Home » Fitness » బీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి..?

బీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి..?

 

1. బీపీ ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు. ఇవి చేసేటప్పుడు ఆయాసం రాకుండా చూసుకోవడం ఎంతో ఉత్తమం.

2. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు.

3. కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.

4. బీపీ తగ్గడంకోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమం.

5. శవాసనం ప్రతిరోజూ 10 నిమిషాలు చేయటంవలన అధిక బీపీ ఉన్నవారిలో అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు తెలిపారు.

6. సుఖ ప్రాణాయామం, భారీ ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం ప్రతి రోజూ చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా చేయడంవలన అధిక బీపీ తగ్గడమే కాకుండా సీరమ్ లిపిడ్స్‌లో మంచి మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img