Home » Beauty » వేసవిలో చేసే ఈ పొరపాట్లు.. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయ్!

వేసవిలో చేసే ఈ పొరపాట్లు.. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయ్!

వేసవిలో చేసే ఈ పొరపాట్లు.. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయ్!

వేసవి కాలం అంటే వేసవి సెలవులు వస్తాయని పిల్లలు,  పెద్దలు కూడా సంతోషపడతారు. అయితే వేసవి కేవలం సెలవులనే కాదు.. వేడిని, ఇబ్బందులను కూడా వెంటబెట్టుకుని వస్తుంది.  వేసవి వేడి కారణంగా పెద్దలే బెంబేలెత్తిపోతుంటారు. అలాంటిది పిల్లలు వేడి కారణంగా ఇబ్బంది పడకుండా ఉండరని అస్సలు చెప్పలేం. పిల్లల శరీరం,  వారి ఇమ్యూనిటీ సిస్టం పెద్దల కంటే బలహీనంగా ఉంటుంది.  చాలా చోట్ల వేసవి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటుతున్నాయి కూడా. ఇంత ఉష్ణోగ్రతల మధ్య పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లల ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. అవి చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

వడదెబ్బ..

వేసవి కాలంలో పెద్దలకే చాలా సులువుగా వడదెబ్బ తగులుతూ ఉంటుంది. అయితే పెద్దల శరీర స్థాయి,  వారి ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది కాబట్టి వడదెబ్బను తట్టుకోవడం,  వడదెబ్బ నుండి తొందరగా కోలుకోవడం సులువుగా ఉంటుంది. కానీ పిల్లల శరీరం చాలా సున్నితం.  పిల్లలకు వడదెబ్బ తగిలితే చాలా తొందరగా ఎఫెక్ట్ పడుతుంది.  

వడదెబ్బ అంటే..

శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగినప్పుడు వడదెబ్బ తగులుతుంది. ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు, చెమట పట్టడం ఆగిపోతుంది. శరీరం తనను తాను చల్లబరచుకోలేకపోతుంది. అధిక జ్వరం, చర్మం పొడిబారడం,  చర్మం ఎర్రగా మారడం,  తల తిరగడం, గందరగోళం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, మగతగా ఉండటం, కండరాల నొప్పులు , నాడీ వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. . ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.

పిల్లలకు ఎక్కువ ప్రమాదం..

తీవ్రమైన వేడికి పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. వారి శరీరాలు త్వరగా వేడెక్కి, డీహైడ్రేషన్ కు  గురవుతాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు తరచుగా నీళ్లు తాగడం మర్చిపోతారు, దీనివల్ల తొందరగా డీహైడ్రేషన్ కు గురవుతారు. ఈ నిర్లక్ష్యం తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

పిల్లలు వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే..

నీరు..

చిన్న పిల్లలకు తరచుగా కొద్దికొద్దిగా నీళ్ళు తాగించడం ముఖ్యం. తల్లులు తమ పిల్లలకు ఎక్కువ సార్లు కొద్దికొద్దిగా ఆహారం ఇస్తుండాలి.

ఎండలోకి వద్దు..

పిల్లలను ఎక్కువ ఎండలోకి తీసుకెళ్లకూడదు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య  పిల్లలు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే.. ఫుల్ హ్యాండ్ షర్ట్,  తలకు టోపి వంటివి పెట్టి పంపించాలి.  పిల్లల వెంట ఎవరో ఒకరు ఉండటం మంచిది.

దుస్తులు..
 
పిల్లలను వేడి నుండి కాపాడటానికి, వారికి లేత రంగు కాటన్ దుస్తులు వేయడం మంచిది ఈ దుస్తులు లేత రంగులో ఉండాలి, దీనివల్ల  శరీరం గాలి పీల్చుకోగలుగుతుంది. ముదురు రంగులు అయితే ఎండను ఎక్కువ నిలుపుకుంటాయి. దీని వల్ల శరీరం వేడి అవుతుంది.

వాతావరణం..

ఇంట్లో ఫ్యాన్ లేదా కూలర్‌ను ఉపయోగించాలి.  బయటకు వెళ్లి  తిరిగి వచ్చిన వెంటనే పిల్లలకు చల్లటి నీటితో స్నానం చేయించాలి.  తర్వాత  వారి శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చల్లబడిన తర్వాత, గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.

నిమ్మరసం ..

పిల్లలను వేడి నుండి కాపాడటానికి,  నీళ్ళు బాగా ఇవ్వాలి.  నీళ్ళతో పాటు నిమ్మరసం కూడా ఇవ్వాలి. పిల్లలు  చాలా ఇష్టంగా తాగుతారు.

                              *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img