తిరుమల వేంకటేశ్వరునికి శుద్ధి
(Tirumala Venkateswara Suddhi)
తిరుమలలో తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అనంతరం శుద్ధి ఉంటుంది.
బంగారు వాకిలి గుండా జరిగే విశ్వరూప సర్వదర్శనం తర్వాత మూడున్నర నుండి ఒక పావుగంట పాటు శుద్ధి నిర్వహిస్తారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో శుద్ధి కార్యక్రమం తెల్లవారుజామున మూడున్నరకు మొదలవుతుంది. ధృవమూర్తికి ముందురోజు రాత్రి చేసిన అలంకరణలు తొలగిస్తారు. పుష్పమాలలను కూడా తొలగిస్తారు. పూజా సామగ్రి అంతటినీ శుభ్రం చేస్తారు. ఒకసారి అలంకరించిన పుష్పమాలలను స్వామివారికి తిరిగి ఉపయోగించకూడదు. వాటిని ఇతరులు ఎవరూ ఉపయోగించకూడదు. అందువల్ల ఎవరూ ఉపయోగించే వీల్లేకుండా స్వామివారికి క్రితంరోజు అలంకరించిన పూలమాలలను తీసి సంపంగి ప్రదక్షిణలో ఉన్న పూలబావిలో వేస్తారు. ఇలా చేయడాన్ని నిర్మాల్య శోధన అంటారు.
తిరుమల వేంకటేశ్వరునికి చేసే శుద్ధి కార్యక్రమంలో ఉపయోగించే నీటిని ఆకాశగంగ నుండి తీసుకొస్తారు.స్వామివారికి చేసే షట్కాల పూజలు అన్నింటికీ ఈ ఆకాశగంగ జలపాతం నుండి తెచ్చిన నీటినే ఉపయోగిస్తారు.
Suddhi in Tirumala, Srivari Sevalu Suddhi, Suddhi at Sanctum Sanctorum, Bangaru Vakili Suddhi




