నైవేద్యం-దద్దోజనం
!! కావలసినవి !!
బియ్యం - ఒక కప్పు
పెరుగు - రెండు కప్పులు
కొత్తిమీర తరుగు - అర కప్పు
అల్లం - చిన్నముక్క
శొంటి - చిన్న ముక్క
మెంతులు - అర స్పూన్
ఎండు మిరపకాయలు - రెండు
మినపప్పు - ఒక టీ స్పూన్
ఆవాలు - అర స్పూన్
జీలకర్ర - అర స్పూన్
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అరస్పూన్
ఉప్పు తగినంత
!! తయారీ !!
ముందుగా అన్నం వండుకుని కొంచం చల్లరాక అందులో పెరుగు,పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.తరువాత అల్లం, శొంటి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని పెరుగన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడుస్టవ్ వెలిగించి బాణాలి పెట్టి నూనె వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు,ఎండు మిరపకాయలు వేసి వేయించుకుని పెరుగు అన్నం లో కలిపి పైన కొత్తిమిరతో అలంకరించుకుని దేవికి నైవేద్యం పెట్టాలి...