆక్సిడెంట్, దీనిని స్లీపింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది చీకటిలో లేదా రాత్రి సమయంలో మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పగటి వెలుగులో ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా విడుదల అవుతుంది. నేటి కృత్రిమ జీవితాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండటం తక్కువ. అందుకే రోజులో కొంతభాగం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఈ పని చేయడం వల్ల ఇది వృద్ధాప్యాన్ని పెంచే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తగ్గిస్తుంది . వ్యాయామం.. కొంతమంది తమకు ఇష్టం వచ్చినప్పుడు శారీరక శ్రమ చేస్తుంటారు. అదే సమయంలో, కొందరు ప్రతిరోజూ వ్యాయామం, జిమ్ లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామం చేస్తారు. ఈ రెండు వర్గాల వారిని గమనిస్తే క్రమం తప్పకుండా ఒక ప్రణాళికతో వ్యాయామం చేసేవారికి వృద్ధాప్య ఛాయలు ఆమడ దూరంలో ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం సహజంగా యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది. కాబట్టి వ్యాయామం దగ్గర బోల్తా పడకండి. ఎక్కువగా తినడం.. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారు చాలామంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారిలో యాంటీఆక్సిడెంట్ లోపం ఏర్పడుతుంది. దీన్ని సరిచేయడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలు కాస్త సేదతీరాలి. అందుకే రోజులో భోజనాన్ని 2 నుండి 3 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇవే మాత్రమే కాకుండా.... రోజూ తగినంత నీరు త్రాగాలి. శరీరంలో తేమ శాతం తగ్గితే చర్మం వాడిపోతుంది. జ్యుసి పండ్లు తినాలి. ఇందులో ముఖ్యంగా నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఉండాలి. రోజుకు రెండు పూటలా భోజనం చేయాలి. అది కూడా సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్ తినాలి. ఇవి వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. మహిళలు పై విషయాలు తెలుసుకుని ఫాలో అయితే వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచొచ్చు. *నిశ్శబ్ద.
1. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. 2. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి. 3. నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్‌శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను వాడితే మరీ మంచిది. 4. తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది. 5. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. 6. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుస్లార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. 7. రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది. 8. వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోండి. 9. మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. 10. రోజూ కార్డియో ఎక్సర్‌సైజులు చేయండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చనడంలో సందేహం లేదు! 11. మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు.
బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే! అధిక బరువు అంటే కాస్త భయపడాల్సిన కాలమిది. అధిక బరువు ఉన్నవారికి మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి అనేక జబ్బులు సులువుగా వస్తాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య కాసింత ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా బరువు తగ్గడానికి రకరకాల డైట్ ప్లాన్‌లు ఫాలో అవుతుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. అయితే ఎక్కువ శ్రమ లేకుండా పొట్ట తగ్గాలంటే, ఆహారంలో పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి. చాలా పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా 8 రకాల పండ్లు బరువు తగ్గడంతో మ్యాజిక్ చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ద్రాక్ష.. ద్రాక్షపండులో కేలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించే పండుగా పరిగణించబడుతుంది . ఇది రోజువారీ కావాల్సిన విటమిన్ సి లో 51% అందిస్తుంది. ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. దీని వాడకం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. యాపిల్స్.. యాపిల్స్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక పెద్ద ఆపిల్‌లో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. యాపిల్స్ తినే వ్యక్తులు 4 సంవత్సరాల కాలంలో ప్రతిరోజూ సగటున 0.56 కిలోల బరువు కోల్పోతారని పరిశోధనలో తేలింది. బెర్రీస్.. ఇవి తక్కువ కేలరీల పండ్లు. ఒక కప్పు రాస్ప్బెర్రీస్ లో కేవలం 64 కేలరీలు కలిగి ఉంటే, ఒక కప్పు స్ట్రాబెర్రీలో 50 కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. బెర్రీలు తినడం వల్ల కొలెస్ట్రాల్, బిపి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది అధిక బరువు నియంత్రించడానికి సహాయపడుతుంది. కివి.. కివి పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కివీస్ విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. 12 వారాల పాటు రోజూ కివిని తింటే ఎంత ఎక్కువ ఉన్న బిపి అయినా తగ్గుతుంది. పొట్ట కొవ్వు, నడుము కొవ్వు కూడా గణనీయంగా తగ్గిస్తుంది. పుచ్చకాయ.. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఇది కాకుండా, నారింజ వంటి పండ్లు కూడా అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు, అవకాడోలు, పీచెస్, ప్లమ్స్, చెర్రీస్, ఆప్రికాట్ వంటి పండ్లు కూడా బరువు తగ్గడానికి గొప్ప ఎంపికలు. ◆నిశ్శబ్ద
ప్రసవం తరువాత మహిళలు ఇవి తింటే అద్భుతమైన శక్తి సొంతమవుతుంది! ప్రసవం తరువాత స్త్రీలలో శారీరక, భావోద్వేగ మార్పులు చాలా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్ల జరిగేవి.. ఈ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా జాగ్రత్త అవసరం. డెలివరీ తరువాత కూడా తల్లిబిడ్డలకు ఇద్దరికీ సరైన జాగ్రత్త, సరైన వైద్య సేవలు అవసరమవుతాయి. ఈ హార్మోన్స్ ను, శారీరక స్థితిని తిరిగి మాములు స్థాయికి తిరిగి తీసుకుని రావడానికి అవి మాత్రమే కాకుండా ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రసవం తర్వాత శరీర మార్పులకు, స్థితికి తగ్గట్టు ఆహారాన్ని కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో పోషకాలు అవసరమైన ఆహారం కూడా పుష్కలంగా తీసుకోవాలి. లేకపోతే శరీరం తొందరగా అలసిపోతుంది. బిడ్డకు పాలు ఇవ్వవడంలో సమస్యలు ఏర్పడటం నుండి మహిళల్లో అలసట, రక్తహీనత, ఎముకలు బలహీనంగా మారడం వంటి ఎన్నో సమస్యలు చాప కింద నీరులా చుట్టుముడతాయి. మీరు ప్రసవానంతరం తొందరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు డైట్ లో భాగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. పెసరపప్పు.. పెసరపప్పులో ఐరన్, పొటాషియం, కాపర్ మెగ్నీషియం, అలాగే ఫైబర్, విటమిన్ B6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి బాదం.. బాదంపప్పులు నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి తీసుకునే ఆహారం శరీరంలో శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. వేయించిన గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వేయించిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ కొద్దిగా తీసుకుంటే మంచిది. బొప్పాయి బొప్పాయిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా శోషించబడతాయి, త్వరగా శక్తిని అందిస్తాయి. అదనంగా, బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇది ఆహారం నుండి పోషకాలను బాగా ఉపయోగించుకోవడంలో శరీరానికి సహాయపడుతుంది, శరీరానికి కావల్సిన శక్తి స్థాయిలను పెంచుతుంది. నెయ్యి అలసట అనేది అంతర్లీన ఒమేగా-3 లోపం వల్ల ఏర్పడే సాధారణ లక్షణం, కాబట్టి నెయ్యి (ఒమేగా 3 గొప్ప మూలంగా నెయ్యిని పరిగణిస్తారు)ని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ప్రసవం అనంతరం పైన చెప్పుకున్నా ఆహారాలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగానూ, శారీరక, మానసిక స్థాయిలు సక్రమంగా నిర్వహించడంలోనూ సహాయపడుతాయి. ◆నిశ్శబ్ద.
గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి షాకింగ్ నిజాలు! ఈమధ్య కాలంలో మహిళలు గర్భము ధరించిన తరువాత మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మధుమేహం గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం. సాధారణంగా రెండవ లేదా మూడవ నెలలో శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇది ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి మీద, దాని అది శరీరంలో ఎలా వినియోగం అవుతుంది అని దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. గర్భధారణ మధుమేహం ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఇంకా ప్రసవ సమయంలో ప్రీక్లాంప్సియా వంటి సమస్యలను ఫేస్ చేసే ప్రమాదం ఉంది. ఇది అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలకు హాని కలిగించే పరిస్థితి. అలాగే మధుమేహం ఉన్న గర్భవతులలో నెలలు నిండకనే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గర్భధారణ మధుమేహం శిశువు అధిక బరువుతో పుట్టడానికి దారితీస్తుంది. ఇది షోల్డర్ డిస్టోసియా (డెలివరీ సమయంలో శిశువు భుజం ఇరుక్కున్నప్పుడు) లేదా సిజేరియన్ డెలివరీ వంటి డెలివరీ సమస్యలకు దారితీయవచ్చు. ఈ సమస్య వల్ల పుట్టిన తర్వాత శిశువులో తక్కువ షుగర్ లెవల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మూర్ఛలు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. ప్రసవ తర్వాత స్త్రీలలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దీనిని పూర్తిగా నిరోధించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి తినవలసిన ఆహారాలు: కార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు పచ్చని ఆకు కూరలు, బ్రోకలీ, క్యారెట్లు బెల్ పెప్పర్స్ వంటి ఇతర పిండి లేని కూరగాయలలో ఫైబర్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు శుద్ధి చేసిన ధాన్యాల నుండి బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలకు మారడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు శక్తిని, మంచి ఫైబర్ ను కలిగి ఉంటాయి. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, బీన్స్ మరియు చిక్కుళ్ళలో మంచి ప్రోటీన్ లభిస్తుంది. పాల ఉత్పత్తులు పాలు, పెరుగు, చీజ్ వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్లకు మంచి మూలం. అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. పండ్లు పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి, కానీ వాటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు పండ్ల రసాలు లేదా ప్రాసెస్ చేసిన పండ్ల స్నాక్స్ కంటే తాజా పండ్లను ఎంచుకోవాలి, ప్రాసెస్ చేసిన వాటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. గింజలు మరియు విత్తనాలు గింజలు, విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ లను కలిగి ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు ఇవి మంచి స్నాక్ లా ఉపయోగపడతాయి. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు ఆహారంలో చేర్చుకోవడానికి కొన్ని మంచి ఎంపికలు. ఆరోగ్యకరమైన కొవ్వులు అవోకాడో, ఆలివ్ నూనె వంటి వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు గర్భధారణ మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలకు కడుపు నిండుగా సంతృప్తిగా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి. గర్భధారణ మధుమేహానికి వ్యతిరేకంగా మహిళలు నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ మధుమేహం అధిక ప్రమాదం ఉన్న మహిళలు, కుటుంబంలో ఎవరికైనా మధుమేహం సమస్య ఉన్నవారు, గర్భధారణ సమయంలో రెగ్యులర్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా జాగ్రత్త పడచ్చు. ◆నిశ్శబ్ద.
ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం! ప్రస్తుత కాలంలో 30 నుండి 40 ఏళ్ళ మహిళల్లో ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఎండోమెట్రియోసిస్. గర్భాశయం (ఎండోమెట్రియం) లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భాశయం వెలుపల అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు, పెల్విస్‌లోని ఇతర భాగాలలో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఎండోమెట్రియోసిస్ కటి నొప్పి, నెలసరి ఎక్కువరోజులు కొనసాగడం, పిల్లలు కలగడంలో ఇబ్బంది వంటి అనేక లక్షణాలకు దారి తీస్తుంది. ఈ సమస్య ఎన్నో శారీరక, మానసిక సమస్యలు సృష్టించి, మహిళల లైఫ్ స్టైల్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది పునరుత్పత్తి, లైంగిక, వృత్తిపరమైన, సామాజిక పనితీరులను ప్రభావితం చేస్తుంది. మొదట్లోనే ఈ సమస్య గురించి తెలుసుకుంటే.. దీన్ని గుర్తిస్తే.. దీన్ని అధిగమించడం సులువు అవుతుంది. ఎండోమెట్రియోసిస్ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉంటే కణజాల పెరుగుదల, వాపుకు దారితీయవచ్చు, ఇది పరిస్థితిని మరింత బాధాకరంగా మారుస్తుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎండోమెట్రియోసిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారాలు ఏమిటంటే.. పసుపు పసుపులో ప్రధాన క్రియాశీల పదార్ధమైన కర్కుమిన్, ఎస్ట్రాడియోల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఎండోమెట్రియోసిస్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది., అలాగే కర్కుమిన్ గర్భాశయం యొక్క లైనింగ్ కణజాల వ్యాప్తిని అణిచివేస్తుంది. వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ అత్యంత ఆల్కలీన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఒకటి. క్లోరోఫిల్ సమృద్ధిగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, వాపును తగ్గించడానికి, ప్రో-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల కార్యకలాపాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ క్లోరోఫిల్ వీట్ గ్రాస్ లో లభ్యమవుతుంది. మునగ ఆకు.. మునగ ఆకు రసంలో మొరింగ ఒలిఫెరా ఉంటుంది. ఇది ఆండ్రోజెన్ గ్రాహకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎండోమెట్రియం యొక్క మందాన్ని కూడా తగ్గిస్తుంది. అశ్వగంధ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి అనుబంధంగా అశ్వగంధ ఉపయోగిస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది. శతావరి శాతవరి ఎండోమెట్రియోసిస్ సంశ్లేషణలను తగ్గించడంలో సహాయపడే మాక్రోఫేజ్‌ల ఫాగోసైటిక్ చర్యను పెంచుతుంది. ఎండోమెట్రియోసిస్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి చిట్కాలు: ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలిని నిర్వహించడం వలన నెలసరిలో తిమ్మిరి, ఉబ్బరం తగ్గించవచ్చు, ఇవి ఎండోమెట్రియోసిస్ సాధారణ లక్షణాలు. ఒత్తిడి ఎండోమెట్రియోసిస్ లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది, కాబట్టి దానిని నియంత్రించడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటి రిలాక్సేషన్ పద్ధతులు సహాయపడతాయి. ఎండోమెట్రియోసిస్ లక్షణాలను తగ్గించడంలో హార్మోన్ థెరపీ సహాయపడుతుంది. దీనివల్ల ఋతుచక్రాన్ని నియంత్రించవచ్చు. ఆక్యుపంక్చర్ లేదా హెర్బల్ రెమెడీస్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు ఎండోమెట్రియోసిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్యలో గైనకాలజిస్ట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం. ◆నిశ్శబ్ద.
మహిళల్లో జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్య ఉన్నట్టో తెలుసా? ఇప్పటి కాలంలో మహిళల ఆరోగ్యం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. నెలసరి సమస్యల నుండి ఎన్నో రకాల జబ్బులు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ మహిళలను బలహీనంగా మారుస్తాయి. కొన్ని సార్లు తాము అనారోగ్యంతో ఉన్నామనే విషయం కూడా మహిళలు స్వతహాగా గుర్తించలేరు. చాలా చిన్నవే.. అనే నిర్లక్ష్యంతో కొన్ని దాటవేస్తుంటారు. చాలామంది వైద్యులు మహిళలు ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని, అన్ని రకాల పరీక్షలు చేయించడం ఉత్తమం అని అంటుంటారు. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితులు సరిపడినట్టు ఉండవు. చాలామంది జుట్టు, చేతి గోర్ల కండిషన్ ను బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో చెప్పచ్చంటున్నారు. ముఖ్యంగా జుట్టు కండిషన్ ఎలా ఉంది?? ఎంత మొత్తంలో రాలిపోతోంది అనే దాన్ని బట్టి ఏ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో గెస్ చేయవచ్చట. ఇంతకూ జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్యలు ఉన్నట్టో తెలుసుకుంటే.. జుట్టు రాలడం.. ఇది చాలా సాధారణ సమస్య. సాధారణంగా తల స్నానం తరువాత 100 వెంట్రుకల వరకు రాలిపోతుంది, ఈ నష్టం తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం. పోషకాహార లోపాలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో వైద్యుడిని సంప్రదిస్తే థైరాయిడ్, రక్తహీనతతో పాటు విటమిన్ డి లోపంతో సహా కొన్ని విటమిన్, ఖనిజ లోపాలను గుర్తించే పరీక్షలు చేయవచ్చు.. పెళుసుదనం … జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొంత తేమ అవసరం. ముఖ్యంగా పెళుసుగా ఉండే జుట్టు జింక్ మరియు, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. జింక్ ఐరన్ లేకపోవడం జుట్టు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కెరాటిన్ ఏర్పడటానికి ఈ పోషకాలు అవసరం. ఐరన్, జింక్ ను ఆహారం నుండి అయినా లేదా సప్లిమెంట్స్ ద్వారా అయినా సరిపడినంత తీసుకోవడం మంచిది. బూడిద జుట్టు దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల DNA దెబ్బతింటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. జుట్టు రాలడం అనే సమస్య ఒత్తిడి వల్ల కూడా సంభవిస్తుంది. అయితే జుట్టు నెరవడం జన్యువుల వల్ల కూడా సంభవిస్తుంది. చాలామందిలో ఇది వంశపరంపర్యంగా వస్తూంటుంది. జుట్టు పొడిబారడం ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు మృదువుగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్య కరమైన కొవ్వులు లోపిస్తే.. జుట్టంతా పొడిబారిపోయి పీచులాగా కనిపిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లోపిస్తున్నాయనే దానికి ఇది చక్కని సూచన. ఆహారంలో అవకాడో, ఆలివ్ ఆయిల్ సాల్మన్ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిచవచ్చు. చుండ్రు చుండ్రు జుట్టులో పొట్టు పొట్టుగా ఏర్పడే ఒకానొక సమస్య. ఇది పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. చుండ్రు సరైన విధంగా ప్రయత్నం చేస్తే తొందరగానే తగ్గిపోతుంది. సెబోర్హెయిక్ డెర్మటైటిస్ ఎరుపు, జిడ్డుగల చర్మంతో ఉంటుంది, ఇది తెల్లటి లేదా పసుపు రంగు పొలుసులతో కప్పబడి ఉంటుంది. మలాసెజియా, ఈస్ట్ లాంటి శిలీంధ్రం జుట్టు కుదుళ్లలో ఏర్పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. జుట్టు పొడిబారడం ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ విధంగా జుట్టు కండిషన్ ను బట్టి శరీర స్థితిని కూడా తెలుసుకోవచ్చు. ◆నిశ్శబ్ద.
బరువు పెరుగుతున్నామని భయం వద్దు.. ఇలా చేస్తే చాలు! మనం భోజనం చేయడం సహజం. అయితే చాలా మంది మహిళలు తిన్న కొద్ది సేపటికే ఆకలి అంటూ ఉంటారు. ఇలా అనిపించడం సర్వసాధారణం, కానీ అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. శరీరం ఆకలి సంకేతాలను వినడం ముఖ్యం అయినప్పటికీ, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అనారోగ్యకరమైన తిండిని నివారించడానికి, మంచి ఆహారం ఎంపిక చేసుకోోడానికి గందరగోళ పడుతున్నట్టైతే ఈ చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వండి.. ఆహారం ట్రాక్‌లో ఉండేలా చేసుకోవడం ఇలా.... ముందుగా ప్లాన్ చేసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపికంచేసుకోవాలి. లేకుపితే చాలా ఈజీగా దగ్గరలో ఉన్న జంక్ ఫుడ్ వైపుకు వెళ్ళిపోతారు. తీసుకునే ఏ ఆహారం అయినా స్నాక్స్ తో సహా ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ఎప్పుడూ పోషకమైన ఆహారం మీరు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. తాజా పండ్లు కూరగాయలను తీసుకోవాలి. ఎనర్జీ బార్ లు స్నాక్ లో చేర్చుకోవాలి. ఆకలితో ఉన్నప్పుడు ఇవి మంచి ఆప్షన్. ఆరోగ్యం కూడా.. ఇంటి ఆహారమే.. మహాభాగ్యం.. బయట కొన్న ఆహారంలో జోడించిన చక్కెర, అనారోగ్య కొవ్వులతో నిండి ఉంటాయి. అందుకే, పూర్తి పోషక పదార్ధాలను ఉపయోగించి ఇంట్లో స్వంతగా తయారు చేయడానికి ప్రయత్నించాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి.. ఎవ్వరికీ ఎక్కువగా తెలియని షాకింగ్ నిజం ఏమిటంటే.. శరీరంలో తేమ శాతం తక్కువైతే చాలా మందికి దాన్ని ఆకలి అనుకుంటారు. చాలాసార్లు ఆకలి అనిపించి ఆహారం తీసుకున్నా తృప్తి కలగకపోవడానికి కారణం ఇదే.. నదుకే నీటిని సరిపడినంత తీసుకోవాలి. ఆకలి అనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి ఆ తరువాత కూడా అదే విధంగా ఆకలి అనిపిస్తే అపుడు ఆహారం తినాలి. అల్పాహారం చేసేటప్పుడు జాగ్రత్త మైండ్‌ఫుల్ ఈటింగ్.. ఫాలో అవ్వాలి. అంటే మీరు తినే వాటిపై శ్రద్ధ చూపడం ప్రతి బైట్ ను ఆస్వాదించడం. అల్పాహారం చేసేటప్పుడు, టీవీ, మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియా చూడటం వంటివి నివారించండి. ఆహారం రుచి, అందులో పదార్థాలు దాని వాసన ఇలాంటివి అనుభూతి చెందుతూ తింటే చాలా తొందరగా తృప్తి చెందిన ఫీల్ కలుగుతుంది. ఆప్షన్స్ కూడా.. ఆహారం తీసుకునేటప్పుడు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ స్పైక్‌లు, క్రాష్‌లకు కారణమయ్యే అవకాశం తక్కువ. వీటిని ఫాలో అయితే మహిళల్లో బరువు పెరగడం అనే సమస్య ఉండదు.. ◆నిశ్శబ్ద.
పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి! స్త్రీలు సాధారణ సమయాల్లో తీసుకునే జాగ్రత్తల కంటే.. వారు గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం కోసం, గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం, గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఆహారం గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆ ఆహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో, గర్భిణీ స్త్రీ ఆహారం ద్వారా డెలివరీ సమయంలో సంభవించే సమస్యలను కూడా నివారించవచ్చు. గర్భధారణ సమయంలో స్త్రీ ఏది తింటే అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు పూర్తి పోషకాహారం లభిస్తే, ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీ తప్పనిసరిగా కొన్ని పదార్థాలు తినాలి. గర్భిణీ స్త్రీకి, పుట్టబోయే బిడ్డకు మేలు చేసే ప్రెగ్నెన్సీ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు ఏమి తినాలంటే… పాలకూర పచ్చి కూరగాయలలో అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో పాలకూర తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాలకూరలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు అనేక ఖనిజాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి, మెరుగైన ఆరోగ్యానికి బచ్చలికూర తీసుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలు పాలకూర తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం, తీక్షణమైన బుద్ధి లభిస్తాయి. గుడ్డు గుడ్డు కూడా పోషకాలతో నిండి ఉంది. గుడ్డులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శిశువు మెదడు అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు తినాలి. బాదం బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి. బాదంపప్పు తింటే గుండె ఆరోగ్యం పదునవుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు వారి పిల్లలకు కూడా మంచిది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు బాదంపప్పును తీసుకోవాలి. ఇది పిల్లల మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. తాజా పండ్లు తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాజా పండ్ల నుండి విటమిన్లు లభిస్తాయి. స్త్రీ గర్భధారణ సమయంలో నారింజ, అరటి, మామిడి, ద్రాక్ష, యాపిల్ మొదలైన పండ్లను తీసుకోవాలి. కావాలంటే ఫ్రూట్ జ్యూస్ చేసి తాగొచ్చు. పెరుగు గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరం. ఇది చాలా మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి సహా చాలా ప్రోటీన్లు ఉంటాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత ఆరోగ్యవంతమైన మరియు అభివృద్ధి చెందిన బిడ్డ పుడుతుంది. పాలు పిల్లలైనా, పెద్దలైనా, ప్రతి ఒక్కరూ పాలు తీసుకోవాలని సూచిస్తారు. ఒక గ్లాసు పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీకి కఫుపులో బిడ్డకు పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యం ఏర్పడుతుంది. అందరికీ అందుబాటులో ఉండే ఈ పదార్థాలు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యం. ◆నిశ్శబ్ద.
మీ ఆరోగ్యానికి అద్భుత మంత్రం! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఒంట్లో బాగోలేకున్నా, మనసు భారంగా ఉన్నా అన్నీ భరిస్తూ ఇంటి పని, బయటి పనులు చక్కబెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. మగవారు బయటికెళ్లి ఉద్యోగం చేసొస్తే వారికి అన్ని సేవలు చేస్తూ, పిల్లలను, అత్తమామలను చూసుకుంటూ తమ గురించి తాము మరచిపోతారు మహిళలు. ఈ కారణంగా మహిళలు శారీరకంగా బలహీనం అవుతారు. ఇక సంపాదన పరంగా మగవారు ఆడవారిని చాలా తొందరగా మాటలు అనేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా కుటుంబంలో జరిగే ఎన్నో గొడవలకు మూల కారణంగా మహిళలనే చేస్తుంటారు. బయట ఎన్ని గొడవలు, ఒత్తిడులు ఉన్నా అవన్నీ ఇంటికొచ్చి మహిళల మీద చూపంచే భర్తలు, తండ్రులు, అన్నలు, ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్టు.. సాటి ఆడవారే చులకనగా చూసి, అవమానిస్తుంటారు. ఈ కారణాల వల్ల మహిళలు మానసికంగా బలహీనం అయిపోతుంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఎంతో దృఢంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం మహిళలు చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. ఇవి అద్భుత మంత్రాలనే చెప్పొచ్చు.. మీకోసం.. మీరు.. కుటుంబం, భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా ఎందరున్నా ప్రతి మహిళ తన ప్రాధాన్యతను తాను గుర్తుంచుకోవాలి. మొదట తన గురించి తాను జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి. తన సంతోషాన్ని, తన సమయాన్ని తాను ప్రత్యేకంగా గడపగలగాలి. భారతీయ మహిళకు ఇలాంటి పని కాస్త కష్టమే.. కానీ అసాధ్యం కాదు. కుటుంబానికి కావలసినవన్ని ఓ మహిళ ఇస్తున్నప్పుడు, ఆ మహిళల తనకు కావలసింది తాను తీసుకోవడంలో తప్పు లేదుగా.. ఇలా చేస్తే మహిళలు మానసికంగా బలవంతులు అవుతారు. ఆరోగ్యం.. మీ బాధ్యత… మీ ఆరోగ్యం గురించి భర్త, పిల్లలు పట్టించుకుని వారు మిమ్మల్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తేనే వెళ్లే వర్గానికి చెందినవారు మీరైతే.. ఇప్పుడే మీ పద్ధతి మార్చేసుకోండి. సహజంగా మహిళలకు ప్రతి దశలో ఎన్నో ఆరోగ్యం సమస్యలు వస్తుంటాయి. ఏ పెయిన్ కిల్లరో.. మరే సిరప్పో.. వేసుకుని అప్పటికి సమస్య తగ్గిపోయిందనిపించుకుని ఏళ్లకేళ్ళు గడిపేసే మహిళా మణులు చాలామందే ఉన్నారు. అవన్నీ వదిలి శరీరం సౌకర్యంగా అనిపించకపోయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తిన చక్కగా వైద్యులను సంప్రదించాలి. ప్రతి మహిళా కాల్షియం, ప్రోటీన్, విటమిన్, బోన్ స్ట్రేంగ్త్ పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేయించుకోవాలి. పోషకారం మీకే ముఖ్యం.. మీగడ పెరుగాంతా భర్తకూ, పిల్లలకూ వడ్డించి తనకు మాత్రం నీళ్లు కలిపి పలుచని మజ్జిగతో భోజనాన్ని మ్యా.. మ్యా.. అనిపించే మహిళలు బోలెడు ఉన్నారు. మగవాళ్ళు ఎక్కువ తినాలి అనే మాటతోనో.. ఎదిగే పిల్లలకు పెట్టాలి కదా అనే సమర్థింపుతోనో ఇంటివారికి ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు.. అది వారి మీద ఇల్లాలికి ఉన్న ప్రేమ. కానీ.. ఆడవారికే ఆహారం అవసరమే కదా.. ఉదయం లేచి ఇల్లు ఊడవడంతో మొదలుపెట్టే పనికి రాత్రి భోజనాలు అయ్యాక తిన్నవి కడిగి సర్దిపెట్టే వరకు విరామం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో భర్త, పిల్లలకు పెట్టే దానికంటే ఎక్కువగా, మంచి పోషకాహారం ఆడవారికే అవసరం. యోగా.. ధ్యానం...కావాలి.. యోగా.. ధ్యానం మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. యోగ లోని ఆసనాల వల్ల మహిళల శరీరంలో వివిధ అవయవాల పనితీరు మెరుగవుతుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి, శరీరంలో అదనపు కొవ్వు, దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భాశయం, థైరాయిడ్, హార్మోన్స్ అసమతుల్యత వంటివి ఆమడ దూరం పోతాయి. ధ్యానం వల్ల చక్కని ఏకాగ్రత, దృఢ నిర్ణయం తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. మానసిక ఒత్తిడులు అధిగమిస్తారు. నెలసరి సమయంలోనూ, గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం, భర్తతో అనుబంధం, మెనోపాజ్ దశ ఇలా అన్ని సమయాలలో ఒత్తిడి సహజంగా ఉంటుంది మహిళల్లో. ఈ ఒత్తిడిని డీల్ చేయడానికి ధ్యానం బాగా సహకరిస్తుంది. గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకునే మహిళల్లో అస్తిత్వం మెరుగ్గా ఉంటుంది. ప్రతి మహిళా కుటుంబాన్ని, గృహిణి బాద్యతనూ కలిగి ఉంటారు. అయితే వాటితో పాటు ప్రపంచాన్ని కూడా శాసించగలిగేవారు కొందరే ఉంటారు. ప్రతి మహిళా ప్రపంచాన్ని శాసించక పోయినా.. తన ప్రపంచాన్ని తాను శాసించుకోగలిగే శక్తిమంతురాలు కావాలి. తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి. అప్పుడే మహిళా దినోత్సవ అర్థానికి సార్ధకత చేకూరుతుంది. ◆నిశ్శబ్ద .
గర్భనిరోధక మాత్రలు మిమ్మల్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోండి! ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మను ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు నచ్చిన వ్యక్తితో కలవడం, పెళ్లి తరువాత కూడా ఇంకా కెరీర్ ప్లానింగ్ పేరుతో ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం ఎక్కువ మంది ఆధారపడే మార్గం బర్త్ కంట్రోల్ పిల్స్ (birth controal pills) ఉపయోగించడం. అయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి కేవలం గర్భాన్ని రాకుండా చేస్తాయేమో కానీ అనేక సమస్యలను మాత్రం పక్కాగా వెంటబెట్టుకొస్తాయి. అండోత్సర్గాన్ని నిరోధించడానికి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మిశ్రమాన్ని కలిగి ఉన్న చాలా గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నెలవారీ మహిళల్లో వచ్చే నెలసరి సమయంలో అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చెందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి. ఇవి ఎలా పని చేస్తాయంటే.. ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా పనిచేస్తుంది, స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది. పిల్ లోని హార్మోన్లు అప్పుడప్పుడు ఈ గర్భాశయ లైనింగ్‌ను మార్చగలవు, గర్భాశయ గోడలను అంటిపెట్టుకుని ఉండే అండాలను విచ్చిన్నం అయ్యేలా చేస్తాయి. గర్భధారణను నిరోధించడానికి మాత్రమే ఈ బర్త్ కొంట్రోల్ పిల్స్ ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు. ఇతర జనన నియంత్రణ మార్గాల కంటే ఇది బాగా సక్సెస్ మార్గమైనప్పటికీ దీని వల్ల కలిగే మార్పులు మాత్రం కేవలం గర్భం రాకుండా అపడంతో అయిపోవు. ఇలాంటి టాబ్లెట్స్ వాడిన తరువాత నెలసరిలో ఎక్కువ ఋతుస్రావం, నెలసరి క్రమం తప్పడం, ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్, హిర్సూటిజం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు చాప కింద నీరులా చేరతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అందరికీ ఒకే విషయమై పలితాన్ని ఇవ్వవు. ఒక్కొక్కరిలో ఒకో విధమైన ఎఫెక్ట్ ఉంటుంది. చాలామందిలో ఇవి వాడిన తరువాత గర్భధారణ సామర్థ్యము తగ్గిపోతుంది. అమ్మతనం అనేది ఓ ప్రాణికి జీవితాన్ని ఇవ్వడం. స్వార్థ ప్రయోజనాలకోసం ఎంతో మంది మహిళలు అనుసరిస్తున్న ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా తరువాత అమ్మ అయ్యే అవకాశానికి వారే పెద్ద సమస్యను ఉత్పన్నం చేసుకుంటున్నారు. ఒకవేళ గర్భనిరోధక మార్గం అనుసరించాలని అనుకుంటే మగవారు కండోమ్ వాడటం ఆడ, మగ ఇద్దరికీ ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలోచించండి మరి.. ◆నిశ్శబ్ద.
కాబోయే అమ్మలకు వ్యాయామం ముఖ్యమా? వ్యాయామం అనేది మనిషి తప్పకుండా ప్రతిరోజూ తన దినచర్యలో భాగం చేసుకోవాలి. అయితే వ్యాయామం విషయంలో ఒక్కొక్క పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక్కో విధమైన నిబంధనలు ఉంటాయి. గర్భం ధరించిన మహిళలు వ్యాయామం చేయవచ్చా.. చేస్తే ఇప్పుడు చెయ్యాలి?? ఎన్ని నెలల సమయంలో మొదలుపెట్టాలి?? ప్రారంభంలోనే వ్యాయామం చేయవచ్చా వంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. వ్యాయామం గర్భవతులు కూడా చేయవచ్చు. అయితే గర్భం గురించి తెలిసిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టడం ప్రమాదం. గర్భం నిలవాలి అంటే 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవడం, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి 3 నెలల సమయంలో వ్యాయామం జోలికి వెళ్లకూడదు. ఆ తరువాత అంటే 3 నెలల తరువాత వ్యాయామం చేయడం మొదలుపెట్టవచ్చు. నెలలు నిండేకొద్ది మహిళ బరువు, శారీరక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యవంతంగా, బిడ్డకు సరైన విధంగా ప్రాణవాయువు, పోషకాలు అందడనికి కూడా వ్యాయామం సహకరిస్తుంది. శరీరం కూడా భారంగా అనిపించకుండా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. గర్భవుతులు పెరిగే బరువును భరించడానికి అనువుగా శరీర కండరాలు, ఎముకల కదలిక సౌకర్యవంతంగా మారుతుంది. అంతే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డ బరువు వల్ల ఆ ప్రభావం వెన్నుపూస మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే వెన్ను నొప్పి లేకుండా, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా చక్కగా ఉండేలా వ్యాయామాలు దోహదం చేస్తాయి. అంతేకాదు, గర్భవతులు వ్యాయామం చేస్తే డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరించడం కష్టతరం అనిపించదు. ఎందుకంటే వ్యాయామం వల్ల శరీరంలో కండరాలు, ఎముకలు దృఢంగా మారి మొత్తం మీద శరీరం గట్టిదనాన్ని పొంది ఉంటుంది. అయితే గర్భవతులు విశ్రాంతి తీసుకోవడం ఎలానో.. శ్వాస క్రియ జరపడం ఎలానో కూడా తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల కండరాలు గట్టిపడతాయి. అలాగే వ్యాయామము చేయడానికి ప్రతిరోజు ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల శరీర తత్వానికి మంచి క్రమశిక్షణ అలవడుతుంది. వ్యాయామం చేయడానికి చదునుగా ఉన్న ఉపరితలము గల్గిన స్థలము ఎంచుకోవాలి. అలాంటిచోట మందం పాటి దుప్పటి పరచుకుని దానిమీద వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జారకుండా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులకు నెలలు నిండేకొద్ది కాళ్ళు వాపు రావడం జరుగుతుంది. ఈ వాపు తగ్గడానికి కూడా కొన్ని వ్యాయామములు తెలుసుకోవాలి. వాపు తగ్గడానికి వ్యాయామం. వెల్లకిలా పడుకుని మెల్లిగా కాళ్ళు పైకి ఎత్తాలి. ఆ తరువాత కాలి పాదాలను గుండ్రంగా తిప్పాలి. దీన్ని మొదట గడియారం తిరిగినట్టు తిప్పి, ఆ తరువాత దానికి రివర్స్ లో తిప్పాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి. కాళ్ళు భారంగా ఉన్న అనుభూతి తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయడం గర్భవతులు ఆరోగ్యానికి మంచిది. గమనిక:- గర్భవతులు వైద్యులు, నిపుణుల సలహా లేనిది సొంతంగా వ్యాయామాలు చేయడం తల్లిబిడ్డకు కూడా ప్రమాదం. కాబట్టి వైద్యుల సలహతోనే ఏ వ్యాయామం అయినా చెయ్యాలి. ◆నిశ్శబ్ద.
గర్భవతులు ఆహారం గురించి అనుమానాలా?? నిజం తెలుసుకోండి!! జీవితంలో ఏ దశలోనైనా మనం తీసుకునే ఆహారం ముఖ్యమైనది. స్త్రీ గర్భం ధరించినపుడు ఈ మాట మరీ నిజమని ఒప్పుకుంటారు. ఎందుకంటే గర్భవతి తీసుకునే భుజించే ఆహారం కడుపులో బిడ్డకు కూడా పోషకాలను అందించగలగాలి. అయితే అందరూ అనుకున్నట్టు సాధారణ రోజుల్లో తినే దానికి రెట్టింపు గర్భం మోసున్న రోజుల్లో తినాలని అర్థం కాదు. గర్భం దాల్చక ముందు కంటే గర్భం దాల్చిన తరువాత ఎక్కువ తినవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ క్రొవ్వు పట్టేంతగా తినకూడదు క్రొవ్వు ఎక్కువైతే గర్భవతులు ప్రసవం కష్టమవుతుంది. అదీకాక ఈ అదనపు క్రొవ్వును కరిగించడానికి చాల కష్టపడవలసి వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలోనే కాదు, బరువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు డాక్టర్ల దగ్గరకు టెస్టుల కోసం వెళ్లినపుడు అక్కడ బరువు చూడటం అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు డాక్టర్లే బరువు తగ్గడం, పెరగడం అనే విషయాల గురించి చెబుతాడు. బరువు విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. గర్భవతులు అందరికీ వర్తించే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు ఉంటాయి. జ్యుస్ లు, లిక్విడ్స్, మొదలైనవి గర్భిణీ స్త్రీలు కావలసినన్ని తీసుకోవాలి. అయితే వీటి తయారీకి పంచదార ఉపయోగించకూడదు చక్కెర అదనంగా తింటే క్యాలరీలు పెరిగి శరీరం బరువు ఎక్కువ ఆవుతుంది. మామూలుగా ఉన్న బరువుకు గర్భవతిగా వున్న సమయములో నున్న బరువుకు 20 కిలోల కంటే ఎక్కువ తేడా వుండకూడాదు. ఇంతకంటే ఎక్కువ బరువు వుండటం మంచిది కాదు. గర్భిణీ స్త్రీ తినే తిండిని బట్టే బిడ్డ పెరుగుతుంది. అందువల్ల తినే తిండి నాణ్యతగా ఉండాలి.. తల్లీ బిడ్డకు ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని ఎన్నిక చేసుకోవాలి. తినే ఈ భోజనం ఎంపిక చేసుకున్న ఆహార పదార్థాల నుండి తయారు చేయాలి. పోషణ పదార్థాలు గల ఆహారాన్ని తీసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా పెరుగుతాడు. విటమినులు, ఖనిజలవణాలు లోపించిన ఆహారాన్ని ఎన్నిక చేసుకున్నట్లయితే బిడ్డ ఆరోగ్యము నష్టానికి గురి అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. సారం లేని భోజనం ఎముకలు దంతాల పెరుగుదలను అరికడుతుంది. బిడ్డ దేహంలో నిరోధక శక్తి తగ్గి పుట్టిన తరువాత ప్రమాదకరమైన రోగాలకు గురి అవుతాడు. సారం లేని ఆహారం తీసుకున్న స్త్రీ గర్భవతిగా ఉన్నంత కాలము ప్రసవ సమయంలోను కష్టపడవలసి వస్తుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి శక్తి లేకుండా పోతుంది. గర్భిణీ స్త్రీ గర్భంలో బిడ్డ వేగంగా వృద్ధి పొందుతూ వుంటాడు. సరైన పెరుగుదలకు పోషకాలు విటమిన్లు బిడ్డకు అవసరమవుతాయి. విటమినులు కొన్ని మన శరీరంలో నిల్వ ఉండవు. అందువల్ల ఈ విటమినులలో గల ఆహార పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీకి విటమినులు గల ఆహారం చాలా మేలు కలుగజేస్తుంది. ◆నిశ్శబ్ద.
మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!! మహిళల్లో రజస్వల అవడం, ఋతుస్రావం అనేవి చాలా సాధారణమైన విషయాలు. అయితే.. కొందరిలో బుతుస్రావం కనబడకపోవడం మొదటి నుంచీ ఉంటే మరి కొందరిలో సడన్ గా ఆగిపోతుంది. కొందరు ఆడపిల్లలు యుక్తవయస్సు వచ్చినా రజస్వల అవరు. పైగా పొత్తికడుపు దగ్గర ఎత్తుగా తయారవుతుంది. అది చూసిన కొందరు ఆ అమ్మాయి గర్భవతి ఏమో అనుకుని పొరబడుతూ ఉంటారు. మహిళల్లో జరగవలసిన సహజ ప్రక్రియ అయిన ఈ రజస్వల కావడం తమకు జరగలేదని ఇలాంటి అమ్మాయిలు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ‘క్రిప్టోమెనోరియా' అనే ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎంతకీ రజస్వల అవడం ఉండదు. కాని కొంతకాలానికి పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా ఎదుగుతుంది. తెలియనివారు దానిని చూసి గర్భిణీ అని కూడా 'కుంటారు ‘క్రిప్టోమెనోరియా' పరిస్థితిలో స్త్రీ నిండుగా ఉంటుంది. వక్షోజాలు పూర్తిగా వస్తాయి. రూపంలో ఎటువంటి తేడా ఉండదు. అయినా రజస్వల అయినట్లు కనబడదు. ఇటువంటి స్త్రీలు రజస్వల అవక పోవడం ఉండదు. రక్తస్రావం మాత్రం కనబడదు. దానికి కారణం యోనిద్వారం దగ్గర కన్నె పొర పూర్తిగా మూయబడి ఉంటుంది. వీరిలో నెల నెలా బహిష్టులు అవడం ఉంటుంది.కాని రక్తస్రావం కనబడదు. వీరిలో కలిగేర రక్తస్రావము బయటకు రావడం కుదరక మర్మావయవాల లోపలే నిలువచేరి పోతుంది. అలా బహిష్టు రక్తం నిలవ చేరిపోవడంతో గర్భా శయం ఉబ్బుకు వస్తుంది. మొదట్లోనే కన్నె పొర పూర్తిగా మూసి ఉంచిన పరిస్థితిని గుర్తించకపోతే 6-7 మాసాలంత గర్బిణీలాగా కనబడే అవకాశం లేకపోలేదు. ఇలా మూసి ఉంచిన కన్నె పొరని ఆప రేషను చేసి తొలగిస్తే లోపల పేరుకుని పోయిన రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. కాన్పు అయిన కడుపులాగా అంతా తగ్గిపోతుంది. కొందరు మొదట్లో నెల నెలా బహిష్టు మామూలుగా అవుతారు. ఆ తరువాత బహిష్టు రావడం ఆగిపోయి అంతు పట్టని రహస్యంగా మిగిలిపోతాయి. హార్మోన్ల లోపంవల్ల బహిష్టులు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, మెంటల్ షాక్ వల్ల బహిష్టులు ఆగిపోవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉంటేకూడా బహిష్టులు వుండవు. పిట్యూటరీ గ్రంధి, ఎడ్రినల్ గ్రంధిలో కంతులు ఏర్పడితే బహిష్టులు రావు. వయస్సు మళ్ళుతున్న స్త్రీలలో అకస్మాత్తుగా నెలసరి ఆగిపోయి తర్వాత శాశ్వతంగా బహిష్టులు ఆగిపోవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి 40-50 సంవత్సరాల వయస్సు వారికి కనబడుతుంది. ఇదే మెనోపాజ్. ఋతుస్రావం రావలసిన విధంగా నెల నెలా రావడం వుండక ఆగిపోవడాన్ని 'సెకండరీ ఎమెనోరియా' అంటారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని కేసుల్లో కారణం ఏదై నదీ అర్థం కాకుండా అవుతుంది. రోగి జననేంద్రియాల పరీక్ష, అల్ట్రాసౌండు ఎగ్జామినేషను, యం. ఆర్. ఐ, హార్మోన్ల పరీక్ష, ఇతర పరీక్షలు జరిపినప్పుడు ఎమెనోరియాకి కారణం తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా జననేంద్రియ సమస్యలు, మహిళల నెలసరి అనేవి చాలా సున్నితమైన అంశాలు. వీటి విషయంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని సొంత వైద్యం లో పరిష్కరించుకోకుండా డాక్టర్ ను కలవడం ఉత్తమం. ◆నిశ్శబ్ద.





















