మన శరీరాకృతిని చక్కగా, అందంగా మలుచుకోవాలంటే మనం రకరకాల పనులు చేస్తుంటాం. డైటింగ్ చేయడం, లేదా ఎక్కువ సేపు శ్రమ పడటం వంటివి చేస్తుంటాం. కానీ ఎంజాయ్ చేస్తూ మీ శరీరాకృతిని అందంగా మలచుకోవాలనుకుంటే ఈతను మించిన వ్యాయామం మరొకటి లేదు. ఈత కొట్టడం ద్వారా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాలు పనిచేస్తాయి. దీనివలన శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది.ఏరోబిక్ వంటివి కూడా చేయాలనుకుంటే ఈత ఇంకాస్త వేగంగా ఇదితే సరిపోతుంది. ఈత అనేది మన శరీరంలోని కొవ్వుని కరిగించటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నిజానికి ఈత రాకపోయినా కూడా ఈత కొలనులో మీ నడుము పై భాగం వరకు నీళ్ళు ఉండేలా చూసుకొని అందులో అలాగే నిలబడిన కూడా.. ఆ అలల వలన మన శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఇలా చేయడం వలన ఎంజాయ్ కి ఎంజాయ్.. వ్యాయామం తో ఫిట్ గా కూడా ఉండగలము.