మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!      ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే.. శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..   జుట్టు రాలే సమస్య బాగా  ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా,  పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి  జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే  ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి  పరిస్థితిలో  తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.  నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర,  గింజలు, నల్ల శనగలు,  అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.                                                                                                              ◆ నిశ్శబ్ద

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు 1. కుర్చీలోంచి కదలకుండా ఓ అరగంట కుర్చున్నారో...అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నిజానికి స్థిరంగా కూర్చోటమన్నది మానవులకు సరిపడదుట. అలా కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్.పి.ఎల్ పనితీరు మందగిస్తుదట. ఎల్.పి.ల్ పనితీరు మందగిస్తే నష్టం ఏంటి అంటారా! ఈ ఎల్.పి.ఎల్ వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ, రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది, సో కదలకుండా కూర్చున్నపుడు ఈ ప్రక్రియ అంతా మందగిస్తుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అందుకే ఎక్కువ సేపు అలా కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి పొట్ట త్వరగా వచ్చేది. 2). సహజంగానే ఆడవారికి పిల్లలు పుట్టాకా కాస్త నడుము, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే పనిగా కూర్చుని ఉద్యోగాలు చేసే వారి గురించి ఇక చెప్పేదిముంది. అవునూ ఇంతకీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న డౌట్ వస్తోంది కదా! ఖచ్చితంగా దాని వలన ఇబ్బందే. పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైనదిట. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. రక్తనాళాలు పూడుకు పోవటం, స్థూలకాయం అధికరక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం వుందని హేచ్చరిస్తున్నారు పరిశోదకులు. 3) చాలా సేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యనికి మంచిది కాదు. కండరాలు క్రమేపి బిగుసుకుపోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. అదేపనిగా ఒకేచోట కదలకుండా కూచునేవాళ్ళకి రోజు మొత్తం మీద ఒకేచోట  మూడుగంటలని మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలునప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది. లేదంటే ఇట్టే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం వుందని తేల్చిచెప్పారు అమెరికన్ పరిశోధకులు. ఇందుకుగాను సుమారు 1.20 లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలి, ఎంతసేపు ఒకేచోట కూర్చుంటున్నారు వంటి విషయాలని పరిశీలించారు. విశ్రాంతి సమయంలోనైన రోజుకి 3 గంటలకి పైగ కదలకుండా కూర్చునే వాళ్ళలో గండె జబ్బులు వంటివి రావటం గమనించారట. ఎట్టి పరిస్తితిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చో వలసి వస్తే మాత్రం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం మంచిది. 4) మన అలవాట్లే మనల్ని కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకేచోట కూర్చోవటం కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తే కంప్యూటర్ దగ్గర అదే పనిగా ఎక్కువసేపు  గడిపితే మరో ప్రమాదం పొంచి వుంది. ఈ మధ్య మహిళలు కూడా కంప్యూటర్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర ఉండే ఆడవారికి ముఖం మడతలు పడటం, కళ్ళు జీవాన్ని కోల్పోవడం, వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందటున్నారు నిపుణులు. తీవ్రమైన రేడియేషన్ కారణంగా కంటి కింద వలయాలు రావటంతో పాటు చర్మ సాగి ముడతలు పదే ప్రమాదం కూడా ఉందట. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవటం తప్పని సరట. -రమ

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా... చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే… నడుమునొప్పి ఎలా వస్తుంది?ఎందుకు వస్తుంది? నడుము  అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి… కూర్చునేటప్పుడు:- కూర్చునేటప్పుడు   వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది.  చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.   కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి.  ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం. పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి.  పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా  ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు.  ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  చాలామంది  ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై..                                      ◆నిశ్శబ్ద.

బరువు తగ్గి మళ్ళీ పెరుగుతున్నారా...అయితే మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..   బరువు తగ్గడం అనేది అతి పెద్ద కష్టాలలో ఒకటి అని మీరు అంగీకరిస్తారు. ఒక పరిశోధన అంచనా ప్రకారం బరువు తగ్గిన వారిలో 80% మంది ఒక సంవత్సరంలోపు బరువును తిరిగి పొందుతారు.  ఎప్పుడైనా బరువు తగ్గి మళ్ళీ  దాన్ని తిరిగి పొందినట్లయితే ఈ సమస్య గురించి  అంతో ఇంతో అనుభవం ఉండి ఉంటుంది. దీర్ఘకాల బరువు తగ్గడంలో 20% మంది వ్యక్తులు మాత్రమే విజయవంతమయ్యారని పరిశోధనలో తేలింది. బరువు తగ్గేవారు తమ బరువును ఎక్కువ కాలం ఎలా మెయింటైన్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అది పెద్ద విషయం కాదు. కానీ అక్కడున్న పొరపాటల్లా తగ్గిన బరువు పెరగకుండా ఏం చెయ్యాలన్నదే.  కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా తగ్గిన  బరువును అలాగే మైంటైన్ చేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. మొదటిది, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. తద్వారా  బరువును తగ్గించుకోవడం. బరువు తగ్గాలనే ఆలోచనతో ఆకలి వేస్తున్నా దాన్ని అణిచిపెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.  అలా చేయడం వల్ల  శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. కాబ్టటి  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునంటూ బరువు తగ్గితే అది  దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. బరువు తగ్గగానే ఇక సమస్య ఏమీ లేదులే అనుకుని నచ్చినట్టు తినడం చాలామంది చేసే తప్పు. మరీ ముఖ్యంగా బయటి ఆహారాలు, బేకరీ ఫుడ్స్ వంటివి రెచ్చిపోయి తింటుంటారు. కానీ ఇలా బరువు తగ్గడం మళ్ళీ ఇలాంటి ఆహారాలు తినడం శరీర వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. ముందున్న బరువు కంటే రెండింతల బరువు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆహారం ద్వారా హార్మోన్లు అసమతుల్యానికి గురవుతాయి. బరువు తగ్గిన తరువాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే దానికి మంచి మార్గం బరువును ట్రాక్ చేయడం. ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంచుకోవాలి. ప్రతివారం బరువును చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి బరువు పెరుగుతూ ఉంటే ఆహారం నుండి విహారం వరకు ఏయే మార్పులు చేసుకోవాలో తమకు తాము అర్థం చేసుకోగలుగుతారు. చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు డైటింగ్ కూడా ఫాలో అయి ఉంటారు. ఇలా ఫాలో అయిన డైటింగ్ ను బరువు తగ్గగానే ఆపేయడం మంచిది కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ పూర్తీగా ఆ డైటింగ్ ను వదిలేయడం అంటే తిరిగి బరువు పెరగడానికి మార్గం ఫిక్స్ చేసుకుంటున్నట్టు.  బరువు తగ్గామనే సంతోషంలో అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని ఇష్టానుసారం తినడం మంచిది కాదు. స్వీట్లు, నూనె పదార్థాలు, శుద్దిచేసిన ఆహారం, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైనవాటికి చాలా దూరం ఉండాలి. పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే బరువు  తగ్గిన తరువాత పొరపాటున కూడా మళ్లీ పెరగడం అనే సమస్య ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం   అప్పటివరకు కష్టపడి తగ్గిన బరువు అంతా కొండలా మళ్ళీ పెరగడం మొదలవుతుంది.                                                                     *నిశ్శబ్ద.  

గర్భధారణ సమయంలో ప్రయాణం చేస్తున్నారా...ఈ తప్పు చేస్తే చాలా డేంజర్..! గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గర్భవతులు ఏదైనా టూర్ లేదా ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే వారు తీసుకునే జాగ్రత్తల చిట్టా  మరింత పెరుగుతుంది.  ఎందుకంటే ప్రయాణంలో వాతావరణంలో మార్పు, మార్గంలో అలసట, తినడం,  త్రాగడంలో సమస్యలు.  లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇబ్బందులు.  ఇవన్నీ గర్భవతులను,  వారి కడుపులో పెరుగుతున్న  బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా  హాయిగా ప్రయాణించడమే కాకుండా, గర్భవతుల ఆరోగ్యం, కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.  గర్భిణీ స్త్రీలు టూర్ లేదా ఏదైనా ప్రయాణం కు వెళ్లే ముందు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుంటే.. గర్భవతులు టూర్ లేదా ప్రయాణం కు వెళ్ళేముందు ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమట. ముఖ్యంగా గర్భవతులకు  ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే లేదా  క్రమం తప్పకుండా మందులు తీసుకుంటుంటే హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యం.  ముఖ్యమైన మందులు, ప్రథమ చికిత్స కిట్, శానిటైజర్,  మాస్క్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఇప్పటికే వైద్యుల దగ్గర చెకప్ తీసుకుని ఉంటే వైద్యుల సూచించిన   మందులను వెంట ఉంచుకోవాలి.  లేకుంటే ప్రయాణంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం,  తల్లి,  పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు. ప్రయాణ సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు.  అపరిశుభ్రమైన ఆహారం,  కలుషిత నీటిని నివారించాలి. శుభ్రమైన నీటిని మాత్రమే త్రాగాలి.   తాజా, వేడి ఆహారాన్ని తినాలి. ప్రయాణించేటప్పుడు బయటి ఆహారం తినడం వల్ల సమస్యలు ప్రమాదాలు పెరుగుతాయి. ఇంటి ఆహారాన్ని లేదా శుభ్రమైన ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తున్నప్పుడు తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు . అలసట,  నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల  ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు, మెదడులోని అలసట కారణంగా  శక్తి తగ్గుతుంది. గర్భవతులు ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం వేడిగా ఉంటే..  బట్టలు, సన్‌స్క్రీన్ లేదా గొడుగు,  ఇతర అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే  ఒక టూర్ కు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం  వాతావరణ పరిస్థితులకు,   వెళ్లాల్సిన ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి  ముందుగానే వాతావరణానికి అనుగుణంగా సిద్ధం కావాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణించేటప్పుడు ఒత్తిడి లేకుండా ఉండాలి.  మానసిక ఒత్తిడి కూడా  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి  ప్రయాణంలో ఉంటే, ఒత్తిడికి దూరంగా ఉండి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి.                              *రూపశ్రీ.    

చర్మం ముడతలు,తెల్ల జుట్టుకు ఈ హార్మోన్ల లోపమే కారణమట..!   చర్మం యవ్వనంగా ఉండాలని,  జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు.  దీనికి కారణం ఇలా ఉంటే ఎప్పటికీ వయసు మీద పడినట్టు కనిపించదు. కానీ కొంతమందికి దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం,  జుట్టు తెల్లగా మారడం కనిపిస్తుంది. అయితే ఇలా జరగడానికి శరీరంలో హార్మోన్ల లోపమే అని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఏ హార్మోన్లు లోపించడం వల్ల చర్మం అలా ముడతలు పడటం, జుట్టు తెల్లగా మారడం జరుగుతుంది? ఈ హార్మోన్ల లోపం రాకూడదు అంటే ఏం చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. చర్మం వృద్దాప్యానికి లోను కావడంలో,  ముడతలు పడటంలో హార్మోన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయట. చర్మం ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం, కాలుష్యం,  శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండటం మొదలైన కారణాల వల్ల కూడా చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్,  గ్రోత్ హార్మోన్..  ఈస్ట్రోజెన్లు,  మెలటోనిన్ వంటి హార్మోన్లు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. మెలటోనిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది,  చర్మ కణాల మరమ్మత్తుకు సపోర్ట్  ఇస్తుంది.  మెలటోనిన్ భవిష్యత్తులో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లో భాగంగా మారవచ్చని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.. ఎండోకన్నబినాయిడ్స్ (CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి),  ఆక్సిటోసిన్ (లవ్ హార్మోన్) చర్మాన్ని సూర్యుడి కాంతి నుండి దెబ్బతినకుండా రక్షించగలవని,  కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మం వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సహాయపడే 8 హార్మోన్లు.. గ్రోత్ హార్మోన్:   కణజాలాలను మరమ్మతు చేయడంలో, దృఢమైన చర్మం కోసం కొల్లాజెన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్లు:   ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళల్లో చర్మ ఆర్ద్రీకరణ,  స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. రెటినోయిడ్స్ (రెటినోల్,  ట్రెటినోయిన్):   చర్మ కణాల పునరుద్ధరణను పెంచుతాయి,  ముడతలను తగ్గిస్తాయి. మెలటోనిన్:   చర్మాన్ని UV నష్టం నుండి రక్షిస్తుంది,  కణాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది. ఆక్సిటోసిన్:   మంటను తగ్గించి, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. ఎండోకన్నాబినాయిడ్స్:   CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి, ఇవి చర్మం ఒత్తిడి,  కాలుష్యం నుండి కోలుకోవడానికి సహాయపడతాయి. α-మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్:   చర్మపు పిగ్మెంటేషన్‌ను పెంచుతుంది,  సూర్యరశ్మి దెబ్బతినకుండా రక్షిస్తుంది.                            *రూపశ్రీ.  

ఎండోమెట్రియోసిస్ అనేది  గర్భాశయ కుహరం వెలుపల  గర్భాశయ  లైనింగ్ కణజాలం పెరిగే ఒక సమస్య. గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. ఈ పొరమీద కణజాలం పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటున్నారు.  దీని ప్రభావం కారణంగా దీన్ని ఒక జబ్బుగా పరిగణిస్తున్నారు. 

మహిళలలో  PCOS, థైరాయిడ్ కు చెక్ పెట్టి, సంతాన అవకాశాలు పెంచే అద్బుతమైన చిట్కాలు..! నేటి కాలంలో మహిళలు సహజంగా గర్భం దాల్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీనికి అతిపెద్ద కారణం హార్మోన్ల అసమతుల్యత. PCOD,  థైరాయిడ్ వంటి సమస్యల కారణంగా, హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. ఇది సహజ గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది . అయితే  జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా,  మందులతో పాటు కొన్ని ఇంటి నివారణలను తీసుకోవడం ద్వారా  హార్మోన్లను సరిదిద్దుకోవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా సహజంగా గర్భం దాల్చడానికి  వైద్యులు చెప్పిన   అద్బుతమైన చిట్కాను తెలుసుకుంటే.. హార్మోన్లను సరిచేయడానికి, PCOSని నియంత్రించడానికి మరియు టెస్టోస్టెరాన్‌ను పెంచడానికి, PCOD కూడా ఉంటే లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా మరే ఇతర కారణం చేతనైనా గర్భం దాల్చలేకపోతే వైద్యులు చెప్పిన చిట్కా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్,  దాల్చిన చెక్క వేసి కలపాలి.  ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తాగాలి. ఈ  పానీయం తాగడం ద్వారా,  హార్మోన్లు సమతుల్యమవుతాయి మరియు ఇన్సులిన్ నిరోధకత కూడా నయమవుతుంది. ఈ పానీయం  ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, ఇది  PCOD ని నయం చేస్తుంది,  శరీరంలో టెస్టోస్టెరాన్‌ను పెంచుతుంది. దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను సరిచేయడం ద్వారా ఆండ్రోజెన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది PCOS ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది . ఇది పిసిఒఎస్ రోగులలో ఆండ్రోజెన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో ఈస్ట్రోజెన్,  టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది కానీ ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. విజయవంతమైన ఇంప్లాంటేషన్‌కు ప్రొజెస్టెరాన్ చాలా ముఖ్యమైనది.  కాబట్టి ఒక స్పూన్  ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు నీళ్లలో వేసి అందులో కాసింత దాల్చిన చెక్క వేసి తాగాలి.     *రూపశ్రీ.  

గర్భిణి స్త్రీలు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!     గర్భధారణ అనేది స్త్రీకి ఒక ముఖ్యమైన సమయం. అందుకే  వారి ఆరోగ్యం పట్ల  ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తమను తాము  జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అది హీట్ స్ట్రోక్‌కు కారణమవుతుంది  డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల వేడి ఆవిర్లు,  ముందస్తు ప్రసవం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు తీవ్రమైన వేడి వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరగడం, తలతిరగటం,  మూర్ఛపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటినీ నివారించడానికి, గర్భిణీ స్త్రీ తనను తాను,  తన పుట్టబోయే బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోవాలి. హైడ్రేటెడ్ గా.. గర్భధారణ సమయంలో పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా తమను తాము  హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ మంచిది. తలతిరగడం, వికారం, పెదవులు ఎండిపోవడం,  పసుపు రంగు మూత్రం నిర్జలీకరణానికి సంకేతాలు. మండే వేడి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందువల్ల,హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా 6-8 గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ముఖ్యంగా  ఇంటి నుండి బయట ఉన్నప్పుడు ఎల్లప్పుడూ  స్టీల్ వాటర్ బాటిల్  వెంట ఉంచుకోవాలి. ఆహారం.. వేడిని నివారించడానికి గర్భిణీ స్త్రీ తాజా పండ్లు,  రసాలను తీసుకోవాలి. ఈ సీజన్‌లో వైద్యులు గర్భిణీ స్త్రీలు దోసకాయ తినమని సలహా ఇస్తారు. అందువల్ల,  రోజువారీ భోజనంలో దాని వినియోగాన్ని పెంచాలి.  అలాగే  కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. దుస్తులు.. ఈ సీజన్‌లో  ఏ రంగు దుస్తులు ధరిస్తారో కూడా ముఖ్యమైన అంశమే.. నలుపు,  ఎరుపు రంగు దుస్తులు వేడిని గ్రహిస్తాయి. దీని కారణంగా గర్భిణీ స్త్రీకి ఎక్కువ వేడిగా అనిపిస్తుంది. సూర్య కిరణాలను నివారించడానికి వీలైనంత వరకు తెలుపు,  లేత గోధుమరంగు వంటి లేత రంగు దుస్తులను ఎంచుకోవాలి. వ్యాయామం.. గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా,  చురుకుగా ఉంచడానికి వేసవిలో వ్యాయామం మంచి మార్గం. ఉదయం,  సాయంత్రం వేళల్లో నడక, ఈత,  యోగా వంటి కార్యకలాపాలు తల్లి,  బిడ్డ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తాయి. కానీ  వ్యాయామం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసుకోకూడదు.  కంఫర్ట్ జోన్‌లో ఉంటూ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల  మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నిద్ర.. గర్భిణీ స్త్రీకి మంచి నిద్ర,  తగినంత విశ్రాంతి చాలా ముఖ్యం. సరైన సమయానికి నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజుల్లో వేసవి వేడి బాగా అలసిపోయేలా చేస్తుంది, కాబట్టి తమ కోసం తాము  సమయం కేటాయించుకోవాలి. పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం ద్వారా శరీరం, మనసుకు  విశ్రాంతి ఇవ్వవచ్చు.                                     *రూపశ్రీ.

గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి! గర్భం ధరించిన స్త్రీల శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.  డెలివరీకి ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత అంతా నార్మల్‌గా అయిపోతుందని అనుకుంటారు కానీ చాలావరకు అది జరగదు.  చాలా మంది మహిళలకు బిడ్డ ప్రసవం తర్వాత కూడా పైల్స్ సమస్యలు అలాగే ఉంటాయి. . ప్రెగ్నెన్సీకి ముందు పైల్స్ సమస్య లేకపోయినా, ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, మహిళలు గర్భధారణ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుని, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. అసలు పైల్స్ అంటే ఏంటి? మానవ శరీరంలో పురీషనాళం చుట్టూ సిరలు ఉంటాయి. ఈ సిరలు ఉబ్బుతాయి. అసాధారణమైన వాపు ఏర్పడుతుంది.  ఈ  సమస్య కారణంగా, ప్రేగు కదలిక సమయంలో దురద,  నొప్పి ఉంటుంది.  ఇవి బయటికి పొడుచుకు వచ్చిన చిన్న గింజలా ఉంటాయి. గర్భవతుల్లో ఎందుకొస్తుంది? నిజానికి, గర్భధారణ సమయంలో గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, సిరలు సులభంగా ఉబ్బుతాయి. అంతే కాకుండా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల గర్భిణీ స్త్రీలో మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం సమయంలో, మలం చాలా గట్టిగా మారుతుంది. ఈ కారణంగా పైల్స్ పరిస్థితి తీవ్రంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే, గర్భిణీ స్త్రీలు మలబద్ధకం కారణంగా పైల్స్‌కు గురవుతారు. డెలివరీ సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హేమోరాయిడ్లు సంభవించవచ్చు. పైల్స్ సమస్యను ముందే గుర్తుపట్టడం ఎలా? పైల్స్ వ్యాధిలో, మలద్వారంలో నొప్పి, మంట, దురద ఉంటుంది. ప్రేగు కదలిక సమయంలో నొప్పి పెరుగుతుంది. కూర్చున్నప్పుడు కూడా పైల్స్ కారణంగా నొప్పి ఉంటుంది. పైల్స్ కారణంగా, మల విసర్జన తర్వాత కూడా ఇబ్బందిగానే ఉంటుంది.  పురీషనాళం సమీపంలోని కణజాలంలో వాపు, పుండ్లు, రక్తస్రావం కనబడతాయి. పైల్స్ తగ్గడానికి, రాకుండా ఉండటానికి గర్భవతులు ఏమి చేయాలంటే..  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడే మహిళలు తమ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. దీని కోసం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలవిసర్జన ఆపకూడదు.. గర్భవతులు బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపించినప్పుడు, వెంటనే టాయిలెట్‌కు వెళ్లిపోవాలి. కారణాలు చెప్పుకుని మెలాన్ని బిగపట్టుకుని కాలం వెళ్లబుచ్చకూడదు. ఇలా చేస్తే కడుపు అస్తవ్యస్తం అవుతుంది. పేగులు ఎప్పటికపుడు శుద్ధి అవుతుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు.   శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి గర్భిణీ స్త్రీలు తమను తాము హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం నీరు బాగా త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి ద్రవాలను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల పైల్స్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.                                      ◆నిశ్శబ్ద.

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!   గర్భధారణ స్త్రీకి మరొక కొత్త ప్రపంచాన్ని పరచయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  గర్భవతులైన స్త్రీలు సమతుల ఆహారాన్ని,  పోషకాలు సమృద్దిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.  అయితే కొంతమంది మహిళలు ముందు రోజు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ తింటూ ఉంటారు. రుచి కోసమో లేక మిగిలిపోతుందనో.. లేక ఖరీదైనదనో.. ఏదో ఒక కారణం తో ముందురోజు ఆహారం తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే.. గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చేసే తప్పులలో అతి పెద్ద తప్పు ముందురోజు ఆహారాన్ని తినడం. ఇలా పాతబడిన ఆహారం తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు తాజాగా వండిన పోషకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని వారు చెబుతున్నారు. ముందురోజు ఆహారం లేదా పాతబడిన ఆహారం తినడం వల్ల గర్భవతులలో చాలా ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కడుపులో పిండం అభివృద్ది మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.  ముందురోజు మిగిలిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇలా గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడితే అది అకాల ప్రసవాలకు,  గర్భస్రావాలకు, తక్కువ బరువు ఉన్న శిశువు జననానికి దారి తీస్తుందట. ముందురోజు మిగిలిపోయిన ఆహారం ఎందుకు తినకూడదు అనే విషయాన్ని కూడా వైద్యులు వివరించారు.  ముందురోజు ఆహారంలో సాల్మోనెలోసిస్,  లిస్టెరియోసిస్ వంటి బ్యాక్టీరియా,  వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు అతిపెద్ద కారణాలు. గర్భం ధరించాలని అనుకునే మహిళలు, గర్భవతులు ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు. బయట నుండి తెచ్చిన ఆహారానికి వీలైనంత దూరం ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో తెచ్చినా దాన్ని వేడిగా ఉన్నట్టే తినాలి. బయట తెచ్చిన ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు.                                          *రూపశ్రీ.  

Health Benefits of Ginger The ginger root is that part of the zingiber officinale plant that is commonly used for culinary and medicinal purposes. Also called the rhizome, it has a light brown color and is thick and knotted. As it matures, its taste and pungent odor increases. Ginger is harvested at 6-20 months and is a basic cooking spice in most households. 1. Ovarian cancer treatment 2. Colon cancer prevention 3. Morning sickness relief 4. Motion sickness remedy 5. Reduces pain and inflammation 6. Heartburn relief 7. Prevention of diabetic nephropathy 8. Migraine relief 9. Menstrual cramp relief 10. Cold and flu prevention   

గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు! మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది తల్లి కావడం. పెళ్ళైన పరిస్థి అమ్మాయి తల్లి కావాలని అనుకుంటుంది. తాను గర్భవతినని తెలిసినప్పుడు ఎంత సంతోషపడుతుందో మాటల్లో వర్ణించలేనిది. ఒకానొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. అంతేనా మరొక ప్రాణాన్ని మోస్తూ ఈ ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని పరిచయం చేయబోతున్నాను అనే భావం కూడా చాలా బావోద్వేగాన్ని కలిగిస్తుంది. అయితే గర్భం ధరించిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులు తన విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే కాకుండా తన మీద తాను చాలా జాగ్రత్త వహించాలి.  మరీ ముఖ్యంగా గర్భవతులకు ప్రయాణాలు అనేవి సహజం. కనీసం డాక్టర్ చెకప్ లకు అయినా వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి సరైన డాక్టర్లు దగ్గర్లో లేక కాసింత దూరమే వెల్లడి వస్తుంది. గర్భం ధరించిన  మహిళలు ప్రయాణం సమయాల్లో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు….. గర్భం ధరించిన తరువాత ఎంత కాదనుకున్నా ప్రయాణాలు తప్పవు. ఉద్యోగాలు చేసే మహిళలు అయితే కచ్చితంగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి గర్భవతులు ప్రయాణములో బాగా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. బయటి నీరు, డ్రింక్స్, సోడాలు, ఇతర ద్రవాలు త్రాగకూడదు!!  చాలామందికి ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. పెళ్ళయ్యి గర్భం దాల్చేవరకు అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఈ ఎత్తుమడమల చెప్పులు సాధారణం. కానీ  గర్భవతులైన స్త్రీలు ఎత్తుమడమల చెప్పులు వేసుకోకూడదు. వదులుగా, ఫ్లాట్ గా ఉండే చెప్పులు  వాడాలి!!  గర్భవతులు వాంతులు కావడం సహజం. వేవిల్లు అని పిలిచే ఇవించెప్పలేనంత నీరసాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణములో వాంతులయ్యే అలవాటు ఉన్న వారికి గర్భ సమయములో ఇంకా పెరుగుతాయి. కాబట్టి... ముందుగానే వైద్యుని సంప్రదించి, తగిన మందులు తీసుకెళ్ళాలి. ప్రయాణంలో ఆకలి అనేది సహజం. అయితే గర్భవతులు మాత్రం తమతో పాటు  కొన్ని రకాల  పండ్లను వెంట ఉంచుకోవాలి, ప్రయాణంలో ఆకలి అనిపిస్తే పండ్లనే తినాలి!  అంతేకానీ బస్సులు, ట్రైన్లు ఆగినప్పుడు అడ్డమైన తిండి కొనుక్కుని తినకూడదు. బయటి పదార్థాలను తినకపోవడం మంచిది!! ఇంట్లో గర్భవతులు ఉన్నారంటే చాలామంది కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెబుతుంటారు. వారి మీద ప్రేమ అలా చేయిస్తుంది. అయితే ఇలా గర్భవతులకు ఏ విధమైన పనులు లేకుండా ఒకే చోట కూర్చోమని చెప్పడం తప్పు.  గర్భవతులకు నడక మంచిది. సాధారణంగా గర్భవతులు నడుస్తున్నప్పుడు తొందరగా అలసిపోతారు.... అలా అలసట అనిపిస్తే.... ఆగి కొద్దిసేపు కూర్చుని.. అలసట తీరిన తరువాత తిరిగి నడవాలి. పనులు చేసుకున్నా, నడిచినా గర్భవతులు బరువులు మాత్రం ఎత్తకూడదు, మోయకూడదు!! ఒకవేళ ఎత్తవలసిన పరిస్థితి వస్తే.... నిలుచున్న స్థితిలోకాక మోకాళ్ళు వంచి, కూర్చుని అప్పుడు ఎత్తాలి! కానీ బరువులు ఎత్తుకుని నడవకూడదు. గర్భవతులు  పండంటి బిడ్డను పొత్తిళ్ళతో చూసుకొని ఆనంద పడాలంటే.... ప్రయాణములో పై పద్దతులను తప్పక ఆచరించాలి.                                     ◆నిశ్శబ్ద.

అండాశయంలో తిత్తుల గురించి ఈ విషయాలు తెలుసా? అండాశయ తిత్తులు అనేవి అండాశయాలపై లేదా లోపల అభివృద్ధి చెందే ద్రవంతో నిండిన సంచులు. చాలా తిత్తులు ప్రమాదకరం కావు,  వాటంతట అవే తగ్గిపోతాయి, కొన్ని అసౌకర్యాన్ని కలిగిస్తాయి లేదా ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. సాధారణంగా అండాశయంలో తిత్తులు స్త్రీ సంతానోత్పత్తికి ముప్పు కలిగించవు  వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం చాలా ఆందోళనకు దారి తీస్తాయి.  ఈ మధ్య కాలంలో మహిళలలో ఈ అండాశయంలో తిత్తుల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలలో కూడా  ఈ సమస్యలు కనిపిస్తుండటంతో  గర్భం ధరించే విషయంలో చాలా ప్రశ్నలు వారిలో నిలిచిపోతున్నాయి.  అయితే అసలు అండాశయంలో తిత్తుల గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఎండోమెట్రియోమాస్ , సిస్టాడెనోమాస్,  డెర్మాయిడ్ సిస్ట్‌లు వంటి కొన్ని రకాల సిస్ట్‌లు ప్రాణాంతకమైనవి.  ఇవి ప్రాణాపాయం కలిగించేంత ప్రభావం కలిగి ఉంటాయి.  ఇవి వయస్సుతో పాటు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సిస్ట్‌లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వీటికి వైద్యం కూడా చాలా నిపుణుల దగ్గర తీసుకోవడం ముఖ్యం.   క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకుంటూ   ఉంటే సిస్ట్ లను ముందే గుర్తించి వాటికి వైద్యం చేయడంలో సహాయపడుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? మహిళలు అండాశయ తిత్తుల గురించి ఆందోళన చెందాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ  నీరసంగా లేదా  కటి భాగంలో పదునుగా ఉన్న వస్తువుతో గుచ్చినట్టు నొప్పి కలగడం,  చికాకు కలగడం వంటివి ఎక్కువగా ఉంటే  వైద్యుడిని సంప్రదించాలి. అధిక ఋతు రక్తస్రావం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రాశయం నిండినట్లు పదే పదే   అనిపించడం,  కడుపు నొప్పిలో ఆకస్మిక మార్పులు ఈ సిస్ట్ లకు సంకేతాలు.  ఈ లక్షణాలు ఉన్న మహిళలు వైద్యులను కలవాలి. మెనోపాజ్ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వీరికి ఈ సమస్యవల్ల ప్రాణం మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు,  ప్రమాదాలు.. అండాశయ తిత్తులు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. వీటిల అత్యంత సాధారణ కారణం ఋతు చక్రంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు . పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)లో, అండోత్సర్గము విఫలమైన కారణంగా అండాశయాలలో ఒకటి కంటే ఎక్కువ  తిత్తులు ఏర్పడతాయి. ఇంకొక  రకం ఎండోమెట్రియాటిక్ తిత్తులు. ఇవి రెట్రోగ్రేడ్ ఋతుస్రావ పద్దతిలో  ముడిపడి ఉన్నాయి, ఇక్కడ ఋతు రక్తం ఫెలోపియన్ గొట్టాలలోకి వెనుకకు ప్రవహిస్తుంది,  అండాశయాలపై ఇంప్లాంట్ అవుతుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వంటి ఇన్ఫెక్షన్లు కూడా అండాశయాలకు వ్యాపించి తిత్తి ఏర్పడటానికి దారితీస్తుంది. నిరపాయకరమైన తిత్తులు,  ప్రమాదకరమైన తిత్తుల గురించి తెలుసుకోవడానికి , ఆందోళనను తగ్గించుకోవడానికి   మహిళలు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ పరీక్షలు,  సాధారణ చెకప్ లు  చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.                                      *రూపశ్రీ.

ధూమపానం చేయకపోయినా మహిళలలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఎందుకంటే..!   ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ధూమపానంతో ముడిపడి ఉంటుంది. కానీ ఇటీవలి పరిశోధనలు చాలా మంది మహిళలు అసలు ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి, 50% మంది మహిళా రోగులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు, పురుషులలో ఈ సంఖ్య 15-20%. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేయని వారిలో క్యాన్సర్ మరణానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఐదవ ప్రధాన కారణం . ముఖ్యంగా మహిళల ఇది చాలా ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాలలో ఇది అడెనోకార్సినోమా అనే రకంలో కనిపిస్తుంది.  దాదాపు రెండు లక్షల కేసులు వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి.  చాలా మంది మహిళలు ఈ వ్యాధి  ప్రారంభ లక్షణాలయిన ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడూ దగ్గు, ఊపిరి ఆడకపోవడం లేదా అలసట వంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సమస్య పెరుగుతుంది.మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గల కారణాలు,  వాటిని ఎలా తగ్గించవచ్చో తెలుసుకుంటే..  ప్రమాద కారకాలు.. ధూమపానం,  వాయు కాలుష్యం వంటివి పురుషులు,  మహిళలు ఇద్దరికీ ప్రమాదాలను కలిగిస్తాయి. కానీ కొన్ని అంశాలు మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. స్త్రీ హార్మోన్లు (ఈస్ట్రోజెన్), జన్యుపరమైన కారకాలు,  ఇంట్లో ఉపయోగించే ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ (కట్టె, బొగ్గు, ఆవు పేడ కేకులు) కూడా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాహన పొగ, పారిశ్రామిక కాలుష్యం,  ఘన ఇంధనాల నుండి వచ్చే పొగ మహిళలకు ప్రధాన ప్రమాదం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కట్టెలు, బొగ్గు, చాలా కాలం పాటు హానికరమైన పొగను ఎదుర్కోవలసి వస్తుంది. ధూమపానం చేయని స్త్రీలు ఎక్కువ కాలం ధూమపానం చేసే వారితో  ఉంటే, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20-30% ఎక్కువగా ఉంటుంది. కొన్ని జన్యు సమస్యలు మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ క్యాన్సర్‌ను కూడా ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఇది సాధారణ క్యాన్సర్,  ఊపిరితిత్తుల కణాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. పరిశోధన ప్రకారం, ఈస్ట్రోజెన్ నిరోధక మందులు కణితి పెరుగుదలను నిరోధించగలవు, కొన్ని వృత్తులలో మహిళలు ఆస్బెస్టాస్, ఆర్సెనిక్,  డీజిల్ పొగలు వంటి హానికరమైన వాయువులకు గురవుతారు. నిర్మాణం, కర్మాగారాలు,  హెయిర్ సెలూన్లలో ఉపయోగించే రసాయనాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ లేదా TB (క్షయ) వంటి వ్యాధులు ఉన్న స్త్రీలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక వాపును కలిగిస్తాయి. ఇది క్యాన్సర్‌గా మారవచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల గురించి పట్టించుకోరు. అలసట, తేలికగా శ్వాస ఆడకపోవడం లేదా తరచుగా దగ్గు రావడం ఒత్తిడి లేదా వయస్సు పెరుగుదల వల్ల ఇలా జరుగుతోందని భావించి మహిళలు వైద్యుడిని సంప్రదించరు. అందుకే క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడుతుంది. ఇలా జరిగితే చికిత్స కూడా ప్రశ్నార్థకం అవుతుంది.                                          *రూపశ్రీ.

  నెలసరి సరిగా రావడం లేదా...ఈ విషయాలు తెలుసుకోండి..!   నెలసరి ఆడవారి జీవితంలో తప్పనిసరి భాగం.  నెలసరి సరిగా రాకపోతే ఎంత ఆందోళన పడతారో అది కేవలం మహిళలకే తెలుసు.  ఈ నెలసరి జాప్యం వల్ల మానసికంగానే కాక శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోంటారు.  ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమస్యలు వస్తాయి. అది ఒత్తిడికి దారి తీస్తుంది.  నిజానికి మహిళలలో వివిధ కార్యకలాపాల వల్ల ఒత్తిడి పెరగడం వల్లనే నెలసరి కూడా సరిగా రావడం లేదని, దీనికి తోడు ఆహారం విషయంలో చేసే నిర్లక్ష్యం మహిళల ఋతుచక్రానికి ఇబ్బంది కలిగిస్తాయని ఆహార నిపుణులు, మహిళా వైద్యులు అంటున్నారు.  నెలసరి సరిగా రానివారు కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని  ఫాలో అవ్వడం వల్ల తిరిగి నెలసరిని ఒక గాడిలో పెట్టవచ్చు. నెలసరి మీద ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. ఇప్పుడెలాగో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలకు తరచుగా ఒత్తిడి స్థాయిలు పెరగడం వల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అండోత్సర్గముకు అంతరాయం కలిగిస్తుంది. ఇది ఋతు చక్రంపై ఈ విధంగా ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేస్తే.. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ఋతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. "ధ్యానం, యోగా, కౌన్సెలింగ్,  కుటుంబం,  స్నేహితులతో ఓపెన్ గా మాట్లాడటం  వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాదు.. బయటకు వెళ్లడం,  అభిరుచులు,  ఇష్టమైన కార్యకలాపాలలో  పాల్గొనడం లేదా ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలలో చేరడం కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలలో నెలసరి అనేది 28 రోజులకు కాస్త ముందు లేదా తరువాత రావడం  పరిపాటి.  అయితే  దీనికి మించి చాలా జాప్యం ఉంటే  జీవనశైలిని,  ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.    ప్రతి నెలా నెలసరి రావడంలో ఎక్కువ రోజులు జాప్యం జరుగుతూ ఉంటే అది చాలా ప్రమాదం.  వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా గర్భధారణ ప్లాన్ చేసుకోవాలి అనుకునే మహిళలు క్రమం తప్పకుండా నెలసరి వచ్చేలా చూసుకోవడం ముఖ్యం. గర్భం దాల్చడానికి ప్రయత్నించని వారు నెలసరి మరీ ఆలస్యంగా ఎక్కువ నెలలు కొనసాగితే గర్భాశయ సమస్యలు ఏవైనా ఉండే  అవకాశం ఉంటుంది.  అందుకే నెలసరి విషయంలో ఏ మహిళ కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.                                   *రూపశ్రీ. 

మహిళలలో హార్మోన్ బాలెన్స్ గా ఉండటానికి భలే మంచి ప్రణాళిక..!   శరీర తన పని తాను సమర్థవంతంగా  చేయడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి.  మహిళలు  తీసుకునే ఆహారం ఈ సమతుల్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆహారం హార్మోన్ల ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో,  పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో అర్థం చేసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో హార్మోన్ల సమతుల్యత చాలా అవసరం. మహిళలలో పునరుత్పత్తి ఆరోగ్యం విషయానికి వస్తే హార్మోన్ల సమతుల్యత కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్లు  శరీరంలోని వివిధ విధులను నియంత్రించడానికి బాధ్యత వహించే రసాయన దూతలు అని చెప్పవచ్చు. ఇందులో జీవక్రియ, మానసిక స్థితి నియంత్రణలు, సంతానోత్పత్తిని రక్షించడం వంటి పనులు ఉంటాయి". ఈ కీలకమైన హార్మోన్ల సమతుల్యత చెదిరిపోయినప్పుడు, చికిత్స చేయకపోతే సమస్యాత్మకంగా మారే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో  రుతుక్రమం అస్తవ్యస్తం అవ్వడం, సంతానోత్పత్తిలో సమస్యలు, థైరాయిడ్ సమస్య,  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది.  తినే ఆహారం,  శరీరంలోని హార్మోన్ల మధ్య చాలా సంబంధం ఉంటుంది.  తినే ఆహారమే హార్మోన్ల ఉత్పత్తి,  నియంత్రణపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది". సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్లు బాలెన్స్ గా ఉండటంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అదే సమయంలో పునరుత్పత్తి వ్యవస్థ  సరైన పనితీరుకు మద్దతు ఇస్తుంది. "కొన్ని ఆహారాలు హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి, మరికొన్ని హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి.  ఆహారాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలంటే.. చక్కెర..  పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి,   హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం మానేయాలి. అధిక చక్కెర తీసుకోవడం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది  శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను ప్రతికూలంగా దెబ్బతీస్తుంది.  ముఖ్యంగా PCOS వంటి  సమస్యలు ఉన్న మహిళల్లో. రోజువారీ చక్కెర తీసుకోవడం తగ్గించడం మంచిది.  ఏదైనా తీపి తినాలని అనిపిస్తే.. పండ్లు, గింజలు,  తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంచుకోవాలి. ఇవి హార్మోన్ల ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ  ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారం.. సమతుల,  పోషకమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వీలవుతుంది.  భోజనంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, లీన్ ప్రోటీన్లు, కాయధాన్యాలు,  చిక్కుళ్ళు ఉండాలి. ఇది  శరీరం హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్.. హార్మోన్ల ఉత్పత్తి విషయానికి వస్తే ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.  రోజువారీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో నిండిన ఆహారం  శరీరానికి పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన  అమైనో ఆమ్లాలు అందిస్తుంది.  ఫైబర్..  శరీరం నుండి అదనపు హార్మోన్లను, కొలెస్ట్రాల్ ను  తొలగించడంలో ఫైబర్ వంటి పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్ తీసుకోవడం  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈస్ట్రోజెన్ స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు లేదా తృణధాన్యాలు వంటి ఫైబర్‌తో నిండిన ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి.  ఇవి ఆరోగ్యకరమైన హార్మోన్ స్థాయిలకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి.                                   *రూపశ్రీ.

మహిళలలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఇదే.. !     ప్రపంచంలో మహిళల పాత్ర అనిర్వచనీయం. ఇంటా,  బయటా అన్ని రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు.  వీరి గురించి సాధారణ రోజుల కంటే మహిళా దినోత్సవం రోజు ఒకింత ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు.  ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు లింగ సమానత్వం, మహిళల హక్కులు,  మహిళలపై హింస,  దుర్వినియోగం వంటి విషయాల గురించి సమాజానికి అవగాహన కల్పించి, మహిళల జీవితాలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీటన్నింటితో పాటు మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. పురుషుల కంటే స్త్రీలు వివిధ రకాల వ్యాధులు, పోషకాహార లోపాలు,  ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  57శాతం కు పైగా మహిళలను పట్టి పీడిస్తున్న ఒక సమస్య గురించితెలుసుకుంటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (NFHS-5) ప్రకారం, భారతదేశంలో 15-49 సంవత్సరాల వయస్సు గల 57% మంది మహిళలు రక్తహీనత ప్రమాదంలో ఉన్నారు . పురుషుల కంటే మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా  చదువురాని మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం, ఋతుస్రావం,  గర్భధారణ సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా పడిపోయినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్.  ఇది  శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మహిళల్లో రక్తహీనతకు అతి పెద్ద కారణం ఐరన్ లోపం. రక్తహీనత ఎందుకంత ప్రమాదం..  కూడా రక్తహీనత ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు గర్భధారణ సమయంలో స్త్రీ శరీరానికి శిశువు అభివృద్ధికి ఎక్కువ పోషకాలు అవసరం. ఈ సమయంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్,  విటమిన్ బి12 లను తీసుకోకపోతే, రక్తహీనత వస్తుంది. రక్తహీనత వల్ల సంతానోత్పత్తి తగ్గడం, గర్భధారణ సమయంలో అకాల ప్రసవం, నవజాత శిశువు బరువు తక్కువగా పుట్టడం,  మానసిక,  శారీరక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే.. రక్తహీనతను నివారించడానికి చిన్నప్పటి నుండే ఆహారాన్ని మెరుగుపరచడం అవసరం. దీని కోసం, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు (పాలకూర, మెంతికూర, తోటకూర, మునగకూర), బీట్‌రూట్, దానిమ్మ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తినేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, సోయా, పాలు, గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్,  విటమిన్ బి12 కోసం ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పప్పులు, మాంసం, పాలు చేర్చుకోవచ్చు.  ఆహారంలో నిమ్మ, నారింజ, ఉసిరి వంటి విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. కాబట్టి విటమిన్-సి తీసుకుంటే ఐరన్ గ్రహించడంలో శరీరానికి ఇబ్బంది కలగదు.                                   *రూపశ్రీ.