Home » Beauty » వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..!

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..!

వేయించిన పసుపు చేసే మ్యాజిక్.. ఇలా వాడితే టానింగ్ మాయం..!


టానింగ్ చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్య. టానింగ్ రాకుండా ఉండటం కోసం అమ్మాయిలు సన్ స్క్రీన్ వాడుతుంటారు. సన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మాత్రం టానింగ్ తొలగించుకోవడానికి చాలా రకాలు క్రీములు,  లోషన్లు వాడుతూ ఉంటారు. కానీ ఇవి చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి. కానీ తక్కువ ఖరీదులో ఇంట్లోనే టానింగ్ తొలగించుకోవడానికి పసుపు బాగా సహాయపడుతుంది.  అందులోనూ పనుపును వేయించుకుని కొన్ని ఇతర పదార్థాలతో వాడటం వల్ల టానింగ్ సులువుగా పోతుందట. చర్మాన్ని కాంతివంతం చేసుకోవడానికి,  టానింగ్ తొలగించడానికి తరచుగా చర్మాన్ని రుద్దుతారు లేదా ఫెయిర్‌నెస్ క్రీములను ఉపయోగిస్తారు. అయితే, అధికంగా రుద్దడం వల్ల చర్మం క్లియర్ కాకుండా ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా, ఫెయిర్‌నెస్ క్రీములు చర్మాన్ని ప్రకాశవంతం చేయవు. అసలు టానింగ్ ఎందుకు వస్తుంది.  టానింగ్ తొలగించడానికి వేయించిన పసుపును ఎలా వాడాలి? తెలుసుకుంటే..

టానింగ్ కు కారణాలు..

టానింగ్ కు కేవలం ఒకటే కారణం కాదు.. దీనికి అనేక విషయాలు కారణం అవుతాయి. సూర్యుని హానికరమైన కిరణాలకు గురికావడం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యుడికి ఎక్కువసేపు గురికావడం,  హార్మోన్ల మార్పులు కూడా ఒక కారణం.

పసుపు చర్మానికి చేసే మేలు..

పసుపులో మంచి మొత్తంలో కర్కుమిన్,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మంటను తగ్గించడంలో, మొటిమలను తగ్గించడంలో,  సహజమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయి. ఇది నల్లటి మచ్చలు, అకాల వృద్ధాప్యం,  వడదెబ్బను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పసుపు ఆరోగ్యానికి,  చర్మానికి రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

టానింగ్ తగ్గించే రెసిపీ..

కావలసిన పదార్థాలు..

పసుపు
కాఫీ పొడి
నిమ్మరసం
తేనె

తయారు విధానం..

 పసుపును పాన్ మీద బాగా వేయించాలి. దానికి కొద్దిగా నిమ్మరసం,  కాఫీ పొడి కలపాలి.  ఇప్పుడు ఆ మిశ్రమంలో  తేనె కలపాలి.  ఈ పేస్ట్ ని శుభ్రమైన ముఖం మీద అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు  అలాగే ఉంచాలి.   ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.

ప్రయోజనాలు..

పైన చెప్పుకున్న వేయించిన పసుపు రెమిడీ ని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల టానింగ్  తగ్గుతుంది.  ముఖం మీద సహజ మెరుపు వస్తుంది.  చర్మం మెరుస్తుంది.  

                       *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img