ఈకలతో ఈకాలం ఫ్యాషన్..
అమ్మాయిల అందం పెంచడంలో చెవి రింగులకు ప్రాధాన్యత చాలా ఉంటుంది. అలాంటి చెవి రింగులు రోజూ ఒకటే తరహావి పెట్టుకుంటే ఏం బావుటుంది. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండాలి.
ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ కు తగ్గట్టు మన చెవి రింగులు ఎంపికచేసుకోవాలి. అలాంటి మోడల్స్ లో ఒకటే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్. మోడ్రన్ గా కనిపించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.
పక్షి ఈకలతో తయారుచేసే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తుల మీదకి అయితే బాగా నప్పుతాయి. మామూలు చుడీదార్స్ మీదకి కూడా బావుంటాయి. కానీ...
చుడీదార్స్ మీదకి ఈ రింగులు కొంచం జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోడ్రన్ గా కనిపించండి...
