Home » Beauty » ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి!

ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి!

ముఖం మీద రేజర్ ఉపయోగిస్తున్నారా..  ఈ తప్పులు చేయకండి!


చాలామంది మహిళల్లో  ముఖంపై అవాంఛిత రోమాలు కనిపిస్తూ ఉంటాయి.  వీటిని  తొలగించడానికి ఫేస్ షేవింగ్ ఎంచుకుంటూ ఉంటారు. ఇది వెంట్రుకలను తొలగించడమే కాకుండా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మేకప్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి బాగా కలిసిపోయేలా చేసి చర్మం బాగా కనిపించేలా చేస్తుంది.  అయితే, ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సరైన జాగ్రత్త, ఉపయోగించే విధానం తెలియకుండా పేస్ రేజర్ ఉపయోగిస్తే చాలా నష్టపోతారు.  ఆ తరువాత చాలా భాదపడాల్సి ఉంటుంది.  అందుకే.. ముఖం మీద రేజర్ ఉపయోగించే ముందు కొన్ని తప్పులు చేయకూడదని బ్యూటీ ఎక్పర్ట్స్ చెబుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే..


రేజర్ ఎంపిక..

ముఖానికి బాడీ రేజర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ముఖం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫేషియల్ రేజర్‌ను ఉపయోగించాలి. దీనికి చిన్న, సన్నని బ్లేడ్ ఉంటుంది. రేజర్ బ్లేడ్ పదునుగా ఉందో లేదో  తనిఖీ చేసుకోవాలి. పాత బ్లేడ్‌లు చర్మానికి చికాకును కలిగిస్తాయి. అలాగే, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి రేజర్ ను ఉపయోగించే ముందు,  తర్వాత శానిటైజర్ లేదా ఆల్కహాల్‌తో రేజర్‌ను శుభ్రం చేసుకోవాలి.

ప్రిపరేషన్..

పొడి చర్మం ఉన్నవారు ఎప్పుడూ రేజర్ వాడకూడదు. దీనివల్ల చికాకు పెరిగే అవకాశం ఉంది. పైగా వాడే ముందు స్కిన్ ను ప్రిపేర్ చేయాలి. ముందుగా  ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. షేవింగ్ సులభతరం చేయడానికి, కలబంద జెల్, ఫేషియల్ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్ రాయాలి . ఇది రేజర్ కు  చర్మం మధ్య ప్రొటెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

షేవింగ్ టెక్నిక్..

ముఖం షేవింగ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది, దానిని అనుసరించడం ముఖ్యం.

రేజర్‌ను ఎప్పుడూ చర్మానికి 45 డిగ్రీల కోణంలో ఉంచాలి.  రేజర్‌పై ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. సున్నితంగా.. చిన్న స్ట్రోక్‌లను ఉపయోగించాలి. ఎల్లప్పుడూ జుట్టు పెరిగే దిశలోనే షేవ్ చేసుకోవాలి.  వ్యతిరేక దిశలో షేవింగ్ చేయడం వల్ల లోపలికి వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ సులభంగా జారగలిగేలా, మరో చేత్తో చర్మాన్ని కొద్దిగా పైకి లాగి  గట్టిగా పట్టి ఉంచండి.

షేవింగ్ తర్వాత..

షేవింగ్ తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, కాబట్టి సరైన జాగ్రత్త అవసరం.

షేవింగ్ చేసిన తర్వాత చర్మాన్ని కూల్ గా ఉంచడానికి  ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.  షేవింగ్ చేసే రోజున విటమిన్ సి లేదా AHA/BHA, లేదా రెటినోల్ వంటి  రసాయన ఎక్స్‌ఫోలియెంట్‌లను వాడకూడదు. ఇవి చర్మాన్ని చికాకుపెడతాయి.  మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్  తో ముఖాన్ని హైడ్రేట్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

షేవింగ్ ఎప్పుడు చేయకూడదు..

మొటిమలు, కోతలు లేదా చర్మ ఇన్ఫెక్షన్ ఉంటే, షేవింగ్ చేయకూడదు. రేజర్ వాడటం వల్ల  ముఖం అంతటా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.   సమస్య మరింత తీవ్రమవుతుంది.


                                        *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img