Home » Beauty » కాంబినేషన్ చర్మంతో కన్ప్యూజ్ అవుతున్నారా.. ఇది అప్లై చేస్తే సెట్టు..!

కాంబినేషన్ చర్మంతో కన్ప్యూజ్ అవుతున్నారా.. ఇది అప్లై చేస్తే సెట్టు..!

కాంబినేషన్ చర్మంతో కన్ప్యూజ్ అవుతున్నారా.. ఇది అప్లై చేస్తే సెట్టు..!

చర్మంలో రకాలు ఉంటాయి.  సెన్సిటివ్ స్కిన్,  డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ తో పాటు కాంబినేషన్ స్కిన్ కూడా ఉంటుంది.  కాంబినేషన్ స్కిన్ ఉన్నవారిలో ముఖంలో గడ్డం,  బుగ్గలు వంటి ప్రాంతాలు బాగా డ్రై గానూ,  నుదురు,  ముక్కు వంటి ప్రాంతాలు ఆయిల్ గానూ ఉంటాయి.  డ్రై స్కిన్ ఉన్నవారు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు,  ఆయిల్ స్కిన్ ఉన్నవారు తమ చర్మానికి తగినట్టు ఫేస్ ప్యాక్ లు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఎంపిక చేసుకోవడం సులువు. కానీ.. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఎలాంటి ఉత్పత్తులు ఉండవు.  ఇలాంటి వారు కనీసం ఇంట్లో ఏదైనా ఫేస్ ప్యాక్ లాంటివి ట్రై చేయాలన్నా చాలా గందరగోళానికి గురవుతూ ఉంటారు.  అయితే.. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు ఇంట్లోనే హాయిగా అప్లై చేసుకోగల ఫేస్ ప్యాక్ ఉంది. అదేంటో.. అది కాంబినేషన్ స్కిన్ ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటే..

పసుపు, పెరుగు పేస్ట్..

పసుపు, పెరుగు రెండూ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపు, పెరుగు రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి మచ్చలను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగు, పసుపును కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

పసుపు, పెరుగు పేస్ట్ అప్లై చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

మొటిమలకు..

 ముఖానికి పెరుగు, పసుపు పూయడం వల్ల మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ చర్మం  ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. పెరుగు, పసుపులో ఉండే యాంటీసెప్టిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలను నయం చేయడానికి సహాయపడతాయి.

మెరిసే చర్మానికి..

పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి, చర్మ ఛాయ మెరుగుపడుతుంది. కాంతివంతమైన చర్మం కోసం పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

ఎండదెబ్బ నుండి ఉపశమనం..

వేసవి కాలంలో చర్మం తరచుగా ఎండకు కమిలిపోతుంది. ఎండ వలన కలిగే మంటను తగ్గించడానికి , నల్లబడటాన్ని నివారించడానికి  పెరుగు, పసుపు ఫేస్ మాస్క్‌ను వేసుకోవచ్చు. పెరుగు , పసుపు ఫేస్ మాస్క్ చర్మానికి పోషణను అందిస్తుంది. ఎండ వలన కలిగే మంట నుండి ఉపశమనం పొందడానికి,  పెరుగు , పసుపు ఫేస్ మాస్క్‌ను వేసుకోవచ్చు.

తేమ..

పెరుగు, పసుపుతో చేసిన ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి లోతైన పోషణ లభించి, మృదువుగా, సున్నితంగా మారుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెరుగు, పసుపులలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల, అవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి.

వృద్దాప్యం..

పెరుగు, పసుపుతో చేసిన ఫేస్ మాస్క్ ఉబ్బును తగ్గిస్తుంది. పెరుగును ఉపయోగించడం వల్ల చర్మం బిగువుగా, కాంతివంతంగా మారుతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

పెరుగు, పసుపు ప్యాక్ ఎలా తయారు చేయాలి..?

రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో  చిటికెడు పసుపును కలపాలి. దీనిని  మెడకు 15 నుండి 20 నిమిషాల పాటు పట్టించాలి.  అది ఆరిన తర్వాత, చల్లటి నీటితో మెల్లగా మసాజ్ చేసి, ముఖం కడుక్కోవాలి. దీన్ని వారంలో కనీసం ఒకటి నుండి రెండు సార్లు ముఖానికి అప్లై చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.  ముఖ్యంగా వేసవి కాలంలో తప్పకుండా కాంబినేషన్  స్కిన్ ఉన్నవారు దీన్ని ట్రై చేస్తే మంచిది.

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img