Home » Beauty » మెంతి గింజల హెయిర్ మాస్క్.. జుట్టు ఎంత ఒత్తుగా పెరిగేలా చేస్తుందంటే!

మెంతి గింజల హెయిర్ మాస్క్.. జుట్టు ఎంత ఒత్తుగా పెరిగేలా చేస్తుందంటే!

మెంతి గింజల హెయిర్ మాస్క్.. జుట్టు ఎంత ఒత్తుగా పెరిగేలా చేస్తుందంటే!

ఒక 20, 30 సంవత్సరాల కిందట గమనిస్తే.. చాలామంది అమ్మాయిలకు పొడవైన,  ఒత్తైన, నల్లగా నిగనిగలాడే నాగుపాము లాంటి జడ ఉండేది.  ఆ కాలంలో కేవలం చాలా కొద్ది మంది మాత్రమే కొత్తిమీర కట్టల్లాంటి జడలు ఉండేవి. ఇంకా కొందరు అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో జుట్టును కత్తిరించేవారు.  కానీ నేటికాలంలో దీనికి చాలా రివర్స్ గా ఉంది.  జుట్టు పొడవుగా,  ఒత్తుగా, నల్లగా నిగనిగలాడాలని కోరుకోని అమ్మాయి ఉండదు.  చాలామంది జుట్టు పెరుగుదల కోసం చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అయితే వంటింట్లో ఉండే మెంతి గింజలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టు అద్బుతంగా పెరుగుతుందట.  దీని గురించి తెలుసుకుంటే..

ఒత్తైన జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మరింత ఒత్తుగా పెరగడానికి,  మెంతుల హెయిర్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు మెంతుల హెయిర్ ప్యాక్‌లను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మెంతుల హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

2 టీస్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టండి. వీటిని రాత్రంతా నానబెడితే ఉదయాన్నే వాడటానికి అనువుగా ఉంటుంది. లేదంటే ఉదయం నానబెట్టి మధ్యాహ్నం లేదా సాయంత్రం మాస్క్ తయారు చేసుకోవచ్చు.  తర్వాత ఆ మెంతులను మిక్సర్‌లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు, ఒక గిన్నెలో ఈ మెంతుల పేస్ట్ , పెరుగు తీసుకోవాలి. వాటిని బాగా కలపాలి. మెంతి గింజల హెయిర్ మాస్క్ సిద్దమైనట్టే..

ఎలా అప్లై చేయాలి?

ఈ హెయిర్ మాస్క్‌ను  జుట్టుకు పూర్తిగా పట్టించాలి. దీనిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.  జుట్టు బాగా దెబ్బ తిని ఉన్నవారు అయితే వారంలో రెండు సార్లు కూడా ఉపయోగించవచ్చు.  తక్కువ సమయంలోనే అద్బుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

జుట్టుకు ఎందుకు మేలు చేస్తుందంటే..

మెంతి గింజల మాస్క్‌లలో  జుట్టుకు పోషణనిచ్చే అనేక పోషకాలు ఉంటాయి.  జుట్టు రాలడంతో బాధపడుతుంటే జుట్టు సంరక్షణ దినచర్యలో మెంతి గింజల మాస్క్‌లను చేర్చుకోవచ్చు. మెంతి గింజల మాస్క్‌లను అప్లై చేయడం వల్ల జుట్టు బలపడి, ఒత్తుగా పెరుగుతుంది. అవి జుట్టును మృదువుగా, నునుపుగా కూడా చేస్తాయి.

                            *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img