వెట్ వైప్స్.. చాలామంది మహిళలు ఉపయోగించే వెట్ వైప్స్ గురించి ఈ నిజాలు తెలుసా..
.webp)
చర్మ సంరక్షణలో భాగంగా చాలామంది మహిళలు వెట్ వైప్స్వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తగిన సమయం లేదా వాతావరణం లేనప్పుడు, మేకప్ తొలగించడానికి సమయం లేనప్పుడు వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా తొందరగా ముఖ చర్మం మీద మురికి, నూనె, మేకప్.. మొదలైనవాటిని తొలగిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు మంచిదే అయినప్పటికీ వీటిని పదే పదే ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. ఇంతకీ వెట్ వైప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటి? వీటి గురించి చాలామందికి తెలియని నిజాలు తెలుసుకుంటే..
వెట్ వైప్స్ లో ఏముంటుంది?
వెట్ వైప్స్ లో ఆల్కహాల్, రసాయనాలు, సువాసనలు ఉంటాయి. ఇవి చర్మానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి.
వెట్ వైప్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది?
వెట్ వైప్స్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తే, వాటిలోని ఆల్కహాల్, రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. ఇది కొన్నిసార్లు చర్మాన్ని చాలా పొడిగా చేస్తుంది. ఎంత మాయిశ్చరైజర్ వాడినా దానిని తగ్గించడం కష్టం అవుతుంది.
ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వెట్ వైప్స్ ను పదే పదే ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం, దురద, దద్దుర్లు వస్తాయి. కొన్నిసార్లు, ఈ చికాకు చాలా ఎక్కువగా అవుతుంది. ఇది హాస్పిటల్స్ కు వెళ్లే పరిస్థితిని కూడా తీసుకురావచ్చట.
ఇప్పటికే సెన్సిటివ్ స్కిన్ ఉంటే వెట్ వైప్స్ వాడకపోవడం బెటర్. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ సులభంగా మొటిమలకు, ర్యాషెస్ కు గురవుతుంది.
చిన్న వయసులోనే ముసలి వాళ్ల లాగా ముఖ చర్మం కనిపిస్తుంటే.. వెట్ వైప్స్ వాడటం కారణం కావచ్చు.
వెట్ వైప్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోయి చాలా త్వరగా వృద్దాప్యానికి లోనవుతుంది.
*రూపశ్రీ.



