Tirumalalo Itara Visesha Sthalalu Related
Home »Tirumalalo Itara Visesha Sthalalu » First Prayer to Varahaswami in Tirumala
?>

తిరుమల క్షేత్రంలో తొలిపూజ వరాహస్వామికి

(First Prayer to Varahaswami in Tirumala)

 

అశేష భక్తజనానికి ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటాచలంలో ఆదిదైవం వరాహస్వామి. వరాహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు భూమాతను రక్షించింది వరాహావతారమేగా మరి.

 

హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరేయగా రక్షించేందుకు, విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి ఆగ్రహావేశాలకు పోకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకున్నాడు. సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు. అదీ వరాహస్వామి కథ. ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే. ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా ఆది వరాహస్వామి దర్శనం అవుతుంది.

 

తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామివారికే అందుతాయి. ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు.

 

Sri Adi Varahaswami Temple in Tirumala, First Darshan in Tirumala Adi Varahaswami, First Naivedyam in Tirumala Adi Varahaswami, Brahma Purana and Adi Varahaswami Temple