Home » Yoga » అర్ధ భుజంగాసానం.. ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..!

అర్ధ భుజంగాసానం.. ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..!

అర్ధ భుజంగాసానం..  ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..!

యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి.  ఒక్కో ఆసనం ఒక్కో రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది.  వీటిలో భుజంగాసనం, అర్ద భుజంగాసనం చాలా ముఖ్యమైనవి. అర్థభుజంగాసనాన్ని బేబీ కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఆసనాలు చాలా నార్మల్ గా అనిపిస్తాయి. కానీ రెగ్యులర్ గా వేస్తూ ఉంటే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. శీతాకాలం లేదా వేసవిలో ఉదయం ఖాళీ కడుపుతో అర్ద భుజంగాసనం చేయడం వల్ల శరీర మూలాలు బలపడతాయి. అర్ధ భుజంగాసనాన్ని సరిగ్గా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు గడపడం వల్ల  వీపును నిఠారుగా చేస్తుంది,  శ్వాసను లోతుగా చేస్తుంది ,  మనస్సు తేలికవుతుంది. మహిళలు ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

అర్ద భుజంగాసనం ప్రయోజనాలు,,


వెన్నెముక..

వెన్నెముకను బలంగా,  నిఠారుగా చేస్తుంది. వెన్ను సమస్యలను దూరం చేస్తుంది.

నడుము..

నడుము నొప్పి , వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్నిరెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పొట్ట కొవ్వు..

చాలా మంది పొట్ట కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ ఆసనం  పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ..

జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తుంటే జీర్ణవ్యవస్థ తిరిగి ఆరోగ్యంగా పనిచేస్తుంది.  తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.

ఊపిరితిత్తులు..

ఈ ఆసనం వేసినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్చ్వాసలు సక్రమంగా జరగడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.

మానసిక ఆరోగ్యం..

నేటికాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే  ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది.

భుజాల ఆరోగ్యం..


ఈ ఆసనంలో భుజాలు,  మెడ సాగదీయం వల్ల భుజాలు, మెడ ప్రాంతాలలో  బిగుసుకుపోయినట్టు ఉండే ఫీలింగ్ తగ్గుతుంది.

హార్మోన్స్..

అర్ద భుజంగాసనం హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

సిట్టింగ్ వర్క్ కోసం..

ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఈ ఆసనం చాలా   ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

                                   *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img