Home » Fashion » పొడవాటి జుట్టు ఉందా.. ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే సెలబ్రిటీలలా కనిపిస్తారు..!

పొడవాటి జుట్టు ఉందా.. ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే సెలబ్రిటీలలా కనిపిస్తారు..!

పొడవాటి జుట్టు ఉందా..  ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే సెలబ్రిటీలలా కనిపిస్తారు..!


 పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడే  కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి ఈవెంట్‌లో తాను అందంగా, స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటుంది. డ్రెస్సింగ్,  మేకప్ ఎంత ముఖ్యమో, హెయిర్ స్టైల్స్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా  పొడవాటి,  మందపాటి జుట్టు ఉన్నవారికి హెయిర్ స్టైల్ అదనపు అందాన్ని తెచ్చిపెడతాయి. నేటికాలంలో హెయిర్ స్టైల్స్ లో చాలా మెరుగుదల కనపిస్తోంది. అయితే వేసుకునే దుస్తులకు,  ముఖ ఆకృతికి సరిపోయే హెయిర్ స్టైల్ ఎంచుకోవడం వల్ల మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీలలా కనిపిస్తారు.  అలాంటి కొన్ని స్పెషల్ హెయిర్ స్టైల్స్ గురించి తెలుసుకుంటే..

ఓపెన్ కర్లింగ్ హెయిర్ స్టైల్..

వదిలేసిన జుట్టు మీద మృదువైన అలలు చాలా అద్బుతంగా కనిపించేలా చేస్తాయి.  ఇది చాలా సాధారణంగా కనిపించినప్పటికీ,  అద్బుతంగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా హల్ది, మెహందీ లేదా సంగీత్ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది.   కావాలనుకుంటే  మిడ్-పార్టింగ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  జుట్టుకు టిక్కా లేదా స్టోన్ పిన్‌ను అటాచ్ చేస్తే బాగుంటుంది.

గజ్రా ఫిష్ టైల్ జడ..

తెలుపు లేదా రంగురంగుల చైన్స్ తో  ఫిష్‌టెయిల్ జడను చుట్టడం ద్వారా అటు  సాంప్రదాయంగానూ ఇటు ఆధునిక రూపాన్ని అందంగా ప్రెజెంట్ చేయవచ్చు. ఈ హెయిర్ స్టైల్ చీరలు,  లెహంగాలు రెండింటికీ చాలా బాగుంటుంది.

షార్ట్ సైజ్ బన్..

తక్కువ ఎత్తులో ఉండే బన్  ఒక క్లాసిక్ హెయిర్ స్టైల్, దీనిని  పెర్ల్ పిన్స్ లేదా స్టోన్ క్లిప్స్ తో అలంకరించవచ్చు. ఈ లుక్ రిసెప్షన్ లేదా సాయంత్రం ఫంక్షన్ కి సరిగ్గా సరిపోతుంది.

హాఫ్ అప్- హాఫ్ డౌన్ హెయిర్ స్టైల్..


జుట్టు ఓపెన్ గా వదిలేసినట్టు ఉండాలి, అలా అని జుట్టు స్టైలిష్ గానూ ఉండాలి అనుకునేవారికి ఈ స్టైల్ సరైనది. పై భాగాన్ని ట్విస్ట్ చేయాలి లేదా జడ వేసి క్లిప్ వేయాలి. ఆపై దిగువ భాగాన్ని లూజ్ గా  వదిలేయాలి,  కింద వెంట్రుకలను కర్లింగ్ చేయాలి.

గజ్రాతో ట్రెడిషనల్ జడ..

భారతీయ వివాహాల్లో గజ్రాకు దాని స్పెషల్ ఇంపార్టెన్స్   ఉంటుంది. స్ట్రైయిట్ గా లేదా  గజిబిజిగా ఉన్న బన్ను గజ్రాతో అలంకరించాలి. ఇది రాయల్ లుక్ ను,  సంప్రదాయ లుక్ ను కూడా ప్రెజెంట్ చేస్తుంది.

                                     *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img