ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, అదే విధంగా ఆడవాళ్ళువారి వారి శరీరాకృతికి తగ్గట్టు దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. తమ శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం ద్వారా పార్టీల్లో ఇతరులను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న మహిళలు ఎలాంటి డ్రెస్సులను వాడాలో ఈ క్రింద ఉన్న విషయాలను చూసి తెలుసుకుందాం.

 

పార్టీ సమయంలో స్ప్రింగ్‌తో తయారైన దుస్తులు వేసుకుంటే మంచిది. అలాగే లిటిల్ బ్లాక్ డ్రెస్‌లు కూడా వేయవచ్చు. అలాగని మరీ పొడవాటి డ్రెస్సులను కూడా వేయకూడదు. స్కట్స్ లాంటివి వేయడం ద్వారా మీ ఎత్తు పెద్దగా తెలియదు. అలాగే చీరల సంగతి కొస్తే అడ్డుగీతలతో కూడినవి వాడవచ్చు. రంగుల ఎంపికలోనూ ఎత్తుగా ఉండేవారు మైల్డ్ కలర్స్ ఎంచుకోవడం మంచిది. సింథటిక్ శారీస్ కట్టేటప్పుడు హ్యాండిల్ వర్క్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ వర్క్ శారీస్, ఫ్రేమ్, మిరర్ వర్క్, మందపాటి చీరలు కట్టడం ద్వారా ఎత్తుగా ఉండేవారు తమ డ్రెస్సింగ్ విధానం అందరినీ ఆకట్టుకుంటాయి.