Home » Beauty » పాదాలు, చేతులు మృదువుగా ఉండాలంటే.. రోజూ రాత్రి ఈ ఒక్క పని చేయండి!

పాదాలు, చేతులు మృదువుగా ఉండాలంటే.. రోజూ రాత్రి ఈ ఒక్క పని చేయండి!

పాదాలు, చేతులు మృదువుగా ఉండాలంటే.. రోజూ రాత్రి ఈ ఒక్క పని చేయండి..!

ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి.. తానేమీ హీరోయిన్ కంటే తక్కువా.. అనే అభిప్రాయంతో ఉంటుంది. దీనికి తగ్గట్టే మేకప్ మెయింటెన్ చేస్తారు,  డ్రస్సులు వేస్తారు, ప్యాషన్ గా ఉండటానికి ట్రై చేస్తారు. కానీ అమ్మాయిలు ఎంత ట్రై చేసినా పాదాలు, చేతులు మాత్రం కొందరికి కళ లేకుండా డల్ గా, నల్లగా, ముడుతలు పడిపోయి, పాదాలు పగిలి,  చర్మం పైకి పొట్టులాగా లేచి కనబడుతూ ఉంటుంది.  దీనికోసం ఎంతో డబ్బు వెచ్చించి బ్యూటీ ట్రీట్మెంట్ లు, మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటూ.. మార్కెట్ లో దొరికే బ్యూటీ ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. కానీ అసలు డబ్బు ఖర్చు లేకుండా ప్రతి రాత్రి కేవలం ఒక్క  చిట్కా పాటించడం ద్వారా కొన్ని రోజుల్లోనే హీరోయిన్స్ లా మృదువుగా,  అందంగా ఉన్న పాదాలు,  చేతులు, చేతి వేళ్లు సొంతం చేసుకోవచ్చు.  ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..

శుభ్రత..

రాత్రి సమయంలో చాలామంది భోజనం చేయగానే కాసేపు సినిమాలు చూడటం,  ఫోన్ లో చాటింగ్స్ లేదా నెట్ బ్రౌజింగ్ వంటివి చేసుకుంటూ ఆ తర్వాత చక్కగా నిద్రపోతారు. కానీ పాదాలు, చేతులు,చేతి వేళ్లు హీరోయిన్స్ లా ఉండాలంటే రాత్రి తీసుకునే శుభ్రత జాగ్రత్తలే కీలకం.  రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ముఖం,  పాదాలు, చేతులు కడుక్కోవాలి.  ఇది చాలా వరకు పాదాలు చేతులు అందంగా కనిపించడంలో సహాయం చేస్తుంది.

ఆయిల్ లేదా మాయిశ్చరైజర్..

రాత్రి పాదాలు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తడి పొడి టవల్ తో తేమను తుడిచేయాలి.  తర్వాత కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా బాదం నూనె, ఆలివ్ నూనె.. ఇలా ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతో పాదాలను,  చేతులకు నూనె అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  ఇది పాదాలు, చేతుల చర్మానికి తేమను  అందిస్తుంది. ముఖ్యంగా పాదాల చర్మాన్ని మృదువుగా చేస్తుంది.  ఒకవేళ ఆయిల్ అప్లై చేయలేకపోతే.. మాయిశ్చరైజర్ అయినా  అప్లై చేయవచ్చు.  ఇది చర్మాన్ని తేమగా ఉంచి, చర్మం పొడిబారకుండా చేస్తుంది.

సాక్స్..

రాత్రి సమయం పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకున్న తర్వాత మంచి శుభ్రమైన సాక్స్ ధరించాలి.  ఇది చర్మం ఆరిపోకుండా,  పొడిబారకుండా చేస్తుంది.  

రిపీట్..

పైన చెప్పుకున్న చిట్కాలు ఏదైనా ప్రతిరోజూ కంటిన్యూగా చేస్తూ ఉండాలి. కనీసం వారం నుండి రెండు వారాల పాటు పాటిస్తే.. ఖచ్చితంగా మంచి మార్పు కనిపిస్తుంది.  దీన్ని ఇలాగే పాటిస్తూ ఉంటే.. చర్మానికి పోషణ లభించి చర్మం యవ్వనంగా మారి పాదాలు. చేతులు మృదువుగా,  అందంగా కనిపిస్తాయి.

                                         *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img