న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!   డిసెంబర్ నెలను పార్టీ సీజన్ అని చెప్పవచ్చు.  ఒకవైపు క్రిస్మస్ వేడకలు,  మరొకవైపు న్యూ ఇయర్ వేడుకలు.. ఈ పార్టీ సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి చోట చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలని కోరుకుంటుంది.  అది ఫ్రెండ్  పార్టీ అయినా, ఆఫీస్ పార్టీ అయినా, లేదా ఫ్యామిలీ మీట్ అయినా ప్రతి ఒక్కరూ తమ ఎంట్రీ  స్టైలిష్‌గా,  రాయల్ గా  కనిపించాలని కోరుకుంటారు. అయితే వీటికి అటెండ్ అవ్వడానికి  ఖరీదైన మేకప్ ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలని  అనుకుంటూ ఉంటారు.  కానీ నిజమేంటంటే అలాంటివి అవసరం లేదు. స్మార్ట్ స్కిన్ కేర్, సరైన మేకప్ చిట్కాలు,  గ్లో ట్రిక్స్‌తో.. ఇంట్లోనే పర్పెక్ట్ పార్టీ లుక్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అందాన్ని పెంచే సులభమైన గ్లో చిట్కాలు.. పార్టీకి ముందు..   ఏదైనా మేకప్‌కి బలమైన బేస్ అవసరం.  ఇందుకోసం  చర్మం ప్రిపేర్ కాకపోతే,  మేకప్ ఎంత బాగున్నప్పటికీ, అది అంత బాగా కనిపించదు. పార్టీకి ముందు  చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి,   చర్మాన్ని మృదువుగా చేయడానికి టోనర్‌ను అప్లై చేయాలి. దీని తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది  చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా సహాయపడుతుంది. బేస్ మేకప్..  బేస్ మేకప్‌లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అప్లై చేయడం. ప్రైమర్  ఫౌండేషన్ సజావుగా కలపడానికి, క్రాక్స్   నివారించడానికి సహాయపడుతుంది. చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకుని, దానిని పూర్తిగా బ్లెండ్ చేయాలి.  నల్లటి మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే వాటిని తేలికపాటి కన్సీలర్‌తో కప్పాలి. ఇది  ముఖాన్ని తాజాగా,  కంప్లీట్ గా  కనిపించేలా చేస్తుంది. ఐ మేకప్.. పార్టీ లుక్ కోసం ఐ మేకప్ చాలా ముఖ్యం.  కళ్ళకు మెరుపు,  కళ్ల సైజ్, కళ్లు అట్రాక్షన్ గా కనిపించడానికి  ఐషాడోను ఉపయోగించవచ్చు.  ఐలైనర్ అంచులుగా ఉండేలా చేసి,  హెవీ మస్కారాను అప్లై చేయడం  ద్వారా  కంటి మేకప్‌కు గ్లామర్‌ను జోడించవచ్చు. కావాలనుకుంటే లుక్‌ను డ్రామాటిక్ గా,  పార్టీకి తగ్గట్టు మరింత హైలెట్ చేయడానికి   ఐ లాషెస్ కూడా పెట్టుకోవచ్చు. మెరిసే లుక్ కోసం.. చర్మం సహజంగా,  తాజాగా మెరిసిపోవాలంటే హైలైటర్, బ్లష్,  డ్యూయ్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా ముఖ్యం.  చెంప ఎముకలు, ముక్కు,  గడ్డంపై తేలికపాటి హైలైటర్‌ను అప్లై చేయాలి. ఇది  ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా పార్టీ లైట్లలో షైనింగ్ ఇస్తుంది.  లుక్‌ను తాజాగా,  యవ్వనంగా ఉంచడానికి  బ్లష్‌ను లైట్ గా, నాచురల్ గా   ఉంచాలి.  మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే.. మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే వేయడం చాలా అవసరం. ఇది  లుక్‌ను తాజాగా ఉంచుతుంది,  అలాగే తొందరగా చెదిరిపోకుండా  ప్రొటెక్ట్ చేస్తుంది.  పార్టీ సమయంలో  ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం చాలా ముఖ్యం.  ఇది  మేకప్‌ ఎక్కువసేపు  చెదిరిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.                            *రూపశ్రీ.

పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..! ఆడవారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం,  పోషకాల లోపం వల్ల అనీమియా, కండర ద్రవ్యరాశి,  ఎముకలు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.  అయితే తక్కువ పరిమాణంలో తిన్నా శరీరానికి మెరుగ్గా పోషకాలు అందించగల ఆహారాలు ఇలాంటి లేడీస్ సమస్యలకు చక్కగా చెక్ పెడతాయి. అలాంటి వాటిలో గుమ్మడికాయ విత్తనాలు ప్రముఖమైనవి. అసలు గుమ్మడికాయ విత్తనాలలో ఉండే పోషకాలేంటి? వీటిని ఆహారంలో ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు? తెలుసుకుంటే.. గుమ్మడికాయ గింజలలో పోషకాలు.. గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, మెగ్నీషియం,  ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా ఐరన్  కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల  ఆరోగ్యం బలోపేతం అవుతుందని మహిళా వైద్యులు అంటున్నారు. ఐరన్ కు పవర్ హౌస్.. గుమ్మడికాయ గింజలు ఐరన్ కు  అద్భుతమైన మూలం. వాటిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాలకూర,  బీట్ రూట్ వంటి ఐరన్ సోర్స్ ఎక్కువగా ఉన్న  ఆహారాల కంటే ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి,  శరీరమంతా ఆక్సిజన్ రవాణాకు ఐరన్ చాలా అవసరం. ఈ విత్తనాలను ప్రతిరోజూ గుప్పెడు తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.  ఇది రోజంతా  శక్తివంతంగా ఉంచుతుంది. మంచి నిద్ర, మనశ్శాంతి.. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టోఫాన్ మెదడును ప్రశాంతపరుస్తుంది,  సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  సెరోటోనిన్ ను హ్యాపీ ఫీలింగ్ హార్మోన్ అని అంటారు.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.   హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్.. గుమ్మడికాయ విత్తనాలలోని మెగ్నీషియం  ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ కణాలు రక్తంలో చక్కెరను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్,  ప్రీ-డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్లు.. గుమ్మడికాయ గింజలు జింక్,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన కలయిక. జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది,  చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ E జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి. ఇవి జుట్టు, చర్మం,  గోళ్లను ఆరోగ్యంగా, మెరిచేలా,  బలంగా ఉంచుతాయి.                                  *రూపశ్రీ.


Online Jyotish
Tone Academy
KidsOne Telugu

పిల్లల పాదాలను మసాజ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలుసా.. పుట్టిన పిల్లల లైఫ్ స్టైల్ లో మసాజ్ అనేది కీలకంగా ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజూ పాదాలకు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. బేబీకి మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మంచి మసాజ్ రోజంతా అలసట,  నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నవజాత శిశువుల నుండి పరిగెత్తే పిల్లల వరకు..  పాదాలకు మసాజ్ చేయడం వారి శారీరక అభివృద్ధికి మాత్రమే కాకుండా వారి మానసిక,  భావోద్వేగ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. పిల్లల పాదాలను మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పాదాలను మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. పిల్లల పాదాలకు మసాజ్ ఎందుకు చేయాలి? పాదాల మసాజ్ పిల్లలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాలాసార్లు పిల్లలు స్కూల్,  చదువు లేదా సామాజిక ఒత్తిడి కారణంగా ఒత్తిడికి గురవుతారు.  ఇలాంటి పరిస్థితులలో పాదాల మసాజ్ మెదడును శాంతపరచడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.. పాదాల మసాజ్ పిల్లలు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పాదాల మసాజ్ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది ప్రశాంతంగా,  గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మెరుగైన శారీరక,  మానసిక అభివృద్ధికి దారితీస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కండరాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఇది పిల్లల శక్తిని పెంచుతుంది. మసాజ్ చేయని పిల్లలతో పోలిస్తే మసాజ్ చేసే పిల్లలు మరింత చురుకుగా చదవగలరు,  ఆడగలరు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. పాదాల రిఫ్లెక్సాలజీ శిశువులు,  పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.. పిల్లల పాదాలు ఆటలు ఆడిన తర్వాత నొప్పిగా లేదా అలసిపోయినట్లు అనిపించవచ్చు. పాదాల మసాజ్ కండరాలను సడలించడం ద్వారా నొప్పిని తగ్గిస్తుంది. పాదాలను మసాజ్ చేసేటప్పుడు, పిల్లలతో సమయం గడుపడటం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య   భావోద్వేగ బంధం బలపడుతుంది. జీర్ణవ్యవస్థ.. పాదాలపై కొన్ని రిఫ్లెక్స్ పాయింట్లు జీర్ణవ్యవస్థకు సంబంధించినవి ఉంటాయి. వాటిని మసాజ్ చేయడం వల్ల పిల్లలలో మలబద్ధకం, అపానవాయువు,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కొబ్బరి లేదా బాదం వంటి నూనెలను ఉపయోగించి పిల్లలకు మసాజ్ చేయడం మంచిది. శిశువు చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి మసాజ్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు.  బిడ్డకు ఏవైనా గాయాలు లేదా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మసాజ్ చేయడం మంచిది కాదు.                                     *రూపశ్రీ.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

మహిళలు మహారాణి లాంటి జీవితం పొందాలన్నా.. పేదరికంలో మగ్గిపోవాలన్నా ఈ 5 విషయాలే డిసైడ్ చేస్తాయ్..! ప్రపంచంలో అందరు  వ్యక్తుల జీవితం ఒకేలా ఉండదు. ఇందులో మహిళల జీవితం మినహాయింపేమీ కాదు. కానీ సరిగా గమనిస్తే.. బాగా ఆలోచిస్తే.. ప్రారంభం ఎలా ఉన్నా.. కాలంతో పాటు ఎదిగి సాధారణ మహిళలు కూడా మహారాణుల్లా గొప్ప స్థానానికి ఎదిగిన వారు ఉన్నారు.  గొప్ప జీవితంతో తమ ప్రయాణం మొదలుపెట్టి పాతాళానికి పడిపోయి పేదరికంతో పోరాడుతున్న మహిళలు కూడా ఉన్నారు.  ఇదంతా ఎందుకు జరుగుతుంది? మహిళల జీవితాలను నిర్ణయించే విషయాలు ఏంటి? కేవలం 5 విషయాలు మహారాణుల్లా గొప్ప స్థానాలు ఇవ్వగలవు, పేదరికంలోనూ ముంచేయగలవు.. అవేంటి? తెలుసుకుంటే.. కష్టం, సోమరితనం.. కష్టపడి పనిచేసే స్త్రీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే సామర్థ్యం ఉంటుంది. మహిళలలోని అంకితభావం, కృషి,  పట్టుదల ఆమెకు గౌరవాన్ని,  విజయాన్ని,  శ్రేయస్సును తెస్తాయి. సోమరితనం  స్త్రీని వెనక్కి నెట్టివేస్తుంది.  పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. సోమరితనం ఎదుగుదల, విశ్వాసం,  ఏదైనా నేర్చుకోవడం  లేదా సాధించడం అనే లక్ష్యాలకు   అతిపెద్ద శత్రువుగా మారుతుంది. పొదుపు, దుబారా.. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా అందులో స్త్రీల పాత్ర చాలా కీలకం.    డబ్బు విలువను అర్థం చేసుకుని తెలివిగా పొదుపు చేసే స్త్రీలు తమ కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోగలుగుతారు.  కానీ ఆడవాళ్లకు   దుబారా అలవాట్లు ఉంటే ఆమె జీవితమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్త్రీలు  కుటుంబం పతనం కావడానికి, ఆర్థిక కష్టాలు అనుభవించడానికి కారణం అవుతారు. మోసం, నిజాయితీ.. నిజాయితీ అనేది ప్రతి సంబంధానికి బలమైన పునాది.   నిజాయితీపరులైన స్త్రీ సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. దీనికి విరుద్ధంగా అబద్ధాలు చెబుతూ  ఉంటే వారి మోసం  సంబంధాలను బలహీనపరచడమే కాకుండా జీవితంలో బాధ, ఒత్తిడి,  అపనమ్మకాన్ని కూడా పెంచుతాయి. ఓర్పు, కోపం.. ఓర్పు,  సంయమనం స్త్రీకి ఉన్న గొప్ప బలాలుగా భావిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ఏ పరిస్థితినైనా నిర్వహించగల స్త్రీ ఎలాంటి పరిస్థితిలోనైనా విజయం సాధిస్తుంది,  బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. దీనికి విరుద్ధంగా, తొందరగా కోపం తెచ్చుకునే స్త్రీలు సంబంధాలలో విభేదాలు, గొడవలు రావడానికి కారణం అవుతుంది.  ఎక్కువ కోపం, తొందరగా కోపం వచ్చే స్త్రీల జీవితం ఒత్తిడి,  సమస్యలతో నిండిపోతుంది. నేర్చుకోవడం,  స్తబ్దత.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ,  కాలానికి అనుగుణంగా మారుతూ ఉండే స్త్రీలు జీవితంలో అన్ని విధాలా అభివృద్ది చెందుతూ ఉంటారు. నేర్చుకునే అలవాటు మహిళలను ప్రతి రంగంలోనూ బలంగా, విజయవంతం అయ్యేలా చేస్తుంది.  నేర్చుకోవడం పట్ల ఆసక్తి లేకుండా కేవలం తిని కూర్చుకొంటూ ఎంజాయ్ చేయాలనే మహిళలు వెనుకబడిపోతారు.                                              *రూపశ్రీ.