Home » Beauty » జుట్టుకు వేసుకున్న రంగు త్వరగా వెలిసిపోతుందా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

జుట్టుకు వేసుకున్న రంగు త్వరగా వెలిసిపోతుందా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

జుట్టుకు వేసుకున్న రంగు త్వరగా వెలిసిపోతుందా?  ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

హెయిర్ కలర్ నేటికాలంలో చాలామంది జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్న ఒక పద్దతి.  జుట్టు కొత్తగా ఫ్యాషన్ గా కనిపించాలన్నా, జుట్టుకు కొత్త హెయిర్ కలర్ ట్రై చేయాలనుకున్నా ఇది మంచి మార్గం. అయితే జుట్టుకు రంగు వేసిన తర్వాత చాలామంది రంగు తొందరగా వెలిసిపోతోందని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ రంగు వేసిన తర్వాత జుట్టును ఎంత కేరింగ్ గా చూసుకుంటే జుట్టుకు వేసిన రంగు అంత ఎక్కువ కాలం నిలుస్తుంది. జుట్టుకు రంగు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే..

ఈ సమయం ముఖ్యం..

రంగులలోని రసాయనాలు చర్మ రంధ్రాలను తెరుస్తాయి. అందువల్ల జుట్టును కడిగే ముందు 48 నుండి 72 గంటల సమయం ఇవ్వాలి. ఇది రంగు కణాలు  జుట్టులోకి సరిగ్గా ఇంకడానికి, రంగు వెలిసిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అలాగే, స్విమ్మింగ్ పూల్ లేదా టబ్‌లో  జుట్టు తడవకుండా చూసుకోవాలి.

సల్పేట్ లేని ఉత్పత్తులు..

జుట్టును ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని షాంపూ , కండిషనర్‌తో కడగాలి. రంగు వేసిన జుట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను వాడాలి. సల్ఫేట్లు  జుట్టును పొడిబారేలా చేసి, రంగు త్వరగా వెలిసిపోయేలా చేస్తాయి. వారానికి రెండు నుండి మూడు సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. సాధారణ షాంపూ కంటే డ్రై షాంపూ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

సన్ లైట్ ప్రొటెక్షన్..

ఎక్కువసేపు ఎండలో ఉండటం మానుకోవాలి.  తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, వెడల్పాటి అంచుగల టోపీ లేదా గొడుగును ఉపయోగించాలి.  జుట్టును ఎండ నుండి రక్షించుకోవడానికి హెయిర్ సన్‌స్క్రీన్ కూడా ఒక మంచి ఎంపిక.

తేమ..

రంగు వేసిన జుట్టు త్వరగా పొడిబారిపోతుంది, అలాగే దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తేమను నిలుపుకోవడానికి ప్రయత్నించాలి. దీని కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగించాలి.

హెయిర్ స్టైలింగ్ పరికరాలు..

రంగు వేసిన జుట్టు ఇప్పటికే కొద్దిగా దెబ్బతిని ఉంటుంది, హెయిర్  స్టైలింగ్ పరికరాలు అయిన హెయిర్ డ్రైయర్,  స్ట్రెయిటనర్ వంటివి  దానిని మరింత దెబ్బతీస్తాయి.  తప్పనిసరిగా స్టైలింగ్ సాధనాలను ఉపయోగించాల్సి వస్తే, హీట్ ప్రొటెక్టెంట్‌ను అప్లై చేయాలి. . ఇది  జుట్టుకు , సాధనాల నుండి వెలువడే వేడికి మధ్య ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది.

స్ప్లిట్ కటింగ్..

జుట్టు చివర్లు చిట్లిపోతే హెయిర్ డై వాటికి అంటుకోదు, పైగా రంగు త్వరగా వెలిసిపోతుంది. క్రమం తప్పకుండా జుట్టును ట్రిమ్ చేయడం వల్ల చివర్లు చిట్లిపోయే సమస్య తగ్గుతుంది .  ప్రతి 6-8 వారాలకు ఒకసారి  జుట్టును ట్రిమ్ చేసుకోవచ్చు.

                              *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img