Home » Yoga » ఆడవాళ్లలో బలాన్ని, దీర్ఘాయువును పెంచే కాళ్ల వ్యాయామాలు!

ఆడవాళ్లలో బలాన్ని, దీర్ఘాయువును పెంచే కాళ్ల వ్యాయామాలు!

ఆడవాళ్లలో బలాన్ని, దీర్ఘాయువును పెంచే కాళ్ల వ్యాయామాలు!

ఆడవాళ్లు బలంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఆడవాళ్లు ఇంటి పనులన్నీ చేయడమే కాకుండా వారికి గర్భం దాల్చడం, ప్రసవం వంటివి ఎన్నో శరీరక కుదుపులు ఎదురవుతూ ఉంటాయి.  గర్బం, ప్రసవం తర్వాత మహిళల శరీరంలో శక్తి పుంజుకోవాలన్నా దానికి తగిన కసరత్తులు చేయాలి.  అయితే మహిళలలో బలాన్ని,  దీర్ఘాయువును పెంచే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాయామాలు ఏంటో తెలుసుకుంటే..

స్క్వాట్ లు..

కాళ్ల వ్యాయామానికి స్క్వాట్ లు చాలా బాగుంటాయి.  ఈ కోవకు చెందిన ఇతర వ్యాయామాలు కూడా బాగా సహాయపడతాయి. ఇది క్వాడ్ లు, హామ్ స్ట్రింగ్స్,  గ్లూట్స్ ను పెంచుతుంది.  మంచి బాలెన్స్ ను కెపాసిటీని పెంచుతుంది.

డెడ్ లిఫ్ట్ లు..

బరువు ఎత్తడం వల్ల హామ్ స్ట్రింగ్స్, గూట్స్ తో పాటు నడుము కండరాలు కూడా బలోపేతం కావడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  ఇవి శరీర స్ట్రక్చర్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.

లంగ్స్..

కాళ్లలోని వివిధ కండరాలను బలోపేతం చేయడంలో లంగ్స్ బాగా సహాయపడతాయి.  ఇవి ఎక్కువకాలం బాలెన్స్ గా ఉండటానికి సహాయపడతాయి.    తూలిపోవడం,  బాలెన్స్ తప్పడం వంటి ప్రమాదాలు తగ్గిస్తాయి.

లెగ్ ప్రెస్ లు..

లెగ్ ప్రెస్ లు కీళ్లపై అనవసరమైన ఒత్తిడి లేకుండా అన్ని మెయిన్ కాలు కండరాలను బలంగా చేయడంలో, కాళ్ల కండరాలను నియంత్రించడంలో సహాయపడతాయి.

బెంచ్ లేదా ప్లాట్ స్టెప్-అప్ లు..

రోజువారీ కార్యకలాపాలకు  అవసరమైన కాళ్ల బలాన్ని,  చురుగ్గా కదలికలు ఉండటానికి బెంచ్ లేదా ప్లాట్ స్టెప్-అప్ లు బాగా సహాయపడతాయి.

బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ లు..


కాళ్ల బలాన్ని విడివిడిగా కేవలం ఒక్కొక్క కాలు బలాన్ని పెంచడానికి బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ లు బాగా సహాయపడతాయి.

కాఫ్ రైజెస్.

లేత కండరాల ఓర్పు పెరగడానికి కాఫ్ రైజెస్ బాగా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా చీల మండలు బాలెన్స్ గా ఉండటానికి,  గాయాలు కాకుండా ఉండటానికి సహాయపడతాయి.

                               *రూపశ్రీ

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img