పసితనం నుండే పిల్లలకు షాంపూల వంటి రసాయన పధార్థాలను తలస్నానానికి వాడటంవల్ల, ఫ్రిజ్ లలోని అతి చల్లని పధార్థాలను తినిపించడం వంటివి చేయడం వలన పిల్లలకు పసితనంలోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి.

ఈ విధంగా పిల్లలకు తెల్ల వెంట్రుకలు అవకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. అదేమిటంటే... అయిదు నుండి పది ఎండి ఉసిరికాయముక్కలు ఒకగిన్నెలో వేసి మునిగే వరకు నీళ్ళుపోసి మూతపెట్టి రాత్రంతా నానపెట్టాలి. ఉదయం నీరు తీసి వేసి ఆ ముక్కలను నేతితో చిన్నమంటపైన దోరగా వేయించి, ఆ ముక్కలను పిల్లలతో తినిపించడం గాని లేదా అన్నంలో కలిపిపెట్టడంగానీ రోజూ విడవకుండా చేయాలి. ఇలా ఆరునెలలు చేస్తే పిల్లల తెల్లవెంట్రుకలు పూర్తిగా నల్లబడుతాయి.