Home » Ladies Special » గ్యాస్ లైటింగ్..మహిళల జీవితాలను ఊబిలోకి తోసే ఈ సమస్య గురించి తెలుసా!

గ్యాస్ లైటింగ్..మహిళల జీవితాలను ఊబిలోకి తోసే ఈ సమస్య గురించి తెలుసా!

గ్యాస్ లైటింగ్..మహిళల జీవితాలను ఊబిలోకి తోసే ఈ సమస్య గురించి తెలుసా!


ఈ ప్రపంచంలో ప్రతి మనిషి భిన్నంగా ఉంటాడు.  మరీ ముఖ్యంగా మహిళల స్వభావం, పురుషుల స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది.  చాలా మంది మహిళలు తమ జీవితంలో వివాహం అయ్యాక.. భర్త  ప్రేమ దొరికితే చాలని, భర్తతో ప్రేమగా ఉంటే చాలని తాపత్రయ పడుతూ ఉంటారు. కేవలం భర్త జీవితంలో ఉంటే అదే తమ జీవితానికి తగిన గుర్తింపు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో చాలామంది మహిళలు గ్యాస్ లైటింగ్ బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్య కారణంగా చాలామంది మహిళలు తమకు ఈ జీవితం వద్దని అనిపిస్తూ ఉంటుంది.. కానీ దాన్నుండి బయటపడి వెళ్లలేని బలహీనత కూడా వారిలో  ఉంటుంది.  సంబంధాలలో చిక్కుకుపోయి ఊబిలోకి దిగబడిపోయి, ఊపిరాడని ఫీలింగ్ ను అనుభవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా గ్యాస్ లైటింగ్ వల్లనే సంభవిస్తుంది.  అసలు గ్యాస్ లైటింగ్ అంటే ఏమిటి?  మహిళల మీద గ్యాస్ లైటింగ్ కు పాల్పడే మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది? గ్యాస్ లైటింగ్ బారిన పడిన మహిళలు ఏ పరిస్థితులు ఎదుర్కుంటూ ఉంటారు? అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటే..

గ్యాస్ లైటింగ్.. మానసిక మోసం..

ఈ రోజుల్లో   భార్యాభర్తల బందాలలో ఎక్కువగా గ్యాస్‌లైటింగ్‌కు గురవుతున్నారు, కానీ ఇది ఎందుకు జరుగుతుందో లేదా దానిని ఎలా తగ్గించుకోవాలో వారికి అర్థం కావడం లేదు. ఇది ఒక రకమైన మానసిక మోసం, ఇది భాగస్వామిని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది. కేవలం మహిళలు మాత్రమే కాకుండా కొన్ని చోట్ల మగవాళ్లు కూడా ఈ గ్యాస్ లైటింగ్ బారిన పడుతూ ఉంటారు.

గ్యాస్ లైటింగ్ కు పాల్పడే వారి లక్షణాలు..

గ్యాస్ లైటింగ్ అనేది వైవాహిక బంధంలో భాగస్వామిని మానసికంగా బాధపెట్టే ప్రవర్తన. ఇందులో నేరుగా మనిషిని బాధించడం లేదా నియంత్రించడం అనేవి ఉండవు. కానీ కొన్ని సంఘటనలు, సందర్బాలను అవకాశంగా తీసుకుని భాగస్వామిని బాధపెట్టడం, వేధించడం, ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. అలాంటి వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి.  ఆ లక్షణాలేంటంటే..

అతిగా స్పందించడం..

భాగస్వామి చిన్న విషయాలకే అతిగా స్పందించడం, అర్థం లేని మాటలు మాట్లాడటం చేస్తుంటే.. వారితో రిలేషన్ లో ఉన్న వారు  గ్యాస్ లైటింగ్‌ను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇది  వారితో రిలేషన్ లో ఉన్న వారి  ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

తప్పు అని నిరూపించడం..

మీ భాగస్వామి అందరి ముందు మీరు చెప్పేది తప్పు అని నిరూపించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే, మీరు గ్యాస్‌లైటింగ్‌కు గురవుతూ ఉండవచ్చు. కొంతమంది తమ భాగస్వాములపై పూర్తిగా ఆధారపడతారు, దీనిని వారు తమకు అనుకూలంగా వాడుకోవచ్చు. ఏం చేసినా తమను దాటి వెళ్లలేరు అనే కారణంతో వారిని అకారణంగా దోషులుగా, తప్పుచేసిన వారిగా నిలబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు.

అనుమానం..

మీ భాగస్వామి మిమ్మల్ని పదేపదే అనుమానిస్తూ ఉంటే లేదా మీకు చెప్పిన విషయాలను మర్చిపోవడం ప్రారంభిస్తే, మీరు 'గ్యాస్‌లైటింగ్'కు గురవుతున్నారని అర్థం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని  కాలక్రమేణా ఈ సంబంధం నుండి బయట పడటం, అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించడం మరిచిపోయి ముందుకు సాగడం చాలా ముఖ్యం.అలా చేయకపోతే వారి చేతిలోనే జీవితం నాశనమైపోతుంది. వారి స్వార్థం కోసం వారు ఎంత బాధపెట్టడానికి అయినా వెనుకాడరు.

కరెక్ట్ గా ఉన్న క్షమాపణ డిమాండ్..

చాలామందిలో ఒక శాడిజం ఉంటుంది.  తమ భాగస్వామి పదే పదే క్షమాపణలు చెబుతూ ఉంటే తమని తాము గొప్పవాళ్లమని,  వైవాహిక బంధంలో తమదే ఆధిపత్యం అని భావించుకుంటూ సంతోషపడం చేస్తుంటారు. ఇలాంటి వారు తప్పు జరగడం అనే విషయం పక్కన పెడితే.. భాగస్వామి మాట్లాడేది,  చేసేది కరెక్ట్ గానే ఉన్నా సరే.. వారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటారు.  ఇందుకోసం చాలా కఠినంగా ప్రవర్తిస్తారు కూడా.  చాలావరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు.

నిర్లక్ష్యం..

కొంతమంది మగవారికి ఇంటి పని,  అవసరమైనప్పుడు భార్య గుర్తుకువస్తుంది. ఇతర విషయాలు  ఏవైనా సరే.. వారికి భార్య గుర్తుకు ఉండదు.  అసలు భార్య గురించి ఆలోచించరు కూడా.  గ్యాస్ లైటింగ్ ద్వారా భార్యలను నియంత్రణ చేస్తూ తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు.  ఒకవేళ భార్యలు భర్త ప్రవర్తనను అర్థం చేసుకుంటే.. ఇలాంటి మగవారు బార్యలను చాలా సులువుగా, ఎలాంటి కారణాలు లేకపోయినా సరే.. కావాలని గొడవలు సృష్టించి మరీ భార్యలను మోసం చేసి వదిలేస్తారు.

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img