పిల్లలకు ఫార్ములా పాలు ఇచ్చేవారు చేసే అతిపెద్ద మిస్టేక్..!

తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని అంటారు. కానీ కొన్నిసార్లు పుట్టిన పిల్లలకు తల్లి పాలు సరిపడక లేక తల్లి ఆరోగ్యం సరిగా లేక.. వేరే ఇతర కారణాల వల్ల తల్లిపాలు ఇచ్చే వెసులుబాటు ఉండదు. అలాంటప్పుడు పిల్లలకు ఫార్ములా పాలు ఇవ్వమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఫార్ములా పాలను తయారు చేయడంలో, వాటిని నిల్వ చేయడంలో చాలా తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆ పాలలో పోషకాలు సున్నా అవుతాయి. అంటే పోషకాలు నాశనం అవుతాయి. ఇలాంటి పాలు ఇచ్చినా పిల్లలకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది కానీ.. పోషకాలు మాత్రం లభించవు. ఇది పిల్లలకు నష్టం చేకూర్చడమే కాకుండా తల్లిదండ్రుల జేబులకు కూడా చెల్లు పెడుతుంది. అందుకే ఫార్ములా పాలు తయారు చేసే విధానం ఏమిటి? పిల్లలకు ఇవ్వడానికి సరైన మార్గం ఏమిటి? తెలుసుకుంటే..
సమయం..
ఫార్ములా పాలను ముందుగానే తయారుచేసుకుంటే , దానిని 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు . కానీ ఆ పాలను ఫ్రిజ్‌లోంచి తీసి వేడి చేసి ఉంటే ఆ పాలను 1 గంటలోపు ఉపయోగించాలట.
ఫార్ములా పాలను తయారు చేసి బిడ్డ ఆ పాలను తాగడం ప్రారంభించిన తర్వాత ఆ పాలను 1 గంటలోపు ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. అయితే బిడ్డ త్రాగడం ప్రారంభించకపోతే గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల పాటు ఉపయోగించవచ్చట.
ఫ్రిజ్ నుండి తీసిన పాలను ఒక గంట తర్వాత తిరిగి ఉపయోగించకూడదు లేదా తిరిగి వేడి చేయకూడదట. అలాగ తల్లి పాల లాగా ఫార్ములా పాలను ఫ్రీజ్ చేయలేరట. లేకుంటే దాని పోషకాలు, పాల టెక్చర్ విచ్ఛిన్నమవుతుందట.
పాల పౌడర్ బాక్స్ తెరిచిన తర్వాత దాని గడువు తేదీ చూసుకుని అలాగే ఎన్నాళ్లైనా వాడవచ్చు అనుకుంటే పొరపాటు. పాల పౌడర్ ప్యాకెట్ తెరవనంతవరకు అది గడువు తేదీ వరకు వాడుకునే అవకాశం కలిగి ఉంటుంది. కానీ.. పాల పౌడర్ ఓపెన్ చేసిన తరువాత 3 నుండి 4 వారాల వరకు మాత్రమే ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ.

.webp)

.webp)