పిల్లలకు సక్రమమైన ఆహారపు అలవాట్లు ఉండడం అవసరం. వేళకు భుజించటం, వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్లు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అయితే కొంత మంది పిల్లలు ఆహార నియామాలను పట్టించుకోరు. అతిగా తినటమో లేదా డైటింగ్ పేర అసలు తినకపోవటమో చేస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకొంటారు. సక్రమమైన పద్ధతిలో ఆహారం తీసుకోకపోవట మన్నది అబ్బాయిల్లో కంటే అమ్మాయిలలోనే ఎక్కువ. ఇది పిల్లలకే కాక పెద్దలకు వర్తిస్తుంది.

పిల్లలకు సక్రమమైన ఆహారపు అలవాట్లు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పేచీలు పెడుతున్నారు కదా అని చెప్పి అన్నం పెట్టడం మానేస్తే అదే అలవాటైపోతుంది. పిల్లలు తక్కువ ఆహారం తీసుకోవడానికి అలవాటు పడిపోతారు. శరీరానికి అవసరమైనంత మోతాదులో ఆహారం లభించకపోవడంతో బలహీనంగా తయారవుతారు. కాబట్టి పిల్లలకు అవసరమైనంత మేరకు ఆహారాన్ని ఇస్తుండాలి.

పిల్లలకు ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా వారు ఆహారం సరిగా తినరు. అందువల్ల తరచు ఆహారం మార్చడం అవసరం. కొత్త రుచులు, కొత్త వాతావరణం కూడూ పిల్లలు బాగా ఆహారం తీసుకోవడానికి దోహదం చేస్తాయి