శరీర సౌందర్యానికి కాజల్ చెప్పిన చిట్కాలు

ఆడవాళ్ళ అందం కోసం, వారి ఆనందం కోసం ప్రకృతి ఎన్నో వనమూలికల్నిఇస్తుంది.

ఎన్నో పండ్లని అందిస్తుంది. వాటి వలన ఆడవాళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

వాటిని ఎలా వాడుకోవాలో తెలియదు. వాటిని కరక్టుగా వాడుకుంటే అన్ని అందాలు

ఆడవాళ్ళ సొంతం " అంటూ చెప్పుకొచ్చిన కాజల్, శరీర సౌందర్యం కోసం కొన్ని చిట్కాలు

కూడా తెలియజేసింది.

 

* నా ముఖంలాగే, నా శరీరంలాగే, మీ ముఖాలు, మీ శరీరాలు నిగనిగలాడుతూ

ఉండాలంటే ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినండి. ఉసిరికాయ మెరుపును అందిస్తుంది.

 

* ఒకవేళ మీకు చర్మ చిట్లి, బరువెక్కినట్లుగా ఉన్న, అలా అనిపించినా వెంటనే శరీరానికి

పెరుగు రాసి అరగంట తరువాత స్నానం చేయాలి. అలా చేస్తే ఆ బాధ నుండి మనకు

విముక్తి లభిస్తుంది.

 

* చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్దిరోజులపాటు ప్రతిరోజూ ఉదయం చేమంతి

పూవుతో సున్నితంగా మర్దన చేసుకోవాలి. అలా చేసుకుంటే చర్మ మీది మడతలు

తొలిగిపోతాయి.

 

* నా జుట్టులాగా మీ జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉండాలంటే కోడిగుడ్డు సోనలో అరటి

పండుని బాగా కలిపి, ఆ ఫెస్ట్ ని తలకి రుద్దుకొని పావుగంట తరువాత తలస్నానం

చేయాలి.

 

* నిమ్మరసం నీటిలో పిండి, ఆ నీటిలో చేతులు ముంచితే మృదువవుతాయి.

 

* పెదవులపై మచ్చలు పోవాలంటే గ్లిసరిన్ లో కొంచెం రోజ్ వాటర్ కలిపి దానిని

పెదవులపై రాసుకోవాలి.