అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నెయిల్ ఆర్ట్.. ఇంట్లోనే సులభంగా ఇలా..!
పెళ్లి, పేరంటం, శుభకార్యం, ప్రత్యేక రోజులు.. ఈవెంట్స్.. ఇలా ప్రతి ఒకదానికి అమ్మాయిలు సెలబ్రిటీస్ కు తగ్గకుండా అందంగా తయారవుతుంటారు. అందులో భాగంగా గోళ్లను ఆకర్షణీయంగా మార్చుకోవడం ఒకటి. గోళ్లు అందంగా కనిపించడానికి చాలామంది నెయిల్ పాలిష్ పెడుతుంటారు. డ్రస్ కు మ్యాచ్ అయ్యేలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటే కనిపించే అందమే వేరు.. అయితే గోళ్లకు నార్మల్ నెయిల్ పాలిష్ పెట్టకుండా మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి నెయిల్ ఆర్ట్ బాగా సహాయపడుతుంది. నెయిల్ ఆర్ట్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యింది కూడా. కాస్త సృజనాత్మకత ఉన్నవారు నెయిల్ పెయింట్ ఉపయోగించి నెయిల్ ఆర్ట్ ను సులభంగా వేసుకోవచ్చు. ఇంతకీ ఇంట్లోనే ఈ నెయిల్ ఆర్ట్ ను ఈజీగా ఎలా వేసుకోవాలో తెలుసుకుంటే..
నెయిల్ ఆర్ట్ కు కావలసినవి..
నెయిల్ పాలిష్
బేస్ కోట్
టాప్ కోట్
డాటింగ్ టూల్ లేదా టూత్ పిక్
టేప్
స్పాంజ్
నెయిల్ పాలిష్ రిమూవర్
నెయిల్ ఆర్ట్ వేసే విధానం..
మొదటగా గోళ్ల మీద ఎలాంటి పాత నెయిల్ పాలిష్ గుర్తులు లేకుండా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించి తో తొలగించాలి. తరువాత పొడవుగా ఉన్న గోళ్లను నచ్చిన ఆకారంలో అందంగా కనిపించేలా కట్ చేయాలి.
గోళ్ల మీద బేస్ కోట్ అప్లై చేయాలి. ఇది గోళ్ల రంగులో ఉండే రసాయనాల నుండి గోళ్లను కాపాడుతుంది. అంతేకాకుండా గోళ్ల మీద ఎక్కువసేపు నెయిల్ ఆర్ట్ నిలిచి ఉండేలా సహాయపడుతుంది. బేస్ కోట్ వేసిన తరువాత అది పూర్తీగా ఆరేవరకు వెయిట్ చెయ్యాలి.
డాటింగ్ టూల్ లేదా టూత్ పిక్ ఉపయోగించి గోళ్ల మీద వివిధ రకాల సైజ్ లతో చుక్కలను పెట్టాలి.
టేప్ ఉపయోగించడం వల్ల గోళ్ల మీద చారల గుర్తులను కూడా సులువుగా వేయవచ్చు. గోరు పై టేప్ ను అతింకించాలి. దానిపై వేరేరంగు నెయిల్ పాలిష్ వేయాలి, టేప్ తీసేసిన తరువాత చారల గుర్తులు పొందుతారు.
తెలుపు లేదా ఏదైనా ఇతర రంగు నెయిల్ పాలిష్ ఉపయోగించి ఫెంచ్ ట్రిక్స్ ను క్రియేట్ చేయాలి. ఇలా నెయిల్ ఆర్ట్ వేసుకున్న తరువాత నెయిల్ ఆర్ట్ తొందరగా పోకుండా ఉండటం కోసం గోర్ల మీద టాప్ కోట్ వేయాలి. ఇలా వేసుకుంటే నెయిల్ ఆర్ట్ పూర్తయినట్టే. ఈ నెయిల్ ఆర్ట్ కు బేస్ కోట్, టాప్ కోట్ వేసి ఉండటం వల్ల గోర్ల మీద నెయిల్ ఆర్ట్ చాలా కాలం ఉంటుంది. అలాగే గోళ్లు కూడా రసాయనాల నుండి సేఫ్ గా ఉంటాయి. ఫ్యాన్సీ గా కనిపించే గోళ్లు ఇంట్లోనే మెరుగులు దిద్దుకున్నట్టే.
*రూపశ్రీ.
