Home » Articles » భోగి

భోగి

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

భోగి అంటే భోజనం
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం
"భగ" అనే పదం నుండి "భోగి"
అన్నమాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి. రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం. భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం.

భోగి మంటలు

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

భోగి సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ ఇది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు.

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరవాత, దాని మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేస్తారు. ఈ రోజున మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం.

భోగి రొజున తలంటు

తల మాడుపై ఉండే బ్రహ్మరంధ్రం మీద నువ్వులనూనె పెట్టి తల్లి తలంటు పోయాలి. ఆ రంధ్రం లోకి నూనె చేరటం ద్వారా చైతన్యం కలుగుతుంది. తప్పనిసరిగా కుంకుడుకాయల రసంతోనే తలంటి, తల ఆరటం కోసం సాంబ్రాణి పొగ వేసి జుట్టు ఆరబెట్టాలి. దీనివల్ల కుదుళ్లు గట్టిపడతాయి. ఆ తరువాత పిల్లలకు నూతన వస్త్రాలు వేస్తారు. సూర్యునికి ఇష్టమయిన పాయసం తప్పనిసరిగా చేస్తారు. సంక్రాంతి అమావాస్య నాడు వచ్చి, అయనం మార్పు జరుగుతుంది. పితృకార్యాలు చేయడానికి మంచిది. ఆ కార్యాలు చేయవలసిన వాళ్లు వాటికి సంబంధించిన వంటకాలన్నీ ఏర్పాటు చేయాలి. అందువల్ల భోగి నాడు సంబరాలు చేసుకోవాలి. ఏ బాధలు పోవాలనే ఆకాంక్షతో ఈవిధంగా చేస్తారు.

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

సాయంత్రం అయ్యేసరికి భోగిపళ్లకు సిద్ధం అవుతారు. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగి మూడిటినీ కలిపి తలచుట్టూ మూడు సార్లు తిప్పి తల మీద పోస్తారు. ఇంట్లోని పెద్ద వాళ్ల తరువాత పేరంటాళ్లు కూడా పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూల రేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల పిల్లలపై దృష్టి దోషం పోతుందనేది విశ్వాసం. పిల్లలు కూర్చునే పీట కింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరువాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు.

Bhogi Festival History, Bhogi Festival In India, Bhogi Festival Celebrations 2014, Bhogi and Makar Sankranti, Bhogi 2014 Date, Importance of Bhogi Festival, Bhogi Pallu Sankranti History

చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో కూడా ఆరోగ్యానికి ఉపకరించే వాటిని (మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క) ఇస్తారు. మన పండుగల వెనుక ఆరోగ్యం దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగ వస్తున్నాయి. కొన్ని చోట్ల భోగి పళ్లు పోయడానికి ముందు కొబ్బరి ముక్కలు చిన్నచిన్నగా తరిగి వాటిని దండగా గుచ్చి పిల్లలకి మెడలో వేస్తారు.