Home » Baby Care » పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు ఇవీ..!

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు ఇవీ..!

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు ఇవీ..!


పిల్లలు శారీరక పెరుగుదల పరంగా,  మెదడు అభివృద్ధి పరంగా కీలక దశలో ఉంటారు. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే వారికి సమతుల్య పోషణ చాలా అవసరం. ఇది నేర్చుకునే సామర్థ్యం, రోగనిరోధక శక్తి, శరీర  శక్తి స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్లు,  ఖనిజాలు వంటి అవసరమైన సూక్ష్మపోషకాలతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి స్థూలపోషకాలతో కూడిన చక్కటి ప్లానింగ్ తో కూడిన ఆహారం పిల్లలకు ఎంతో అవసరం.  పిల్లల మెదడు అభివృద్దికి  7 పోషకాలు చాలా అవసరం. ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే..

ప్రోటీన్..

కణజాలాల నిర్మాణం, కణజాల  మరమ్మత్తుకు,  కండరాల పెరుగుదలకు తోడ్పడటంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  రోజువారీ ఆహారంలో గుడ్లు, పాల ఉత్పత్తులు,  పప్పుధాన్యాలు చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా గింజలు, విత్తనాలు,  చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి,  ఏకాగ్రతను మెరుగుపరచడానికి చాలా కీలకమైనవి.

ఐరన్..

పిల్లల మేధో వికాసానికి ఐరన్ ఒక కీలకమైన పోషకం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడటంతో పాటు, మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరాను  అందించడంలో సహాయపడుతుంది. ఐరన్  లోపం వల్ల అలసట, ఏకాగ్రత లోపం,  చదువులో చురుగుదనం తగ్గడం వంటివి ఎదురవుతాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పోషక విలువలున్న ధాన్యాలు వంటి ఆహారాలు శరీరంలో  ఐరన్  స్థాయిలు సమతుల్యంగా  ఉండటంలో సహాయపడతాయి.

కాల్షియం, విటమిన్-డి..

బలమైన ఎముకలు,  దంతాలకు కాల్షియం,  విటమిన్ డి చాలా అవసరం. పిల్లలకు పాలు, పెరుగు,  జున్ను ఇవ్వాలి.  బి విటమిన్లు శక్తి జీవక్రియకు, శరీరం చురుగ్గా ఉండటానికి సోపోర్ట్ ఇస్తాయి. తద్వారా పిల్లలు రోజంతా చురుకుగా,  ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడతాయి.

కార్బోహైడ్రేట్లు..

గోధుమ, ఓట్స్, మిల్లెట్,  బ్రౌన్ రైస్ వంటి సంపూర్ణ ధాన్యాలు రోజంతా శక్తిని అందిస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి,   పాఠశాల సమయంలో అలసటను నివారిస్తాయి. దీనితో పాటు, పప్పులు, పనీర్, గుడ్లు,  సోయా ఉత్పత్తుల వంటి వనరుల నుండి లభించే ప్రోటీన్లు మెదడు అభివృద్ధికి, ఏకాగ్రత,  చురుకుదనాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకమైనవి.

సూక్ష్మ పోషకాలు..

జింక్,  విటమిన్ సి వంటి సూక్ష్మపోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి, ఇవి పిల్లల చదువుకు ఆటంకం కలిగించే సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. నిమ్మజాతి పండ్లు, గింజలు, విత్తనాలు,  పప్పుధాన్యాలు  ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచివి.

అయోడిన్..

 థైరాయిడ్ సరిగ్గా  పనిచేయడానికి,  మెదడు అభివృద్ధికి అత్యవసరమైన పోషకం అయోడిన్.  చాలామంది అయోడిన్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.   వంటలో అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం ద్వారా అయోడిన్ లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా విటమిన్ ఎ కంటిచూపుకు,  రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు..

గింజలు,  విత్తనాలు నాడీ వ్యవస్థ అభివృద్ధికి,  గ్రహణశక్తి పనితీరుకు తోడ్పడతాయి. వాటిని చిరుతిళ్లలో చేర్చుకోవడం చాలా మంచిది. పండ్లు,  గింజల వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో శక్తి లేకపోవడం అనే సమస్యను అధిగమించవచ్చు.  అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరచుకోవచ్చు.

                            *రూపశ్రీ

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img