Home » Articles » బెస్ట్ డ్యాడ్ బాద్‌షానే..
 
 
బెస్ట్ డ్యాడ్ బాద్‌షానే..
 
 
Shah Rukh Khan Best Dad in the World, India Most Popular Father, Poll Survey  Shah Rukh Khan, Indias Best Famous Father
 
జూన్ మూడవ వారంలో జరుపుకునే ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఒక పోల్ లో మోస్ట్ పాపులర్ డ్యాడ్ గా నిలిచింది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఒక మ్యాట్రిమోని సంస్థ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో బాలీవుడ్ టాప్ హీరో షారుఖా ఖాన్, బరాక్ ఒబామా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నారు. ఐదువేల ఐదు వందల మంది మహిళలు పాల్గొన్న ఈ సర్వేలో ‘ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఫాదర్’గా 42.5 శాతం మంది షారూఖ్‌కే ఓటేశారు. ‘ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఫాదర్’గా నెంబర్ వన్ స్థానంలో షారుఖ్ నిలవగా, 36.9 శాతం ఓట్లతో  సచిన్ టెండుల్కర్ రెండవ స్థానం,  బిగ్ బి అమితాబ్ 20.6శాతం ఓట్లతో మూడో స్థానం సంపాదించుకున్నారు.
 
Shah Rukh Khan Best Dad in the World, India Most Popular Father, Poll Survey  Shah Rukh Khan, Indias Best Famous Father
 
ఇక దేశవిదేశాలలో అత్యధికంగా అభిమానించే ఫాదర్ ఎవరనే అంశంతో నిర్వహించిన పోల్‌లో 40.3శాతం మంది ఒబామాకి ఓటు చేశారు. మీరు  ఎక్కువగా అభిమానించే తండ్రి కూతుర్లు ఎవరంటూ సాగిన పోల్ లోను బాద్ షా, ఆయన చిట్టి తల్లి సుహానా 43.2శాతం ఓట్లు సంపాదించుకున్నారు. ఈ పోల్ లో మహేష్‌భట్-ఆలియాభట్, ప్రకాశ్ పదుకొనే-దీపికాపదుకొనే, అనిల్‌కపూర్-సోనమ్‌కపూర్‌లు ఆ తర్వాతి స్థానాల్లో వున్నారు.  తండ్రీ కొడుకుల కోసం సాగిన సర్వేలో   బాలీవుడ్ నటులు రిషీకపూర్-రణబీర్ కపూర్ లకు 33.4 శాతం మంది ఓట్లు వేశారు.  ఆ తర్వాతి స్థానంలో అమితాబ్-అభిషేక్, షారూఖ్-ఆర్యన్ ఉన్నారు.  ఇలా ఫాదర్స్ డే కోసం సాగిన పోల్‌లో షారుఖ్ బెస్ట్ డ్యాడ్ అని మగువలు కితాబునిచ్చారు.