Home » జయహో » జయహో మహిళా.... జయహో...

 

మనమే పనిమంతులమట. ఓ పక్క వంటపని, ఇంకో పక్క పిల్లల పనులు, మరో పక్క ఆఫీసు ఫోన్లు ఇలా ఒకేసారి ఎన్నో పనులను చేస్తూ ఒకేసారి అన్నిటిని సామర్థ్యంతో చక్కబెట్టే నేర్పు ఆడవాళ్లకే ఎక్కువ మగవాళ్ళతో పోలిస్తే అంటున్నారు పరిశోధకులు.

ఈ మాట ఏదో ఆషామాషిగా చెప్పెయ్యలేదు. కొంతమంది ఆడవారిని, మగవారిని తీసుకుని వారికి ఎనిమిది నిమిషాలలో మూడు వేరు వేరు పనులను చేయమని చెప్పారు. అందులో ఫోన్ లో మాట్లాడటం, కనిపించని తాళం చెవిని వెతకటం, అతిధులు వస్తే పలకరించటం... ఇలాంటి పనులను చేర్చారు. ఇలా ఒకేసారి వేరు వేరు పనులను త్వరగా పూర్తిచేయటం, అలాగే ఓర్పుతో, నేర్పుతో వాటిని చక్కబెట్టుట అలా ఆడవారు మగవారి కంటే బెటర్ అని తేల్చి చెప్పేశారు పరిశోధకులు.

ఎప్పుడైనా నా వల్ల కావటం లేదు అనిపిస్తే ఈ అధ్యయనాన్ని ఓసారి గుర్తు చేసుకోండి చాలు. ఓపిక, ఉత్సాహం తన్నుకొస్తాయి.