సుదర్శన్ టోకెన్ పద్ధతి - సుదర్శన్ కౌంటర్లు
(Sudarshan Counters)
.png)
తిరుమలలో నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుదర్శన్ కౌంటర్ల సదుపాయం కలుగజేశారు. దీనివల్ల భక్తులకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పని లేకుండా దర్శనం ఏర్పాటు చేసిన సమయానికి ఆలయానికి చేరుకునే సదవకాశం కలిగింది.
భక్తులు తిరుమల వెళ్ళదలచుకున్న రోజును నిర్ణయించుకుని, ఆ తేదీని చెప్పి సుదర్శన్ టోకెన్ పద్ధతి ద్వారా ''సర్వదర్శనం'' లేదా ''ప్రత్యేక దర్శనం'' టికెట్లు పొందవచ్చు.
తిరుపతిలో సుదర్శన్ కౌంటర్లు
రైల్వే స్టేషన్ వద్ద సెకండ్ చౌల్ట్రీ
భూదేవి కాంప్లెక్స్
అలిపిరి టోల్గేట్
శ్రీనివాసం
శ్రీవారి సన్నిధి
ఆర్టీసీ బస్ స్టాండ్
టి.టి.డి. ఇంఫర్మేషన్ సెంటర్, రేణిగుంట
తిరుమల తిరుపతి దేవస్థానం వారు మితిమీరిన రద్దీని తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 5000 టోకెన్ల చొప్పున ఇస్తారు. ఒక వ్యక్తికి ఒక టోకెన్ చొప్పున ఇస్తారే గానీ ఒక గ్రూపు మొత్తానికీ ఒక కూపన్ చొప్పున ఇవ్వరు.
దూర ప్రాంతాల నుండి బయల్దేరిన వారికి ఒక్కోసారి కాస్త ముందు వెనుకగా సుదర్శన్ టోకెన్ లభించవచ్చు. కనుకనే ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకునే ముందే సుదర్శన్ టోకెన్ తీసుకోవడం ఉత్తమం. అప్పటికీ ఆశించిన సమయానికంటే దర్శన సమయం అటూఇటూగా ఉంటే దాన్ని బట్టి తిరుపతి చుట్టుపక్కల ఉన్న శ్రీకాళహస్తి, కాణీపాకం, పద్మావతి అమ్మవారి దేవాలయం, గోవిందరాజ స్వామి దేవాలయం లాంటి పుణ్యస్థలాలను దర్శించుకోవచ్చు. ఒకవేళ తిరుమలలోనే దర్సనానికి ఇంకా సమయం మిగిలి ఉందనుకుంటే పాపవినాశనం, స్వామిపుష్కరిని మొదలైన పుణ్యస్థలాలను చూసిరావచ్చు.
Sudarshan Counters in Tirumala, TTD and Sudarshan Token System, Sudarshan Counter Srivari Sannidhi, Sudarshan Counter Srinivasam




